గూగుల్ క్రోమ్ గమ్మత్తులు... | Google Chrome've ... | Sakshi
Sakshi News home page

గూగుల్ క్రోమ్ గమ్మత్తులు...

Published Wed, Apr 9 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

గూగుల్ క్రోమ్ గమ్మత్తులు...

గూగుల్ క్రోమ్ గమ్మత్తులు...

వెబ్  విహారానికి ఒక వండర్‌ఫుల్ విమానం లాంటిది గూగుల్ క్రోమ్. అన్ని వెబ్‌బ్రౌజర్‌ల కన్నా బెటర్‌మెంట్‌గా ప్రారంభం అయ్యి ఇప్పుడు బెస్ట్ అనిపించుకొంటున్న క్రోమ్‌లో ఉపయోగించుకోవాలి కానీ  ఎన్నో గమ్మత్తై సేవలున్నాయి. వాటిని వినియోగించుకొంటే ఇప్పటి వరకూ క్రోమ్‌మీదున్న అభిమానం రెట్టింపు అవుతుంది! అలాంటి వాటిలో కొన్ని...

 mxHeroతో మంచి సదుపాయాలు!

క్రోమ్‌కు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వెబ్‌బ్రౌజింగ్ ప్రారంభించేస్తే ఎన్నో కొత్త అనుభవాలు సొంతం అవుతాయి. ముందుగా ఎమ్‌ఎక్స్‌హీరో ఇన్‌స్టాల్ అయ్యి ఉన్న బ్రౌజర్‌తో జీమెయిల్‌లోకి లాగిన్ అయితే... మెయిల్స్ పంపుకోవడం చాలా సదుపాయం అవుతుంది. దీన్ని వల్ల జీమెయిల్‌లో ‘సెండ్‌లేటర్’ అనే అప్షన్ వస్తుంది. ఫలితంగా ముందుగా మెయిల్‌ను కంపోజ్ చేసి, దాన్ని తర్వాత పంపేవిధంగా టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. మరి ఒక విధంగా ఈ ఆప్షన్ వరమే!
 
మామూలుగా జీమెయిల్ లో ఒకేసారి ఎక్కుమంది ఒక మెయిల్‌ను పంపితే... ఆ రెసిపెంట్స్ పేర్లు అందరికీ వెళతాయి. మనం ఎంతమందికి ఆ మెయిల్ పంపామో ఆ వివరాలు అందరికీ చేరిపోతాయి. ఒక విధంగా అది అసౌకర్యమే. అలాంటి అసౌకర్యాన్ని నిరోధించే సదుపాయం కూడా ఈ ఎక్స్‌టెన్షన్‌టూల్‌తో సొంతం చేసుకో వచ్చు.  అలాగే REPLY TIMEOUT, TOTAL TRACK,SELF DESTRUCT వంటి అప్షన్‌లు కూడా తెచ్చిపెడుతుంది ఈ ఎక్స్‌టెన్షన్.
 
rapportive for chrome.. ఒక ప్రొఫైల్ డైరీ...

 
జీమెయిల్ బ్రౌజింగ్ ను మరింత సౌకర్యవంతంగా తయారు చేసేది ఈ ఎక్స్‌టెన్షన్. జీమెయిల్ ఫ్రెండ్స్‌కు సంబంధించి వివరాలను ఒక పద్ధతిలో అమర్చి పెడుతుంది ఇది. ఒక కాంటాక్ట్‌కు సంబంధించి అతడి ప్రొఫైల్ పిక్చర్, జీమెయిల్‌ఐడీ, ఫేస్‌బుక్ ఐడి, స్కైప్ ఐడీ ఇంకా అందులో ఉంటే వెబ్‌సైట్ నుంచి ఫోన్ నంబర్‌వరకూ అన్ని వివరాలను ఒక క్రమంలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఈ సదుపాయాన్ని మీ కంప్యూటర్ సిస్టమ్ కు కూడా అందిస్తుంది rapportive.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement