MP Shashi tharoor
-
గుర్రంపై కూర్చుని ఖడ్గమెత్తిన హీరో
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీని హేళన చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. తనకు అన్ని తెలుసని చెప్పుకునే మోదీ ‘తెల్లని గుర్రంపై కూర్చుని గాల్లోకి ఖడ్గాన్ని ఎత్తిన హీరో’ అని పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలో ఒక్క వ్యక్తి(మోదీ) చేతిలోనే పాలన అంతా నడుస్తోందని అన్నారు. ‘మోదీ ప్రభుత్వానిది ఏక వ్యక్తి పాలన. మోదీ∙చెప్పిన ప్రతిదానికీ అంతా తలూపుతున్నారు. చరిత్రలో ప్రధాని కార్యాలయంలో పాలన ఇంతగా ఎప్పుడూ కేంద్రీకృతం కాలేదు. ప్రతి నిర్ణయాన్ని ప్రధాని కార్యాలయమే తీసుకుంటోంది. అనుమతి కోసం ప్రతి దస్త్రాన్ని అక్కడికే పంపుతున్నారు’ అని అన్నారు. మరోవైపు, ‘మోదీ శివలింగంపై తేలు వంటి వారు’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు కోర్టుకెక్కారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజీవ్ బబ్బర్ పరువు నష్టం కేసు వేశారు. -
హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్
న్యూయార్క్: హిందూమతం అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కొనియాడారు. అనిశ్చితితో కూడిన నేటి సమాజానికి సరిగ్గా సరిపోయేది హిందూ మతమేనని పేర్కొన్నారు. మనకు తెలియని చాలా విషయాలు ఈ మతంలో ఉన్నాయన్నారు. జైపూర్ సాహిత్య వేడుకలకు అనుబంధంగా న్యూయార్క్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అద్భుతమైదని కొనియాడారు. ‘అనిశ్చితి, సంశయాలను జయించే ఒకే ఒక గొప్ప మతం హిందూయిజం. హిందూమతానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత నిర్ణయం. స్త్రీలను, కులాన్ని ద్వేషించే విషయాలను గ్రహించి, తన మతం ఇతరుల పట్ల వివక్ష చూపడానికి అనుమతిస్తోందని వాదిస్తే అది వ్యక్తి తప్పవుతుంది కానీ మతానికి కాదు’ అని థరూర్ పేర్కొన్నారు. -
చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు
ఛండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లర్‌పై చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్) మిస్ వరల్డ్ అయ్యింది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతే ఆయన ట్వీట్‌పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్ తీవ్రంగా స్పందించారు. మానుషి హర్యానాకే కాదు.. యావత్ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్‌కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్‌పై మండిపడ్డారు. ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు కూడా థరూర్ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World! — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 What a terrific answer by this bright young woman -- a real credit to Indian values! #missworldmanushi https://t.co/0gCQxlqD5L — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 -
సునంద కేసులో నలుగురు కీలకం
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో హస్తమున్న నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసు అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించటంతో దర్యాప్తు బృందంమే సమాచారం అందించింది. ఇందులో భాగంగానే శశిథరూర్ వ్యక్తిగత సిబ్బంది, మరో ఇద్దరు బిజినెస్మేన్లను కూడా విచారించారు. శశిథరూర్ కుటుంబ సన్నిహితులు అయిన దేవన్‌ను బుధవారం విచారించినట్టు సమాచారం. అతడిని గత ఏడాదిలో రెండుసార్లు ప్రశ్నించారు. సునంద మృతి చెందినపుడు గత జనవరిలో, తరువాత నవంబర్‌లో కూడా విచారించినట్టు సమాచారం. -
శశిథరూర్‌ను ఇప్పుడు ప్రశ్నించం
ముందు మిగతా వారందరినీ విచారిస్తాం: పోలీసులు న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రస్తుతానికి ప్రశ్నించబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. తొలుత.. ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులందరనీ విచారించటంతో పాటు, లభ్యమైన సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని చెప్పారు. సునంద అనుమానాస్పద మరణానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటుతో సంబంధం ఉండొచ్చన్న వార్తా కథనాలను ప్రస్తావించగా.. తమకు ఇంతవరకూ అటువంటి కోణమేదీ తారసిల్లలేదని పోలీసులు బదులిచ్చారు. కొత్తగా చెప్పటానికేం లేదు: థరూర్ సునందపుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు తీరుపై శుక్రవారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్.. ఈ విషయంలో తాను కొత్తగా చెప్పేదేమీ లేదని శనివారం వ్యాఖ్యానించారు. ఆయన కొచ్చి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ కేసు విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.