Small cars
-
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే..
ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామంది వాహన కొనుగోలుదారులు తక్కువ ధర వద్ద ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో షావోమ (Xiaoma) కంపెనీ సరసమైన ధరకే ఈవీ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమ కంపెనీ బెస్టూన్ బ్రాండ్ కింద చిన్న ఎలక్ట్రిక్ కారు (Bestune Xiaoma)ని చైనాలో లాంచ్ చేసింది. దీని ధర 30వేల నుంచి 50వేల యూవన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షలు. ఇప్పటికీ ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ మొదలైనట్లు.. ఈ నెలలోనే సేల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బెస్టూన్ షావోమ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న వుల్లింగ్ హాంగుయంగ్ మినీ ఈవీకి ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు గత ఏప్రిల్ నెలలో షాంఘై ఆటో షోలో కనిపించింది. కాగా త్వరలో రోడ్డు మీదికి రానుంది. డ్యూయెల్ టోన్ కలర్లో చూడముచ్చటగా ఉన్న ఈ కారు మంచి డిజైన్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు షావోమ బెస్టూన్ ఎలక్ట్రిక్ కారు FME ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన కార్లు 800 కిమీ నుంచి 1200 కిమీ రేంజ్ అందిస్తాయి. కావున 20 కిలోవాట్ మోటార్ కలిగిన బెస్టూన్ 800కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. కాగా ఖచ్చితమైన రేంజ్ తెలియాల్సి ఉంది. -
ఎంజీ చిన్న ఈవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ భారత్‌లో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 26న కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది. నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2–స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి హంగులు ఉన్నాయి. కామెట్ ఈవీని భారత్‌లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్ యెప్ ఎస్యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది. -
చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..
న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్‌యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్బ్యాక్లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్‌యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు. యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్‌యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్‌పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు. -
దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు
న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటూ వచ్చిన దేశీ కార్ల మార్కెట్‌కు ప్రస్తుతం చిన్న కార్లు ఊతమిస్తున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ సమస్యల కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. దీంతో పరిమాణంలో చిన్నగా ఉన్నా, కొనుగోలుదారు పెట్టే ధరకు గరిష్ట స్థాయిలో లగ్జరీ సదుపాయాలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు వీటిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ. 5,00,000- రూ. 9,00,000 శ్రేణిలో మినీ సెడాన్లు, రూ. 6,00,000 నుంచి రూ. 12,00,000 దాకా ఖరీదు చేసే స్పోర్ట్స్ యుటి లిటీ వాహనాలు(ఎస్యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు(ఎంయూవీ) మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్ మెరుగ్గా 15-16 శాతం స్థాయిలో వృద్ధి చెందుతోందని అంచనా. నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లపై తక్కువ స్థాయిలో ఎనిమిది శాతం ఎక్సైజ్ సుంకం విధించాలన్న గత యూపీఏ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చిన్న కార్ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సెడాన్లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 24 శాతం ఎక్సైజ్ సుంకాలు ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించడం చిన్న కార్ల మార్కెట్‌కు తోడ్పడుతోంది. లగ్జరీ ఫీచర్లు.. లోపల విశాలంగా ఉండటం, లగ్జరీ ఫీచర్లు, తక్కువ ధర, చూడముచ్చటి ఆకారం, అన్నింటికన్నా ముఖ్యంగా మెరుగైన మైలేజీ, ట్రాఫిక్‌లో సైతం సులువుగా వెళ్లేందుకు అనువుగా ఉండటం చిన్న కార్లకు ప్లస్ పాయింటు. టచ్స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పార్కింగ్ సెన్సార్లు, డే-టైమ్ ల్యాంప్‌లు, సీడీ ప్లేయర్లు మొదలైన ఫీచర్లు కొన్నాళ్ల క్రితం దాకా కాస్త పై స్థాయి కార్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రస్తుతం టెక్నాలజీ అభిరుచి కలిగిన యువ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో కంపెనీలు చిన్న కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నాయి. స్టీరింగ్ వీల్‌పైనే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్స్ కూడా ఉండాలని చాలా మంది కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు. ఇతరులను అనుకరించడం కాకుండా తమ అవసరాలకు అనుగుణమైన కార్లను ఎంచుకోవడంలో దేశీ కొనుగోలుదారులు ప్రస్తుతం వాస్తవిక దృక్ప థంతో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 4 మీటర్ల లోపు పొడవుండే కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ వాహనాలు పాపులర్‌గా ఉన్నాయి. అలాగే రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మారుతీ సుజుకీ ఎర్టిగా, హోండా మొబీలియో కార్లు మార్కెట్లో పెను మార్పులు తెచ్చాయి. ఈ సెగ్మెంట్ ఊతంతోనే రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు నిలదొక్కుకున్నాయి. భారత మార్కెట్లో లేటుగా ప్రవేశించినప్పటికీ 2012 జూలైలో ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్‌యూవీతో రెనో సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, రెండు దశాబ్దాల పైగా భారత్‌లో ఉన్న పెద్దగా విజయవంతం కాలేకపోయిన ఫోర్డ్ సైతం.. ఎకోస్పోర్ట్ మినీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. 17 రోజుల వ్యవధిలో ఏకంగా 40,000 బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ వీటికోసం నాలుగు నుంచి ఎనిమిది నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ విభాగం కార్లు ఇంత ప్రజాదరణ పొందుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో మారుతీ, టాటా, హ్యుందాయ్, మహీంద్రా, ఫియట్, షెవర్లె, ఫోక్స్‌వ్యాగన్ తదితర కంపెనీలు మరిన్ని మినీ-సెడాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.