సాక్షి, తమిళసినిమా : నీది నాది ఒకే కథ చిత్ర దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి యువ స్టార్ నటుడు కార్తీ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. కార్తీకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో అనువాదమై కలెక్షన్లు వసూలు చేస్తుంది.అంతే కాకుండా ఊపిరి చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా కార్తీ తన సోదరుడు సూర్య నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తున్నారు. సాయేషాసైగల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
తదుపరి రజత్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటింనున్నారు. ఇందులో నటి రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ ప్రధాన పాత్రలను పోషించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ తన 18వ చిత్రానికి కమెట్ అయ్యారన్నది తాజా సమాచారం. దీనికి తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నీది నాది ఒకే కథ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్నారని, ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్త వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment