20 ఏళ్ల క్రితం వై2కే బగ్ (దానికి మరో పేరు మిలీనియం బగ్) కంప్యూటర్లను గడగడలాడించింది. ఈ బగ్ వల్ల అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా ఇబ్బందులు తలెత్తాయో ఇవాళ (జులై 19) మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వై2కే బగ్ కథాకమామిషు ఏంటి? వై2కే బగ్‌కి క్రౌడ్ స్ట్రైక్‌కి ఏదైనా సంబంధం ఉందా?
ప్రపంచంలోని అన్నీ దేశాల మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పర్సనల్ కంప్యూటర్‌లలోని విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ప్రత్యక్షమవుతుంది. పలుమార్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతున్నాయి. విండోస్‌లోని సాంకేతిక సమస్యలతో భారత్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బోర్డింగ్ పాస్‌లను సైతం చేతి రాత ఉపయోగించాల్సి వచ్చింది.
అయితే విండోస్‌లోని తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌ను విజ్ఞప్తి చేస్తుండగా ..ఈ ప్రస్తుత పరిస్థితి 2000 ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన వై2కే బగ్ లాగా తీవ్ర ఆందోళనను రేకెత్తిచ్చింది. సర్వర్‌లలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు మైక్రోసాఫ్ట్ పరిష్కారం చూపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సమస్యలు అదుపులోకి వచ్చాయి.
ఏంటి ఈ వై2కే బగ్?
1960-1980లలో కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేసే సమయంలో డేటా స్టోరేజీని ఆదా చేసేందుకు కంప్యూటర్ ఇంజనీర్లు సంవత్సరానికి రెండు అంకెల ‘19’ కోడ్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31,1999 తర్వాత కొత్త ఏడాది అంటే 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత పోగ్రామర్లు వినియోగించిన కోడ్‌ను 00గా భావించి 2000 ఏడాదిగా కాకుండా 1900గా కంప్యూటర్లు అర్థం చేసుకున్నాయి.ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే
100 సంవత్సరాలుగా తీసుకుని
ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 00గా పరిగణించాయి. ఏడాది 2000 అయితే ప్రోగ్రామర్లు ఫిక్స్ చేసిన 19 కోడ్ కారణంగా 1900 తీసుకున్నాయి. ఫలితంగా ఆ ఏడాది టెక్నాలజీ రంగం అతలాకుతలమైంది. ఇతర రంగాలు సైతం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. బగ్‌ను పరిష్కరించేందుకు ప్రోగ్రాం అందుబాటులోకి రావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ పాత సంవత్సరం ముగిసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వై2కే కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం సాధారణమేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
క్రౌడ్ స్ట్రైక్ వర్సెస్ వై2కే బగ్
ఆ వై2కే బగ్‌కి తాజా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో ఇబ్బందులకు ఏదైనా సంబంధం ఉందా అంటే లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రముఖ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలకు, పలు ప్రభుత్వ విభాగాలకు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. దాని ఫలితంగానే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్‌లోని ఇబ్బందులు తలెత్తి సిస్టమ్‌లు షట్‌డౌన్ , రీస్టార్ట్ అవుతున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment