ధనుష్‌తో రీమేక్‌ చేసేందుకు..! | Dhanush In Needi Naadi Oke Katha Remake | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 25 2018 1:53 PM | Last Updated on Sun, Mar 25 2018 1:53 PM

Dhanush In Needi Naadi Oke Katha Remake - Sakshi

తమిళ హీరో ధనుష్‌

యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్‌ హిట్ నీదీ నాదీ ఒకే కథ. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మధ్యతరగతి ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. పాజిటివ్‌ టాక్‌ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమా రీమేక్‌ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

చెన్నైలో నీదీ నాదీ ఒకే కథ సినిమా చూసిన ప్రముఖ తమిళ నిర్మా కలైపులి థాను ఈ సినిమాలో తమిళ్ రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట. సినిమాలోని రుద్రరాజు సాగర్‌ పాత్రకు తమిళ్ లో ధనుష్‌ అయితే సరిగ్గా సరిపోతాడని.. ధనుష్ అంగీకరిస్తే సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతానిక ధనుష్ ఈ రీమేక్‌ లో నటించేందుకు అంగీకరించాడా లేదన్న అన్న విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement