ఇంటి అందం రెట్టింపు | heav demand for UPVC doors and windows | Sakshi
Sakshi News home page

ఇంటి అందం రెట్టింపు

Published Sat, Jan 14 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

ఇంటి అందం రెట్టింపు

ఇంటి అందం రెట్టింపు

విపణిలోకి యూపీవీసీ తలుపులు, కిటికీలు

 సాక్షి, హైదరాబాద్‌
ఇంటికెవరొచ్చినా వారికి స్వాగతం పలికేవి తలుపులే. అందుకే అవి ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపు అవుతుంది. అయితే గతంలో తలుపులు, కిటికీలను చెక్క, కలపతో చేయించేవారు. వీటి మన్నిక కొన్నేళ్లే ఉంటుంది. వీటి స్థానంలో ఇప్పుడు విపణిలోకి యూవీవీసీ తలుపులు, కిటికీలు వచ్చేశాయి. ధరలు కూడా అందుబాటులో ఉండటం, లెక్కలేనన్ని రంగులూ అందుబాటులో ఉండటం, మన్నిక విషయంలోనూ నాణ్యంగా ఉండటంతో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది.

యూపీవీసీ అంటే అన్‌ప్లాస్టిసైజ్డ్‌ పాలీవినైల్‌ క్లోరైడ్‌. దేశవ్యాప్తంగా తలుపులు, కిటికీల మార్కెట్‌ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు.

సౌకర్యాలెన్నో..
యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటీష్‌ ప్రమాణాల్లో తేలింది.
సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటి M? లు 300 పీఏ వరకు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు.
యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.
అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది.
యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్ధాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్ధాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్‌ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్‌ను ఆదా అవుతుంది.
సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అందే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్కూలు, గ్రిల్స్‌ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని చేధించడం అంత సులువు కాదు.

బొమ్మలు భలే
సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో గోడలకు వేలాడదీసే బొమ్మలు మన అభిరుచులను అద్దం పడతాయి. అందుకే ఎక్కడి బొమ్మలు అక్కడే వేయాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అని పెదవి విరుస్తారు.
వంట గదిలో తాజా కనిపించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా అంతగా రుచించవు.
హాల్‌లో ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను వేలాడదీయవచ్చు.
ఆఫీసుల్లో వెయింట్‌ హాల్‌లో అయితే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్‌ ఆర్ట్‌లను పెట్టుకోవచ్చు.
ఇంటికి వేసే రంగులూ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంత కలుగచేస్తాయి. ముదురు రంగులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement