చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు | Shashi Tharoor Controversy Tweet on Manushi Chillar | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద ట్వీట్‌

Published Mon, Nov 20 2017 10:51 AM | Last Updated on Mon, Nov 20 2017 2:07 PM

Shashi Tharoor Controversy Tweet on Manushi Chillar  - Sakshi - Sakshi - Sakshi - Sakshi

ఛండీగఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ మిస్‌ వరల్డ్‌-2017 మానుషి చిల్లర్‌పై చేసిన ఓ ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు.

‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్‌) మిస్‌ వరల్డ్‌ అయ్యింది’’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతే ఆయన ట్వీట్‌పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్‌ తీవ్రంగా స్పందించారు.

మానుషి హర్యానాకే కాదు.. యావత్‌ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్‌కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్‌ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్‌పై మండిపడ్డారు.

ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్‌ అభిమన్యు కూడా థరూర్‌ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్‌ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement