స్టన్నింగ్‌ | Sree Vishnu's 'cult look' from 'Veera Bhoga Vasantha Rayalu' released | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌

Published Sun, Jul 29 2018 12:38 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

Sree Vishnu's 'cult look' from 'Veera Bhoga Vasantha Rayalu' released - Sakshi

‘మెంటల్‌ మదిలో, ఉన్నది ఒకటే జిందగీ, నీదీ నాదే ఒకే కథ’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియలు కూడా ఈ చిత్రంలో మెయిన్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ఇప్పటివరకూ నారా రోహిత్, శ్రియల లుక్స్‌ని రిలీజ్‌ చేశారు. శనివారం శ్రీవిష్ణు లుక్‌ని విడుదల చేశారు. చిత్రానికి పని చేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఈ లుక్‌ని రిలీజ్‌ చేయడం విశేషం. ‘‘నారా రోహిత్, శ్రియల లుక్స్‌కి మంచి స్పందన లభించింది.

తాజాగా విడుదల చేసిన శ్రీవిష్ణు స్టన్నింగ్‌ లుక్‌ బాగుందని అందరూ అంటున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేన్‌ ఆర్‌. దర్శకుడు. మార్క్‌ కే. రాబిన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేష¯Œ ్స బ్యానర్‌పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్‌ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్‌ నేని, చరిత్‌ మానస్, స్నేహిత్‌ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:  వెంకట్, ఎడిటర్‌: శశాంక్‌ మాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement