‘శృంగారం’ ట్వీట్‌.. నా పొరపాటే! | Arshi Khan Responded on Her Controversial tweet on Afridi | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 11:25 AM | Last Updated on Sat, Jun 2 2018 3:44 PM

Arshi Khan Responded on Her Controversial tweet on Afridi - Sakshi

నటి అర్షి ఖాన్‌ (ఇన్‌సెట్లో అఫ్రిదీ)

సాక్షి, ముంబై: మోడల్‌ కమ్‌ బాలీవుడ్‌ నటి అర్షి ఖాన్‌కి వివాదాలు కొత్తేం కాదు. మూడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌తో మొదలైన ఆమె వివాదాల ప్రస్థానం.. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది.  పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం అప్పట్లో రేపింది. ఆ దెబ్బకి అర్షి పేరు మీడియాలో మారుమోగిపోయింది.  

ఒక రకంగా బిగ్‌బాస్‌ హౌజ్‌కు సెలబ్రిటీగా ఆమెకు ఛాన్స్‌ దక్కటానికి కూడా కారణం ఆ వ్యవహారమే. అయితే 2015లో ట్వీట్‌ చేసిన తర్వాత అఫ్రిదీ గురించి, ఆ ట్వీట్‌ గురించి ఆమె ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఓ ఛానెల్‌ చిట్‌ఛాట్‌ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్‌ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్‌ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా’ అంటూ అర్షి పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే ప్రసారం కానుంది. 

కాగా, అఫ్రిదీ వ్యవహారంలో అర్షిపై అప్పట్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గెహానా వశిష్ఠ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు అర్షి చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పుకుంటోందంటూ గెహానా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement