ఇంటి కిటికీలు వెలుతురుతోపాటు కరెంటు కూడా అందిస్తే బాగుంటుందని చాలాకాలంగా అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు తీరే రోజు దగ్గరకు వచ్చేసింది. అమెరికాలోకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల బందం ఇలాంటి సరికొత్త కిటికీలను అభివద్ధి చేసింది మరి! మార్కెట్‌లో ఇప్పటికే కొన్ని పారదర్శక సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా తాము చేయగలిగామని ఈ ప్రాజెక్టుకుకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త విక్టర్ క్లిమోవ్ తెలిపారు.
రెండు పొరలుగా ఉండే ఈ కొత్త రకం సోలార్ ప్యానెల్ సాధారణ ప్యానెల్స్ విద్యుత్తు ఉత్పత్తి చేయలేని కాంతులనూ వాడుకోగలగడం విశేషం. కిటికీలోని రెండు పొరలు వేర్వేరు రంగులను శోషించుకోవడమే కాకుండా.. ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ రంగులను కిటికీకి ఒకవైపున ఉండే చిన్నసైజు సోలార్ ప్యానెల్స్‌వైపు మళ్లిస్తారు. దీంతో అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మోతాదు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment