వైవిధ్యమైన పాత్రలో యంగ్‌హీరో | Sri Vishnu Playing New Role In Upcoming Movie | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన పాత్రలో యంగ్‌హీరో

Published Sat, Apr 7 2018 11:01 AM | Last Updated on Sat, Apr 7 2018 11:01 AM

Sri Vishnu Playing New Role In Upcoming Movie - Sakshi

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. మొదట్నుంచీ వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సీరియస్‌ క్యారెక్టర్‌లోనూ, మెంటల్‌ మదిలో లాంటి రొమాంటిక్‌ పాత్రల్లోనూ నటించి తనేంటో నిరూపించుకున్నాడు.

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మళ్లీ తనలోని నటుడ్ని పరిచయం చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీవిష్ణు తన రాబోయే సినిమాలో మరొక విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని సమాచారం. ఈ గెటప్‌ గజని సినిమాలోని సూర్య పాత్రను పోలి ఉంటుందని, గుండు, ఒళ్లంతా టాటూలతో ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిన్నపాటి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నారా  రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్‌ బాబులు కలిసి నటించబోతున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ శ్రియ కీలకపాత్రలో నటించినట్లు సమాచారం. ఈ సినిమాకు ‘వీరభోగ వసంత రాయలు’ అని టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement