Needi Naadi Oke Katha
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!
మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి. అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి చూద్దాం! తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’: తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో. తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’ చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. ఆకలి రాజ్యం: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్ బీటెక్’: మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి: మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇడియట్: నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. ‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి: నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్‌లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశారు. ‘అమ్మో ఒకటో తారీఖు’: ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య: మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్ రాజ్. ‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్: హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్ రెచ్చిపోయాడు. -
వేణు ఊడుగుల దర్శకత్వంలో కార్తీ
సాక్షి, తమిళసినిమా : నీది నాది ఒకే కథ చిత్ర దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి యువ స్టార్ నటుడు కార్తీ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. కార్తీకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో అనువాదమై కలెక్షన్లు వసూలు చేస్తుంది.అంతే కాకుండా ఊపిరి చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా కార్తీ తన సోదరుడు సూర్య నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తున్నారు. సాయేషాసైగల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి రజత్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటింనున్నారు. ఇందులో నటి రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ ప్రధాన పాత్రలను పోషించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ తన 18వ చిత్రానికి కమెట్ అయ్యారన్నది తాజా సమాచారం. దీనికి తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నీది నాది ఒకే కథ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్నారని, ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్త వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
మీదీ మాదీ మనదీ ఒకే కథ
కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం. వేణు ఊడుగుల సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ అలాంటిదే. ఉదాత్తమైన ఒక దృశ్యకావ్యం కాలం గడిచి చాలా దూరం నడిచివచ్చినా బట్టల పొత్తిళ్ళలో దాక్కుని కూర్చున్న అపురూప పరిమళంలా మనల్ని మనోరంజితం కావిస్తూనే ఉంటుంది. కలతపరచి దిగులుపరచి, మనం ఆలా ప్రవర్తించకూడదనే తెలివిడిని కలిగి స్తూనే ఉంటుంది. చాలా కాలం క్రితం నేను చూసిన ‘రీడర్’ సినిమా నాకివాళ జ్ఞాపకమొస్తోంది. తనకు చదువు రాదని చెప్పుకోవడానికి సిగ్గు పడిన ఒక అమ్మాయి మౌనంగా అనేక సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవి స్తుంది. అట్లాగే ‘షిండ్లర్స్ లిస్ట్’ నాజీల దురాగతాల సమయంలో ఒక యూదుడు చూపిన అత్యున్నత హృదయస్పందన ఏళ్ళు గడిచినా బాధాభరితమైన రసాయనిక అసమతుల్యతను మనలో కలుగజేస్తుంది. కొరియన్ సినిమా, ‘ఏప్రిల్ స్నో’ అవాంఛితమైన పరిస్థితులలో వైవాహికేతర సంబంధంలోకి వెళ్లిన వివాహిత స్త్రీ పురుషుల ఘర్షణ జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి హృదయం బరువై మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కధ’’ నాకు ఇలాటి భావాన్నే కలి గించింది. కనుక. కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం . వేణు ఊడుగుల సినిమా అలాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని, మార్కెట్ చెబుతున్న మార్గంలో పయనించలేక, సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ రేస్‌లో నిలువలేక రాలి పడిపోతున్న, అయోమయానికి, ఆత్మన్యూనతకు లోనవుతున్న అనేకమందిని వేణు మనకు పరిచయం చేశాడు. చాలా సినిమాలు ఉదాత్తతను చెబుతూనే మధ్యలో ఎక్కడో పురుష దాస్యాన్ని చెబుతుంటాయి. ఫిదా సినిమా చూస్తున్నపుడు నాకు ఇలాటి ఆశ్చర్యమే కలిగింది. తాటి చెట్టంత మగవాళ్ళు ఇద్దరుండగా, అక్కకు సహాయానికి చెల్లి ఇండియానుంచి రావడమూ, కాలేజ్‌లో తన మీదికి వచ్చిన మగపిల్లలపై, వీరనారిని అని చెప్పుకునే నాయిక నాయకుడి వీరత్వ ప్రదర్శనకు ఎదురుచూడటం, ఇంటి చాకిరీ బాధ్యతగా చేయడం, ఆమె వూగిసలాట చాలా చిరాకు తెప్పించింది. వేణు సినిమాలో అలాంటి ద్వైదీయతలు ఉండవు. మొదటినుండి కడదాకా ఒకటే విషయం, స్థిరచిత్తంతో ప్రశ్నిస్తూ వెడతాడు. ‘మీరు సాధించగలరు’ అని ఒకలాటి భ్రమాత్మకత మాదకత వైపుకి నేటి యువతరాన్ని నెడుతున్న అనేక అంశాలను వేణు ప్రశ్నిస్తాడు . వేణు చాలా మృదువైన అబ్బాయి. మితభాషి, ముఖంనిండుగా మాటలు అక్కరలేని మౌనం చిద్విలాసంగా వెలుగుతూ ఉంటుంది. అతనిది ‘‘లవ్ ఎట్ రీజనల్ మైల్ స్టోన్’’ నేను చదివిన మొదటి కవిత. అట్లాగే మనసుకు హత్తుకు పోయింది. ప్రేమ సంబంధాలలోకి ఓ ప్రాంతం ఎలా చొచ్చుకొస్తుందో చెప్తాడు ఈ అబ్బాయి ఎంతో హృద్యంగా. ‘‘వంద ప్లాస్టిక్ సర్జరీలు కావాలి–ఆమె చెంపలపైనున్న నా ముద్దుల తడి ఆరడానికి! ఏడు సముద్రాలు కావాలి – నేను మాత్రమే కని పించే ఆ రెండు కళ్ళని కడుక్కోవడానికి’’ అంటూ నీది మా ఏరి యానే అయితే ఈ గొడవే ఉండేది కాదు అని వెళ్ళిపోయిన ప్రాంతీయేతర ప్రియురాలి గురించి అతను రాసిన కవిత సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. సామాజిక స్పృహ నిండుగావున్న వ్యక్తి తన ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తే అది కచ్చితంగా చాలా పాతదే అయిన మట్టిని చీల్చుకుని బుజ్జి బుజ్జి మారాకులు వేసుకుని ఆత్మవిశ్వాసంతో సూర్యుని దిక్కుకి ధిక్కారంతో తల ఎత్తి ప్రశ్నలు వేస్తున్న చిట్టి మొలకలా ఉంటుంది. వేణు ఇప్పుడు మనముందుంచిన ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’ అచ్చం అలాటి సినిమానే. ఎన్నో విలువయిన ప్రశ్నలను ఒక అమాయకుడయినా ఎదిగీ ఎదగని అబ్బాయి చేత అడిగించాడు ఈ దర్శకుడు. సంతృప్తిగా బ్రతకడమంటే ఏమిటీ? సంతృప్తికి కొలమానాలేవి? యూనివర్సిటీలో ఉన్నపుడు క్లాస్ నుంచి తిరిగివస్తుంటే అంత వరకు మట్టి పని చేసిన కూలీలు కేరేజీలు విప్పి వరుసగా కూర్చుని భోజనం చేస్తుండేవారు, మధ్యమధ్యలో బోలెడు చతురులు. ఒక ముద్ద అడిగి పెట్టించుకు తినాలనిపించేది వాళ్ళని చూస్తే. వాళ్ళు సంతృప్తిగా లేరనా? ఇంటికెళ్లి ఉడుకు నీళ్లు పోసుకుని పడుకుంటే వాళ్లకి పట్టే నిద్ర చిరంజీవికి పడుతుందా, మోదీకి పడుతుందా. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది వ్యక్తిత్వ వికాస తరగతులూ, పుస్తకాలు. ఈ మధ్య కాలంలో వేలం వెర్రిగా మార్కెట్‌ను ఆక్రమించుకుంటున్న ఈ అంశం గురించి వేణు భలే చెప్పాడు. ‘‘గొప్ప విజయాలకు ఎల్లప్పుడూ గొప్పత్యాగాలు అవసరమవుతాయి’’ అంటాడు మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ. శాక్రిఫైస్ అనేదానికి పరిమితి ఏమిటీ? ఎంతవరకూ? తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూ అల్లిపెడుతున్న బంగారు వలలో పడి పిల్లలు చేస్తున్న త్యాగాల అత్యాచారాన్ని ఎవరైనా కొలతలు వేస్తున్నారా? వేణు వేసిన అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న ఒకటి ఉంది అది ’’డిగ్నిటీ ఆఫ్ లేబర్’’. డిగ్నిటీ అఫ్ లేబర్ అంటే ఏమిటీ, మనమూ, మనపక్కన వ్యక్తి చేస్తున్న పని ఏదయినా అది విలువయినదే. నేను కార్ నడుపుతాను, నువ్వు ఆ కార్ ఓనర్‌వి అయితే ఏమిటీ, నాకు ఈ వృత్తి వచ్చు, నీకు మరో వృత్తి వచ్చు. ఒక వృత్తి మాత్రమే గొప్పది అని నిర్వచించిన కుట్ర ఎక్కడ మొదలయింది? లేచీ లేవగానే తిండి గింజల కోసం రెక్కలల్లార్చుకుని ఆకాశపు దారుల్లో బయలుదేరే పిట్ట కడుపు నిండాక పడే తృప్తి ముందు రేపటి చింత నిలబడగలదా? సాదా సీదా సెట్టింగుతో, ఎక్కడా కించిత్తు శారీరక ప్రదర్శనలు లేకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిన ఈ అబ్బాయికి, ఇంత మంచి సినిమా తీసిన ఈ అబ్బాయికి భవిష్యత్తు మరిన్ని అవకాశపు వాకిళ్ళను తెరిచే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక చూడండి, ఎప్పుడో ఒకప్పుడు మనం ఫీలయిన కథ మనందరి కథ, వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
ధనుష్ కాదు శింబు
తమిళసినిమా: ఏ భాషలోనైనా చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటే వెంటనే ఆ చిత్ర రీమేక్ హక్కులకు పోటీ సహజం. ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న చిత్రం నీది నాది ఒకే కథ. వర్థమాన నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఇందులో బిచ్చగాడు చిత్రం ఫేమ్ సాట్నా టిటస్ కథానాయకిగా నటించింది. టాలీవుడ్లో ఈమెకిది తొలి చిత్రం. ఊడుగుల వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. దీంతో కోలీవుడ్ దర్శక, హీరోల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం నటుడు ధనుష్‌కు తెగ నచ్చేసిందని, వెంటనే తమిళరీమేక్ హక్కులను ధనుష్ కొనేశారని ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కిపాయుమ్ తూట్టా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి నీది నాది ఒకే కథ రీమేక్‌లో నటిస్తారని ప్రచారం. అయితే తాజా గా నీది నాది ఒకే కథ చిత్రంలో ధనుష్‌ను కాదని, సంచలన నటుడు శింబు నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం హల్చల్ చేస్తోంది. అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం ఫ్లాప్‌తో షాక్ తిన్న శింబు ఆ చిత్రం నిర్మాత నుంచి నష్ట పరిహారం లాంటి డిమాండ్లను ఎదుర్కొన్నారు. చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో సెక్క సి వక్క వానం చిత్రంలో నటిస్తున్నారు. -
దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ విష్ణు. సహాయనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా విజయాలు సాధిస్తున్న ఈ యువ కథానాయకుడు త్వరలో దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నానన్న శ్రీవిష్ణు, మంచి కథ కుదిరితే తప్పుకుండా దర్శకుడిగా మారతానని చెపుతున్నాడు. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీదీ నాదీ ఒకే కథ సినిమా ఇటీవల విడుదలై విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న శ్రీ విష్ణు... ప్రస్తుతం వీరభోగ వసంత రాయలుతో పాటు ‘తిప్పరా మీసం’ అనే కామెడీ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. -
నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది..
‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్ మీడియా వర్క్స్ బేనర్లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్‌గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్. ‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ రాజ్ తోట, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ధనుష్‌తో రీమేక్ చేసేందుకు..!
యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్ హిట్ నీదీ నాదీ ఒకే కథ. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మధ్యతరగతి ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా రీమేక్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలో నీదీ నాదీ ఒకే కథ సినిమా చూసిన ప్రముఖ తమిళ నిర్మా కలైపులి థాను ఈ సినిమాలో తమిళ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. సినిమాలోని రుద్రరాజు సాగర్ పాత్రకు తమిళ్ లో ధనుష్ అయితే సరిగ్గా సరిపోతాడని.. ధనుష్ అంగీకరిస్తే సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతానిక ధనుష్ ఈ రీమేక్ లో నటించేందుకు అంగీకరించాడా లేదన్న అన్న విషయం తెలియాల్సి ఉంది. -
‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : నీదీ నాదీ ఒకే కథ జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : శ్రీ విష్ణు, సాట్నా టిటస్, దేవీ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ సంగీతం : సురేష్ బొబ్బిలి దర్శకత్వం : వేణు ఊడుగుల నిర్మాత : నారా రోహిత్, ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.. లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చదువులు, ర్యాంకుల కోసం పరుగులు, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను పెట్టే ఇబ్బందులు ప్రధానంగా ప్రస్థావించారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీ విష్ణుకు మరో విజయాన్ని అందించిందా..? కథ : రుద్రరాజు దేవీ ప్రసాద్ (దేవీ ప్రసాద్) ప్రొఫెసర్. ఉన్నత మైన చదువు చదుకొని సమాజంలో పరువు ప్రతిష్ట ఉన్న మధ్య తరగతి తండ్రి. తన కొడుకు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలని తపన పడే తండ్రి. సాగర్ (శ్రీ విష్ణు) డిగ్రీ మూడు సార్లు ఫెయిల్ అయ్యి తన చెల్లెలితో కలిసి మళ్లీ ఎగ్జామ్స్ రాసే కుర్రాడు. జీవితం మీద, భవిష్యత్తు మీద క్లారిటీ లేకుండా టైం పాస్ చేసేస్తుంటాడు. కానీ తండ్రి బాధ తెలుసుకున్న సాగర్ ఎలాగైనా తండ్రి కోరుకున్నట్టుగా మారాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ధార్మిక (సాట్నా టిటస్) సాయం తీసుకుంటాడు. కానీ ఈ ప్రయత్నాల్లో తనని తాను కోల్పోవడం ఇష్టం లేక.. తండ్రి ఆశించినట్టుగా మారలేక నలిగిపోతుంటాడు. చివరకు సాగర్.. తండ్రి కోరుకున్నట్టుగా మారాడా..? లేక తనలాగే తాను ఉండిపోయాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా తండ్రీ కొడుకుల మధ్యే నడిచే కథ కావటంలో ప్రధానం గా రెండు పాత్రలే తెరమీదే కనిపిస్తుంటాయి. జీవితంలో ఏది సాధించలేననే నిరుత్సాహంలో బతికే కుర్రాడిగా శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. తన కొడుకు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవ్వాలన్న తండ్రి కోరిక నేరవేర్చలేక.. తనని తాను కోల్పోలేక సతమతమ్యే పాత్రలో మంచి భావోద్వేగాలను పండించాడు. తొలిసారిగా తెరపైన కనిపించిన దర్శకుడు దేవీ ప్రసాద్.. నటుడిగానూ మంచి మార్కులు సాధించాడు. మధ్య తరగతి మనుషుల మనస్థత్వాలకు, ఆలోచనలకు, ఆశలకు ప్రతిరూపంగా నటించి మెప్పించారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాట్నా టిటస్కు ఈ సినిమాలో కూడా నటనకు ఆస్కారమున్న పాత్రే దక్కింది. ఫస్ట్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసిన సాట్నా.. ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటన కనబరిచింది. విశ్లేషణ : మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లోను ఉండే సమస్యలనే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా కథే అనిపించేలా ఉంది కథనం. ప్రస్తుత సమాజంలో అందరు మనుషులు ముసుగులు వేసుకునే బతుకున్నారన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్ చేశాడు. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న అంశాలను బలమైన ఎమోషనల్ సీన్స్‌తో తెర మీద ఆవిష్కరించాడు.. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎక్కడ కమర్షియల్ లెక్కల కోసం పాటలను ఇరికించకుండా ప్రతీ పాట కథలో భాగంగా వచ్చిపోతుంటాయి. సినిమాకు మరో ప్రధానబలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం శ్రీ విష్ణు నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఈ సినిమా కొనాలనుకున్నా – శర్వానంద్
‘‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ చూడగానే మార్నింగ్ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్‌కి కాల్ చేస్తే, అప్పటికే బిజినెస్ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్ చేసుకున్నానే అనిపిస్తోంది’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాదే’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ‘ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ అవుతుందనే వైబ్రేషన్ కలిగింది. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు. -
‘నా కథలా కూడా అనిపిస్తుంది’
యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి మనుషుల జీవితం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినీ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్‌ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ షో చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా యంగ్ హీరో నాని కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాని... ‘ఇది నా కథలా కూడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు నటనలో అతను ఎంత మనసుపెట్టి పర్ఫామ్ చేశాడో తెలుస్తోంది. అతనికి అతని టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు నాని. This looks like my Katha too .. there’s a lot of heart in sree vishnu’s performance .. wishing him and his team all the very best :)#NeedhiNaadhiOkeKatha https://t.co/hoisBjLIFl — Nani (@NameisNani) 22 March 2018 -
‘నీది నాది ఒకే కథ’ ప్రీరిలీజ్ ఈవెంట్
-
మనందరి కథలా ఉంది : శేఖర్ కమ్ముల
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు. సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు. -
ఆ మాట అనిపించుకోకూడదు
‘‘చదువు సరిగ్గా రాని కుర్రాడి జీవితంలో చదువు పూర్తయినప్పటి నుంచి సెటిలయ్యే వరకు ఏం జరిగిందన్నదే ‘నీది నాది ఒకే కథ’. వేణుగారు ఫుల్ క్లారిటీతో మంచి సినిమా తీశారు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ని చూసి, చాలామంది కుర్రాళ్లు వాళ్లను వాళ్లు చూసుకుంటున్నట్లుగా భావిస్తారు. జీవితంలో కీలక సమయాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ, సొసైటీ మనకేమీ చేయదు. అందుకే.. అన్ని సందర్భాల్లో సమాజం గురించి ఆలోచించి, మన ఇష్టాయిష్టాలను చంపేసుకోవాల్సిన అవసరం లేదని మా చిత్రంలో చెబుతున్నాం. దర్శకులు దేవి ప్రసాద్‌గారు నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పాత్రతో పెద్దవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆయన ఓ డైరెక్టర్లా కాకుండా మాతో ఓ నటుడిలా కలిసిపోయారు. ఆయన పాత్ర చూసి థ్రిల్ అవుతారు. మాస్ హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం లేదు. కథ నచ్చే ఒప్పుకుంటున్నా. అయినా.. మాస్ హీరో అవ్వడం చాలా కష్టం. ఈ చిత్రంలో డోగ్మే 95 టెక్నిక్ వాడారు. అది 1995 టెక్నిక్.తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఎలా అనేది అందులో మెయిన్. ట్రాలీలు, జిమ్మీలు, సెట్లు వంటివి లేకుండా చాలా తక్కువలో సినిమా చేశాం. ఆ టెక్నిక్ వాడి తెలుగులో తీసిన మొదటి సినిమా మాదే. ఒకే తరహా సినిమాలు, పాత్రలు చేస్తే ‘వీడు ఒకే టైప్ క్యారెక్టర్స్ చేస్తున్నాడ్రా’ అంటారు. ఆ మాట అనిపించుకోకూడదన్నదే నా ప్రయత్నం. అందుకే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వెంకటేష్‌గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ చేస్తా. ఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో ఓ పోలీస్ స్టోరీ చేయనున్నా’’ అన్నారు. -
ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో...
సాక్షి, సినిమా : టాలీవుడ్లో టాలెంటెడ్ నటుడిగా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సపోర్టింగ్ పాత్రలతోపాటు అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అతను నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్ విడుదలైంది. చదువుల్లో పూర్ అయిన ఓ వ్యక్తి.. టీచర్ అయిన తన తండ్రి మెప్పుపొందేందుకు చేసే ప్రయత్నమే నీది నాది ఒకే కథ. ఇంట్రో నుంచే ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించారు. చిత్తూరు స్లాంగ్‌లో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సట్నా టైటస్(బిచ్చగాడు ఫేం) మధ్య నడిచే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. తర్వాత ఎమోషనల్ మోడ్‌లోకి మారిపోయిన ట్రైలర్.. చివర్లో ‘ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో ఏంట్రా మీ సోదంతా’ అంటూ సీరియస్ డైలాగ్‌తో ముగించారు. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నీది నాది ఒకే కథ ట్రైలర్ విడుదల
-
ఇద్దరిదీ ఒకే కథ
‘నువ్వు ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతున్నావ్.. అయ్యో.. ఇదేదో బ్లడ్ క్యాన్సరో, మౌత్ క్యాన్సరో కాదు కదా అండీ?.. దానికన్నా పెద్దది’... ‘పాన్‌షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బోండాలు అమ్ముకునేవాడిది ఓ బతుకు కాదా? మెకానిక్ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏం.. మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’ వంటి డైలాగులు ‘నీది నాది ఒకే కథ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీ విష్ణు, ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. వేణు ఊడుగుల దర్శ కత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రీ విష్ణు స్టూడెంట్‌గా కనిపించనున్నారు. చిత్తూరు యాసలో తను పలికిన ఘాటైన డైలాగులు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, దేవిప్రసాద్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: రాజ్ తోట (అర్జున్‌రెడ్డి ఫేమ్). -
మార్చి 23న ‘నీది నాది ఒకే కథ’
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. -
నీదీ నాదీ ఒకే కథ’ టీజర్ విడుదల
-
నువ్ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథలు కొత్తదనంతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో వంటి సినిమాలు ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందాయి. తాజాగా ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు’ ఫేమ్ శ్రీవిష్ణు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన ఈ సినిమాను నారా రోహిత్ సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకకులను ఆకట్టుకుంటోంది. సరిగ్గా చదువు అబ్బని ఓ యువకుడి జీవిత సంఘర్షణ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనిగొని పొగుడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అన్న పద్యంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈసారైనా పాస్ అవుతావా? అన్న డైలాగ్ హీరోను వెంటాడుతుంది. తీరా తనకే డౌట్ వచ్చి.. ‘ఈ సారైనా నేను పాస్ అవుతానా?’ అని చెల్లెల్ని అడుగుతాడు.. ‘హండ్రెడ్ పర్సంట్ పాస్ అవుతావ్ అన్నయ్య’ అంటూ చెల్లెలు ధైర్యం చెప్తుంది.. ‘అందుకే డిసైడ్ అయ్యాను చదివేద్దామని..’ అని ఎగ్జామ్ సెంటర్లో హీరో బీరాలు పోతాడు. ‘మరి చదివేశాయా?’ అని ఎగ్జామినర్ అడిగితే.. ‘ఏంది చదివేది రాత్రేగా డిసైడ్ అయింది’ అంటూ తెల్లముఖం వేస్తాడు శ్రీవిష్ణు.. ‘నువ్వు ఆత్మనూన్యత భావంతో బాధపడుతున్నావ్’ అని హీరోయిన్ అంటే.. ‘ఇదేదో బ్లడ్ క్యాన్సరో.. మౌత్ క్యాన్సరో కాదు కదండి’ అని శ్రీవిష్ణు అడిగితే.. దానికంటే పెద్దదని తను బదులిస్తుంది. చదువులో రాణించలేక ఓ యువకుడు పడే ఘర్షణను టీజర్లో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ‘పాన్ షాపోడిది ఓ బతుక్కాదా? కొబ్బరిబొండాలు అమ్ముకునేవోడిది ఓ బతుక్కాదా? మెకానిక్ షెడ్డోది ఓ బతుక్కాదా? డ్రైవర్‌ది బతుక్కాదా? యే.. నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని హీరో ఏమోషనల్‌గా బరస్ట్ అయితే.. చాచి చెంపమీద కొట్టి.. ‘నువ్ మారావురా ప్రపంచందంతా ఒక దారైతే.. నీ ఒక్కడిది ఒక దారి. నువ్ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు’ అని తండ్రి కోపంగా బదులిస్తాడు. ఓ సామాన్యుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఓ సామాన్య మెకానిక్‌తో ఆవిష్కరింపజేయడం గమనార్హం. ఈ సినిమా టీజర్ 24 గంటల్లోనే 5 లక్షలకుపైగా డిజిటల్ వ్యూస్ సాధించింది.