
కిటికీలు లేని విమానం..
ఇదో ప్రైవేటు జెట్ డిజైన్. ఇందులో కిటికీలు ఉండవు. అయితే.. చిత్రంలో కనిపిస్తున్నట్లు ఇదేదో అద్దాలతో రూపొందించిన విమానం డిజైన్ కూడా కాదు. దీనికి వాడేది రెగ్యులర్ మెటీరియల్‌నే.. అయితే.. విమానానికి బయట ఉండే కెమెరాలు చుట్టూ ఉండే దృశ్యాలను లోపల ఉండే క్యాబిన్ గోడలు, సీలింగ్‌పై టెలికాస్ట్ చేస్తాయన్నమాట. దీని వల్ల మనకు పారదర్శకమైన విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఈ డిస్‌ప్లే ప్యానెళ్లను వీడియో కాన్ఫరెన్స్ కోసం లేదా ఫొటో ఆల్బమ్స్ వంటివి చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. లేదా కంప్యూటర్ డెస్క్‌టాప్‌పై పెట్టుకున్నట్లు ఓ మంచి వాల్‌పేపర్‌ను పెట్టుకోవచ్చు. ఈ డిజైన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన టెక్నికాన్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ఈ డిజైన్‌పై విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయట.