దిగంగనా సూర్యవన్షీ
‘‘నాకు తెలుగు భాష రానందుకు బాధగా ఉంది. భాష తెలిసి ఉంటే ఎవరితో అయినా ఈజీగా కనెక్ట్ కావొచ్చు. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్. కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన సినిమా ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా దిగంగనా సూర్యవన్షీ చెప్పిన విశేషాలు.
► సౌత్‌లో ఇదే నా ఫస్ట్ మూవీ. రెండేళ్ల క్రితం నాకు రెండు సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో నేను హిందీలో ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ‘హిప్పీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కావడం సంతోషంగా ఉంది.
► బాలీవుడ్‌లో నేను నటించిన ‘ఫ్రైడే, జిలేబీ’ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో ‘హిప్పీ’ సినిమాకి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన ఆముక్తమాల్యద పాత్ర పట్ల బాగా ఇంప్రెస్ అయ్యాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడం హ్యాపీ. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ‘హిప్పీ’లో బోల్డ్‌సీన్స్ ఉన్నాయి. సినిమాకు మంచి క్లైమాక్స్ కుదిరింది. ఎమోషనల్ సీన్స్‌లో గ్లిజరిన్ లేకుండానే ఏడవగలను.
► రాజమౌళిగారికి నేను బిగ్ ఫ్యాన్‌ని. ‘బాహుబలి’ సినిమాను ఆరుసార్లు చూశాను. మహేశ్‌బాబు సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు చూశాను. టెలివిజన్‌లో నేను చేసిన ‘వీర’ షోకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు అవకాశం వచ్చినా నేను చేయలేదు.
► సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ షో నైన్త్ సీజన్‌లో నేను పార్టిసిపెంట్‌గా చేశాను. ‘బిగ్‌బాస్’ చరిత్రలో నేను యంగెస్ట్ పార్టిసిపెంట్‌ని. సల్మాన్‌సార్‌తో నాకు పరిచయం ఉంది. ఆయన తెలుసు కదా అని లీడ్ హీరోయిన్‌గా చాన్స్ ఇవ్వమని అడగలేను. అయితే సల్మాన్ సార్ బ్యానర్‌లో సినిమా చాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment