గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక | Indian Govt Issue High Severity Warning to Google Chrome Users Check The Reason | Sakshi
Sakshi News home page

గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

Published Sun, Aug 11 2024 1:46 PM | Last Updated on Sun, Aug 11 2024 2:32 PM

Indian Govt Issue High Severity Warning to Google Chrome Users Check The Reason

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. విండోస్, మ్యాక్ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లపై గూగుల్ క్రోమ్ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

క్రోమ్ బ్రౌజర్‌లో బగ్‌లు ఉన్నాయని, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకునే అవకాశం ఉందని.. సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకున్న ముఖ్యమైన డేటాను, పాస్‌వర్డ్‌లను సైతం వారు కాపీ చేసుకునే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ బ్రౌజర్‌ ఉపయోగించేవారు వెంటనే దాన్ని అప్డేట్ చేయాలని సంస్థ పేర్కొంది.

ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లతో సహా అనేక రకాల ఆండ్రాయిడ్ పరికరాలను గూగుల్ క్రోమ్ ప్రభావితం చేస్తుందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. కాబట్టి యూజర్లు తప్పకుండా క్రోమ్ అప్డేట్ చేసుకోవాలి.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, క్రోమ్ బ్రౌజర్‌లో ఈ భద్రతా లోపం సుమారు 18 సంవత్సరాల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని డెవలపర్లు గుర్తించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ సమస్యను వెలికితీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement