Lust Stories 2: Neena Gupta opens up on wife and husband conversation - Sakshi
Sakshi News home page

Lust Stories 2: అందుకే అలాంటి సీన్లు, డైలాగ్‌లు పెట్టారు: నటి

Published Fri, Jun 23 2023 9:55 AM | Last Updated on Fri, Jun 23 2023 11:21 AM

Neena Gupta Lust Stories 2 Opens Wife And Husband Conversation - Sakshi

నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా,విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ వెబ్‌ సీరిస్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సీరిస్‌లో నీనా గుప్తా 'డాడీ మా' రోల్‌లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమె దూరంగానే ఉంటూ వచ్చింది. లస్ట్ స్టోరీస్- 2తో నీనా గుప్తా తిరిగి టెలివిజన్ స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సీరిస్‌ ట్రైలర్‌లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్‌ సంభాషణలు ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: మద్యం తాగుతారా? నెటిజన్‌ ప్రశ్నకు శ్రుతీహాసన్‌ సమాధానమిదే!)

శృంగారం గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని నీనా చెప్పింది. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చుతారని అప్పట్లో నమ్మేదానినని నీనా తెలిపింది. తన మదర్‌ ఎంతో స్ట్రిక్ట్ అంటూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ఇలా పంచుకుంది.

'నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్‌రూమ్‌లో పడుకోలేదు.  మేము అందరం ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం ప్రక్కన క్రింద పడుకునేవాళ్లం. కానీ కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకుంటాను. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు.

మా అమ్మ నాకు శృంగార అంటే ఏమిటో చెప్పలేదు, పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఎంత కఠినంగా ఉండేదంటే, నన్ను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి కూడా వెళ్లనివ్వదు.'

'నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో  ముద్దు పెట్టుకోవడం ద్వారా  గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు కూడా తమ కుమార్తెలతో చెప్పడానికి భయపడతారు. పూర్వ కాలంలో, పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు.

ఇలా ఎందుకు చేసేవారంటే? శృంగారం విషయంలో కొత్తజంట మధ్య గొడవలు రాకూడదని..  శృంగారం కోసం భర్త  అడిగినప్పుడు అమ్మాయి 'కర్తవ్యం' ఎలా నెరవేర్చాలో అప్పటి తల్లులు చెప్పేవారు.' అని నీనా గుప్తా అన్నారు.

(ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి)

ఇది నేటికీ కొన్నిచోట్ల జరిగే విషయమేనని, పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్- 2 ముఖ్యమైనదని తెలిపింది. ఈ సీరిస్‌లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. తప్పేముంది?  మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలుపుతున్నామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement