భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంతంగా కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సరసమైన చిన్న కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉంటుందని.. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 'నోమురా' తన నివేదికలో పేర్కొంది.
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికా, జపాన్ కంపెనీలు చిన్న కార్లను విరివిగా తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మార్కెట్లో చిన్న కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎస్‌యూవీలు, ప్రీమియం కార్ల ధరలు పెరగడంతో.. వాహన కొనుగోలుదారుల చూపు చిన్న కార్ల మీద పడింది. సీఎన్‌జీ కార్ల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
చిన్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నోమురా తన నివేదికలో వెల్లడించింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండేది కాదు.. అయితే నేడు ఎక్కువమంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో గ్లోబల్ మార్కెట్లో వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆ తరువాత ఆటోమొబైల్ కంపెనీలు కోలుకున్నప్పటికీ.. డిమాండుకు తగ్గ సరఫరా చేయడంలో కొంత విఫలమయ్యాయి. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వేగవంతమైంది. వచ్చే ఏడాది డిమాండుకు తగిన విధంగా డెలివరీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది.
ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌పై.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రభావం కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఐరోపాలో ఉద్యోగ నష్టాలు.. ఫ్రాన్స్ & జర్మనీలలో రాజకీయ గందరగోళం వంటివి ఐరోపాలో మొత్తం డిమాండ్ రికవరీని ప్రభావితం చేసిందని నోమురా నివేదిక ద్వారా తెలిసింది. యూఎస్ ట్యాక్స్, అధిక ధరలు వంటివి కూడా కార్ల అమ్మకాల మీద ప్రభావం చూపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment