హై రిస్క్‌లో విండోస్‌ యూజర్లు.. | these Windows versions at high risk Govt issues warning | Sakshi
Sakshi News home page

హై రిస్క్‌లో విండోస్‌ యూజర్లు..

Published Sat, Aug 17 2024 7:27 PM | Last Updated on Sat, Aug 17 2024 8:15 PM

these Windows versions at high risk Govt issues warning

మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్‌ 11, విండోస్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గుర్తించిన రెండు భద్రతా లోపాల గురించి యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని టార్గెట్ సిస్టమ్‌పై దాడి చేసే వ్యక్తి 'ఎలివేటెడ్ ప్రివిలేజెస్' పొందేందుకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) హెచ్చరించింది.

ఈ ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జారీ చేసిన ఒక సూచనలో సమస్య గురించి కొన్ని వివరాలను పంచుకుంది. “వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ (VBS), విండోస్ బ్యాకప్‌కు మద్దతు ఇచ్చే విండోస్ ఆధారిత సిస్టమ్‌లలో ఈ లోపాలు ఉన్నాయి. దాడి చేసే వ్యక్తి గతంలో తొలగించిన సమస్యలను తిరిగి ప్రవేశపెట్టడానికి లేదా వీబీఎస్‌ రక్షణలను చేధించడానికి ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.

తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లో సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సెర్ట్‌ఇన్‌ పేర్కొంది. కాబట్టి విండోస్‌ యూజర్లు మైక్రోసాఫ్ట్‌ అందించిన అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది.

ప్రభావిత విండోస్‌ వెర్షన్‌లు ఇవే..

  • Windows Server 2016 (Server Core installation)

  • Windows Server 2016

  • Windows 10 Version 1607 for x64-based Systems

  • Windows 10 Version 1607 for 32-bit Systems

  • Windows 10 for x64-based Systems

  • Windows 10 for 32-bit Systems

  • Windows 11 Version 24H2 for x64-based Systems

  • Windows 11 Version 24H2 for ARM64-based Systems

  • Windows Server 2022, 23H2 Edition (Server Core installation)

  • Windows 11 Version 23H2 for x64-based Systems

  • Windows 11 Version 23H2 for ARM64-based Systems

  • Windows 10 Version 22H2 for 32-bit Systems

  • Windows 10 Version 22H2 for ARM64-based Systems

  • Windows 10 Version 22H2 for x64-based Systems

  • Windows 11 Version 22H2 for x64-based Systems

  • Windows 11 Version 22H2 for ARM64-based Systems

  • Windows 10 Version 21H2 for x64-based Systems

  • Windows 10 Version 21H2 for ARM64-based Systems

  • Windows 10 Version 21H2 for 32-bit Systems

  • Windows 11 version 21H2 for ARM64-based Systems

  • Windows 11 version 21H2 for x64-based Systems

  • Windows Server 2022 (Server Core installation)

  • Windows Server 2022

  • Windows Server 2019 (Server Core installation)

  • Windows Server 2019

  • Windows 10 Version 1809 for ARM64-based Systems

  • Windows 10 Version 1809 for x64-based Systems

  • Windows 10 Version 1809 for 32-bit Systems

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement