Wonderful
-
టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం!
కొత్త ఐడియాలను అమలు చేయడంలో భారత్ ముందుంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది. చాలామంది తమ టాలెంట్ చూపించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఐడియాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్లో ఒక వీడియో అందరినీ అమితంగా అలరిస్తోంది. దీనిని చూసినవారంతా ఆ మహిళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నీటి ట్యాప్ విరిగిపోవడంతో ఒక మహిళ దానికి టూత్‌పేస్ట్ ట్యూబ్ కత్తిరించి బిగించింది. దాని మూత తీస్తూ నీటిని పట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళ నీటిని పట్టుకునేందకు ఒక బకెట్ తీసుకురావడం కనిపిస్తుంది. తరువాత అక్కడ విరిగి ఉన్న ట్యాప్ కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటే నీటిని పట్టుకోవడం ఇబ్బందికరం అని గ్రహించి, ఆమె ఒక టూట్‌పేస్ట్ కట్ చేసి, ఆ టాప్కు బిగిస్తుంది. తరువాత కావలినంత నీటిని పట్టుకుని, తరువాత దానికి మూత బిగిస్తుంది. ఈ వీడియో జూలై 12న షేర్ అవగా, ఇప్పటి వరకూ దీనికి 120.7కే వ్యూస్ దక్కాయి. 9 సెకెన్లు ఈ వీడియోకు ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైక్స్ దక్కాయి. వీడియో చూసిన నెటిజన్లు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Wow very practical👏 pic.twitter.com/T21h2EedtJ — Tansu YEĞEN (@TansuYegen) July 12, 2023 ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్
న్యూయార్క్: హిందూమతం అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కొనియాడారు. అనిశ్చితితో కూడిన నేటి సమాజానికి సరిగ్గా సరిపోయేది హిందూ మతమేనని పేర్కొన్నారు. మనకు తెలియని చాలా విషయాలు ఈ మతంలో ఉన్నాయన్నారు. జైపూర్ సాహిత్య వేడుకలకు అనుబంధంగా న్యూయార్క్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అద్భుతమైదని కొనియాడారు. ‘అనిశ్చితి, సంశయాలను జయించే ఒకే ఒక గొప్ప మతం హిందూయిజం. హిందూమతానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత నిర్ణయం. స్త్రీలను, కులాన్ని ద్వేషించే విషయాలను గ్రహించి, తన మతం ఇతరుల పట్ల వివక్ష చూపడానికి అనుమతిస్తోందని వాదిస్తే అది వ్యక్తి తప్పవుతుంది కానీ మతానికి కాదు’ అని థరూర్ పేర్కొన్నారు. -
ఎత్తైన కొండల మధ్య అద్భుత విన్యాసం
-
వరాహిమాతకు యంత్రపూజ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న యంత్రపూజల్లో 11వ రోజైన గురువారం వరాహిమాత యంత్ర పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వరాహిమాత ప్రతిమను ముగ్గులతో తీర్చిదిద్దగా, అర్చకులు కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణలు పూజలు నిర్వహించారు. వరాహిమాత యంత్రపూజ చేయడం వల్ల దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని, అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని వారు పేర్కొన్నారు. వరాహిమాత ప్రతిమ చుట్టూ భక్తులు దీపాలు వెలిగించారు. -
కనువిందుగా కళాబృందాల ప్రదర్శన
భారీగా సామాజిక పరివర్తన ర్యాలీ తెనాలి: సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ 7వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం సామాజిక పరివర్తన ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోనిS రైల్వేస్టేషను సెంటరు నుంచి ర్యాలీ ఆరంభించారు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆ సెంటరులోని భగత్‌సింగ్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ్నుంచి ప్రదర్శన రణరంగచౌక్కు చేరుకోగానే పార్టీ నేతలతో కలిసి అక్కడి అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు. మార్కెట్ సెంటర్, మెయిన్‌రోడ్డు, బోసురోడ్డు నుంచి ప్రదర్శన బహిరంగసభావేదికైన నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంకు చేరుకొంది. ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి తరలించ్చిన పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు, 13 జిల్లాల్నుంచి ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ప్రదర్శనకు ముందుభాగాన తప్పెటగుళ్లు, మహిళల డబ్బు వాయిద్యబృందం, మహిళల కోలాంటి, గిరిజన నృత్యాలు కనువిందుగా సాగాయి. కార్యకర్తలు, కళాకారులు ఎరుపు దుస్తుల్లో, ఎర్ర జెండాలు పట్టుకుని క్రమశిక్షణగా ప్రదర్శనలో సాగటం, కళాబృందాల సందడి పట్టణవాసుల్ని ఆకర్షించాయి. మహాసభల వేదికపైనా ఆంధ్రప్రదేశ్ జనసంస్కృతిక మండలి కళాకారులు అద్భుతంగా విప్లవ పాటలకు అభినయించారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడుకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల మద్దెల దిలీప్ చేసిన అభినయం ఆకట్టుకుంది. -
రామప్ప ఆలయం అద్భుతం..
వెంకటాపురం(వరంగల్): కాకతీయుల కాలంలో నిర్మించిన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం అద్భుతంగా ఉందని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కాన్సులేట్ జనరల్ (హైకమిషనర్) హస్సాన్ నౌరీయన్ అన్నారు. శనివారం పాలంపేట శివారులోని గల రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ శిల్పకళాసంపద గురించి టూరిజం గైడ్లు గోరంట్ల విజయ్‌కుమార్, సూర్యకిరణ్‌లు ఆయన కుటుంబసభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఇరానీలు ఆలయానికి చెందిన ప్రతి శిల్పాన్ని పరీశీలిస్తూ శిల్పాకళ సౌందర్యాన్ని కెమెరాలో బంధించారు. నంది విగ్రహం వద్ద ఫొటోలు దిగారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సు అందాలను తిలకించారు. -
ఖరీఫ్ మళ్లీ ఆలస్యమే
అంచనాలకు అందని సాగు విస్తీర్ణం వచ్చేనెల సమీక్ష ద్వారానే నిర్ధారణకు వీలు రబీకీ ప్రతికూల వాతావరణం అనకాపల్లి, న్యూస్‌లైన్: ఈ ఏడాది కూడా ఖరీఫ్ అనుకున్నట్టు ప్రారంభం కాదనిపిస్తోంది. వాతావరణ కారణాల వల్లే ఖరీఫ్ మళ్లీ ఆలస్యం కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాలు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చాయి. ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు వర్షపాతం తగ్గే అవకాశముందని వచ్చిన సూచనలు వ్యవసాయ విభాగాన్ని కలవరపరుస్తున్నాయి. జిల్లాలో 2.16 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేపట్టాల్సి ఉండగా, దీనిలో ప్రధానభాగం వరిపంటకే దక్కుతుంది. సరాసరి లక్ష హెక్టార్లలో వరి సాగు చేయా ల్సి ఉన్నప్పటికీ వర్షంపైనే అధిక శాతం రైతులు ఆధారపడతారు. వరి నారుమళ్లు వేసే రైతులు నింగివైపు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల అంచనాల మేరకు ఈ ఏడాది కనీ సం ఆగస్టు రెండోపక్షం నుంచే ఖరీఫ్ సాగు మొదలవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొక్కజొన్న విస్తీర్ణం పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొక్కజొన్న పంట గిట్టుబాటుకావడం తో పాటు స్వీట్‌కార్న్‌పై అందరికీ ఆసక్తి పెరగడంతో వాటి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. వర్షాలను బట్టి వరి, వర్షాధార చెరకు విస్తీర్ణాలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గితే అపరాల సాగుపై రైతులు మళ్లే అవకాశముంది. ఇప్పటికిప్పుడే పరిస్థితిపై అంచ నా లేకపోయినా, మే రెండో వారానికి ఓ అవగాహన కలిగే అవకాశం ఉంది. పరిశోధన విభాగం శాస్త్రవేత్తలంతా మే 12 నుంచి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సదస్సులో దృశ్యం ఆవిష్కృతమయ్యేట్టు ఉంది. ఈ సదస్సులో ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి సమీక్ష జరగనుంది. జూన్ 2 నుంచి రెండు ప్రభుత్వా లు ఏర్పాటు కాబోతూ ఉండడంతో ఆ లోపు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే చిట్టచివరి రాష్ట్రస్థాయి సమీక్ష ఇదే కానుంది. రబీకి చిక్కులు : భారీ వర్షాల నేపథ్యంలో గత రబీ సీజన్ ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, నీటిముంపు పరిస్థితుల నుంచి తెప్పరిల్లి రబీ పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు జనవరి నుంచి మారిన వాతావరణ స్థితిగతులు ప్రతికూల ఫలితాలనే రుచి చూపిస్తున్నాయి. వాస్తవానికి ఈపాటికే రబీ సాగు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా మొదలుకావడంతో ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో పొద్దుతిరుగుడు, వరి, చెరకు, మొక్కజొన్న పంటలు సాగు దశలో ఉన్నాయి. చెరకు దీర్ఘకాలికపంట కావడంతో పాటు ఖరీఫ్, రబీల జమిలి పంటగా గుర్తింపు పొందింది. పొద్దు తిరుగుడు వరి, చెరకులకు చీడపీడల తాకిడి అధికంగా ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వరి, చెరకులకు పీక పురుగుల తాకిడి ఎక్కువైంది. -
గూగుల్ క్రోమ్ గమ్మత్తులు...
వెబ్ విహారానికి ఒక వండర్ఫుల్ విమానం లాంటిది గూగుల్ క్రోమ్. అన్ని వెబ్బ్రౌజర్ల కన్నా బెటర్‌మెంట్‌గా ప్రారంభం అయ్యి ఇప్పుడు బెస్ట్ అనిపించుకొంటున్న క్రోమ్‌లో ఉపయోగించుకోవాలి కానీ ఎన్నో గమ్మత్తై సేవలున్నాయి. వాటిని వినియోగించుకొంటే ఇప్పటి వరకూ క్రోమ్మీదున్న అభిమానం రెట్టింపు అవుతుంది! అలాంటి వాటిలో కొన్ని... mxHeroతో మంచి సదుపాయాలు! క్రోమ్‌కు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకొని వెబ్‌బ్రౌజింగ్ ప్రారంభించేస్తే ఎన్నో కొత్త అనుభవాలు సొంతం అవుతాయి. ముందుగా ఎమ్ఎక్స్హీరో ఇన్స్టాల్ అయ్యి ఉన్న బ్రౌజర్‌తో జీమెయిల్లోకి లాగిన్ అయితే... మెయిల్స్ పంపుకోవడం చాలా సదుపాయం అవుతుంది. దీన్ని వల్ల జీమెయిల్లో ‘సెండ్లేటర్’ అనే అప్షన్ వస్తుంది. ఫలితంగా ముందుగా మెయిల్‌ను కంపోజ్ చేసి, దాన్ని తర్వాత పంపేవిధంగా టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. మరి ఒక విధంగా ఈ ఆప్షన్ వరమే! మామూలుగా జీమెయిల్ లో ఒకేసారి ఎక్కుమంది ఒక మెయిల్‌ను పంపితే... ఆ రెసిపెంట్స్ పేర్లు అందరికీ వెళతాయి. మనం ఎంతమందికి ఆ మెయిల్ పంపామో ఆ వివరాలు అందరికీ చేరిపోతాయి. ఒక విధంగా అది అసౌకర్యమే. అలాంటి అసౌకర్యాన్ని నిరోధించే సదుపాయం కూడా ఈ ఎక్స్టెన్షన్టూల్తో సొంతం చేసుకో వచ్చు. అలాగే REPLY TIMEOUT, TOTAL TRACK,SELF DESTRUCT వంటి అప్షన్లు కూడా తెచ్చిపెడుతుంది ఈ ఎక్స్టెన్షన్. rapportive for chrome.. ఒక ప్రొఫైల్ డైరీ... జీమెయిల్ బ్రౌజింగ్ ను మరింత సౌకర్యవంతంగా తయారు చేసేది ఈ ఎక్స్టెన్షన్. జీమెయిల్ ఫ్రెండ్స్‌కు సంబంధించి వివరాలను ఒక పద్ధతిలో అమర్చి పెడుతుంది ఇది. ఒక కాంటాక్ట్‌కు సంబంధించి అతడి ప్రొఫైల్ పిక్చర్, జీమెయిల్ఐడీ, ఫేస్బుక్ ఐడి, స్కైప్ ఐడీ ఇంకా అందులో ఉంటే వెబ్సైట్ నుంచి ఫోన్ నంబర్వరకూ అన్ని వివరాలను ఒక క్రమంలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో ఉండే ఈ సదుపాయాన్ని మీ కంప్యూటర్ సిస్టమ్ కు కూడా అందిస్తుంది rapportive.