
‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ పోస్టర్
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు.
సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment