‘‘నాకు నచ్చిన మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టే తక్కువ అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన తెలుగు సినిమా అవకాశాల్లో ‘హిప్పీ’ తప్ప మరో స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేయలేదు. ఏదో కథకి ఓకే చెబితే డబ్బు వస్తుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘హిప్పీ’. దిగంగన సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర చేశారు. కలైపులి యస్. థాను నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి చెప్పిన విశేషాలు....
► నేటి యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో ఓ కంపెనీ సీఈవోగా నటించాను. ప్లేబాయ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉంటుంది.
► కార్తికేయ బాగా నటించాడు. ఫ్రెష్ అప్రోచ్‌తో పోయిటిక్‌గా తీశాడు దర్శకుడు క్రిష్ణ. థానుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్.
► లస్ట్ బేస్డ్(కామం) సినిమాలు చాలా రావొచ్చు. కానీ, ఎమోషన్ లేకుండా లవ్, యాక్షన్, ఫియర్.. ఇలా ఏదీ వర్కౌట్ కాదు. కేవలం కామం వల్లే సినిమాలు ఆడవు. ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100’ సినిమాలు స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఉన్న లవ్ బేస్డ్ సినిమాలు. అందుకే హిట్ సాధించాయి. ‘హిప్పీ’ కూడా బోల్డ్ కంటెంట్‌తో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చుతుంది.
► నా యాక్టింగ్ కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. ఏమీ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రాలేదు నేను. వచ్చి ఇంకా నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్పిన మా గురువుగారు(రామ్‌గోపాల్ వర్మ) డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పలేదు. నేను హిందీలో ‘వాస్తుశాస్త్ర’ చేస్తున్న సమయంలో షారుక్ మా సెట్‌కి వచ్చారు. అప్పుడు ఆయన ‘వీర్‌జారా’ చేస్తున్నారు. మా సెట్‌కి వచ్చిన షారుక్‌ని సుశ్మితాసేన్ ‘హాయ్.. షారుక్’ అంటూ పలకరించారు. నేను హాయ్ చెప్పి డైలాగ్స్ చదవడంలో మునిగిపోయాను. నేను కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశానని షారుక్ ఫీలైనట్లు అనిపిచింది. సెట్‌లో ఉన్నప్పుడు కాస్త ఎగై్జట్‌మెంట్, టెన్షన్ ఉంటుంది. ఈ విషయం షారుక్‌కు చెప్పేలోపే.. ఆయన నన్ను హగ్ చేసుకుని.. ఈ సమస్య నాకే అనుకున్నా.. నీకూ ఉందా?’ అన్నారు. సెట్‌లో ఎగై్జటింగ్‌గా అనిపించని రోజున ఏ యాక్టర్ అయినా సినిమాలు మానేయొచ్చని నా అభిప్రాయం. హాలీవుడ్, బాలీవుడ్‌లాగా మనం కూడా క్యారెక్టర్ బేస్ట్ సినిమాలు చేయాలి.
► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్లే నా డైరెక్షన్‌లో సినిమా రాలేదు. అక్టోబర్‌లో ఓ సినిమాని ప్రకటించనున్నా. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆర్‌జీవీగారు నాతో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment