‘అది యాటపోతు కాదు యాటకత్తి’ | Karthikeya Hippi Trailer Released | Sakshi
Sakshi News home page

‘అది యాటపోతు కాదు యాటకత్తి’

Published Thu, May 9 2019 3:06 PM | Last Updated on Thu, May 9 2019 5:23 PM

Karthikeya Hippi Trailer Released - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన ఈ హీరో వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడీ హీరో. ఆర్‌ఎక్స్‌ 100 స్టైల్లోనే కాస్త బోల్డ్‌నెస్‌, యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న హిప్పీ టీజర్‌తో మంచి హైప్‌ను క్రియేట్‌ అయింది. తాజగా హిప్పీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌లో కావల్సినంత బోల్డ్‌ కంటెంటే కాకుండా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో చెప్పించే డైలాగ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించగా.. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement