Hippy Movie
-
అందుకే బోల్డ్ సీన్స్ చేశా
‘‘నాకు తెలుగు భాష రానందుకు బాధగా ఉంది. భాష తెలిసి ఉంటే ఎవరితో అయినా ఈజీగా కనెక్ట్ కావొచ్చు. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్. కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన సినిమా ‘హిప్పీ’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా దిగంగనా సూర్యవన్షీ చెప్పిన విశేషాలు. ► సౌత్‌లో ఇదే నా ఫస్ట్ మూవీ. రెండేళ్ల క్రితం నాకు రెండు సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో నేను హిందీలో ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ‘హిప్పీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కావడం సంతోషంగా ఉంది. ► బాలీవుడ్లో నేను నటించిన ‘ఫ్రైడే, జిలేబీ’ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో ‘హిప్పీ’ సినిమాకి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన ఆముక్తమాల్యద పాత్ర పట్ల బాగా ఇంప్రెస్ అయ్యాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడం హ్యాపీ. స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ‘హిప్పీ’లో బోల్డ్సీన్స్ ఉన్నాయి. సినిమాకు మంచి క్లైమాక్స్ కుదిరింది. ఎమోషనల్ సీన్స్‌లో గ్లిజరిన్ లేకుండానే ఏడవగలను. ► రాజమౌళిగారికి నేను బిగ్ ఫ్యాన్‌ని. ‘బాహుబలి’ సినిమాను ఆరుసార్లు చూశాను. మహేశ్‌బాబు సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు చూశాను. టెలివిజన్‌లో నేను చేసిన ‘వీర’ షోకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు అవకాశం వచ్చినా నేను చేయలేదు. ► సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ షో నైన్త్ సీజన్లో నేను పార్టిసిపెంట్‌గా చేశాను. ‘బిగ్‌బాస్’ చరిత్రలో నేను యంగెస్ట్ పార్టిసిపెంట్‌ని. సల్మాన్‌సార్‌తో నాకు పరిచయం ఉంది. ఆయన తెలుసు కదా అని లీడ్ హీరోయిన్గా చాన్స్ ఇవ్వమని అడగలేను. అయితే సల్మాన్ సార్ బ్యానర్లో సినిమా చాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. -
ఆ రోజు సినిమాలు మానేయొచ్చు
‘‘నాకు నచ్చిన మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టే తక్కువ అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన తెలుగు సినిమా అవకాశాల్లో ‘హిప్పీ’ తప్ప మరో స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేయలేదు. ఏదో కథకి ఓకే చెబితే డబ్బు వస్తుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘హిప్పీ’. దిగంగన సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర చేశారు. కలైపులి యస్. థాను నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి చెప్పిన విశేషాలు.... ► నేటి యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో ఓ కంపెనీ సీఈవోగా నటించాను. ప్లేబాయ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉంటుంది. ► కార్తికేయ బాగా నటించాడు. ఫ్రెష్ అప్రోచ్‌తో పోయిటిక్గా తీశాడు దర్శకుడు క్రిష్ణ. థానుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ► లస్ట్ బేస్డ్(కామం) సినిమాలు చాలా రావొచ్చు. కానీ, ఎమోషన్ లేకుండా లవ్, యాక్షన్, ఫియర్.. ఇలా ఏదీ వర్కౌట్ కాదు. కేవలం కామం వల్లే సినిమాలు ఆడవు. ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలు స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఉన్న లవ్ బేస్డ్ సినిమాలు. అందుకే హిట్ సాధించాయి. ‘హిప్పీ’ కూడా బోల్డ్ కంటెంట్‌తో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది. ► నా యాక్టింగ్ కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. ఏమీ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రాలేదు నేను. వచ్చి ఇంకా నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్పిన మా గురువుగారు(రామ్‌గోపాల్ వర్మ) డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పలేదు. నేను హిందీలో ‘వాస్తుశాస్త్ర’ చేస్తున్న సమయంలో షారుక్ మా సెట్‌కి వచ్చారు. అప్పుడు ఆయన ‘వీర్‌జారా’ చేస్తున్నారు. మా సెట్‌కి వచ్చిన షారుక్‌ని సుశ్మితాసేన్ ‘హాయ్.. షారుక్’ అంటూ పలకరించారు. నేను హాయ్ చెప్పి డైలాగ్స్ చదవడంలో మునిగిపోయాను. నేను కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశానని షారుక్ ఫీలైనట్లు అనిపిచింది. సెట్లో ఉన్నప్పుడు కాస్త ఎగై్జట్‌మెంట్, టెన్షన్ ఉంటుంది. ఈ విషయం షారుక్‌కు చెప్పేలోపే.. ఆయన నన్ను హగ్ చేసుకుని.. ఈ సమస్య నాకే అనుకున్నా.. నీకూ ఉందా?’ అన్నారు. సెట్లో ఎగై్జటింగ్‌గా అనిపించని రోజున ఏ యాక్టర్ అయినా సినిమాలు మానేయొచ్చని నా అభిప్రాయం. హాలీవుడ్, బాలీవుడ్‌లాగా మనం కూడా క్యారెక్టర్ బేస్ట్ సినిమాలు చేయాలి. ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్లే నా డైరెక్షన్లో సినిమా రాలేదు. అక్టోబర్‌లో ఓ సినిమాని ప్రకటించనున్నా. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆర్జీవీగారు నాతో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాను
‘‘హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. హీరో కావాలని చిన్నప్పట్నుంచి కలలు కన్నాను. అసలు హీరోలు ఎలా ఉంటారబ్బా? మామూలు వాళ్లు ఉన్నట్లే వాళ్లూ ఉంటారా? అనిపించేది. కానీ సడెన్‌గా నన్ను హీరో అంటుంటే.. మామూలు మనిషిలానే అనుకున్నాను. నేను ఇంత కష్టపడితే ఎంతో ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) ప్రేమను చూశాను. అందుకనే ఇకపై ముందుకే వెళతాను’’ అని కార్తికేయ అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగనా సూర్యవన్షీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిప్పీ’. కలైపులి థాను నిర్మించారు. జూన్ 6న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ –‘‘నేను ‘హిప్పీ’ సినిమాను కార్తికేయతో చేయడానికి ప్రధాన కారణం తన కళ్లే. పవర్‌ఫుల్‌గా ఉండే తన కళ్లను చూసే తనతో సినిమా చేయాలనుకున్నాను. కచ్చితంగా తను రాకింగ్ హీరో అవుతాడు. ఇందులో జేడీగారు చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేశారు. దిగంగన నేచుల్ యాక్టర్. నివాస్ సోల్ ఉన్న మ్యూజిక్‌ను అందించారు. థానుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు’’ అన్నారు. ‘‘హిప్పీ అంటే సంచార జీవి అని అర్థం. ఈ సినిమాలో నా చేత అన్ని రకాల పాటలు రాయించారు. నా మీద అన్ని కోణాల్లోనూ నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’’ అన్నారు అనంత్ శ్రీరామ్. ‘‘థానుగారు దర్శకుడిగా సాధకబాధకాలు తెలుసుకున్న తర్వాత నిర్మాతగా మారారు. నా జీవితంలో రామ్‌గోపాల్ వర్మ అనే రాముడున్నాడు. ఆయన కృష్ణలీలలకు ఫేమస్. టీఎన్ కృష్ణగారు రామ తత్వానికి ఫేమస్. కెమెరా ముందు తప్ప.. కార్తికేయకు కెమెరా వెనక యాక్టింగ్ చేయడం రాదు. తనతో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు జేడీ చక్రవర్తి. ‘‘జూలై 12, 2018.. నేను మళ్లీ పుట్టినరోజు. నాకు పునర్జన్మ దక్కిన రోజు. ఆ రోజు ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైంది. ఆ సినిమా లేకపోతే నేను లేను. కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి మాట్లాడుతాను. ఒళ్లు దగ్గర పెట్టుని పనిచేస్తాను. ‘హిప్పీ’ విషయంలో నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం డైరెక్టర్ కృష్ణగారే. ఆయన తమిళ డైరెక్టర్ కాదు.. పక్కా మాస్ తెలుగు డైరెక్టర్. థానుగారు ఫోన్ చేసినప్పుడు అంత పెద్ద ప్రొడ్యూసర్ నాకెందుకు ఫోన్ చేస్తారనుకున్నాను. స్కిప్ట్ర్ నచ్చింది.. చెన్నై రండి అన్నారాయన. వెళితే అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. రజనీకాంత్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన పెద్ద నిర్మాత నాతో సినిమా చేయా లనుకోవడంతో షాక్ అయ్యాను. జేడీగారి ఎనర్జీ లెవల్స్ సూపర్బ్. జూన్ 6న నేను ఒక్కడినే కాదు.. మీరు కూడా షర్ట్ తిప్పి ఎగరేస్తారు. ఆ రోజు అందరం హిప్పీలుగా మారుతాం. సినిమా మీకు నచ్చితే షర్ట్ తిప్పి పైకి ఎగరేసి ఫొటో తీయండి. దాన్ని ట్రెండ్ చేద్దాం’’ అన్నారు. -
సమ్మర్లో కూల్ సినిమా అవుతుంది
‘‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్బాస్టర్ అయింది. కార్తికేయ బాగా నటించాడని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు కార్తికేయతో ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా చేస్తున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ ఎందుకు అంత హిట్ అయిందో ఇప్పుడు అర్థం అయింది’’ అని నాని అన్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి యస్. థాను నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో టీఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిప్పీ’. కార్తికేయ, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లు. ‘హిప్పీ’ టీజర్‌ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కార్తికేయతో పని చేయడం సరదాగా ఉంది. ఆ పరిచయంతోనే నేను ఈ టీజర్ రిలీజ్ చేశాను. సక్సెస్ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని లక్షణాలు, వైబ్రేషన్స్ ఈ టీజర్లో ఉన్నాయి. సమ్మర్లో కూల్ సినిమా అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయింది. అందరి అంచనాలకు తగ్గ రీతిలో నిర్మిస్తున్నాం. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు థాను. ‘‘టీజర్ రిలీజ్ చేసినందుకు నానిగారికి థ్యాంక్స్’’ అన్నారు టీఎన్ కృష్ణ. ‘‘నానిగారితో పని చేసే అవకాశం ‘గ్యాంగ్‌లీడర్’ ద్వారా వచ్చింది. అడగ్గానే టీజర్ లాంచ్ చేసిన ఆయనకు థ్యాంక్స్. షూటింగ్ చేస్తూ నానిగారికి బాగా క్లోజ్ అయ్యాను’’ అన్నారు కార్తికేయ. ‘‘ట్రైలర్ చూస్తుంటే ఫన్ రైడ్‌లా ఉంది. కార్తికేయకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె ప్రసన్న, కెమెరా: ఆర్డీ రాజశేఖర్. -
పది సెకన్లు టైమ్ ఇస్తే ఏడ్చేస్తా
‘‘ఏడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ మొదలుపెట్టాను. హిందీ టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేశాను. ‘వీరా’ అనే సీరియల్ తెలుగులో ‘మీనా’గా అనువాదం అయింది. సీరియల్స్ చేస్తూ ‘బిగ్‌బాస్ సీజన్ 9’లో పాల్గొన్నాను. అది పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాను. టీవీ నుంచి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్లంతా లేట్‌గా వెళ్లారు. నేను మాత్రం 20 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. హిందీలో ‘ఫ్రైడే, జలేబి, రంగీలా రాజా’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం ‘హిప్పీ’ సినిమాతో తెలుగు, తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అని బాలీవుడ్ భామ దిగంగనా సూర్యవన్షీ అన్నారు. తమిళ టాప్ ప్రొడ్యూసర్ ఎస్.థాను నిర్మాణంలో టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘హిప్పీ’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరో. ఈ సినిమాతో కథానాయికగా సౌత్‌కు పరిచయం అవుతున్న సూర్యవన్షీ పలు విశేషాలు పంచుకున్నారు. ► మంచి ప్రాజెక్ట్‌తో సౌత్‌కి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సౌత్ సినిమాల్లో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అని నా ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఈ సినిమాలో హీరోతో సమానంగానే నా పాత్ర కూడా ఉంటుంది. ► ‘కబాలి’ తీసిన థాను సార్ బేనర్లో చేయడం ఎగై్జటింగ్‌గా అనిపించింది. కార్తికేయ మంచి కో–స్టార్. తెలుగు డైలాగ్స్ త్వరగా నేర్చుకుంటున్నానని మా టీమ్ అంటున్నారు. డబ్బింగ్ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ► రజనీకాంత్ సార్, చిరంజీవి సార్ స్టార్స్‌గా ఎదిగిన కథలు చాలా విన్నాను. అవి నాకు స్ఫూర్తి. తెలుగు డబ్బింగ్ సినిమాలు చాలా చూశాను. ‘బాహుబలి’ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. పీరియాడికల్ సినిమా చేయాలనుంది. గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. కత్తి యుద్ధాలు చేయాలనుంది (నవ్వుతూ). ► గ్లిజరిన్ లేకుండానే ఏడుస్తాను. పది సెకన్లు టైమ్ ఇస్తే చాలు కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇందులో నాకు ఇండియా రికార్డ్ కూడా ఉంది. సీరియల్ షూటింగ్ టైమ్‌లో ఏడ్చే సన్నివేశాల్లో నా కళ్లను చూస్తే.. నా ఫ్రెండ్స్ రైట్ ట్యాప్ ఆన్ చెయ్, లెఫ్ట్ ట్యాప్ ఆన్ చెయ్ అని సరదాగా అంటుంటారు. ► 16 ఏళ్లకే నేను రాసిన నా తొలి నవల రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇంకో పుస్తకం కూడా రాశాను. పాటలు, స్క్రిప్ట్స్ కూడా రాస్తుంటాను. నాకు రాయడం వచ్చు కదా అని దర్శకులు చెప్పినదానితో వాదించను. వింటాను ► రాజమౌళిసార్, మణిరత్నంగారితో పని చేయాలనుంది. వరుసగా సినిమాలు చేయాలని కంగారు పడను. ప్రాజెక్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తుంటాను. ∙దిగంగనా సూర్యవన్షీ