కోలీవుడ్‌లో దర్శకుడు మారి సెల్వరాజ్ టెన్షన్ పార్టీ అని అన్నది ఎవరో కాదు. నటుడ, నిర్మాత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌నే. తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్. కీర్తిసురేష్ కథానాయక నటించిన ఇందులో వడివేలు కీలకపాత్ర పోషించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. పరియేరుమ్ పెరుమాళ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తరువాత ధనుష్ హీరోగా కర్ణన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం దర్శకుడికి మూడో చిత్రం. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి)
నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మామన్నన్ చిత్రం ఈనెల 29న తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్ కార్యక్రమాలను ముంబరం చేశారు. ఇటీవల ఒక చానన్‌లో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ షూటింగ్ స్పాట్లో దర్శకుడు మారి సెల్వరాజ్ చాలా టెన్షన్‌గా ఉంటారని చెప్పారు. తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను ఎడాపెడా కొట్టేస్తారని, ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తారని చెప్పారు. సెట్ అంతా యుద్ధవాతావరణం నెలకొంటుందని అన్నారు.
దీంతో నెటిజన్లు దర్శకుడు మారి సెల్వరాజ్ ఓ రేంజ్‌లో అడేసుకుంటున్నారు. శతాధిక చిత్రాలు చేసిన దర్శకులు కూడా మర్యాదగా ప్రవర్తించేవారిని, రెండు చిత్రాలతో మారిసెల్వరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌పై తన ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
(ఇదీ చదవండి:మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment