Kalaipuli S. Thanu
-
కోలీవుడ్‌లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
అనంతపురంలో అసురన్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అందుకే బోల్డ్ సీన్స్ చేశా
‘‘నాకు తెలుగు భాష రానందుకు బాధగా ఉంది. భాష తెలిసి ఉంటే ఎవరితో అయినా ఈజీగా కనెక్ట్ కావొచ్చు. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్. కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన సినిమా ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా దిగంగనా సూర్యవన్షీ చెప్పిన విశేషాలు. ► సౌత్‌లో ఇదే నా ఫస్ట్ మూవీ. రెండేళ్ల క్రితం నాకు రెండు సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో నేను హిందీలో ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ‘హిప్పీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కావడం సంతోషంగా ఉంది. ► బాలీవుడ్లో నేను నటించిన ‘ఫ్రైడే, జిలేబీ’ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో ‘హిప్పీ’ సినిమాకి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన ఆముక్తమాల్యద పాత్ర పట్ల బాగా ఇంప్రెస్ అయ్యాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడం హ్యాపీ. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ‘హిప్పీ’లో బోల్డ్సీన్స్ ఉన్నాయి. సినిమాకు మంచి క్లైమాక్స్ కుదిరింది. ఎమోషనల్ సీన్స్‌లో గ్లిజరిన్ లేకుండానే ఏడవగలను. ► రాజమౌళిగారికి నేను బిగ్ ఫ్యాన్‌ని. ‘బాహుబలి’ సినిమాను ఆరుసార్లు చూశాను. మహేశ్‌బాబు సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు చూశాను. టెలివిజన్‌లో నేను చేసిన ‘వీర’ షోకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు అవకాశం వచ్చినా నేను చేయలేదు. ► సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ షో నైన్త్ సీజన్లో నేను పార్టిసిపెంట్‌గా చేశాను. ‘బిగ్‌బాస్’ చరిత్రలో నేను యంగెస్ట్ పార్టిసిపెంట్‌ని. సల్మాన్‌సార్‌తో నాకు పరిచయం ఉంది. ఆయన తెలుసు కదా అని లీడ్ హీరోయిన్గా చాన్స్ ఇవ్వమని అడగలేను. అయితే సల్మాన్ సార్ బ్యానర్లో సినిమా చాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. -
జీరో నుంచి వందకి తీసుకెళ్లింది
‘‘ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కన్ఫ్యూజన్ లేదు. కథ నాకు నచ్చి, డైరెక్టర్ చేయగలుతాడనే నమ్మకం వస్తే సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుంటాను’’ అని కార్తికేయ అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ‘హిప్పీ’ సినిమా బాగా వచ్చింది. నేను బాగా నటించాననే నమ్మకం ఉంది. ఆడియన్స్‌కి నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోబోతున్నాను. సినిమా చూసిన తర్వాత రివ్యూలు ఎలా ఉంటాయి? ఆడియన్స్ నా గురించి ఎలా మాట్లాడుకుంటారు? అని ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. ► జేడీ చక్రవర్తిగారి గురించి ‘జేడీ.. ఉంటే సినిమా ఫినిష్ కాదు. సెట్లో నుంచి వెళ్లిపోతారు’ అని కొందరు రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ అంతా రివర్స్. ఆఫ్‌స్క్రీన్‌లో మేం ఫ్రెండ్స్ అయిపోయాం. సార్.. కొందరు మీ గురించి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పాను. ‘వాళ్లు చెప్పింది నిజమే. నచ్చని సినిమాలకు నేను అలానే చేశా’నని జేడీ అన్నారు. ► టీఎన్కృష్ణగారు కథ చెబుతా అన్నప్పుడు ‘ఏమాయ చేసావె’ లాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను. కథ నరేట్ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఇది ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు ఫుల్ డిఫరెంట్ అని. ► ‘ఆర్ఎక్స్ 100’తో పెద్దహిట్ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ థానుగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్ నాతో సినిమా చేయడానికి రెడీ అయినప్పుడు ఆ నమ్మకం నాకు వచ్చింది. నాపై నాకు భరోసా కలిగింది. ‘ఆర్ఎక్స్ 100 ’సినిమాను మేమే తీశాం. నాకు ఫస్ట్ ఎర్నింగ్ థానుగారే ఇచ్చారు. అడ్వాన్స్‌గా పది లక్షలు తీసుకున్నాను. ► ఒక హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నిజానికి ఒత్తిడిలోనే ఉన్నాను. ‘ఆర్ఎక్స్ 100’ రిలీజ్‌కు ముందు జీరోలో ఉన్నాను. ఆ సినిమా జీరో నుంచి 100కి తీసుకెళ్లింది. సో... ఇది 101 వస్తేనే సక్సెస్ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాను. ► ‘ఆర్ఎక్స్100’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నా ఏజ్ ప్రకారం నాకు లవ్‌స్టోరీలే వస్తాయి. లవ్‌స్టోరీలు అన్నప్పుడు లిప్ లాక్‌లు తప్పవు. రియలిస్టిక్ సినిమాలు చేయాలి. న్యాచురల్‌గా ఉండాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు లిప్‌లాక్ సీన్స్‌ను కూడా న్యాచురల్‌గానే చూపించాలి. ► పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా, ఏ అబ్బాయికైనా ఎవరూ నచ్చకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కాలేజ్ డేస్‌లో ఓ లవ్‌ఫెయిల్యూర్ ఉంది. ► ఇప్పటి యంగ్ హీరోలతో కాంపిటీషన్ ఫీలయ్యే స్టేజ్‌కి నేను ఇంకా రాలేదు. నాకు పెద్దగా ఫ్యాన్స్ లేరనుకుంటా. ఇటీవల ఇద్దరు యంగ్ హీరోల మధ్య వినిపించిన ఫ్యాన్స్ వార్ మిస్అండర్స్టాండింగ్ వల్లే వచ్చిందని నా భావన. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు ఫస్ట్ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయాలా? అనుకున్నాను. నిజంగా భయం వేసింది. నెక్ట్స్ డే థియేటర్లోకి వెళితే ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ అన్నారు. అప్పుడు రివ్యూస్‌పై కోపం వచ్చింది. ఏదైనా తేడా జరిగితే నాది, పాయల్, అజయ్ ఇలా అందరి కెరీర్లకు ఇబ్బంది కలిగేది. ► ప్రస్తుతం ‘గుణ 369, గ్యాంగ్‌లీడర్’ చేస్తున్నాను. శేఖర్‌రెడ్డి, వీవీ వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన శ్రీ సరిపల్లితో సినిమా చేయబోతున్నాను. -
ఊహించడం అంత వీజీ కాదు
‘‘ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్‌టైమ్ ఉంటుంది. నా జీవితంలోనూ బ్యాడ్‌టైమ్ గడిచింది. అందుకే డైరెక్టర్‌గా గ్యాప్ వచ్చింది’’ అన్నారు దర్శకుడు టి.ఎన్. కృష్ణ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్. కృష్ణ చెప్పిన విశేషాలు. ►‘హిప్పీ’ సినిమాను ముందు తమిళ భాషలో తీద్దాం అనుకున్నాం. ఆ టైమ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఆఫర్ వచ్చింది నాకు. తెలుగు ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. హీరోగా కార్తికేయ బాగా నటించాడు. ఇక రీమేక్ ఎందుకు? అనిపించి స్ట్రయిట్ తెలుగు సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. ‘హిప్పీ’ కథను కార్తికేయకు చెప్పాం. నచ్చింది అన్నారు. అలా ‘హిప్పీ’ ప్రయాణం మొదలైంది. జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి ప్రస్తావించిన ప్యారడైజ్ లాస్, ప్యారడైజ్ గెయిన్ అనే అంశాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేశాను. ►కార్తికేయ బాగా నటించాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పాజిటివ్‌గా ఉంటుంది. నిర్మాత థానుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది యూత్‌ఫుల్ ఫిల్మ్. నేటి యువత రిలేషన్‌షిప్స్‌ను ఎలా డీల్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్లో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే అంశాలను ప్రస్తావించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అని ఆడియన్స్ అంత వీజిగా ఊహించలేరు. ఇది కంప్లీట్ లవ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది. ►సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చలర్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతోంది. నేటి టెక్నాలజీకి అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అయినా అంతే. అప్డేట్ కావాలి. ►ఈ సినిమాలో నా పర్సనల్ లైఫ్ సీన్స్, నా స్నేహితులవి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో లవ్‌ని ఫీల్ అవ్వలేనివారు లవ్‌స్టోరీ తీయలేరని నా నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఒక్కో లాంగ్వేజ్‌లో ఒక్కో బ్యూటీ ఉంటుంది. ►‘సిల్లున్ను ఒరు కాదల్’ (‘నువ్వు నేను ప్రేమ’) (2006) సినిమా తర్వాత ఓ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నేను చేసిన ‘నెడుంజాలై’ రిలీజైంది. ‘హిప్పీ’ నా మూడో సినిమా. నెక్ట్స్ థానుగారే నా డైరెక్షన్లో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అలాగే పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను. -
ఆ రోజు సినిమాలు మానేయొచ్చు
‘‘నాకు నచ్చిన మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టే తక్కువ అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన తెలుగు సినిమా అవకాశాల్లో ‘హిప్పీ’ తప్ప మరో స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేయలేదు. ఏదో కథకి ఓకే చెబితే డబ్బు వస్తుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘హిప్పీ’. దిగంగన సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర చేశారు. కలైపులి యస్. థాను నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి చెప్పిన విశేషాలు.... ► నేటి యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో ఓ కంపెనీ సీఈవోగా నటించాను. ప్లేబాయ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉంటుంది. ► కార్తికేయ బాగా నటించాడు. ఫ్రెష్ అప్రోచ్‌తో పోయిటిక్గా తీశాడు దర్శకుడు క్రిష్ణ. థానుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ► లస్ట్ బేస్డ్(కామం) సినిమాలు చాలా రావొచ్చు. కానీ, ఎమోషన్ లేకుండా లవ్, యాక్షన్, ఫియర్.. ఇలా ఏదీ వర్కౌట్ కాదు. కేవలం కామం వల్లే సినిమాలు ఆడవు. ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలు స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఉన్న లవ్ బేస్డ్ సినిమాలు. అందుకే హిట్ సాధించాయి. ‘హిప్పీ’ కూడా బోల్డ్ కంటెంట్‌తో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది. ► నా యాక్టింగ్ కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. ఏమీ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రాలేదు నేను. వచ్చి ఇంకా నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్పిన మా గురువుగారు(రామ్‌గోపాల్ వర్మ) డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పలేదు. నేను హిందీలో ‘వాస్తుశాస్త్ర’ చేస్తున్న సమయంలో షారుక్ మా సెట్‌కి వచ్చారు. అప్పుడు ఆయన ‘వీర్‌జారా’ చేస్తున్నారు. మా సెట్‌కి వచ్చిన షారుక్‌ని సుశ్మితాసేన్ ‘హాయ్.. షారుక్’ అంటూ పలకరించారు. నేను హాయ్ చెప్పి డైలాగ్స్ చదవడంలో మునిగిపోయాను. నేను కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశానని షారుక్ ఫీలైనట్లు అనిపిచింది. సెట్లో ఉన్నప్పుడు కాస్త ఎగై్జట్‌మెంట్, టెన్షన్ ఉంటుంది. ఈ విషయం షారుక్‌కు చెప్పేలోపే.. ఆయన నన్ను హగ్ చేసుకుని.. ఈ సమస్య నాకే అనుకున్నా.. నీకూ ఉందా?’ అన్నారు. సెట్లో ఎగై్జటింగ్‌గా అనిపించని రోజున ఏ యాక్టర్ అయినా సినిమాలు మానేయొచ్చని నా అభిప్రాయం. హాలీవుడ్, బాలీవుడ్‌లాగా మనం కూడా క్యారెక్టర్ బేస్ట్ సినిమాలు చేయాలి. ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్లే నా డైరెక్షన్లో సినిమా రాలేదు. అక్టోబర్‌లో ఓ సినిమాని ప్రకటించనున్నా. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆర్జీవీగారు నాతో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాను
‘‘హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. హీరో కావాలని చిన్నప్పట్నుంచి కలలు కన్నాను. అసలు హీరోలు ఎలా ఉంటారబ్బా? మామూలు వాళ్లు ఉన్నట్లే వాళ్లూ ఉంటారా? అనిపించేది. కానీ సడెన్‌గా నన్ను హీరో అంటుంటే.. మామూలు మనిషిలానే అనుకున్నాను. నేను ఇంత కష్టపడితే ఎంతో ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) ప్రేమను చూశాను. అందుకనే ఇకపై ముందుకే వెళతాను’’ అని కార్తికేయ అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగనా సూర్యవన్షీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిప్పీ’. కలైపులి థాను నిర్మించారు. జూన్ 6న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ –‘‘నేను ‘హిప్పీ’ సినిమాను కార్తికేయతో చేయడానికి ప్రధాన కారణం తన కళ్లే. పవర్‌ఫుల్‌గా ఉండే తన కళ్లను చూసే తనతో సినిమా చేయాలనుకున్నాను. కచ్చితంగా తను రాకింగ్ హీరో అవుతాడు. ఇందులో జేడీగారు చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేశారు. దిగంగన నేచుల్ యాక్టర్. నివాస్ సోల్ ఉన్న మ్యూజిక్‌ను అందించారు. థానుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు’’ అన్నారు. ‘‘హిప్పీ అంటే సంచార జీవి అని అర్థం. ఈ సినిమాలో నా చేత అన్ని రకాల పాటలు రాయించారు. నా మీద అన్ని కోణాల్లోనూ నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’’ అన్నారు అనంత్ శ్రీరామ్. ‘‘థానుగారు దర్శకుడిగా సాధకబాధకాలు తెలుసుకున్న తర్వాత నిర్మాతగా మారారు. నా జీవితంలో రామ్‌గోపాల్ వర్మ అనే రాముడున్నాడు. ఆయన కృష్ణలీలలకు ఫేమస్. టీఎన్ కృష్ణగారు రామ తత్వానికి ఫేమస్. కెమెరా ముందు తప్ప.. కార్తికేయకు కెమెరా వెనక యాక్టింగ్ చేయడం రాదు. తనతో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు జేడీ చక్రవర్తి. ‘‘జూలై 12, 2018.. నేను మళ్లీ పుట్టినరోజు. నాకు పునర్జన్మ దక్కిన రోజు. ఆ రోజు ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైంది. ఆ సినిమా లేకపోతే నేను లేను. కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి మాట్లాడుతాను. ఒళ్లు దగ్గర పెట్టుని పనిచేస్తాను. ‘హిప్పీ’ విషయంలో నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం డైరెక్టర్ కృష్ణగారే. ఆయన తమిళ డైరెక్టర్ కాదు.. పక్కా మాస్ తెలుగు డైరెక్టర్. థానుగారు ఫోన్ చేసినప్పుడు అంత పెద్ద ప్రొడ్యూసర్ నాకెందుకు ఫోన్ చేస్తారనుకున్నాను. స్కిప్ట్ర్ నచ్చింది.. చెన్నై రండి అన్నారాయన. వెళితే అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. రజనీకాంత్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన పెద్ద నిర్మాత నాతో సినిమా చేయా లనుకోవడంతో షాక్ అయ్యాను. జేడీగారి ఎనర్జీ లెవల్స్ సూపర్బ్. జూన్ 6న నేను ఒక్కడినే కాదు.. మీరు కూడా షర్ట్ తిప్పి ఎగరేస్తారు. ఆ రోజు అందరం హిప్పీలుగా మారుతాం. సినిమా మీకు నచ్చితే షర్ట్ తిప్పి పైకి ఎగరేసి ఫొటో తీయండి. దాన్ని ట్రెండ్ చేద్దాం’’ అన్నారు. -
ఆయన నటనకు పెద్ద ఫ్యాన్‌ని
‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ‘హిప్పీ’. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరీ ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా తెరకెక్కించారు దర్శకుడు. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా రావడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా టిఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ ‘హిప్పీ’. కలైపులి ఎస్. థాను సమర్పణలో వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని జూన్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘కబాలి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో ‘హిప్పీ’ చేయడం గొప్పగా భావిస్తున్నాను. జె.డి. చక్రవర్తిగారిది చాలా కీ రోల్. కథ వినగానే ఆయన ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు. ‘‘నా పాత్రకు ఉన్న ప్రాధాన్యత అర్థమై వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాను. కార్తికేయ రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు’’ అన్నారు నటుడు జె.డి. చక్రవర్తి. ‘‘హిప్పీ’ చాలా సహజంగా, సింపుల్‌గా ఉంటుంది. మన కుటుంబంలోనో, స్నేహితుల జీవితాల్లోనో జరుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుంది. జె.డి. చక్రవర్తిగారి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా అవుతుంది’’ అన్నారు టిఎన్. కృష్ణ. ‘‘అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 7న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కలైపులి ఎస్. థాను. జజ్బా సింగ్, బ్రహ్మాజీ నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కె. ప్రసన్న. -
నా కెరీర్‌ని టాప్‌కి తీసుకెళుతుంది
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత చాలా కథలు విన్నా. ఎలాంటి కథతో సినిమా చేయాలనే క్లారిటీ లేదు. టీఎన్ కృష్ణ చెప్పిన ‘హిప్పీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పా’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత కార్తికేయ హీరోగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘హిప్పీ’. వీ క్రియేషన్స్‌పై రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన సన్నివేశానికి కలైపులి థాను క్లాప్ ఇచ్చా రు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిప్పీ’ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నారని తెలియడంతో మరింత ఉత్సాహం కలిగింది. ‘కబాలి’ లాంటి పెద్ద సినిమా తీసిన ఆయనతో నా రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్ లెవెల్‌కు తీసుకెళుతుందని బలంగా నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రయిట్ చిత్రం ‘హిప్పీ’. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు టీఎన్ కృష్ణ. ‘‘రెండు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని కలైపులి థాను అన్నారు. జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కె. ప్రసన్న. -
రొమాంటిక్ కామెడీ
‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘హిప్పీ’. టి.ఎన్. కృష్ణ దర్శకుడు. వి క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ పతాకాలపై కలైపులి.యస్.థాను నిర్మిస్తున్నారు. శుక్రవారం కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకుని ‘హిప్పీ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. తన తొలి చిత్రానికి భిన్నంగా, కేర్ఫ్రీ, క్యాజువల్‌గా సాగే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూశాను. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ హీరో అనిపించింది’’ అన్నారు కలైపులి యస్.థాను. ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది’’ అని కార్తికేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: నివాస్ కె.ప్రసన్న. -
‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్ఎక్స్ 100’ హీరో..!
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్‌లో కబాలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన కలైపులి ఎస్ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్‌గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ధనుష్‌తో రీమేక్ చేసేందుకు..!
యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్ హిట్ నీదీ నాదీ ఒకే కథ. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మధ్యతరగతి ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా రీమేక్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలో నీదీ నాదీ ఒకే కథ సినిమా చూసిన ప్రముఖ తమిళ నిర్మా కలైపులి థాను ఈ సినిమాలో తమిళ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. సినిమాలోని రుద్రరాజు సాగర్ పాత్రకు తమిళ్ లో ధనుష్ అయితే సరిగ్గా సరిపోతాడని.. ధనుష్ అంగీకరిస్తే సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతానిక ధనుష్ ఈ రీమేక్ లో నటించేందుకు అంగీకరించాడా లేదన్న అన్న విషయం తెలియాల్సి ఉంది. -
లింగ... డిసైడ్ చేశాడట..
చెన్నై: లింగ సినిమా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ....ఎక్కు తొలిమెట్టు... కొండను ఢీకొట్టు...అంటూ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కొంతసొమ్ము చెల్లించడానికి 'దళపతి' ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎంత డబ్బు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ధృవీకరించారు. సమస్య పరిష్కారమైందనీ, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన విరమించారని ఆయన ప్రకటించారు. కాగా లింగ సినిమా పంపిణీ దారులకు , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌కు మధ్య గత రెండు నెలలుగా వివాదం నడుస్తోంది. తాము నష్టపోయిన సుమారు 35 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగి ఉద్యమించారు. గత నెలలో రజనీ ఇంటిముందు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ సరనస అనుష్క, సోనాక్షి హీరోయిన్లుగా, డిసెంబర్ 12, 2014లో భారీ అంచనాలతో రిలీజైన మూవీ లింగ. రజనీకాంత్ సినీ జీవితంలో డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలను మూటగట్టుకుంది.