ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ రానేవచ్చింది. ఇది ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ( CERT-In ) పలు యాపిల్ ఉత్పత్తులలో సెక్యూరిటీ లోపాల గురించి హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్‌ఓఎస్, మ్యాక్స్‌ఓఎస్, విజన్‌ఓఎస్ సహా అనేక రకాల యాపిల్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లు ప్రభావిత జాబితాలో ఉన్నాయి.
యాపిల్ ఉత్పత్తలలో ఈ సెక్యూరిటీ లోపాలను ‘హైరిస్క్’గా సెర్ట్‌ఇన్ వర్గీకరించింది. వీటిని అలక్ష్యం చేస్తే సున్నితమైన సమాచారానికి అటాకర్‌లకు అనధికార యాక్సెస్ ఇచ్చినట్టువుతుంది. వారు మీ పరికరంలో ఆర్బిటరీ కోడ్‌ని అమలు చేసే అవకాశం ఉంటుంది. క్లిష్టమైన భద్రతా పరిమితులు పక్కకు వెళ్తాయి. సేవ తిరస్కరణ (DoS) షరతులకు ఆస్కారం కలుగుతుంది. అటాకర్‌లు సిస్టమ్‌పై నియంత్రణ సాధించేందుకు వీలు కలుగుతుంది. స్పూఫింగ్, క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS) దాడులు జరిపే ప్రమాదం ఉంటుంది.
ప్రమాదాలను నివారించడానికి యాపిల్ పరికరాలను సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ చేయాలని యూజర్లకు సెర్ట్ ఇన్ సూచించింది.
ప్రభావిత యాపిల్ డివైజెస్ ఇవే..
iOS: Versions prior to 18 and 17.7
iPadOS: Versions prior to 18 and 17.7
macOS Sonoma: Versions prior to 14.7
macOS Ventura: Versions prior to 13.7
macOS Sequoia: Versions prior to 15
tvOS: Versions prior to 18
watchOS: Versions prior to 11
Safari: Versions prior to 18
Xcode: Versions prior to 16
visionOS: Versions prior to 2
Comments
Please login to add a commentAdd a comment