bold statement
-
యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా,విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ వెబ్ సీరిస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సీరిస్‌లో నీనా గుప్తా 'డాడీ మా' రోల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమె దూరంగానే ఉంటూ వచ్చింది. లస్ట్ స్టోరీస్- 2తో నీనా గుప్తా తిరిగి టెలివిజన్ స్క్రీన్లలోకి వచ్చింది. ఈ సీరిస్ ట్రైలర్లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ సంభాషణలు ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!) శృంగారం గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని నీనా చెప్పింది. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చుతారని అప్పట్లో నమ్మేదానినని నీనా తెలిపింది. తన మదర్ ఎంతో స్ట్రిక్ట్ అంటూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ఇలా పంచుకుంది. 'నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్రూమ్లో పడుకోలేదు. మేము అందరం ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం ప్రక్కన క్రింద పడుకునేవాళ్లం. కానీ కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకుంటాను. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ నాకు శృంగార అంటే ఏమిటో చెప్పలేదు, పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఎంత కఠినంగా ఉండేదంటే, నన్ను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి కూడా వెళ్లనివ్వదు.' 'నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు కూడా తమ కుమార్తెలతో చెప్పడానికి భయపడతారు. పూర్వ కాలంలో, పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే? శృంగారం విషయంలో కొత్తజంట మధ్య గొడవలు రాకూడదని.. శృంగారం కోసం భర్త అడిగినప్పుడు అమ్మాయి 'కర్తవ్యం' ఎలా నెరవేర్చాలో అప్పటి తల్లులు చెప్పేవారు.' అని నీనా గుప్తా అన్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) ఇది నేటికీ కొన్నిచోట్ల జరిగే విషయమేనని, పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్- 2 ముఖ్యమైనదని తెలిపింది. ఈ సీరిస్‌లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. తప్పేముంది? మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలుపుతున్నామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. -
శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ సీజన్-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్ శృంగార జీవితం(సెక్స్ లైఫ్)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా భట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? -
శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్
-
శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు. ఇప్పటికీ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జేఎఫ్డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. సమంత సెక్స్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’అన్న ప్రశ్నకు సమాధానంగా.. సెక్స్‌కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది సామ్. అంతేకాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది. సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది. -
ఆఫ్రిదిపై మోడల్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: పాకిస్థాన్ షాహిద్ ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపానని సంచలన ప్రకటనలు చేసిన ఇండియన్ మోడల్, నటి ఆర్షి ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షాకింగ్ స్టేట్ మెంట్స్, సెక్సీ ఫొటోలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో వివాదస్పద ప్రకటనలతో హల్ చల్ చేసింది. ఓ హిందీ దినపత్రికకు ఇచ్చిన ఆఫ్రిదిపై పొగడ్తలు కురిపించింది. పడక గదిలో ఆఫ్రిది అంత మంచి ప్రేమికుడు మరొకరు ఉండరని పేర్కొంది. మంచి వ్యక్తి, మంచి భర్త అని కితాబిచ్చింది. అంతేకాదు ఆఫ్రిది వేరీ కేరింగ్, సెన్సిటివ్, రొమాంటిక్ గా ఉంటాడని వెల్లడించింది. ప్రేమికుడిగా, స్నేహితుడిగా, వ్యక్తిగా అతడికి వందకి వంద మార్కులు వేస్తానని చెప్పింది. ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపానని కొద్ది నెలల క్రితం ప్రకటించి ఆర్షి ఖాన్ సంచలనం రేపింది. 'అవును. ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా. నేను ఎవరితో గడపాలన్నా ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ' అని ట్వీట్ చేయడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. తాను కడుపుతో ఉన్నానని, తనకు ఇప్పుడు మూడో నెల అని బుధవారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్షిఖాన్ వెల్లడించింది. భోపాల్ లో కాన్పు చేయించుకుంటానని, ఆఫ్రిదిని అల్లుడిగా తన తల్లి అంగీకరించిందని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఆర్షి ఖాన్ ప్రకటనలపై ఆఫ్రిది ఇప్పటివరకు స్పందించలేదు. ఆఫ్రిది కారణంగానే తాను గర్భం దాల్చానని ప్రకటించిన ఆర్షి ఖాన్ పై పాకిస్థాన్ లో రెండో ఫత్వా జారీ అయింది. EXCLUSIVE: Read my REVIEW of Afridi's virility n sexual prowess in bed here https://t.co/wlG3NFOyYD @priyankachopra @bipsluvurself @iHrithik — Arshi Khan (@ArshiKOfficial) March 18, 2016