హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్‌ | Hinduism Wonderful Religion Suited For Modern Era | Sakshi
Sakshi News home page

హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్‌

Published Sat, Sep 22 2018 5:51 AM | Last Updated on Sat, Sep 22 2018 5:51 AM

Hinduism Wonderful Religion Suited For Modern Era - Sakshi

న్యూయార్క్‌: హిందూమతం అద్భుతమైనదని కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ కొనియాడారు. అనిశ్చితితో కూడిన నేటి సమాజానికి సరిగ్గా సరిపోయేది హిందూ మతమేనని పేర్కొన్నారు. మనకు తెలియని చాలా విషయాలు ఈ మతంలో ఉన్నాయన్నారు. జైపూర్‌ సాహిత్య వేడుకలకు అనుబంధంగా న్యూయార్క్‌లో గురువారం నిర్వహించిన ఓ  కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అద్భుతమైదని కొనియాడారు. ‘అనిశ్చితి, సంశయాలను జయించే ఒకే ఒక గొప్ప మతం హిందూయిజం. హిందూమతానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత నిర్ణయం. స్త్రీలను, కులాన్ని ద్వేషించే విషయాలను గ్రహించి, తన మతం ఇతరుల పట్ల వివక్ష చూపడానికి అనుమతిస్తోందని వాదిస్తే అది వ్యక్తి తప్పవుతుంది కానీ మతానికి కాదు’ అని థరూర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement