గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. తేలిగ్గా తీసుకుంటే మీ బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఈ బ్రౌజర్‌లో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాజర్లు సులువుగా హ్యాక్ చేస్తున్నారని తెలియజేసింది.
మనలో చాలా మంది వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఇంటర్‌నెట్‌ను ఉపయోగించేటప్పుడు మనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇస్తుంటాం. ఒకవేళ మనం వాడే బ్రౌజర్ సురక్షితం కాకుంటే మన సమాచారమంతా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లను అప్‌డేట్ చేస్తుంటుంది. ఒకవేళ మీరు పాత వర్షన్ బ్రౌజర్లను వాడుతుంటే ప్రమాదంలో పడినట్లే.
విండోస్ యూజర్లు 110.0.5481.77/.78 వర్షన్, మ్యాక్, లైనెక్స్ యూజర్లు 110.0.5481.77 వర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్నవారికి భారత ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఓ నివేదిక విడుదల చేసింది. వీళ్ల బారిన పడకూడదంటే గూగుల్ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
(ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ)
Comments
Please login to add a commentAdd a comment