controversial tweet
-
దున్నపోతుని తన్నినట్లు.. జితేందర్‌రెడ్డి వరుస ట్వీట్ల కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం. పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమైంది. ఆ వెంటనే మళ్లీ ఆ వీడియోను ఆయన పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ గందరగోళ రాజకీయం నడిపిస్తోంది. పార్టీ కేడర్ సైతం అయోమయానికి గురవుతోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారని కొందరు అంటుండగా.. పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 అయితే తన ట్వీట్‌ను సమర్థించుకునేలా మరో ట్వీట్ వెంటనే పోస్ట్ చేశారాయన. కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 बीजेपी नेता और पूर्व सांसद @apjithender ने अपना ये ट्वीट क्यों डिलीट कर दिया ? pic.twitter.com/rxSnAmskBO — Lutyens Media (@LutyensMediaIN) June 29, 2023 ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా బండి.. ఈటలకేమో ఆ బాధ్యతలు? -
వివాదాస్పద వీడియో.. బీజేపీ మహిళా నేత అరెస్ట్
సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన బీజేపీ మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సౌదామణి గత జనవరిలో రెండు మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా ఉన్న వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయబడింది. సెంట్రల్ క్రైమ్ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సౌదామణి ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఈ నేథ్యంలో శనివారం సెంట్రల్ క్రైమ్, సైబర్ క్రైమ్ పోలీసులు సౌదామణి చెన్నైలోని ఆమె ఇంటిలో అరెస్టు చేశారు. చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
మోదీపై రమ్య వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా చీఫ్ దివ్య స్పందన అలియాస్ రమ్య గురువారం వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని పక్షి రెట్టతో పోల్చుతూ ఆమె చేసిన ట్వీట్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడగా, కాంగ్రెస్ పార్టీ మౌనం దాల్చింది. గుజరాత్లో నర్మదా నదీతీరాన బుధవారం సర్దార్ పటేల్ స్మృత్యర్థం నిర్మించిన 182 మీటర్ల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని మోదీ బుధవారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నలుపురంగులో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం దగ్గర తెల్లటి దుస్తులతో మోదీ ఫొటోలు దిగారు. పటేల్ విగ్రహం కాళ్లదగ్గర మోదీ నిలబడ్డ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న రమ్య..‘అది పక్షి రెట్టేనా?’ అని ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిజమైన సంస్కృతి ఇదేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. మరోవైపు తన ట్వీట్‌ను సమర్థించుకున్న దివ్య.. దీనిపై వివరణ ఇవ్వబోననీ, అది అడిగే అర్హత బీజేపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. -
‘శృంగారం’ ట్వీట్.. నా పొరపాటే!
సాక్షి, ముంబై: మోడల్ కమ్ బాలీవుడ్ నటి అర్షి ఖాన్‌కి వివాదాలు కొత్తేం కాదు. మూడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌తో మొదలైన ఆమె వివాదాల ప్రస్థానం.. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం అప్పట్లో రేపింది. ఆ దెబ్బకి అర్షి పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఒక రకంగా బిగ్‌బాస్ హౌజ్‌కు సెలబ్రిటీగా ఆమెకు ఛాన్స్ దక్కటానికి కూడా కారణం ఆ వ్యవహారమే. అయితే 2015లో ట్వీట్ చేసిన తర్వాత అఫ్రిదీ గురించి, ఆ ట్వీట్ గురించి ఆమె ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఓ ఛానెల్ చిట్‌ఛాట్ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా’ అంటూ అర్షి పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా, అఫ్రిదీ వ్యవహారంలో అర్షిపై అప్పట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ గెహానా వశిష్ఠ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు అర్షి చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పుకుంటోందంటూ గెహానా తెలిపారు. Yes, I had sex with Afridi! Do I need the Indian media's permission to sleep with someone? It's my personal life. For me it was love. — Arshi Khan (@ArshiKOfficial) 8 September 2015 -
రవితేజ ‘నెక్స్ట్’.. రచ్చ కాకూడదనే!
సాక్షి, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ చేసిన ఓ పని సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజా చిత్రం టచ్ చేసి చూడు ప్రమోషన్లో భాగంగా గురువారం రవితేజ అభిమానులతో ట్విటర్లో చిట్ ఛాట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మాస్ రాజా సమాధానం ఇవ్వటం... వెంటనే దానిని తొలగించటం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గురించి ‘ఒక్క ముక్కలో’ చెప్పండంటూ ఓ పవన్ వీరాభిమాని రవితేజను కోరాడు. దీనికి వెంటనే రవితేజ ‘నెక్స్ట్’ అంటూ బదులిచ్చి మరో ప్రశ్నకు వెళ్లిపోయాడు. అయితే తర్వాత ఏమైందో తెలీదుగానీ ఆ ట్వీట్‌ను మాస్ రాజా తొలగించేశాడు. కానీ, అప్పటికే కొందరు ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం ప్రారంభించేశారు. వివాదాస్పదం కావటం ఇష్టం లేకనే రవితేజ ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ.. ముందే అలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాల్సిందని పలువురు విమర్శిస్తున్నారు. మరికొందరేమో మాస్ రాజాకు మద్ధతుగా.. అది కాకతాళీయంగా జరిగిపోయిందని.. అప్పట్లో ఓ టీవీషోలో మల్టీస్టారర్ పవన్‌తోనే చేస్తానన్న రవితేజ కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా! -
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు
సాక్షి, సినిమా : తాజాగా నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ట్విటర్ వేదికగా ఆమె ప్రశ్న సంధించింది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నావా? అంటూ పలువురు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించింది కాదని.. డబ్బు కోసం ఓ తండ్రి కూతురిని అమ్ముకుంటే.. ఆమె ఆవేదనను తాను ట్వీట్ చేశాను అంటూ పూనమ్ వివరణ ఇచ్చుకుంది. పవన్ ఫ్యాన్స్ వార్నింగ్... ‘డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు’ అంటూ నటి పూనమ్ చేసిన కామెంట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ... ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది. నాటకాలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరికొందరు పూనమ్ కూడా టీవీ చానల్స్ చర్చా కార్యాక్రమాలకు వెళ్లాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు. Dabbul kosam maripoina siddantalu..me astitvam Enti ?avasarlu kosam maripoina nijayati ni gunam Enti ??? #justathought — Poonam Kaur Lal (@poonamkaurlal) 27 January 2018 -
చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు
ఛండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లర్‌పై చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్) మిస్ వరల్డ్ అయ్యింది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతే ఆయన ట్వీట్‌పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్ తీవ్రంగా స్పందించారు. మానుషి హర్యానాకే కాదు.. యావత్ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్‌కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్‌పై మండిపడ్డారు. ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు కూడా థరూర్ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World! — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 What a terrific answer by this bright young woman -- a real credit to Indian values! #missworldmanushi https://t.co/0gCQxlqD5L — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 -
‘రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడతాం’
ముంబై: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే వర్మను చెప్పులతో కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు వర్మ సినిమాలకు పనిచేయకూడదని సినిమా సెట్టింగ్, దాని అనుబంధ కార్మికుల సంఘం నిర్ణయించింది. ఈ సంఘంలో 52 వేల మంది సినీ కార్మికులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వర్మ వివాదస్పద ట్వీట్ చేశారు. మహిళలను శృంగారతార సన్నీ లియోన్‌తో పోలుస్తూ అనుచిత ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. మహిళలను కించపరిచేలా వర్మ వ్యాఖ్యలు చేశారని సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రె గోవాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాంబ్రె ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఫేస్ బుక్’పై నెటిజన్ల ఫైర్!
నెట్ న్యూట్రాలిటీపై కంపెనీ బోర్డు సభ్యుడి వివాదాస్పద ట్వీట్... న్యూయార్క్: నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు చేసిన ట్వీట్, దానిని దుమ్మెత్తిపోస్తూ నెటిజన్లు, ప్రత్యేకించి భారత నెటిజన్లు చేసిన రీట్వీట్స్తో ఆన్లైన్ అట్టుడికిపోయింది. వివక్షాపూరిత ఇంటర్నెట్ టారిఫ్‌ను అడ్డుకుంటూ.. నెట్ న్యూట్రాలిటీని పరిరక్షిస్తూ... టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్బుక్ తన అక్కసును ఇంకా వెళ్లగక్కుతోంది. ఈ విధానాన్ని ‘వలసవాద వ్యతిరేక’ భావజాలంగా ఫేస్ బుక్ బోర్డ్ మెంబర్ మార్క్ అండ్రీసేన్ ట్వీట్ చేశారు. మంచి అంశాలను సైతం ‘వలసవాద వ్యతిరేక’ భావజాలంతో తోసిపుచ్చడం సరికాదని అన్నారు. దేశ ప్రజలకు ఇలాంటి నిర్ణయాలు ఎంతమాత్రం దోహదపడవని పేర్కొన్న ఆయన, ఈ భావజాలం దేశాన్ని ఆర్థికంగా దశాబ్దాల పాటు వెనక్కు నెడతాయని అన్నారు. దేశం బ్రిటిష్ పాలనలో ఉంటేనే మంచి నిర్ణయాలు వచ్చి ఉండేవని సైతం వ్యాఖ్యానించారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ట్వీట్‌ను అండ్రీసేన్ ఉపసంహరించుకున్నారు. ఫేస్బుక్ ఫ్రీ బేసి క్స్‌ను కొందరు ఇంటర్నెట్ వలసవాదంగా సైతం అభివర్ణించారు. మరి కొందరు ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదానికి ‘సరికొత్త కొనసాగింపుగా’ ఫేస్‌బుక్‌ను అభివర్ణించారు. తాజా పరిణామాలతో తన వ్యాఖ్యలను అన్నింటినీ వెనక్కితీసుకుంటున్నట్లు అండ్రీసేన్ ప్రకటించారు. నేపథ్యం చూస్తే... వెబ్సైటును బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఇటీవల హెచ్చరించింది. అంతక్రితం నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్ .. డేటా సర్వీసులకు కంటెంట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసింది. నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డం కులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
పాప మృతికి కారణం ఆమె తండ్రే
రాజస్తాన్ యాక్సిడెంట్‌పై నటి, ఎంపీ హేమమాలిని వివాదాస్పద ట్వీట్ ముంబై: రాజస్తాన్‌లో ప్రమాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజా ట్వీట్ వివాదాస్పదమైంది. ‘బాలిక తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయేది కాదు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడటమే గాక హేమ, మరో నలుగురు గాయపడ్డం తెలిసిందే. హేమ మెర్సిడెజ్ బెంజ్ తన ఆల్టో కారును ఢీకొన్నప్పుడు అది గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతోందని మృతురాలి తండ్రి హనుమాన్ మహాజన్ ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హేమ ట్వీట్‌పై స్పందిస్తూ ‘పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడగలరు. ఆమెకు ధైర్యముంటే నా ముందుకొచ్చి చెప్పమనండి’ అని అన్నారు. మీడియాను తప్పుబట్టిన హేమ మృతురాలి కుటుంబీకుల్ని వదలి ఒంటరిగా వెళ్లిపోయిన తనపై మీడియా విమర్శలు గుప్పించడం పట్ల ట్వీటర్లో హేమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘సంచలనాల కోసమే మీడియా నన్ను అపఖ్యాతి పాలు చేసింది’ అని అన్నారు. కాగా హేమమాలిని కారు ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాజస్తాన్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అక్కడి పోలీసులు, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది.