భయం వేసింది | Sree Vishnu first look from Veera Bhoga Vasantha Rayalu | Sakshi
Sakshi News home page

భయం వేసింది

Published Mon, Oct 22 2018 2:16 AM | Last Updated on Mon, Oct 22 2018 2:16 AM

Sree Vishnu first look from Veera Bhoga Vasantha Rayalu - Sakshi

శ్రీ విష్ణు

నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ‘కల్ట్‌ ఈజ్‌ రైజింగ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్‌. ఇంద్రసేన్‌ దర్శకత్వంలో అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని శ్రీవిష్ణు లుక్‌ను విడుదల చేశారు. ‘‘పచ్చబొట్లు వేయించుకున్నాను. కాస్త భయం కలిగింది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా రకాల అనుభూతులకు లోనయ్యాను’’అని పేర్కొన్నారు శ్రీవిష్ణు. ‘‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే రిలీజ్‌ చేసిన మిగతా తారల లుక్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్‌ కె. రాబిన్‌ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement