ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సలహా జారీ చేసింది. కొన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పు కలిగించే సాంకేతిక లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ టీమ్ (CERT-in) గుర్తించింది. ముప్పు ఉన్న పరికరాల జాబితాను విడుదల చేసింది.
ఈ లోపాలను వినియోగించుకుని హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది. స్పూఫింగ్‌పై వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాల వల్ల యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తదితర పరికరాల సాఫ్ట్‌వేర్‌లు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం జారీ చేసిన హై రిస్క్ హెచ్చరికలో పేర్కొంది. వీటి నుంచి బయటపడటానికి యాపిల్ నుంచి సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ముప్పు ఉన్న వెర్షన్లు ఇవే..
17.6, 16.7.9కి ముందున్న iOS, iPadOS వెర్షన్‌లు, 14.6కి ముందు MacOS Sonoma వెర్షన్‌లు, 13.6.8కి ముందు MacOS వెంచురా వెర్షన్‌లు, 12.7.6కి ముందు macOS Monterey వెర్షన్‌లు, 10కి ముందు వాచ్OS వెర్షన్‌లు, 17.6కి ముందు tvOS వెర్షన్‌లు, 1.3కి ముందు visionOS వెర్షన్‌లు, 17.6కి ముందు Safari వెర్షన్‌లు.
Safari versions before 17.6
iOS and iPadOS versions before 17.6
iOS and iPadOS versions before 16.7.9
macOS Sonoma versions before 14.6
macOS Ventura versions before 13.6.8
macOS Monterey versions before 12.7.6
watchOS versions before 10.6
tvOS watchOS versions before 17.6
visionOS versions before 1.3
Comments
Please login to add a commentAdd a comment