దిగంగనా సూర్యవన్షీ
‘‘ఏడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ మొదలుపెట్టాను. హిందీ టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేశాను. ‘వీరా’ అనే సీరియల్ తెలుగులో ‘మీనా’గా అనువాదం అయింది. సీరియల్స్ చేస్తూ ‘బిగ్‌బాస్ సీజన్ 9’లో పాల్గొన్నాను. అది పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాను. టీవీ నుంచి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్లంతా లేట్‌గా వెళ్లారు. నేను మాత్రం 20 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను.
హిందీలో ‘ఫ్రైడే, జలేబి, రంగీలా రాజా’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం ‘హిప్పీ’ సినిమాతో తెలుగు, తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అని బాలీవుడ్ భామ దిగంగనా సూర్యవన్షీ అన్నారు. తమిళ టాప్ ప్రొడ్యూసర్ ఎస్.థాను నిర్మాణంలో టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘హిప్పీ’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరో. ఈ సినిమాతో కథానాయికగా సౌత్‌కు పరిచయం అవుతున్న సూర్యవన్షీ పలు విశేషాలు పంచుకున్నారు.
► మంచి ప్రాజెక్ట్‌తో సౌత్‌కి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సౌత్ సినిమాల్లో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అని నా ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఈ సినిమాలో హీరోతో సమానంగానే నా పాత్ర కూడా ఉంటుంది.
► ‘కబాలి’ తీసిన థాను సార్ బేనర్‌లో చేయడం ఎగై్జటింగ్‌గా అనిపించింది. కార్తికేయ మంచి కో–స్టార్. తెలుగు డైలాగ్స్ త్వరగా నేర్చుకుంటున్నానని మా టీమ్ అంటున్నారు. డబ్బింగ్ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను.
► రజనీకాంత్ సార్, చిరంజీవి సార్ స్టార్స్‌గా ఎదిగిన కథలు చాలా విన్నాను. అవి నాకు స్ఫూర్తి. తెలుగు డబ్బింగ్ సినిమాలు చాలా చూశాను. ‘బాహుబలి’ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. పీరియాడికల్ సినిమా చేయాలనుంది. గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. కత్తి యుద్ధాలు చేయాలనుంది (నవ్వుతూ).
► గ్లిజరిన్ లేకుండానే ఏడుస్తాను. పది సెకన్లు టైమ్ ఇస్తే చాలు కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇందులో నాకు ఇండియా రికార్డ్ కూడా ఉంది. సీరియల్ షూటింగ్ టైమ్‌లో ఏడ్చే సన్నివేశాల్లో నా కళ్లను చూస్తే.. నా ఫ్రెండ్స్ రైట్ ట్యాప్ ఆన్ చెయ్, లెఫ్ట్ ట్యాప్ ఆన్ చెయ్ అని సరదాగా అంటుంటారు.
► 16 ఏళ్లకే నేను రాసిన నా తొలి నవల రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇంకో పుస్తకం కూడా రాశాను. పాటలు, స్క్రిప్ట్స్ కూడా రాస్తుంటాను. నాకు రాయడం వచ్చు కదా అని దర్శకులు చెప్పినదానితో వాదించను. వింటాను
► రాజమౌళిసార్, మణిరత్నంగారితో పని చేయాలనుంది. వరుసగా సినిమాలు చేయాలని కంగారు పడను. ప్రాజెక్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తుంటాను.
∙దిగంగనా సూర్యవన్షీ
Comments
Please login to add a commentAdd a comment