different role
-
వైవిధ్యమైన పాత్రలో యంగ్‌హీరో
నీదీ నాదీ ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. మొదట్నుంచీ వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సీరియస్ క్యారెక్టర్లోనూ, మెంటల్ మదిలో లాంటి రొమాంటిక్ పాత్రల్లోనూ నటించి తనేంటో నిరూపించుకున్నాడు. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మళ్లీ తనలోని నటుడ్ని పరిచయం చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీవిష్ణు తన రాబోయే సినిమాలో మరొక విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని సమాచారం. ఈ గెటప్ గజని సినిమాలోని సూర్య పాత్రను పోలి ఉంటుందని, గుండు, ఒళ్లంతా టాటూలతో ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిన్నపాటి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు కలిసి నటించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ శ్రియ కీలకపాత్రలో నటించినట్లు సమాచారం. ఈ సినిమాకు ‘వీరభోగ వసంత రాయలు’ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. -
డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా
చాలా బోల్డ్‌గా నటించే కథా నాయికల్లో నటి ఆండ్రియా ఒకరు. అభినయమే కాదు అందాలారబోతకు సరిలేరు నాకెవ్వరూ అనేంతగా పేరు తెచ్చుకున్న నటి ఆమె. ఆయిరత్తిల్ ఒరువన్, అరణ్మణై వంటి పలు చిత్రాల్లో తనదైన శారీరక భాషతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బూటీ తాజాగా తరమణి చిత్రంతో తనలోని బహుపార్వ్సాల్ని ఆవిష్కరించ నున్నారట. నగర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇంతవరకు తెరపై చూడనటువంటి పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారట. ధనం, మోహం, కామం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే తరమణి చిత్ర కథలో ప్రేమ అంతర్లీనంగా ఉంటుందని నటి ఆండ్రియ మూడు డిఫరెంట్ కోణాల్లో ఈ చిత్రంలో కనిపించనున్నారని ఆ చిత్ర దర్శకుడు రామ్ తెలిపారు. తంగమాన్గళ్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు రామ్తదుపరి చిత్రంలో కూడా ఆండ్రియానే హీరోయిన్ అట. -
వైవిధ్యమైన పాత్రలో విశాల్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ఆసక్తిని కనబరిచే హీరోల్లో విశాల్ ఒకరు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఈ నెల 20న మరో వైవిధ్యమైన పాత్రతో విశాల్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. సినిమా పేరు ‘ఇంద్రుడు’. అనూహ్యమైన సంఘటన కళ్ల ముందు జరిగినా కూడా ఠక్కున నిద్రలోకి జారిపోవడం ‘నార్కొలెప్సీ’ అనే వ్యాధి లక్షణం. ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ఈ సినిమాలో విశాల్ కనిపించబోతున్నారు. తిరు దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘నాన్ సిగప్పు మనిదన్’కు ఇది అనువాద రూపం. ఈ నెల 20న ‘ఇంద్రుడు’ విడుదల కానుంది. లక్ష్మీమీనన్ కథానాయిక. నార్కొలెప్సీ వ్యాధి కారణంగా ఇందులో హీరోకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి? వాటిని తను ఎలా ఎదుర్కోగలిగాడు? అనేది ఈ సినిమాలో ఆసక్తికమైన అంశమని దర్శకుడు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్‌ల కెమిస్ట్రీ తమిళనాట సంచలనం సృష్టించిందని, అయితే కథానుగుణంగానే వారితో ఆ హాట్సీన్స్ని తెరకెక్కించాల్సి వచ్చిందనితిరు తెలిపారు. శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరినీ విశాల్ అంతం చేసే సన్నివేశాలు ఉద్రేకపూరితంగా ఉంటాయని ఆయన అన్నారు. యూ టీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఇనియా, శరణ్య ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.