windows
-
హై రిస్క్‌లో విండోస్ యూజర్లు..
మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గుర్తించిన రెండు భద్రతా లోపాల గురించి యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని టార్గెట్ సిస్టమ్‌పై దాడి చేసే వ్యక్తి 'ఎలివేటెడ్ ప్రివిలేజెస్' పొందేందుకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.ఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జారీ చేసిన ఒక సూచనలో సమస్య గురించి కొన్ని వివరాలను పంచుకుంది. “వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ (VBS), విండోస్ బ్యాకప్‌కు మద్దతు ఇచ్చే విండోస్ ఆధారిత సిస్టమ్‌లలో ఈ లోపాలు ఉన్నాయి. దాడి చేసే వ్యక్తి గతంలో తొలగించిన సమస్యలను తిరిగి ప్రవేశపెట్టడానికి లేదా వీబీఎస్ రక్షణలను చేధించడానికి ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లో సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. కాబట్టి విండోస్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించిన అప్డేట్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచించింది.ప్రభావిత విండోస్ వెర్షన్లు ఇవే..Windows Server 2016 (Server Core installation)Windows Server 2016Windows 10 Version 1607 for x64-based SystemsWindows 10 Version 1607 for 32-bit SystemsWindows 10 for x64-based SystemsWindows 10 for 32-bit SystemsWindows 11 Version 24H2 for x64-based SystemsWindows 11 Version 24H2 for ARM64-based SystemsWindows Server 2022, 23H2 Edition (Server Core installation)Windows 11 Version 23H2 for x64-based SystemsWindows 11 Version 23H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for 32-bit SystemsWindows 10 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for x64-based SystemsWindows 10 Version 21H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for 32-bit SystemsWindows 11 version 21H2 for ARM64-based SystemsWindows 11 version 21H2 for x64-based SystemsWindows Server 2022 (Server Core installation)Windows Server 2022Windows Server 2019 (Server Core installation)Windows Server 2019Windows 10 Version 1809 for ARM64-based SystemsWindows 10 Version 1809 for x64-based SystemsWindows 10 Version 1809 for 32-bit Systems -
విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
అప్పుడు వై2కే బగ్‌తో అతలాకుతలం .. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్
20 ఏళ్ల క్రితం వై2కే బగ్ (దానికి మరో పేరు మిలీనియం బగ్) కంప్యూటర్లను గడగడలాడించింది. ఈ బగ్ వల్ల అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా ఇబ్బందులు తలెత్తాయో ఇవాళ (జులై 19) మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వై2కే బగ్ కథాకమామిషు ఏంటి? వై2కే బగ్‌కి క్రౌడ్ స్ట్రైక్‌కి ఏదైనా సంబంధం ఉందా?ప్రపంచంలోని అన్నీ దేశాల మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పర్సనల్ కంప్యూటర్లలోని విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ప్రత్యక్షమవుతుంది. పలుమార్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతున్నాయి. విండోస్‌లోని సాంకేతిక సమస్యలతో భారత్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బోర్డింగ్ పాస్‌లను సైతం చేతి రాత ఉపయోగించాల్సి వచ్చింది. అయితే విండోస్‌లోని తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌ను విజ్ఞప్తి చేస్తుండగా ..ఈ ప్రస్తుత పరిస్థితి 2000 ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన వై2కే బగ్ లాగా తీవ్ర ఆందోళనను రేకెత్తిచ్చింది. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు మైక్రోసాఫ్ట్ పరిష్కారం చూపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సమస్యలు అదుపులోకి వచ్చాయి. ఏంటి ఈ వై2కే బగ్?1960-1980లలో కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేసే సమయంలో డేటా స్టోరేజీని ఆదా చేసేందుకు కంప్యూటర్ ఇంజనీర్లు సంవత్సరానికి రెండు అంకెల ‘19’ కోడ్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31,1999 తర్వాత కొత్త ఏడాది అంటే 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత పోగ్రామర్లు వినియోగించిన కోడ్‌ను 00గా భావించి 2000 ఏడాదిగా కాకుండా 1900గా కంప్యూటర్లు అర్థం చేసుకున్నాయి.ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 100 సంవత్సరాలుగా తీసుకుని ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 00గా పరిగణించాయి. ఏడాది 2000 అయితే ప్రోగ్రామర్లు ఫిక్స్ చేసిన 19 కోడ్ కారణంగా 1900 తీసుకున్నాయి. ఫలితంగా ఆ ఏడాది టెక్నాలజీ రంగం అతలాకుతలమైంది. ఇతర రంగాలు సైతం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. బగ్‌ను పరిష్కరించేందుకు ప్రోగ్రాం అందుబాటులోకి రావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ పాత సంవత్సరం ముగిసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వై2కే కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం సాధారణమేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్రౌడ్ స్ట్రైక్ వర్సెస్ వై2కే బగ్ఆ వై2కే బగ్‌కి తాజా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో ఇబ్బందులకు ఏదైనా సంబంధం ఉందా అంటే లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రముఖ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలకు, పలు ప్రభుత్వ విభాగాలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. దాని ఫలితంగానే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్‌లోని ఇబ్బందులు తలెత్తి సిస్టమ్‌లు షట్‌డౌన్ , రీస్టార్ట్ అవుతున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలిసింది. హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడంతో మ్యానువల్ చెకింగ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ‘మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి’ అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.డెన్వర్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్‌లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది.ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లుఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ‘మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్‌గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం’ అని వివరణ ఇచ్చింది.VIDEO | Passengers stranded at Goa airport following a technical glitch with the check-in system. Further details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/XAYjtLRlpJ— Press Trust of India (@PTI_News) July 19, 2024pic.twitter.com/SI8mcURA1H— IndiGo (@IndiGo6E) July 19, 2024@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD— Sameen (@MarketWizarddd) July 19, 2024 -
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా పవన్ దావులూరి నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్‌మైండ్ డిపార్ట్మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్ హెడ్‌గా నియమించగా.. తాజాగా పవన్‌కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది. అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్‌కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు సైతం చోటు దక్కింది. ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. కాగ్నిజెంట్‌కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్వర్క్స్కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్కి శాంతను నారాయణ్‌లు సీఈఓలుగా రాణిస్తున్నారు. -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్‌లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్‌లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్‌లో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
విండోస్ బర్త్‌డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్‌లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్‌ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్‌లో ఐఫోన్ సపోర్ట్‌కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్‌తో కనెక్షన్‌కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్‌కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తే ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్‌తో సెటప్‌ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్‌బార్‌లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్‌ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
విండోస్ యూజర్లకు అలెర్ట్..! అవి కచ్చితంగా కావాల్సిందే..
మనలో చాలా మంది ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతుంటాం. గత ఏడాది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. విండోస్ 10ను వాడే యూజర్లు ఉచితంగా విండోస్ 11కు ఆప్ గ్రేడ్ కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ చిన్న మెలిక పెట్టింది. కచ్చితంగా కావాల్సిందే..! మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ ఎడిషన్‌ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్ ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే ప్రారంభించవచ్చును. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, పూర్తిగా లెవల్లో విండోస్ 11 ప్రొను వినియోగించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ అకౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పటికే విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతున్నవారు నేరుగా మైక్రోస్టాఫ్ 11 ప్రొ ఎడిషన్‌లోకి లాగిన్ అవవచ్చు. అంతేకాకుండా వారు ఇప్పటికే ఆ అకౌంట్లో నిలువు చేసుకున్న డాటాను ఈ వెర్షన్లో వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని నెలల్లో విండోస్ 11 ప్రోని విడుదల చేయనుంది. -
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరపోయే శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్, పీసీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలలోని విండోస్ ప్లాట్‌ఫామ్ లో కూడా ఎటువంటి చింత లేకుండా గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్ తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు విండోస్ ప్లాట్‌ఫామ్ మీద గేమ్స్ ఆడాలంటే వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ లాగా ఒకే దగ్గర కావు, దీంతో గేమింగ్ ప్రియులు కొంత అసౌకర్యానికి గురి అయ్యేవారు. గేమింగ్ లవర్స్ ఆసక్తిని గమనించిన గూగుల్ విండోస్ ప్లాట్‌ఫామ్ లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్‌ఫామ్ తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. గేమ్ అవార్డ్స్ 2021 సందర్భంగా హోస్ట్ జియోఫ్ కీగ్లీ ప్రధాన క్రాస్ ప్లాట్‌ఫామ్ ప్రకటన చేశారు. గూగుల్ నిర్మించిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ విండోస్ ప్లాట్‌ఫారంపై కూడా లభ్యం కానుంది. దీంతో గేమింగ్ లవర్స్ తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ అడుకోవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లేలోని గేమ్స్ గురుంచి గూగుల్ ప్రొడక్ట్ డైరెక్టర్ గ్రెగ్ హార్ట్రెల్ ది వెర్జ్ తో మాట్లాడుతూ.. గెమర్స్ మరిన్ని పరికరాల్లో గూగుల్ ప్లే గేమ్స్ పొందగలరు. వారు త్వరలో ఫోన్, టాబ్లెట్, క్రోమ్ బుక్, విండోస్ పీసీ మధ్య ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్స్ ఎంజాయ్ చేయగలరు అని అన్నారు. లాంఛ్ తేదీ గురుంచి ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. (చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక) -
విండోస్ యూజర్లకు షాక్ ! మైక్రోసాఫ్ట్ కీలక సూచన
విండోస్ ప్రింట్ స్పూలర్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్ హెచ్చిరించింది. ప్రింట్ స్పూలర్ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సెక్యూరిటీ ప్యాచ్ ‘ప్రింట్ స్పూలర్ కోడ్‌కి సంబంధించిన లోపాల కారణంగా విండోస్‌కి సంబంధించిన అన్ని వెర్షన్లకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోకి వాళ్లు ప్రింట్ స్పూలర్‌ని డిసేబుల్ చేయడం మంచిదని సూచించింది. -
విండోస్ 11 రాకతో స్కైప్ కథ ముగిసినట్టేనా..!
మైక్రోసాఫ్ట్ కంపెనీ తదుపరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్షన్ విండోస్ 11 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మరింత సరళతరమైన డిజైన్‌తో పాటు, ఆండ్రాయిడ్ యాప్స్ విండోస్‌లో పనిచేసేలా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది మైక్రోసాఫ్ట్. కాగా విండోస్ 11 రాకతో ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ స్కేప్‌కు ఎండ్ కార్డ్ పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో బై డిఫాల్ట్‌గా వీడియో కాలింగ్ రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో స్కేప్ కనుమరుగయ్యే అవకాశాలున్నాయిని ఐరిష్ & సండే ఇండిపెండెంట్ టెక్ ఎడిటర్ అడ్రియన్ వెక్లర్ పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సుమారు 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్కేప్ కొనుగోలు అతిపెద్ద డీల్‌గా నిలిచింది. గత సెప్టెంబరులో, మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్.. జూమ్, బ్లూజీన్స్ టీమ్స్ ,స్కైప్ ఉపయోగించి వీడియో సమావేశాలను తన చాట్ ఫీచర్లో తెస్తున్నట్లు ప్రకటించగా, అక్టోబర్‌లో, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ గేనోర్ మాట్లాడుతూ..స్కైప్ మరింత విస్తరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసిన, వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా కొన్ని రోజుల్లోనే గూగుల్ మీట్, జూమ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలు వీడియో కాలింగ్ ఫీచర్, మీటింగ్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్కేప్‌పై ఉన్న ప్రజాదరణ కాస్త తగ్గిపోయింది. బహుశా మైక్రోసాఫ్ట్ ఈ కారణం చేతనో స్కేప్‌కు ఎండ్‌కార్డ్ పలకాలని భావిస్తోందని టెక్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. స్కైప్ కు అంతా మేలు చేయలే...! కరోనా మహమ్యారితో ప్రముఖ వీడియో కాలింగ్, మీటింగ్ యాప్ జూమ్ అత్యంత ఆదరణ ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో స్కైప్‌లో ఏలాంటి గ్రోత్ కనిపించలేదు. సుమారు 70 శాతం ప్రజలు స్కైప్ నుంచి తప్పుకున్నారు. ప్లే స్టోర్‌లో స్కైప్ యాప్ ఆప్షనల్‌గా ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసే నాథుడే లేకుండా అయ్యాడు. చదవండి: గూగుల్ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్‌లో..! -
అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వెర్షన్ విండోస్ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్‌కి సంబంధించి ఇది కొత్త శకమని, రాబోయే దశాబ్దం .. అంతకు మించిన కాలానికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..!
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ నుంచి రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ను ఫ్రీ అప్‌గ్రేడ్‌గా చేసుకోవచ్చునని ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం విండోస్ 10 యూజర్లకే కాకుండా విండోస్7, విండోస్ 8.1 ఆపరేటింగ్ యూజర్లకు కూడా ఉచితంగా విండోస్ 11ను అప్‌గ్రేడ్ చేసుకొవచ్చునని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్ 8 వాడుతున్న యూజర్లు మాత్రం డైరక్ట్‌గా ఆప్‌గ్రేడ్‌ను పొందలేరు. ఈ లేటేస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎక్కువ మంది యూజర్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లనుంచి దృష్టిమరల్చడానికి ఫ్రీ ఆప్‌గ్రేడ్‌ను మైక్రోసాఫ్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్ భవిష్యత్తులో పట్టించుకపోవచ్చును. అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ స్టాట్‌కౌంటర్ అందించిన డేటా ప్రకారం..విండోస్ 10 తర్వాత విండోస్ 7 ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నిలిచింది. విండోస్ 7 వోఎస్ మే 2021 నాటికి మార్కెట్ వాటాలో 15.52 శాతం. విండోస్ 8.1 తరువాత 3.44 శాతం వాటాగా ఉంది. కాగా విండోస్ 8 మార్కెట్లో 1.27 శాతం వాటా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను జూన్ 24 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారికి వెంటనే ఆప్‌గ్రేడ్ ఇచ్చే విషయంపై అస్పష్టత నెలకొంది. చదవండి: Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల -
తీగ లాగితే ‘కిటికీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటికి తలుపులు ఎంత అవసరమో కిటికీలూ అంతే. అయితే ఈ మధ్యకాలంలో చెక్కతోనో, స్టీల్‌తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది. ఎన్నో వెరైటీలు, డిజైన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వీటి వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ►విండో బ్లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రావు. వీటికి పరదా అవసరం ఉండదు. లివింగ్ రూమ్‌తో పాటు బెడ్ రూములో అందమైన ప్రకృతి చిత్రాలు ఉన్న బ్లైండ్స్ను ఏర్పాటు చేసుకుంటే ఉదయం లేచి వాటిని చూస్తే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాదు బయటి వారికి లోపల ఏముందో కనిపించదు. మనం బయట ఏం జరుగుతుందో చూడాలనుకుంటే బ్లైండ్స్కు ఉన్న తాడు లాగితే సరిపోతుంది. ఇందులో వర్టికల్, రోలర్, చిక్, ఉడెన్, ఫొటో, జీబ్రా వంటి ఎన్నో రకాలుంటాయి. ఠి చీర్ బ్లైండ్స్ సహజసిద్దమైన బొంగు కర్రలతో చేస్తారు. ఇవి తలుపు మాదిరిగా కనిపిస్తుంటాయి. ధర చ.అ.కు రూ.200–350 వరకు ఉంటుంది. ఠి వర్టికల్ బ్లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. ధర చ.అ.కు రూ.90–150 వరకు ఉంటుంది. ఠి గాలి, వెలుతురు ధారాలంగా రావాలనుకునేవారు జీబ్రా బ్లైండ్స్ కరెక్ట్. చూడ్డానికి చిప్స్ మాదిరిగా ఉండే ఈ బ్లైండ్స్ పైనుంచి కిందికి తెరుచుకుంటాయి. ధర చ.అ.కు రూ.180–280 ఉంటుంది. ఠి రోలర్ బ్లైండ్స్ అచ్చం పరదా మాదిరిగా ఉంటుంది. తాడు లాగుతుంటే ముడుచుకుంటూ పైకి లేస్తుంది. ధర చ.అ.కు రూ.130–300 వరకు ఉంటుంది. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
న్యూఢిల్లీ: కొన్ని నిర్థారిత ప్లాట్‌ఫామ్స్‌కు రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ‘నోకియా ఎస్ 40’లో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్‌లో కూడా వాట్సప్ రాదు. భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఐఓఎస్ సపోర్ట్ చేయబోదని ఇంతకు వాట్సప్ తన బ్లాగ్‌లో పేర్కొంది. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్ 4.0 ప్లస్, ఐఓఎస్ 7 ప్లస్ లేదా విండోస్ ఫోన్ 8.1 ప్లస్‌కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.3 కంటే పాత ఓఎస్‌లో వాట్సప్ పనిచేయదు. విండోస్ ఫోన్ 7, ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6, నోకియా సింబియన్ ఎస్ 60 వెర్షన్లలో కూడా వాట్సప్ రాదు. ఐఓఎస్ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్.. ఐఓఎస్ 7 ఆధారంగా నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓఎస్ 4.0 ప్లస్, ఐఫోన్ రన్నింగ్ ఐఓఎస్ 8 ప్లస్, విండోస్ ఫోన్ 8.1 ప్లస్, జియో ఫోన్, జియో ఫోన్ 2లకు వాట్సప్ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదని వాట్సప్ వెల్లడించింది. చాట్ హిస్టరీని ఈ-మెయిల్‌కు పంపుకోవచ్చని సూచించింది. -
తీ ఇన్ వన్ స్మార్ట్ విండో!
మీ ఇంట్లోని కిటికీలు ఒకేసారి మూడు పనులు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వీరు అభివృద్ధి చేసిన స్మార్ట్ కిటికీలు ఒకవైపు ఎండను, ఇంకోవైపు వేడిని నియంత్రిస్తూనే మరోవైపు హానికారక సూక్ష్మజీవులను చంపేయగలవు. విమానాలు మొదలుకొని ఆసుపత్రులు, బస్సులు, రైళ్లలో ఈ కిటికీలను వాడితే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించగలమనీ, అదే సమయంలో ఎండ, వేడిని నియంత్రించడం ద్వారా బోలెడంత డబ్బును కూడా ఆదా చేయగలమని అంటున్నారు షియా అనే శాస్త్రవేత్త. టంగ్స్టన్ ట్రయాక్సైడ్ అనే ప్రత్యేక పదార్థం వాడటం ద్వారా ఇది సాధ్యమవుతోందని, విద్యుత్తు ఛార్జ్ లేదా రసాయనాల ద్వారా ఈ పదార్థం తక్కువ సమయంలో కాంతిని ప్రసారం చే యడం లేదా అడ్డుకునే స్థితికి మారగలదని చెప్పారు. అదే సమయంలో సూర్యరశ్మిలోని పరారుణ కాంతికిరణాలను వేడిగా మార్చడం ద్వారా భవనం లోపలి భాగపు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చునని వివరించారు. టంగ్స్టన్ ట్రయాక్సైడ్కు నానోస్థాయి బంగారు కణాలను చేర్చడం ద్వారా వేడిని గ్రహించవచ్చునని చెప్పారు. ఈ వేడి వల్ల కిటికీ ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు జీవించలేవని అన్నారు. -
కిటికీలతో కరెంటు.. చల్లదనం
ఇంటి కిటికీలు మీక్కావాల్సిన విద్యుత్తును తయారు చేయడంతోపాటు ఇల్లంతా చల్లగా ఉంచితే ఎలా ఉంటుంది? అబ్బో అద్భుతంగా ఉంటుంది అంటున్నారా? అయితే మీ ఆశలు త్వరలోనే తీరనున్నాయి. చైనా శాస్త్రవేత్తలు కొందరు సూర్యరశ్మిలోని కొన్ని రకాల కాంతులను అడ్డుకునే, పారదర్శకమైన సోలార్ సెల్స్‌ను తయారు చేయడం దీనికి కారణం. సూర్యరశ్మిలో అతినీల లోహిత, పరారుణ కాంతి కూడా ఉంటుందని మనకు తెలుసు అయితే ఇవన్నీ విద్యుదుత్పత్తికి పనికి రావు. ఈ రకమైన కాంతిని మళ్లీ వాతావరణంలోకి పంపించేస్తే ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎక్కువ కాదు. చైనా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ప్లాస్టిక్‌లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది అటు సూర్యుడి తాపం లోనికి చొరబడకుండా అడ్డుకుంటూనే.. ఇంకోవైపు నిర్దిష్ట తరంగదైర్ఘ్యమున్న కాంతి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక ప్లాస్టిక్‌తో తయారైన కిటికీలు, సోలార్ ప్యానెల్స్‌ను వాడటం ద్వారా ఇళ్లలో విద్యుత్తు ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి ప్లాస్టిక్ సోలార్ సెల్స్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హిన్ లాప్ యిప్ చెప్పారు. చౌకగా తయారు చేసుకోగలగడం, విస్తృత వాడకానికి అవకాశం ఉండటం ఈ ప్లాస్టిక్ సోలార్స్ సెల్స్ సానుకూల అంశాలని వివరించారు. -
ఆ మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్స్ బంద్
శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ ఫోన్ 7.5, విండోస్ ఫోన్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ కూడా పనిచేయదు. విండోస్ 8.1, విండోస్ 10 మొబైళ్లకు మాత్రం పుష్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. -
ఈ కిటికీలతో బోలెడంత కరెంటు...
ఇంటి కిటికీలు వెలుతురుతోపాటు కరెంటు కూడా అందిస్తే బాగుంటుందని చాలాకాలంగా అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు తీరే రోజు దగ్గరకు వచ్చేసింది. అమెరికాలోకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల బందం ఇలాంటి సరికొత్త కిటికీలను అభివద్ధి చేసింది మరి! మార్కెట్లో ఇప్పటికే కొన్ని పారదర్శక సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా తాము చేయగలిగామని ఈ ప్రాజెక్టుకుకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త విక్టర్ క్లిమోవ్ తెలిపారు. రెండు పొరలుగా ఉండే ఈ కొత్త రకం సోలార్ ప్యానెల్ సాధారణ ప్యానెల్స్ విద్యుత్తు ఉత్పత్తి చేయలేని కాంతులనూ వాడుకోగలగడం విశేషం. కిటికీలోని రెండు పొరలు వేర్వేరు రంగులను శోషించుకోవడమే కాకుండా.. ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ రంగులను కిటికీకి ఒకవైపున ఉండే చిన్నసైజు సోలార్ ప్యానెల్స్వైపు మళ్లిస్తారు. దీంతో అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మోతాదు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అంచనా. -
ఇంటి అందం రెట్టింపు
విపణిలోకి యూపీవీసీ తలుపులు, కిటికీలు సాక్షి, హైదరాబాద్ ఇంటికెవరొచ్చినా వారికి స్వాగతం పలికేవి తలుపులే. అందుకే అవి ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపు అవుతుంది. అయితే గతంలో తలుపులు, కిటికీలను చెక్క, కలపతో చేయించేవారు. వీటి మన్నిక కొన్నేళ్లే ఉంటుంది. వీటి స్థానంలో ఇప్పుడు విపణిలోకి యూవీవీసీ తలుపులు, కిటికీలు వచ్చేశాయి. ధరలు కూడా అందుబాటులో ఉండటం, లెక్కలేనన్ని రంగులూ అందుబాటులో ఉండటం, మన్నిక విషయంలోనూ నాణ్యంగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. యూపీవీసీ అంటే అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్. దేశవ్యాప్తంగా తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటీష్ ప్రమాణాల్లో తేలింది. ⇔ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటి M? లు 300 పీఏ వరకు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ⇔ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్ధాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్ధాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్‌ను ఆదా అవుతుంది. ⇔ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అందే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్కూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని చేధించడం అంత సులువు కాదు. బొమ్మలు భలే సాక్షి, హైదరాబాద్: ఇంట్లో గోడలకు వేలాడదీసే బొమ్మలు మన అభిరుచులను అద్దం పడతాయి. అందుకే ఎక్కడి బొమ్మలు అక్కడే వేయాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అని పెదవి విరుస్తారు. ⇔ వంట గదిలో తాజా కనిపించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా అంతగా రుచించవు. ⇔ హాల్లో ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను వేలాడదీయవచ్చు. ⇔ ఆఫీసుల్లో వెయింట్ హాల్లో అయితే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్‌లను పెట్టుకోవచ్చు. ⇔ ఇంటికి వేసే రంగులూ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంత కలుగచేస్తాయి. ముదురు రంగులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. -
మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం
న్యూయార్క్ః సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లతో ప్రవేశ పెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.. సంస్థకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. లక్షల మంది యూజర్ల అభిప్రాయాలతో తీర్చి దిద్దామని, అత్యంత సురక్షితమైన వెర్షన్ అంటూ గత యేడాది మార్కెట్లో ప్రవేశ పెట్టిన కంపెనీ.. యూజర్లను అప్ గ్రేడ్ చేసుకోమంటూ తొందర పెట్టడం తలకు చుట్టుకుంది. పాత వెర్షన్ ఓ ఎస్ లను వాడుతున్న వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమంటూ నోటీసులు పంపించడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ మహిళ కోర్టుకెక్కడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీపై పెట్టిన కేసులో విజయం సాధించింది. మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్నెల్లలో 30 కోట్లమంది వరకూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకున్నా... అక్కడితో ఆగని మైక్రోసాఫ్ట్.. ఆ సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పాత ఓ ఎస్ లను వాడుతున్నవారికి నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ తమను బలవంత పెడుతోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా... కొందరు తమ ప్రమేయం లేకుండా విండోస్ 10 ఇన్ స్టాల్ అయిపోతోందంటూ మండిపడ్డారు. అదే ఆరోపణలతో కోర్టు కెక్కిన మహిళ కేసును కోర్టు విచారించింది. తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది. విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
విండోస్ డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్
న్యూయార్క్: వాట్సాప్ అంటే ఇప్పటిదాకా మొబైల్ ఫోన్లకే పరిమితం. ఇకపై విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఫేస్బుక్. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. విండోస్, మ్యాక్ డెస్క్‌టాప్‌లో ఏ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ ఈ యాప్‌తో వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుకోవచ్చు. విండోస్ 8, ఆపై ఓఎస్‌లకు మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. మ్యాక్ 10.9, ఆపై ఓఎస్ వినియోగదారులు మాత్రమే దీనిని వినియోగించుకోవచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి, అందులో కనిపించే క్యూఆర్ కోడ్‌ను మన స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా డెస్క్టాప్పై వాట్స్‌యాప్ దర్శనమిస్తుంది. ఎంచక్కా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడమే. -
యూపీవీసీతో లుక్కే వేరు!
♦ ఇంటి అందాన్ని రెట్టింపు చేసేది సింహద్వారమే ♦ దర తక్కువ, మన్నికెక్కువ దేశంలో తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. సాక్షి, హైదరాబాద్: ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో యూపీవీసీ తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్‌ను సంక్షిప్తంగా యూపీవీసీ అంటాం. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటిష్ ప్రమాణాల్లో తేలింది. ♦ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీ లు 300 పీఏ వరకు నీటిలో తడిసినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తుప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వే యాల్సిన అవసరం కూడా లేదు. ♦ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు త గ్గుతుంది. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ♦ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అంటే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్క్రూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని ఛేదించడం అంత సులువు కాదు. -
అలా లేకుంటే విమానాలు కూలిపోతాయి
ఒక వస్తువు నిర్మాణానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకే, ప్రతిపనికి భవిష్యత్ అంచనాలు, గతంలోని పరాభావాలు, ప్రస్తుత అనుభవాలు మేళవించుకొని ఒక వస్తువును రూపొందిస్తారు. అది చూసేందుకు తేలికగా అనిపించినా, పెద్దగా ఆలోచింపలేకపోయినా అసలు కథ తెలిస్తే మాత్రం అవునా.. అలాగా అని ఆసక్తిగా అనుకోవాల్సిందే. సాధారణంగా మనం విమానాలు చూస్తుంటాం. కొందరికైతే వాటిలో ప్రయాణించిన అనుభవం కూడా ఉండి ఉండేఉంటుంది. ఆ సమయంలో గమనించారో లేదో ఏ విమానానికి చూసిన దాని కిటికీలు గుండ్రంగా ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఆలోచించారా.. అలా ఉండటం వల్ల మతలబు ఏమిటి? ఎప్పటి నుంచి వాటిని గుండ్రంగా తయారుచేయడం మొదలుపెట్టారు? వాటిని చతురస్రాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, త్రిభుజాకారంలోనో ఎందుకు తయారు చేయలేదు? అని పరిశీలిస్తే.. దాని వెనుక అసలు కథ తెలిసింది. అది 1950. అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా ట్రెండింగ్. ఇవి మిగతా విమానాల కన్నా వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతోపాటు ఎంతో ఒత్తిడినితట్టుకోగలవి. కానీ,దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. అయితే, అనుహ్యంగా ఇదే జెట్ లైనర్ విమానాలు 1953లో కూలిపోయి 56 మంది ప్రాణాలు విడిచారు. ఇలా ఎందుకు జరిగి ఉంటుందని విచారణచేస్తే ఆ విమాన కిటికీలే సమస్య అని తెలిసింది. సాధారణంగా చతురస్రాకరంలో ఉంటే వాటికి కోణాలు ఉంటాయిని, ఒక్కోకోణం ఒక్కో బలహీనత ఉండి అక్కడ లోపలికి గాలి చొచ్చుకొచ్చి విండో పగిలిపోయి అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉండి విమానాన్ని కూలిపోయేలే చేస్తుందని వారు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి విమానాల కిటికీలు గుండ్రంగా రూపొందించడం మొదలు పెట్టారు. అలా ఉండటం వల్ల ఒత్తిడి అనేది ఒక చోట కేంద్రీకృతం కాకుండా విండో చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. తక్కువ ఒత్తిడి మాత్రమే విండోస్‌పై పడి విమానాలు సురక్షితంగా ఉంటాయి. -
ఇంట్లో దుర్వాసన తగ్గాలంటే..
ఇంటిప్స్ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.రాత్రిపూట కార్పెట్‌పై బేకింగ్ సోడా చల్లి, మరుసటి రోజు ఉదయం వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచాలి.బకెట్ వేడి నీళ్లలో కప్పు అమోనియా కలిపి, ఆ నీళ్లతో ఫ్లోర్ తుడవాలి.అమోనియా కలిపిన వేడి నీటిలో డోర్‌మ్యాట్స్ నానబెట్టి, ఉతకాలి. ఫ్లోర్ తడి లేకుండా జాగ్రత్తపడాలి.ఫర్నీచర్, కార్పెట్స్, కర్టెన్స్ శుభ్రంగా ఉంచాలి. కిచెన్ సింక్‌లో క్యారట్, ఉల్లి, బంగాళదుంప తొక్కలు మిగిలిపోతే దుర్వాసన వస్తుంది. కొద్దిగా ఐస్‌ను గ్రైండ్ చేసి వేయాలి. దాని మీద బొరాక్స్ పౌడర్‌ను చల్లి, పై నుంచి నీళ్లు పోయాలి. సింక్‌లో నీళ్లు పోయే పైప్ దగ్గర మూత వేసి, దాంట్లో ఒక అంగుళం మేర వేడి నీళ్లు పోయాలి. దాంట్లో పిడికెడు బేకింగ్ సోడా వేయాలి. తర్వాత ఆ నీటిని వదిలేయాలి. వేడినీళ్లు, బేకింగ్ సోడా వల్ల సింక్‌లో దుర్వాసన వదులుతుంది. ఈ జాగ్రత్తలు ఇంటిని దుర్వాసన నుంచి విముక్తి చేస్తాయి. -
ఈ పల్లె... పక్షుల స్వర్గం!
ఒక ఉదయాన... కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు... చెట్టు కొమ్మ మీద పిట్ట పాట వినక ఎన్ని రోజులవుతుందో! ఒక సాయంత్రాన... ఆకాశ దేశాన బారులు బారులుగా ప్రయాణించే పక్షుల గుంపును చూసి ఎన్ని రోజులవుతుందో! మాయమైపోతుంది. మనిషిలోని మనిషి మాత్రమే కాదు... పక్షుల జాడ కూడా! అందుకే ఆ పక్షులను తన గుండెల్లో పెట్టుకోవాలనుకుంది కొక్కరేబేలూర్. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకాలో ఉన్న ఈ చిన్న ఊళ్లోకి అడుగుపెడితే... చెట్లకు వేలాడే పక్షిగూళ్లు స్వాగతతోరణాల్లాగ కనిపిస్తాయి. పక్షులను ప్రేమించమని మౌనంగా చెబుతాయి. ప్రతి చెట్టుకూ పక్షి గూళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మే నెలలోనైతే చిట్టి చిట్టి పక్షి పిల్లలతో వాతావరణం అల్లరి అల్లరిగా ఉంటుంది. పక్షులను పక్షుల్లా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. పక్షులు కూడా గ్రామస్థులకు బాగా అలవాటుపడిపోయాయి. వాటికి ఎంత దగ్గరికి వెళ్లినా, భయంతో పారిపోకుండా కళ్లలో కళ్లు పెట్టి ప్రేమగా చూస్తాయి. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన పక్షుల్లో పెలికాన్, బ్లాక్ ఐబిస్, గ్రే హెరాన్, ఇండియన్ పాండ్ హెరాన్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సెప్టెంబర్‌లో గ్రామంలోకి ప్రవేశించే పక్షులు మే తరువాత వేరే చోటుకి వలస వెళతాయి. ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి వలస వచ్చే ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా తమ అదృష్టంగా కూడా భావిస్తారు ఆ గ్రామస్థులు. చెట్ల మీద నివాసముండే పక్షులు అప్పుడప్పుడూ దగ్గరలోని పంటపొలాలపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటాయి. దీనివల్ల నష్టం వాటిల్లినా... వాటిని తరిమికొట్టడం, హింసాత్మక చర్యలకు దిగడంలాంటివేమీ చేయరు గ్రామస్థులు. పక్షులపై వారి ప్రేమను ప్రభుత్వం సైతం అర్థం చేసుకుంది. అందుకే పక్షుల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ‘‘ఈ పక్షులను చూస్తుంటే సొంత బిడ్డల్ని చూసినట్లుగా అనిపిస్తుంది’’ అంటుంది గ్రామానికి చెందిన ఒక గృహిణి. కొందరైతే చనిపోయిన తమ ఆత్మీయులను ఈ పక్షుల్లో చూసుకుంటా మని చెబుతున్నారు. ‘‘మీది ఏ ఊరు? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే, మా ఊరు పేరు చెబితే రాష్ట్రంలో గుర్తు పట్టనివారు ఉండరు. పైగా మా ఊరి ఔన్నత్యం గురించి పొగుడుతుంటారు కూడా’’ అంటాడు గ్రామానికి చెందిన కుమార్ అనే విద్యార్థి. ‘‘ఆడపిల్ల ప్రసవానికి పుట్టింటికి వెళ్లినట్లు ఈ పక్షులు మా ఊరికి వస్తాయి’’ అని గర్వంగా చెబుతాడు యోగేశ్ అనే యువకుడు. కొక్కరేబేలూర్ చేస్తున్న పుణ్యం ఊరకే పోలేదు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు ఈ గ్రామం ‘రోల్ మోడల్’గా మారింది. ప్రభుత్వం కూడా పక్షుల సంక్షేమానికి ప్రత్యేకంగా గ్రాంటు విడుదల చేస్తోంది. పక్షులను వాటి మానాన వాటిని వదిలేయడం కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రామస్థులు. ఏదైనా పక్షి అనారోగ్యంతో కనిపించినా, గాయపడినా తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కొందరైతే చేపపిల్లలను ప్రేమగా పక్షుల నోటికి అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఊరు దాటిన తరువాత ఒక్క చెట్టు మీద కూడా పక్షుల గూళ్లు కనిపించవు. దీన్ని బట్టి పక్షులకు, ఆ ఊరికి ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది. ‘‘పక్షులు ఈ ఊరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది? ఈ ఊరికే ఎందుకు రావడం మొదలైంది?’’లాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలేవీ దొరకక పోవచ్చు. కాని వాటి గురించి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- ‘‘పక్షులు కొలువైన చోట ఊరికి మంచి జరుగుతుంది’’ అని! -
త్రీమంకీస్ - 60
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 60 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఏమిటా విండోస్?’’ గోడకి ఆనించి ఉన్న కిటికీలని చూసి మర్కట్ అడిగాడు. ‘‘అప్పుడప్పుడూ విండో షాపింగ్‌కి వెళ్ళొస్తూంటాను. కుక్క తోకని కూడా కాలు అనుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?’’ ‘‘ఐదు’’ బుష్‌ని చూస్తూ వేళ్ళతో లెక్కపెట్టుకుని మర్కట్ జవాబు చెప్పాడు. ‘‘తప్పు. నాలుగే. తోకని కాలని అనుకున్నంత మాత్రాన అది కాలు కాదు. ఇంకోటి అడగనా?’’ వైతరణి నవ్వుతూ అడిగింది. ‘‘ఒద్దు. ఒకే కుక్క చేత రెండుసార్లు కరిపించుకునేవాడు మూర్ఖుడు అవుతాడు.’’ వాళ్ళిద్దరూ దుప్పటి కిందకి చేరాక వైతరణి తన గౌన్ని విప్పి మంచం కింద పడేస్తూ అడిగింది. ‘‘లైట్లోనే ఇష్టం అన్నాగా? చెప్పండి. మనకి పుట్టే పిల్లల బంగారు భవిష్యత్‌కోసం ఏం చేద్దాం?’’ ‘‘టీ అమ్మే వాడిలా పెంచి మోడీని చేయచ్చు. లేదా ఐఐటిలో చదివించి కేజ్రీవాల్‌ని చేయచ్చు’’ మర్కట్ చెప్పాడు. ‘‘విదేశాల్లో మాత్రం చదివించద్దండి’’ ఆలోచించి చెప్పింది. ‘‘ఏం?’’ ‘‘రాహుల్ గాంధీలా తయారవుతాడు.’’ 19 ‘‘మీరు అసలు ఇంగ్లీష్ మందులే వాడరా?’’ వానర్ అడిగాడు. ‘‘ఊహూ. ఇంగ్లీష్ మందు తీసుకుంటే రెండుసార్లు రికవర్ అవాలి. ఓసారి జబ్బు నించి. ఇంకోసారి ఆ మందు నించి.’’ ‘‘మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు లేదా? అది మంచిదని డాక్టర్లు చెప్తారే?’’ వానర్ అడిగాడు. ‘‘ఏది తిని ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తామో టెక్నికల్‌గా అదే బ్రేక్‌ఫాస్ట్. అందువల్ల ప్రపంచంలో బ్రేక్‌ఫాస్ట్ తినని వారే ఉండరు’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘ఈ రాత్రి వంట నేను చేయనా? లేక మీరు చేస్తారా?’’ వానర్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడే మర్చిపోయావా? నాన్ సెక్స్‌వల్ ప్రేమలో నంబర్ నైన్, కుక్ ఏ మీల్ టుగెదర్. కలిసి వంట చేయడం కూడా ప్రేమని వ్యక్తం చేసే ఓ పద్ధతి’’ డాక్టర్ మూలిక చెప్పింది. వానర్ ఫ్రిజ్ తెరిచి కూరలు ఉంచే క్రిస్పర్ బాక్స్‌ని తెరిచి చూశాడు. ‘‘అందులో అనేక రకాల ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, భస్మాలు కనిపించాయి. వాటిని చూసి చెప్పాడు. ‘‘లేవు. నేను వెళ్ళి తెస్తాను.’’ ‘‘ఏం లేవు?’’ మూలిక అడిగింది. ‘‘వంకాయలు. ఉల్లిపాయలు. ఉల్లి కారం పెట్టిన వంకాయ కూర తినాలని ఉంది.’’ ‘‘ఉల్లిపాయా! వంకాయా!’’ మూలిక పక్కలో బాంబ్ పడ్డట్లుగా అరిచింది. ‘‘ఏం?’’ ‘‘వంకాయ సర్వరోగప్రదాయిని అని వినలేదా? దాన్ని చస్తే తినకూడదు. తింటే త్వరగా చస్తాం అని ధన్వంతరి రాశాడు. ఉల్లిపాయ గాలే అసలు మనకి తగలకూడదు అని చరకుడు రాశాడు. ఈ రెండూ ఆయుర్వేదంలో నిషిద్ధం.’’ ‘‘పోనీ దొండకాయ, ఉల్లి కారం కూర?’’ ‘‘దొండ పరమ నిషిద్ధం. వెనకటికి ఒకడికి దొండ పాదు కింద స్నానం చేస్తే బుద్ధి మాంద్యం పట్టుకుందని చరకసంహితలో రాసుంది. అది మనిషిని నిస్తేజంగా మారుస్తుంది.’’ ‘‘వంకాయ, దొండకాయలకే ఉల్లి కారం వేసి వండితే బావుంటుంది. ఒక్కసారికేం కాదు.’’ ‘‘ఊహూ. అవి రెండూ వాతపిత్త దోషాలని కలిగిస్తాయి.’’ ‘‘పోనీ చామదుంపలు తెస్తాను. వేయించి ఇంత ధనియాల పొడి, ఉప్పూ, కారం చల్లి...’’ ‘‘నో. నో. నో. నో... దుంపకూరలు కూడా నిషిద్ధం. నేల అడుగున పండే వాటిలో ఒక్క వేరుశెనగ మాత్రమే శ్రేష్టం. మిగిలినవన్నీ వర్జింప తగ్గవి. అవన్నీ వాతాన్ని కలిగించేవి.’’ ‘‘కాని రాముడు అరణ్యవాసంలో కందమూలాలనే తిని జీవించాడు కదా?’’ ‘‘రాముడు దేవుడు. నువ్వు మనిషి.’’ వానర్ కొద్దిసేపు ఆలోచించి తనకి ఇష్టమైన కూరలని, వాటిని వండే విధానాలని చెప్పాడు. ఆమె వేటికి వాతపిత్తకఫ దోషాలో చెప్పి ఖండించేసింది. ‘‘బెండకాయ?’’ ‘‘అది కొంత దాకా ఓకే.’’ ‘‘సరే. బెండకాయ, వేరుశెనగపప్పు కలిపి వేపుడు చేస్తే?’’ ‘‘ఈరోజు చతుర్దశి. చతుర్దశి నాడు బెండకాయ తింటే ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది అని ఆయుర్వేద రత్నావళిలో రాశారు.’’ ‘‘పోనీ సొరకాయలో పాలు పోసి వండుదామా?’’ వానర్ ఆశగా అడిగాడు. ‘‘రాత్రి పూట సొరకాయ నిషిద్ధం. జలుబు చేస్తుంది.’’ ‘‘సరే. ఈరోజు తిథికి, ఈ వారానికి ఏవి సూటబుల్?’’ బలహీనంగా అడిగాడు. ‘‘తోటకూర పొడికూర, బచ్చలి పులుసు, గంగబాయిల కూర పచ్చడి.’’ ‘‘అదేమిటి? ఆక్కూరతో పచ్చడా? ఎక్కడా వినలేదే?’’ ‘‘చేస్తాగా. తిని చూసి మాట్లాడు. ముందుగా ఆకుకూరలని ఇసక పోయేలా బాగా కడిగి కాడల నించి ఆకులని వేరు చేయి... నా వంటంటే అంతా పడి చస్తారు.’’ (కోక్ ఫ్రిజ్‌లో కాకుండా టాయ్లెట్లో ఎందుకు ఉంది?) -
కొత్తసరుకు
ఐబాల్ ఆండీ ఫ్రిస్బీ... దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐబాల్ తాజాగా ఫ్రిస్బీ, స్టాలియన్ పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రిస్బీ రూ.5799, స్టాలియన్ రూ.6999లకు ఈకామర్స్ సైట్ల ద్వారా లభిస్తున్నాయి. ఫ్రిస్బీ ఫీచర్ల విషయానికొస్తే... ఇది లేటెస్ట్ ఓఎస్ కిట్‌క్యాట్‌తో నడుస్తుంది. నాలుగు అంగుళాల స్క్రీన్సైజున్న ఈ ఫోన్లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఒక జీబీ ర్యామ్, 4జీబీల ప్రధాన మెమరీ ఉన్నాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ, సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 0.3 ఎంపీ మాత్రమే. బ్యాటరీ సామర్థ్యం 1600 ఎంఏహెచ్ మాత్రమే. ఇక స్టాలియన్ ఫీచర్లను పరిశీలిస్తే... దీని స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు కాగా, బ్యాటరీ సామర్థ్యం 1700 ఎంఏహెచ్. మిగిలిన ఫీచర్లన్నీ ఫ్రిస్బీతో సమానంగా ఉన్నాయి. రెండు ఫోన్లకూ త్రీజీ, ఎడ్జ్,జీపీఆర్ఎస్, వైఫై 802.11.బీ/జీ/ఎన్, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. జోల్లా సెయిల్ఫిష్... స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఎంట్రీ ఈ జోలా సెయిల్ఫిష్ ఓఎస్. ఆండ్రాయిడ్, విండోస్, ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల తరువాత ఫైర్ఫాక్స్ ఓఎస్ అందుబాటులోకి రాగా తాజాగా ఈ సరికొత్త ఓఎస్ సెయిల్ఫిష్ మార్కెట్లోకి వచ్చింది. మాజీ నోకియా ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ఆసక్తికరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలై ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.16,499. సెయిల్ఫిష్ ఓఎస్ ప్రత్యేకత దాని యూజర్ ఇంటర్ఫేస్, మల్టీటాస్కింగ్ సామర్థ్యాల్లో ఉందని నిపుణులు అంటున్నారు. స్క్రీన్‌సైజు 4.5 అంగుళాలు కాగా, దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్డ్యుయెల్కోర్ స్నాప్‌డ్రాగన్ ఫోన్‌ను ఉపయోగించారు. రామ్ ఒక జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 16 జీబీ. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా 8 ఎంపీ రెజల్యూషన్‌తో, సెల్ఫీ కెమెరా 2ఎంపీ రెజల్యూషన్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లోని చాలావరకూ అప్లికేషన్లను సపోర్ట్ చేయడం మరో విశేషం. ఎస్ఎంఎస్, ఫేస్బుక్, వాట్సప్ వంటి అన్ని రకాల మెసేజింగ్‌లు ఒకేచోట ఉండటం మరో ఆసక్తికరమైన ఫీచర్. -
కిటికీలు లేని విమానం..
ఇదో ప్రైవేటు జెట్ డిజైన్. ఇందులో కిటికీలు ఉండవు. అయితే.. చిత్రంలో కనిపిస్తున్నట్లు ఇదేదో అద్దాలతో రూపొందించిన విమానం డిజైన్ కూడా కాదు. దీనికి వాడేది రెగ్యులర్ మెటీరియల్‌నే.. అయితే.. విమానానికి బయట ఉండే కెమెరాలు చుట్టూ ఉండే దృశ్యాలను లోపల ఉండే క్యాబిన్ గోడలు, సీలింగ్‌పై టెలికాస్ట్ చేస్తాయన్నమాట. దీని వల్ల మనకు పారదర్శకమైన విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ డిస్ప్లే ప్యానెళ్లను వీడియో కాన్ఫరెన్స్ కోసం లేదా ఫొటో ఆల్బమ్స్ వంటివి చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. లేదా కంప్యూటర్ డెస్క్టాప్పై పెట్టుకున్నట్లు ఓ మంచి వాల్‌పేపర్‌ను పెట్టుకోవచ్చు. ఈ డిజైన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన టెక్నికాన్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ఈ డిజైన్‌పై విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయట. -
విండోస్ స్మార్ట్‌వాచ్ ఇలా ఉంటుందా?!
‘విండోస్’ ను వేరబుల్ గాడ్జెట్స్‌కు కూడా అందుబాటులో ఉంచుతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన నేపథ్యంలో ‘మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌వాచ్’ కచ్చితంగా వస్తుందని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాప్ట్ సొంతంగా స్మార్ట్‌వాచ్‌ను తయారు చేయకపోయినా... విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేసే స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి రావడం మాత్రం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ విండోస్ స్మార్ట్‌వాచ్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.. అనే విషయం గురించి ఆన్లైన్లో గాసిప్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రపంచం స్మార్ట్‌వాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న పరిణామాల మధ్య విండోస్ స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ఒకటి సచిత్రరూపంలో ఆసక్తికరంగా మారింది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకొంటున్న విండోస్స్మార్ట్వాచ్ కాన్సెప్ట్ ఇదే... వాచ్‌ఫేస్: అన్నివాచ్లలాగానే టైమ్, తేదీ చూసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్: సెల్ఫోన్లో వాల్‌పేపర్ మార్చుకొన్నట్టుగానే ఈ స్మార్ట్‌వాచ్‌లో కూడా బ్యాక్గ్రౌండ్మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆజ్ఞలు పాటిస్తుంది: ఈ స్మార్ట్‌వాచ్ పిలిస్తే పలుకుతుంది. ఒక ‘హాట్వర్డ్’ ను సెట్ చేసుకొంటే అది వినిపించినప్పుడల్లా స్పందిస్తుంది. మీ ఆజ్ఞలను పాటిస్తుంది. స్పర్శతెర: స్పర్శకు కూడా స్పందిస్తుంది. స్వైపింగ్ ద్వారా తెరలను మార్చుకోవచ్చు. నోటిఫికేషన్లు పంపిస్తుంది: కీలకమైన విషయం ఏమిటంటే.. ఇది స్మార్ట్‌ఫోన్‌కు రిమోట్‌లా ఉంటుంది. మొబైల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దానికి వచ్చే మెసేజ్‌ల గురించి అప్డేట్స్ ఇస్తుంది. జేబులోంచి ఫోన్ తీయకుండానే చేతికి కట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. మెసేజ్‌లు చదువుకోవచ్చు: ఈ స్మార్ట్‌ఫోన్ తెరపై ఫోన్‌కు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లు డిస్ప్లే అవుతాయి. టెక్ట్స్‌ను స్పీచ్‌గా మారుస్తుంది: మెసేజ్‌ను చదివి వినిపిస్తుంది. వాతావరణ వివరాలు, న్యావిగేషన్, మ్యూజిక్ ప్లేయర్లా ఉపయోగపడుతుంది. -
వ్యూహం మార్చిన మైక్రోసాఫ్ట్
-
మైక్రోసాఫ్ట్ మరిన్ని చౌక స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ మరిన్ని మాస్(చౌక) స్మార్ట్ఫోన్లను అందించనున్నది. విండోస్ ఓఎస్‌పై పనిచేఏ 100-200 డాలర్ల(రూ.6,000-12,000) ఖరీదుండే హ్యాండ్సెట్లను త్వరలో మార్కెట్లోకి తేనున్నది. మొబైల్ ఫోన్ మార్కెట్లో చెప్పుకోదగ్గ స్థాయి మార్కెట్ వాటా కొల్లగొట్టడం తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా కంట్రీ జనరల్ మేనేజర్(కన్సూమర్ చానల్స్ గ్రూప్) చక్రపాణి గొల్లపలి చెప్పారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన మూడో వార్షిక మొబైల్ సమావేశం 2014లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో విండోస్ ఆధారిత ఫోన్లు రెండో స్థానంలో ఉన్నాయని వివరించారు. యాపిల్, బ్లాక్‌బెర్రీలను తోసిరాజని ఈ స్థానాన్ని సాధించామని పేర్కొన్నారు. తమ మార్కెట్ వాటా 1.5% నుంచి 5%కి పెరిగిందని వివరించారు. ఆండ్రాయిడ్ తర్వాతి స్థానం తమదేనని చెప్పారు. మరిన్ని యాప్‌లు... 3-4 నెలల్లో 100-200 డాలర్ల ఖరీదుండే మాస్ స్మార్ట్ఫోన్లు అందించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న నోకియా లూమియా ఇదే రేంజ్లో ఉన్న ఫోన్ అని వివరించారు. ఇక వినియోగదారులను ఆకర్షించడానికి సినిమా, ఆటలు, సంగీతం, మ్యాప్‌లు, తదితర సంబంధిత యాప్‌లను, కంటెంట్‌ను కూడా అందించాలని యోచిస్తున్నామని చక్రపాణి వివరించారు. లెసైన్స్ ఫీజును కూడా తగ్గించామని పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ట్యాబ్లెట్లను మరిన్ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించారు. -
ఆండ్రాయిడ్ బాట పట్టిన నోకియా
-
మైక్రోసాఫ్ట్.. ఓ కొండ కరుగుతోంది!
అంతకంతకూ తగ్గిపోతున్న మైక్రోసాఫ్ట్ పదిహేనేళ్లలో సగానికిపైగా తగ్గిన కంపెనీ విలువ అదే సమయంలో 80 రెట్లు పెరిగిన పోటీదార్లు కొత్త ఆవిష్కరణలతో గూగుల్, యాపిల్ల సవాలు మైక్రోసాఫ్ట్‌కు మాత్రం ఫెయిల్యూర్ స్టోరీలే అధికం ఇప్పటికీ పీసీల్లో వాడే విండోస్, ఆఫీస్లే ఆధారం ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల రాకతో పీసీలకే గడ్డుకాలం ఇంటికో కంప్యూటర్. కంప్యూటర్లో విండోస్. ఎంతసేపూ ఇదేనా? అవును ఇదే!! కొన్ని దశాబ్దాల పాటు సాగిందిదే. విండోస్‌ను సృష్టించినందుకు మైక్రోసాఫ్ట్‌కు దక్కిన కీర్తి అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలో అత్యంత సంపన్నమైన కంపెనీ ఇదే. ప్రపంచ కుబేరుల్లో నంబర్-1 దీని వ్యవస్థాపకుడు బిల్ గేట్సే. కానీ ఎన్నాళ్లని అదే విండోస్‌లో కూర్చుంటారు జనం. అందుకే గూగుల్ తెచ్చిన ఆండ్రాయిడ్‌కు గులామైపోయారు. కంప్యూటర్లు పక్కనపెట్టి ట్యాబ్లెట్లు, ఫ్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు పెద్ద కష్టమే వచ్చింది. దాని వైభవమంతా ‘లాంగ్ లాంగ్ ఎగో’కు మారే ప్రమాదం కనిపిస్తోంది!! విండోస్‌కు ఎదురులేనన్నాళ్లు ఓకే. కానీ గూగుల్‌తో పరిస్థితి మారింది. గూగుల్ సెర్చింజిను ప్రపంచానికి ఫేవరెట్ అయింది. పోటీగా మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ‘బింగ్’ మాత్రం... చతికిలబడింది. ఈ-బుక్స్, మ్యూజిక్‌లోనూ చుక్కెదురే. ఫలితమేంటంటే... 1999లో 616 బిలియన్ డాలర్లుగా ఉన్న మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఇపుడు సగానికిపైగా పడిపోయి 298 బిలియన్ డాలర్ల దగ్గరుంది. ప్రత్యర్థి కంపెనీ యాపిల్ అప్పట్లో 5 బిలియన్ డాలర్లు కాగా... 80 రెట్లు పెరిగి 400 బిలియన్ డాలర్ల స్థాయిని చేరింది. గూగుల్ మార్కెట్ క్యాప్ సైతం మైక్రోసాఫ్ట్‌ని మించి 341 బిలియన్ డాలర్లను చేరింది. ఒక్క ఐ-ఫోన్‌తో యాపిల్ చరిత్ర మారిపోగా... ఆండ్రాయిడ్, యూట్యూబ్, క్రోమ్, గూగుల్ బుక్స్ సహా పలు ఆవిష్కరణలతో గూగుల్ తిరుగులేని స్థాయిని చేరింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఒక్క ఐఫోన్ అమ్మకాలు 22.7 బిలియన్ డాలర్లు కాగా... మైక్రోసాఫ్ట్ మొత్తం అమ్మకాలు 17.4 బిలియన్ డాలర్లే. ఒకనాడు కంప్యూటర్ రంగంపై ఐబీఎం ఆధిపత్యానికి గండి కొట్టిన మైక్రోసాఫ్ట్... ఇపుడు తానూ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందంటే అది స్వయంకృతమే!!. పోటీలో వెనకబాటు... ఒకటిరెండు ఉత్పత్తులతోనే యాపిల్ ఠారెత్తిస్తోంది. గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు తెస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి పోటీ లేదు. కానీ గూగుల్ డాక్స్ (డాక్యుమెంట్స్) వచ్చాక పోటీ మొదలైంది. అలాగే ఎంత తక్కువ ఫీచర్లున్నా కొన్ని దశాబ్దాల పాటు ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే ఎక్స్ప్లోరరే. కానీ గూగుల్ క్రోమ్ వచ్చాక దానికి నూకలు చెల్లాయి. ఇక విండోస్ని చావుదెబ్బ తీయటానికి క్రోమ్ పేరిట ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా తెస్తోంది గూగుల్. 2001లో యాపిల్ ఐపాడ్ తెచ్చింది. పోటీగా 2006లో మైక్రోసాఫ్ట్ జూన్ మ్యూజిక్ ప్లేయర్‌ని తెచ్చింది. కానీ రెణ్నెల్లు కూడా తిరక్కముందే మ్యూజిక్ ప్లేయరు, మొబైల్ ఫోనూ, ఇంటర్నెట్, కెమెరా వంటి అనేక సదుపాయాలతో యాపిల్ ఐఫోన్‌ని తెచ్చింది. జూన్ అటకెక్కింది. విండోస్, ఆఫీస్ తప్ప ఏమీ లేవు... మైక్రోసాఫ్ట్ ప్రధానంగా ఆధారపడింది విండోస్, ఆఫీస్, సర్వర్ల మీదే. విండోస్ ఎక్స్పీ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అమ్మకాలే కంపెనీకి ప్రధానాధారం. పర్సనల్ కంప్యూటర్స్ విభాగంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ కింగే కానీ... ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల రాకతో జనం పీసీలే వద్దనుకుంటున్నపుడు దాని భవిష్యత్తేంటన్నది ప్రశ్న. నిజానికి విండోస్, ఆఫీస్లపై విపరీతమైన మమకారం వల్లే మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీల్లో రాణించలేదన్న వాదనలున్నాయి. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి స్టీవ్ స్టోన్ గతంలో ‘‘మైక్రోసాఫ్ట్‌కు విండోస్ ఒక దైవం. అది తయారు చేసే ఏ ఉత్పత్తయినా విండోస్ చుట్టూనే తిరుగుతుంది’’ అన్నారంటే పరిస్థితి తెలియకమానదు. ఆ ధోరణే మైక్రోసాఫ్ట్‌కు శాపంగా మారిందనుకోవాలి. ఎందుకంటే 1998లోనే మైక్రోసాఫ్ట్ సిబ్బంది ఇ-రీడర్ని డెవలప్ చేశారు. కానీ, దాని యూజర్ ఇంటర్ ఫేస్... విండోస్‌కి తగ్గట్లు లేదంటూ స్వయంగా బిల్ గేట్స్ రిజెక్ట్ చేశారు. తరవాత ఈ-రీడర్లు ఎంత హిట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. అలాగే, ఎంఎస్ఎన్ మెసెంజర్లో స్టేటస్ అప్డేట్ అనే చిన్న ఫీచర్ పెట్టి ఉంటే... ఫేస్బుక్ ఇంత వేగంగా ఎదిగేది కాదన్నది మరికొన్ని వర్గాల మాట. ఈ ఐడియా అప్పట్లోనే ఒక ప్రోగ్రామర్ ఇచ్చినా... గేట్స్ కొట్టిపారేశారట. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ (పీడీఏ) వంటి ప్యాకెట్ డివైజ్‌ల కోసం ఉద్దేశించిన విండోస్ సీఈ ఆపరేటింగ్ సిస్టం ఆ కోవకి చెందినదే. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే నేటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, స్మార్ట్ఫోన్లలో మైక్రోసాఫ్ట్‌కే ఆధిపత్యం ఉండేదంటారు విశ్లేషకులు. అంటే గతంలోనే ఎన్నో టెక్నాలజీలను ఆవిష్కరించినప్పటికీ... విండోస్‌లో కూర్చుని వాటిని పక్కకు తోసేసిం దన్న మాట మైక్రోసాఫ్ట్. నోకియాతో డీల్ కలిసొస్తుందా? ఈ మధ్య నోకియా హ్యాండ్సెట్ బిజినెస్‌ని దాదాపు 720 కోట్ల డాలర్లు చెల్లించి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. దీనివల్ల కొంతైనా నిలదొక్కుకోవచ్చన్నది మైక్రోసాఫ్ట్ ఆలోచన. కానీ నోకియాదీ మైక్రోసాఫ్ట్ లాంటి చరిత్రే. ఒకప్పుడు మొబైల్ అంటే నోకియానే. కానీ స్మార్ట్ఫోన్ల రాకతో నోకియా పరిస్థితి తారుమారైంది. హైఎండ్‌లో యాపిల్, శాంసంగ్‌లు... లో ఎండ్ మార్కెట్లో చైనా మొబైళ్లు నోకియాని ఎడాపెడా బాదాయి. స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లదే హవా. నోకియా మాత్రమే విండోస్‌ను వాడుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లు 90 కోట్లు, యాపిల్ ఐఫోన్లు 25 కోట్ల పైచిలుకు అమ్ముడవుతున్న ప్రపంచ మార్కెట్లో విండోస్ ఫోన్ల అమ్మకాలు 2-3 కోట్లే. యాప్స్ పరంగా చూస్తే ఆండ్రాయిడ్‌లో 8.5 లక్షల పైచిలుకు, యాపిల్‌లో 9 లక్షల పైచిలుకు ఉండగా... విండోస్‌లో 1,80,000 మాత్రమే ఉన్నాయి. విండోస్ ఫోన్ల అమ్మకాలు తక్కువ కావటంతో ఈ ప్లాట్‌ఫాంపై యాప్స్ తయారీకి డెవలపర్లూ ముందుకు రావట్లేదు. అందుకనే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సర్వీసులు అన్నీ ఒకచోట అందించేందుకు మోటరోలాను కొన్న గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా నడిచింది. అయితే శాంసంగ్, హెచ్‌టీసీ లాంటి ఇతర హ్యాండ్సెట్ తయారీ సంస్థలు కొన్ని మోడళ్లను విండోస్ ప్లాట్‌ఫాంపై తయారు చేస్తున్నాయి. నోకియాతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం వల్ల అవి పునరాలోచనలో పడే ప్రమాదమూ ఉంది. - సాక్షి బిజినెస్ డెస్క్ -
ఆండ్రాయిడ్/విండోస్ మొబైల్స్‌కు ‘మై బీఎస్ఎన్ఎల్’ యాప్
కోచి: ఆండ్రాయిడ్, విండోస్ మొబైల్ ఫోన్ యూజర్ల కోసం ప్రభుత్వరంగ మొబైల్ కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్.. ‘మై బీఎస్ఎన్ఎల్’ను సోమవారం ప్రారంభించింది. ఈ యాప్‌తో వినియోగదారులు పోస్ట్ పెయిడ్ బిల్స్‌ను, ప్రి-పెయిడ్ టాపప్లను ఏ సమయంలోనైనా, ఎక్కడ నుంచైనా చెల్లించవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్/విండోస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ యాప్‌తో యూజర్లు తమ ప్రస్తుత బిల్లు ఎంతో తెలుసుకోవచ్చని, బిల్లులు చెల్లించవచ్చని, చెల్లింపులకు రశీదులు పొందవచ్చని, ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించారో తెలుసుకోవచ్చని, ప్రి పెయిడ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని, నెట్‌బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వంటి వివిధ రకాల చెల్లింపుల ఆప్షన్స్‌ను కూడా పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ వివరించింది. -
ఒకే క్లిక్‌తో వీడియోల వర్షం...
యూట్యూబ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. అలాగే యూట్యూబ్ డౌన్లోడర్స్ గురించి కూడా. రియల్‌ప్లేయర్ డౌన్లోడర్, యూట్యూబ్ డౌన్లోడర్, ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ వంటి సాఫ్ట్వేర్లతో నెటిజన్లు యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటుంటారు. ఈ విషయంలో బాగా ఆరితేరిన నెటిజన్లు.. ఏ డౌన్లోడర్ అయితే బెటర్ అనే విషయం గురించి రివ్యూలు కూడా రాసేస్తుంటారు. యూట్యూబ్ డౌన్లోడర్ అయితే లింక్ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుందని, రియల్ ప్లేయర్ డౌన్లోడర్ వాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, అదే ఇంటర్నెట్ డౌన్లోడర్ మేనేజర్ అయితే తిరుగేలేదని చెబుతుంటారు. అయితే.. ఇవన్నీ యూట్యూబ్ నుంచి ఒక్కో వీడియోను డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేందుకు ఉద్దేశించినవి మాత్రమే. వీటి ద్వారా మనకు అవసరమైన వీడియో మీద క్లిక్ చే సి.. లేదా దాని లింక్‌ను పేస్టు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటినుపయోగించి ఒకసారి ఒక్క వీడియో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే... ఒకేసారి ఎక్కువ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే? యూట్యూబ్ కు సంబంధించి ఒక ఛానల్లో ఉండే వీడియోలన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేయాలంటే? ఒక్కో వీడియోను క్లిక్ చేసి ఒక్కొక్కటిగా డౌన్లోడ్ చేసుకునే శ్రమను తప్పించి.. అన్నీ ఒకే క్లిక్‌తో వీడియోలను సిస్టమ్‌లోకి డంప్ చేసుకోవాలంటే... దీనికి డౌన్లోడర్ సాఫ్ట్వేర్ల రూపంలో కొన్ని ఆప్షన్లున్నాయి. అవేవంటే... 4కే వీడియో డౌన్లోడర్... ఒక ఛానల్లో ఆటోమేటిక్ ప్లే లిస్ట్‌గా జోడించిన వీడియోలన్నింటినీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ డౌన్లోడ్ మేనేజర్ చాలా ఉత్తమమైనది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వీడియో డౌన్లోడింగ్ చాలా సులభతరం అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ విండోస్, మ్యాక్, లైనక్స్.. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదా పనిచేస్తుంది. ఇందులో రెండు వెర్షన్లున్నాయి. ఫ్రీవెర్షన్, పెయిడ్ వెర్షన్. ఫ్రీవెర్షన్ విషయంలో ఒకేసారి 25 వీడియోల వరకే పరిమితి ఉంటుంది. అదే పెయిడ్ వెర్షన్ విషయంలో ఎటువంటి పరిమితులుండవు. పెయిడ్ వెర్షన్ లెసైన్స్ కీ ధర దాదాపు పది డాలర్లు. వ్యక్తిగత అవసరాల కోసం అయితే.. ఉచిత వెర్షన్ చాలు. ఈ డౌన్లోడ్ మేనేజర్‌ను ఉపయోగించడం కూడా చాలా సులువే. డౌన్లోడ్ చేయాలనుకుంటున్న ఛానల్ యూఆర్ఎల్ను తెచ్చి4కే మేనేజర్లో పేస్ట్ చేస్తే చాలు మొత్తం వీడియోలు పీసీ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వస్తాయి. ఫ్రీ యూట్యూబ్ డౌన్లోడ్.. ఇది విండోస్ ఓఎస్ కోసం ప్రత్యేకంగా రూపొందినది. ఇది కూడా 4 కే డౌన్లోడ్ మేనేజర్లాంటిదే. యూఆర్ఎల్ను కాపీ పేస్ట్ చేయడం.. మంచి క్వాలిటీతో ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం. ఛానల్లోని అన్ని వీడియోలూ కాకుండా.. అవసరమైన వీడియోలను మాత్రమే క్లిక్ చేసుకుని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లేలిస్ట్ కౌంట్ ద్వారా కొన్ని వీడియోలను స్కిప్చేసి.. అనవసరమనుకున్న వాటిని తొలగించుకోవడం ఈ డౌన్లోడ్ మేనేజర్‌లోని ప్రత్యేక సదుపాయం. బీవై ట్యూబ్డీ, ఫ్లాష్గాట్.. ఈరెండు డౌన్లోడ్ మేనేజర్లూ మొజిల్లా ఫైర్ఫాక్స్ యాడ్ ఆన్ సర్వీస్‌లు. వీటిని ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌కు యాడ్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఒకేసారి ఎక్కువ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీవై ట్యూబ్ డీ.. దీని పూర్తిపేరు బల్క్ యూట్యూబ్ డౌన్లోడర్. పేరుకు తగ్గట్టే దీనిద్వారా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని పోలినదే ఫ్లాష్గాట్.. మొజిల్లా ద్వారా యూట్యూబ్ చానల్‌ను ఓపెన్ చేసుకుని.. ఈ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి.. వీడియో డౌన్లోడింగ్ మొదలుపెట్టవచ్చు. - జీవన్‌రెడ్డి.బి -
విండోస్ ఐఆర్సీటీసీ యాప్
హైదరాబాద్: విండోస్ ఓఎస్‌పై పనిచేసే ట్యాబ్లెట్లు, మొబైళ్లు, పీసీల కోసం ఐఆర్సీటీసీ యాప్‌ను ఉచితంగా అందిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆప్ ఇప్పటికే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఉందని, విండోస్ స్టోర్, విండోస్ ఫోన్ స్టోర్లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ యాప్ ద్వారా రైల్వే ఎంక్వైరీలు, రైల్వే టికెట్ల బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చని, బుకింగ్స్/క్యాన్సిలేషన్ హిస్టరీ చూసుకోవచ్చని పేర్కొంది. విండోస్‌లో యాప్స్ సంఖ్య బాగా పెరిగిపోతోందని, వినియోగదారులు, డెవలపర్లు విండోస్‌ను తమ ప్రాధాన్య ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంటున్నారని కంపెనీ వివరించింది.