దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో | Sri Vishnu Soon To Turn As Director | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 27 2018 2:05 PM | Last Updated on Tue, Mar 27 2018 2:07 PM

Sri Vishnu Soon To Turn As Director - Sakshi

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ విష్ణు. సహాయనటుడిగా కెరీర్‌ ప్రారంభించి హీరోగా విజయాలు సాధిస్తున్న ఈ యువ కథానాయకుడు త్వరలో దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత‍్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు.

ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నానన్న శ్రీవిష్ణు, మంచి కథ కుదిరితే తప్పుకుండా దర్శకుడిగా మారతానని చెపుతున్నాడు. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీదీ నాదీ ఒకే కథ సినిమా ఇటీవల విడుదలై విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ ను అందుకున్న శ్రీ విష్ణు... ప్రస్తుతం వీరభోగ వసంత రాయలుతో పాటు ‘తిప్పరా మీసం’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement