ఆఫ్రిదిపై మోడల్ సంచలన వ్యాఖ్యలు | Shahid Afridi is a very good lover in bed: Arshi Khan | Sakshi
Sakshi News home page

ఆఫ్రిదిపై మోడల్ సంచలన వ్యాఖ్యలు

Published Mon, Mar 21 2016 1:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

ఆఫ్రిదిపై మోడల్ సంచలన వ్యాఖ్యలు

ఆఫ్రిదిపై మోడల్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: పాకిస్థాన్ షాహిద్ ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపానని సంచలన ప్రకటనలు చేసిన ఇండియన్ మోడల్, నటి ఆర్షి ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షాకింగ్ స్టేట్ మెంట్స్, సెక్సీ ఫొటోలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో వివాదస్పద ప్రకటనలతో హల్ చల్ చేసింది. ఓ హిందీ దినపత్రికకు ఇచ్చిన ఆఫ్రిదిపై పొగడ్తలు కురిపించింది.

పడక గదిలో ఆఫ్రిది అంత మంచి ప్రేమికుడు మరొకరు ఉండరని పేర్కొంది. మంచి వ్యక్తి, మంచి భర్త అని కితాబిచ్చింది. అంతేకాదు ఆఫ్రిది వేరీ కేరింగ్, సెన్సిటివ్, రొమాంటిక్ గా ఉంటాడని వెల్లడించింది. ప్రేమికుడిగా, స్నేహితుడిగా, వ్యక్తిగా అతడికి వందకి వంద మార్కులు వేస్తానని చెప్పింది.

ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపానని కొద్ది నెలల క్రితం ప్రకటించి ఆర్షి ఖాన్ సంచలనం రేపింది. 'అవును. ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా. నేను ఎవరితో గడపాలన్నా ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ' అని ట్వీట్ చేయడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది.

తాను కడుపుతో ఉన్నానని, తనకు ఇప్పుడు మూడో నెల అని బుధవారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్షిఖాన్ వెల్లడించింది. భోపాల్ లో కాన్పు చేయించుకుంటానని, ఆఫ్రిదిని అల్లుడిగా తన తల్లి అంగీకరించిందని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఆర్షి ఖాన్ ప్రకటనలపై ఆఫ్రిది ఇప్పటివరకు స్పందించలేదు. ఆఫ్రిది కారణంగానే తాను గర్భం దాల్చానని ప్రకటించిన ఆర్షి ఖాన్ పై పాకిస్థాన్ లో రెండో ఫత్వా జారీ అయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement