contravercial comments
-
రాజ్యాంగాన్ని సవరిస్తాం!
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలుగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ కట్టబెట్టాలంటూ ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కర్వార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగానికి కాంగ్రెస్ హయాంలో పలు మార్పుచేర్పులు చేసి అనవసర అంశాలతో నింపేశారు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణగదొక్కే చట్టాలను చేర్చారు. ఇలాంటి తప్పిదాలన్నింటినీ సరిచేయాల్సి ఉంది. ఇందుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీజేపీకి మూడింత రెండొంతుల మెజారిటీ అవసరం’’ అని హెగ్డే అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగాన్ని తిరగరాసి సర్వనాశనం చేయాలన్న బీజేపీ, ఆరెస్సెస్ రహస్య అజెండా మరోసారి బట్టబయలైందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. మున్ముందు ఎన్నికలతో నిమిత్తమే లేకుండా నియంతృత్వ పాలనకు తెర తీసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నస్తోందని ఎక్స్‌లో ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఎలాగోలా సర్వనాశనం చేయాలన్న ప్రధాని మోదీ, సంఘ్ పరివార్ ఉద్దేశాలే హెగ్డే నోట వెలువడ్డాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారికి న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యమంటే అంతులేని విద్వేషమని ఆరోపించారు. ‘బీజేపీని ఓడిద్దాం, రాజ్యాంగాన్ని రక్షిద్దాం’ అంటూ కాంగ్రెస్ నేతలు తమ సోషల్ అకౌంట్లలో హాష్‌ట్యాగ్ జోడించారు. దాంతో ఈ వివాదంపై బీజేపీ ఆచితూచి స్పందించింది. హెగ్డే వ్యాఖ్యలు వ్యక్తిగతమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. వాటిపై ఆయనను వివరణ కోరతామని తెలిపారు. హెగ్డే బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. హిందూ అతివాద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. -
హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 'ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. #WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt — ANI (@ANI) December 26, 2023 స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్మానస్లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా,విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ వెబ్ సీరిస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సీరిస్‌లో నీనా గుప్తా 'డాడీ మా' రోల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమె దూరంగానే ఉంటూ వచ్చింది. లస్ట్ స్టోరీస్- 2తో నీనా గుప్తా తిరిగి టెలివిజన్ స్క్రీన్లలోకి వచ్చింది. ఈ సీరిస్ ట్రైలర్లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ సంభాషణలు ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!) శృంగారం గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని నీనా చెప్పింది. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చుతారని అప్పట్లో నమ్మేదానినని నీనా తెలిపింది. తన మదర్ ఎంతో స్ట్రిక్ట్ అంటూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ఇలా పంచుకుంది. 'నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్రూమ్లో పడుకోలేదు. మేము అందరం ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం ప్రక్కన క్రింద పడుకునేవాళ్లం. కానీ కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకుంటాను. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ నాకు శృంగార అంటే ఏమిటో చెప్పలేదు, పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఎంత కఠినంగా ఉండేదంటే, నన్ను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి కూడా వెళ్లనివ్వదు.' 'నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు కూడా తమ కుమార్తెలతో చెప్పడానికి భయపడతారు. పూర్వ కాలంలో, పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే? శృంగారం విషయంలో కొత్తజంట మధ్య గొడవలు రాకూడదని.. శృంగారం కోసం భర్త అడిగినప్పుడు అమ్మాయి 'కర్తవ్యం' ఎలా నెరవేర్చాలో అప్పటి తల్లులు చెప్పేవారు.' అని నీనా గుప్తా అన్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) ఇది నేటికీ కొన్నిచోట్ల జరిగే విషయమేనని, పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్- 2 ముఖ్యమైనదని తెలిపింది. ఈ సీరిస్‌లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. తప్పేముంది? మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలుపుతున్నామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
ఆ డైరెక్టర్ అంతే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాడు: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్‌లో దర్శకుడు మారి సెల్వరాజ్ టెన్షన్ పార్టీ అని అన్నది ఎవరో కాదు. నటుడ, నిర్మాత, మంత్రి ఉదయనిధి స్టాలిన్నే. తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్. కీర్తిసురేష్ కథానాయక నటించిన ఇందులో వడివేలు కీలకపాత్ర పోషించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. పరియేరుమ్ పెరుమాళ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తరువాత ధనుష్ హీరోగా కర్ణన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం దర్శకుడికి మూడో చిత్రం. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మామన్నన్ చిత్రం ఈనెల 29న తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్ కార్యక్రమాలను ముంబరం చేశారు. ఇటీవల ఒక చానన్‌లో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ షూటింగ్ స్పాట్లో దర్శకుడు మారి సెల్వరాజ్ చాలా టెన్షన్‌గా ఉంటారని చెప్పారు. తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను ఎడాపెడా కొట్టేస్తారని, ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తారని చెప్పారు. సెట్ అంతా యుద్ధవాతావరణం నెలకొంటుందని అన్నారు. దీంతో నెటిజన్లు దర్శకుడు మారి సెల్వరాజ్ ఓ రేంజ్లో అడేసుకుంటున్నారు. శతాధిక చిత్రాలు చేసిన దర్శకులు కూడా మర్యాదగా ప్రవర్తించేవారిని, రెండు చిత్రాలతో మారిసెల్వరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌పై తన ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి:మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) -
Karnataka assembly elections 2023: మోదీ ‘అసమర్థుడైన కొడుకు’
బెంగళూరు: ప్రధాని మోదీని విషసర్పమంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై గొడవ కొనసాగుతుండగానే ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. కలబురగి జిల్లా చిట్టాపూర్ స్థానం నుంచి మళ్లీ ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్న ఖర్గే తనయుడు ప్రియాంక్ సోమవారం మోదీని అసమర్థుడైన కొడుకుగా అభివర్ణించారు. బంజారా కులంలో పుట్టానంటున్న మోదీ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ‘‘మీరేం భయపడకండి, మీ కొడుకు ఢిల్లీలో ఉన్నాడని కలబురగి బంజారా ప్రజలకు హామీ ఇచ్చారు. అసమర్థుడైన కొడుకు ఢిల్లీలో ఉంటే ఆ కుటుంబం ఎలా ముందుకెళుతుంది?’’ అని ప్రశ్నించారు. కోలి, కబ్బలిగ, కురుబ వర్గానికి చెందినవాడినని గతంలో చెప్పిన మోదీ, తాజాగా బంజారా వర్గం వాడినని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
జడేజాకు ఇంగ్లీష్ రాదు.. తిట్టినా అర్ధం కాదు
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఇంగ్లీష్ రాదని, అందువల్లే తాను బిట్స్ అండ్ పీసెస్ అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నాడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. బిట్స్ అండ్ పీసెస్ వ్యవహారంపై ఓ నెటిజన్‌తో జరిపిన చాట్‌లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశాడు. అయితే, తాజాగా ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి రావడంతో జడేజా, మంజ్రేకర్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లైంది. వివరాల్లోకి వెళితే.. సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్, తాను మంజ్రేకర్‌తో జరిపిన ట్విటర్ సంభాషణను లీక్ చేశాడు. అందులో మంజ్రేకర్.. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అసలు తాను ఏం చెబుతున్నానో కూడా అతనికి అర్థం కాదని హేళన చేస్తాడు. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం జడేజాకు ఇప్పటికీ తెలీదని, కనీసం దాని అర్ధం తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయడని పేర్కొన్నాడు. అలాగే 'వెర్బల్ డయేరియా(నోటి విరేచనాలు)' అంటూ జడేజా తననుద్ధేశించి సంబోధించిన పదాన్ని కూడా ఎవరైనా అతనికి చెప్పి ఉంటారని ఎగతాలి చేశాడు. అంతటితో ఆగని మంజ్రేకర్.. సదరు అభిమానిపై కూడా ఫైరయ్యాడు. నీలాగా ప్లేయర్స్‌ను పొగడటానికి నేను అభిమానిని కాదు.. ఓ విశ్లేషకుడినంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని సంబోధిస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై జడ్డూ కూడా ఘాటుగానే స్పందించాడు. మంజ్రేకర్.. నీ కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లను ఆడాను, ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇప్పటికే చాలా విన్నాను.. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు’’ అంటూ కౌంటరిచ్చాడు. అయితే ఈ వివాదం అంతటితో సద్దుమణిగిందనుకుంటే, తాజాగా లీకైన ట్విటర్ చాట్ మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి. చదవండి: వాళ్లు నిజంగా జాత్యాహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు -
‘స్వామి అగ్నివేశ్ మేక వన్నె పులి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు ఇంటర్నెట్ వేదికగా స్వామి అగ్నివేశ్‌ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు నాగేశ్వర రావు. (చదవండి: దేవుళ్ల రథాలపై మరింత నిఘా..) GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్మెంట్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమే కాక మానవ జీవితానికి సిగ్గు చేటు అన్నారు. ఇక పోలీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్ చేసింది. GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 -
వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్ దేవ్
అగర్తలా : పంజాబీలు, జాట్లపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ వెనక్కితగ్గారు. పంజాబీలు, జాట్లు శారీరకంగా దృఢంగా ఉంటారని, అయితే బెంగాలీలకున్న తెలివితేటలు వారికి ఉండవని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని చెప్పుకొచ్చారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్ సోదరుల పాత్రను నేను ఎప్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోన’ని విప్లవ్ దేవ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అగర్తలా ప్రెస్ క్లబ్లో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. దేశంలో ప్రతి వర్గానికీ ఓ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతూ బెంగాలీలు తెలివితేటలకు పెట్టింది పేరని..పంజాబీలు, జాట్లు శారీరకంగా బలంగా ఉన్నా తెలివితేటల్లో బెంగాలీలకు సరిపోరని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పంజాబీని సర్ధార్ అంటారని, వారికి తెలివితేటలు తక్కువగా ఉన్నా చాలా దృఢంగా ఉంటారని వారిని బలంలో ఎవరూ గెలవలేరని, ప్రేమతోనే వారిని జయించాలని అన్నారు. ఇక హరియాణాలో పెద్దసంఖ్యలో ఉండే జాట్లకు తెలివితేటలు తక్కువగా ఉన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జాట్తో ఎవరైనా పెట్టుకుంటే అతడు ఇంటి నుంచి తుపాకీతో బయటకు వస్తాడని అన్నారు. విప్లవ్ దేవ్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేవ్ వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్ష నేతలు ఆరోపించారు. ఇక విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలి’ వంటి సూచనలు చేసి విమర్శలపాలయ్యారు. చదవండి : బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు! -
‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని శ్రీకృష్ణ భగవానుడే పంపాడని కాంగ్రెస్ నేత సూర్యకాంత్ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ మాట్లాడుతూ కరోనా వైరస్, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే మన వద్దకు పంపారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ట్విటర్లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. హిందూ దేవతలతో కోవిడ్-19ను పోల్చడం పట్ల యూజర్లు ఆయనపై మండిపడ్డారు. చదవండి : 100 రోజుల లాక్డౌన్.. ఏం జరిగింది? -
‘బిర్యానీ కాదు..బుల్లెట్ దించాలి’
బెంగళూర్ : సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతుంటే తాజాగా కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వైఖరికి తాను మద్దతిస్తానంటూ జాతి విద్రోహులకు బిర్యానీ కాదు బుల్లెట్ రుచిచూపాలని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్న ర్యాలీలో జాతి విద్రోహులను కాల్చిపారేయాలనే నినాదాలు మిన్నంటిన క్రమంలో ఈ వివాదంపై కర్ణాటక మంత్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. జాతి విద్రోహులపై అనురాగ్ ఠాకూర్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నవారిపై మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, యాకూబ్ మెనన్‌ల మృతిని వ్యతిరేకిస్తూ, తుక్డే తుక్డే గాయంగ్‌ను సమరిస్తూ, సీఏఏపై దుష్ప్రచారం సాగిస్తున్నవారే అనురాగ్ ఠాకూర్ ప్రకటనతో విభేదిస్తున్నారని నిప్పులు చెరిగారు. జాతి వ్యతిరేకులకు బిర్యానీ తినిపించడం కాదని, వారికి బుల్లెట్ రుచిచూపాలని మంత్రి రవి ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. చదవండి : సీఏఏపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ -
కైరానా ఎమ్మెల్యే వ్యాఖ్యలతో హైరానా..
లక్నో : యూపీలోని కైరానా ఎస్పీ ఎమ్మెల్యే నహిద్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మద్దతుదారుల దుకాణాల నుంచి ఏ వస్తువూ కొనుగోలు చేయరాదని స్ధానిక ముస్లింలకు ఎమ్మెల్యే పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. ముస్లింలు ఈ షాపుల నుంచి సరుకులు కొనుగోలు చేయడం వల్లే బీజేపీ మద్దతుదారులైన వీరు బతుకుతున్నారని ఆ వీడియోలో ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. కైరానాతో పాటు పరిసర గ్రామాల్లోని ముస్లింలు స్ధానిక బీజేపీ మద్దతుదారుల దుకాణాల్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరాదని, పది రోజుల నుంచి నెలరోజుల పాటు ఇలా చేస్తే పరిస్ధితిలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేరే గ్రామాలకు లేదా ఎక్కడికైనా వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకుని మీ సోదరులకు సంఘీభావం తెలిపేందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో బీజేపీ సానుభూతిపరులైన వ్యాపారులను బహిష్కరించండి. ‘వారి నుంచి మీరు సరుకులు కొనడం వల్లే వాళ్ల ఇళ్లు నడుస్తున్నాయి..మన వైఖరి వల్లనే మనం ఇబ్బందులు పడుతున్నామ’ని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల కారణంగా కైరానాలో హిందువులు వలస వెళుతున్నారని కొన్నేళ్ల కిందట ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. -
‘ఆమె చాలా అందంగా ఉంటేనే లాభం’
టిబెట్ : ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా ఇంటర్నెట్ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. దలైలామా వ్యాఖ్యల పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయంటూ నెజటిన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. in the end, yet another patriarch — Alan (@CityLondonAlan) June 28, 2019 -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
‘ఆ ఎమ్మెల్యేకి మతిభ్రమించింది’
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్సరాయ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్నో గెస్ట్ హౌస్‌లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. -
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌పై చర్యలు
సాక్షి, కోల్‌కతా : యువతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై వర్సిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను క్లాస్‌లు తీసుకోకుండా నిలిపివేయడంతో పాటు క్యాంపస్‌లో అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించింది. విద్యార్ధులు చేసిన ఫిర్యాదులపై వైస్ ఛాన్స్‌లర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్‌పై తీసుకున్న చర్యలను వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం హెడ్ ఓంప్రకాష్ మిశ్రా వెల్లడించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ నుంచి తొలగించాలని విద్యార్ధులు పట్టుబట్టారని మిశ్రా తెలిపారు. కన్యత్వం లేని యువతులను ఎవరూ వివాహం చేసుకోరాదని తన ఫేస్బుక్ పేజ్‌లో కనక్ సర్కార్ చేసిన పోస్ట్‌లు కలకలం రేపాయి. కన్యత్వం కలిగిన యువతిని సీల్ చేసిన బాటిల్‌తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. మరోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కనక్ సర్కార్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ డీజీపీని కోరింది. -
వారు పేదలను పొట్టనబెట్టుకుంటున్నారు..
జైపూర్ : కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించారు. ఉదయ్‌పూర్‌లో బీజేపీ ప్రచార ర్యాలీలో రాజ్‌బబ్బర్ మాట్లాడుతూ పేద ప్రజలను హతమార్చే హంతక ముఠా గుజరాత్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. గ్యాంగ్‌స్టర్ ముఠాలో ఒకరు బీజేపీ చీఫ్ కాగా, మరొకరు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ రూపాయి విలువ దిగజారుతున్న క్రమంలో రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లి 90 ఏళ్ల హీరాబెన్‌తో పోల్చడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వయసు స్ధాయిలో ఉంటే ప్రస్తుతం రూపాయి బలహీనపడుతూ ప్రధాని తల్లి వయసుకు క్షీణిస్తోందని రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఏడున జరగనుండగా, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : బ్రిటిష్ పాలకులు మరో వందేళ్లు దేశాన్ని పాలించాల్సిందని బీఎస్పీ యూపీ చీఫ్ ధరంవీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని మరో వందేళ్లు పాలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఎదిగేవారని అన్నారు. బీఆర్ అంబేడ్కర్‌ను బ్రిటిషర్లు చదువుకునేందుకు అనుమతించకపోతే దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించగలిగే వారు కాదని వ్యాఖ్యనించారు. బ్రిటిష్ పరిపాలనలో ఆయనకు చదువుకునే అవకాశం దక్కిందని, వారు లేకుంటే దేశంలో ఏ పాఠశాలలోనూ బాబాసాహెబ్‌కు అడ్మిషన్ లభించేది కాదని అన్నారు. ధరంవీర్ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన నేతలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. బ్రిటిషర్ల పాలనకు గాను మనం రుణం చెల్లించాలని ధరంవీర్ భావిస్తే ఆయన బ్రిటన్‌లో శరణార్ధిగా ఉండాలని కొందరు నేతలు సూచించారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో బిఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ ఏడున జరిగే రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్ చేసిన బీఎస్పీ వారిని ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. -
‘బీఫ్ తిన్నందుకే కేరళకు ఈ శిక్ష’
సాక్షి, బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని అన్నారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ‘చూడండి కేరళలో ఏం జరిగిందో..! దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింద’ని శుక్రవారం జగిరిన విలేకర్ల సమావేశంలో ఎద్దేవా చేశారు. బసనగౌడ విజయపుర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్ ఫెస్టివల్ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు. జేడీఎస్ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ కూడా బసనగౌడపై మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడని బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తారని చురకలంటించారు. -
రామాయణంపై ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాఖ్‌పై కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దల్వాయ్ రామాయణాన్ని ఉటంకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లును సభ ముందుంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సైతం సీతను అనుమానిస్తూ విడిచిపెట్డాడని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు.మహిళలను కేవలం ముస్లింలే కాకుండా హిందూ, క్రిస్టియన్, సిక్కు మతాలు సైతం వివక్షకు గురిచేశాయని అన్నారు. ప్రతి సమాజం పురుషాధిక్యతతో కూడుకున్నదని అంటూ శ్రీరాముడు సైతం అనుమానంతో సీతాదేవిని విడిచిపెట్డాని వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవస్థను మనం మార్చాల్సిన అవసరం ఉందని హుసేన్ దల్వాయ్ పేర్కొన్నారు.ముస్లిం మహిళల సంక్షేమంపై మోదీ సర్కార్‌కు ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు. ముస్లిం మహిళలకు మరిన్ని హక్కులు కల్పిస్తూ సాధికారత ఇస్తామని హామీ ఇవ్వడం కేవలం కంటితుడుపు చర్యని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌పై తమ పార్టీ వైఖరి సుస్పష్టమని యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. రాఫెల్ డీల్‌పై కాంగ్రెస్ ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడటంతో శుక్రవారం ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రభుత్వం సభలో చేపట్టలేకపోయింది. -
కఠువా రేప్ ఓ చిన్న ఘటన
జమ్మూ: జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొన్నిగంటలు కూడా గడవకముందే బీజేపీ నేత కవీందర్ గుప్తా(59) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కఠువాలో అసిఫా(8) అనే బాలికను అత్యాచారం చేసి, హత్యచేయడం చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సత్పాల్ శర్మ, గుప్తాతో పాటు మరో ఆరుగురు సోమవారం బీజేపీ–పీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు. ఈ సందర్భంగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించినందుకే బీజేపీ నేతల్ని తప్పించారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కఠువాలో జరిగింది ఓ చిన్న ఘటనే. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో మనం ఆలోచించాలి. ఇలాంటి చాలా సమస్యల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ ఒక్క ఘటనకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు’ అని గుప్తా పేర్కొన్నారు. కాగా, కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియాకు మంత్రివర్గంలో చోటుదక్కడం గమనార్హం. -
అలాంటి అధికారులను కొట్టాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడి వివాదం సమసిపోకముందే ఆప్ ఎంఎల్ఏ నరేష్ బల్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్షు ప్రకాష్ వంటి అధికారులను కొట్టాల్సిందేనని అన్నారు. ఉత్తమ్ నగర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే బల్యాన్ మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని..అయితే ఇలాంటి అధికారులను కొట్టాల్సిందేనని తానంటానని..సాధారణ పౌరుల పనులను నిలిపివేసే అధికారులకు ఇలా బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. మరోవైపు ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై దాడికి పాల్పడి అరెస్ట్ అయిన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం విదితమే. -
‘రేసుగుర్రం’ రేసులో లేదా?
2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం, ఎంపిక పారదర్శకంగా జరగలేదని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయమై నిర్మాతలు కె. వెంకటేశ్వరరావు, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెగాఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు – నిర్మాత కె. వెంకటేశ్వరరావు అల్లు అర్జున్ హీరోగా నేను, నల్లమలుపు బుజ్జి 2014లో నిర్మించిన ‘రేసుగుర్రం’ ఎంత హిట్ అయిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, ‘సినిమా చూపిస్త మామ...’ సాంగ్‌కు బెస్ట్ సింగర్ అవార్డులనూ సైమా ఇచ్చింది. అంత మంచి సినిమాకు నంది అవార్డు రాకపోవడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నంది అవార్డులు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మంచి జ్యూరీ మెంబర్స్‌ని నియమించి, సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూడాలి. 24 క్రా‹ఫ్ట్స్ పరిశీలించి, బాగున్న దానికి అవార్డులు ఇస్తే మాలాంటి నిర్మాతలకు ఆనందంగా ఉంటుంది. నంది అవార్డులు మాకే రావాలని కాదు. బెస్ట్ మూవీకి రావాలన్నదే మా అభిప్రాయం. అవార్డుల కోసమే అయితే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నంది అవార్డుల కోసం రోడ్డు మీద పడకండి’ అని నిర్మాత సి.కల్యాణ్ అనడం తప్పు. ఆయన తీసిన సూపర్ హిట్ సినిమాకు అవార్డు రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమాకు సరైన అవార్డులు రాలేదు. నాగేశ్వరరావుగారు నటించిన ‘మనం’ చిత్రానికి కూడా అవార్డు ఇవ్వకపోవ డాన్ని అన్యాయంగానే భావిస్తున్నాం. ‘రుద్రమదేవి’, ‘మనం’, ‘బాహుబలి’ వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా లకు సరైన అవార్డులు రాలేదు. కమిటీ మెంబర్లు ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా సినిమాలకీ మంచి అవార్డులు వచ్చేవి. మంచి సినిమాలకు అవార్డుల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూరీ మెంబర్స్‌ని తప్పుపట్టడం లేదు. మాకు అర్హత ఉన్నా అవార్డులు రాలేదని చెబుతున్నాం. ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కడుపు మండి వచ్చాను! – నల్లమలుపు బుజ్జి మంచి విజయం సాధించిన ‘రేసుగుర్రం’ సినిమాను పక్కన పెట్టి ఏవేవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. నంది అవార్డుల కమిటీ, ప్రభుత్వం సినిమాల ఎంపికలో వన్‌సైడెడ్‌గా ఆలోచించారు. వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారు. కొంతమంది నిర్మాతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా కెరీర్లో 24క్రాఫ్ట్స్‌లో సూపర్‌గా తీసిన సినిమా ‘రేసుగుర్రం’. కంటి తుడుపు అవార్డులు ఇచ్చారు. అవార్డులను పంచుకున్నారా? ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. ప్రజలు మెచ్చిన సినిమాలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలకు అనిపిస్తుంది. జ్యూరీ మెంబర్స్ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌కి రాని నేను... కడుపు మండి వచ్చాను. పబ్లిసిటీ కోసం కాదు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ బాగా నటించారు. హీరో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సడన్‌గా ఒక కమెడియన్ వచ్చి కాసేపు స్క్రీన్ మీద ఉంటే సినిమా మొత్తం మారిపోతుందా? అవార్డుల ఎంపిక కమ్మ లాబీయింగ్లా ఉంది. ఏంటిది? అని ప్రశ్నించడానికే ఈ ప్రెస్‌మీట్. ఎవరి మీదా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. క్యాస్ట్ గురించి తేవడం కరెక్ట్ కాదు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మొత్తం అవార్డులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది సార్’ అన్నారు. అవార్డుల ఎంపిక సరైన ప్రామాణిక అంశాలతోనే జరిగిందా? అన్న ప్రశ్నకు.. ‘మొత్తం దొంగ అవార్డులే అన్నారు. మరి, ఆ అవార్డుల కోసం ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్నకు.. సినిమా ఉంది కాబట్టే అడుగుతున్నాం. ‘బాహుబలి’ సినిమాకి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కు ఎందుకు అవార్డు రాలేదు? గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు అర్హత లేదా? ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చుకుంటారు. కానీ, ‘రుద్రమదేవి’కి ఇవ్వరు. మాకు వాళ్ల మీద వ్యతిరేకత ఏముంటుంది? గవర్నమెంట్ ఎవరిదో అందరికీ తెలుసు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ... అల్లు అర్జున్ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రెస్‌మీట్ గురించి తెలియదు. ‘మనం’కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, సరైన అవార్డు రాలేదు’ అన్నారు. పునర్జన్మల కథలకు నంది అవార్డులు ఇవ్వరు కదా? అన్న ప్రశ్నకు... ‘ఈగ’కు నేషనల్ అవార్డు, నంది అవార్డు ఇచ్చారు కదా. కనీసం జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. మా ఆవేదన జ్యూరీ సభ్యులకు తెలియాలనుకున్నాం. ఈ ప్రెస్‌మీట్‌తో సాధించేది ఏమీ లేదు. టీడీపీ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం అన్యాయమే. నేను సినిమా వాడిని. సినిమాల గురించి చెప్తున్నాను. జ్యూరీ చేసిన తప్పులను చెప్తున్నాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్తున్నాను. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని చెప్తున్నాం. నేను క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం లేదు. లాబీయింగ్ జరిగింది. మాకు లాబీయింగ్ చేయడం చేతకాదు’ అన్నారు. అప్పుడు నన్నూ విమర్శించారు – గుణశేఖర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు అమరావతి ప్రారంభోత్సవం సమయంలో... ‘‘రుద్రమదేవి మూలాలు ఉన్న అమరావతి శంకుస్థాపన నా చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలా రుద్రమదేవి గొప్పతనాన్ని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమాకి పన్ను మినహాయింపు, అవార్డులు ఇవ్వలేదని గుణశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదేదో అవార్డులు రాని సంఘం కాదు. మేం గ్రూప్ కట్టలేదు. బుధవారం ఓ ప్రముఖ టీవీ చానెల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు గౌరవ జ్యూరీ సభ్యులు ఒక ఇష్యూని లేవనెత్తారు. దాని గురించి ప్రస్తావించాలని వచ్చా. అందులో ఒక జ్యూరీ మెంబర్ని.. అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ అవార్డు ఇచ్చారని ప్రశ్నించినప్పుడు... ‘కావాలని ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ విభాగంలో ఆప్లై చేశారు కాబట్టే ఇచ్చాం’ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశారా? అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశానన్నది వాస్తవం కాదు. ఇదే గోనగన్నారెడ్డి పాత్రకు సపోర్టింగ్ ఆర్టిస్టుగానే సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. ఒక్క ఏపీ ప్రభుత్వమే అల్లు అర్జున్‌లాంటి హీరోను క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పింది. దానిని గౌరవంగా తీసుకోవాలా..? లేక అవార్డు వచ్చినందుకు (ఏస్వీ రంగారావు అవార్డు) ఆనందపడాలో అర్థం కావడం లేదు. ప్రూఫ్‌తో సహా వచ్చాను. సహాయ నటుడు విభాగంలోనే అల్లు అర్జున్ పేరు రాశా. ‘రుద్రమదేవి’ తెలంగాణకు చెందిన చిత్రం కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డు ఇవ్వలేదని కొందరన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే విధంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తుందనుకున్నా. సమాచార లోపం లేకుండా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుగార్ల చేత ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాను. బహిరంగంగా విమర్శించకుండా లేఖ రాశాను. ఆ లేఖకు స్పందన లేదు. నేనో పెద్ద నిర్మాతను కాననా? నంది అవార్డుల ఎంపికలో ‘టామీ’ సినిమాకు ఇచ్చిన స్థాయి ‘రుద్రమదేవి’కి లేదా? జ్యూరీ మెంబర్స్‌ని మెప్పించలేకపోయిందా? ‘మీరు పన్ను మినహాయింపుకు ఓ ప్రశ్న అడిగారు. జవాబు ఇప్పుడు వచ్చింది. అవార్డులు రాకపోవడమే జవాబు’ అని నెటిజన్లు అంటున్నారు. ఏస్వీరంగారావుగారి అవార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదు. కేటగిరీల స్థాయి గురించి మాట్లాడను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్‌కు ఆప్లై చేశాను. బన్నీ ఆ కేటగిరీకి కరెక్ట్ కాదు. ఆప్లికేషన్ ప్రింట్లో ఈ అవార్డులపై మీడియా ముఖంగా అభ్యంతరం చెప్పినవారు మూడేళ్లు అవార్డులకు అర్హులు కారని నియమనిబంధనలతో కూడిన ఒక బుక్ ఉంది. అంతకు ముందు లేదు. ఇప్పుడే పెట్టారు. ఇలా అవార్డులు ఇవ్వడానికే ఆ నిబంధన పెట్టారనిపిస్తోంది. నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా ఎనిమిది వచ్చాయి. నేను తీసిన 12 సినిమాల సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టు లకు దాదాపు 30 నంది అవార్డులు వచ్చాయి. ‘ఒక్కడు’ సినిమాకి 8 అవార్డులు వచ్చినప్పుడు నన్ను విమర్శించారు.అవార్డుల ఎంపికలో మంచి ప్రమాణాలను పాటించాలని కోరుతున్నాను. అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు– నిర్మాత మల్కాపురం శివకుమార్ నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా ఉంది. అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రకటించింది. 2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. హాలీవుడ్ వాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? ఈ అవార్డులు ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. -
ఈశ్వరప్పా.. ఇవేం మాటలప్పా!
బెంగళూరు: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రశ్నించిన ఓ మహిళా జర్నలిస్ట్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ముఖ్య నేత కె.ఎస్. ఈశ్వరప్పపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈశ్వరప్ప వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటక మహిళా కాంగ్రెస్, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులో భారీ ఆందోళన నిర్వహించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో బీజేపీ మహిళల పట్ల ఎలా ఆలోచిస్తోందో తెలుస్తున్నదని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈశ్వరప్పతోపాటు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కె.ఎస్.ఈశ్వరప్ప శనివారం ఒక మహిళా జర్నలిస్టుతో మాట్లాడుతూ.. 'ఎవరైనా అత్యాచారం చేస్తే మేమేం చేయగలం? మీరిక్కడ వున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడితే ప్రతిపక్షం ఏం చేస్తుంది?' అని ప్రశ్నించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో కంగుతిన్న జర్నలిస్టులు అక్కడిక్కడే ఆయనకు నిరసన తెలిపారు. అన్ని రాజకీయపక్షాలు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. దీంతో ఈశ్వరప్ప సారీ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈశ్వరప్ప ఉదంతానికి కొద్ది రోజుల ముందు కర్ణాటకకే చెందిన కె.జె. జార్జ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇద్దరు పురుషులు ఒక మహిళను రేప్ చేస్తే అది గ్యాంగ్‌రేప్ కాదని, నలుగురైదుగురు చేస్తేనే దాన్ని సామూహిక అత్యాచారం అనాలంటూ రేప్ కు నిర్వచనం ఇచ్చారు.