ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామంది వాహన కొనుగోలుదారులు తక్కువ ధర వద్ద ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో షావోమ (Xiaoma) కంపెనీ సరసమైన ధరకే ఈవీ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
షావోమ కంపెనీ బెస్టూన్ బ్రాండ్ కింద చిన్న ఎలక్ట్రిక్ కారు (Bestune Xiaoma)ని చైనాలో లాంచ్ చేసింది. దీని ధర 30వేల నుంచి 50వేల యూవన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షలు. ఇప్పటికీ ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ మొదలైనట్లు.. ఈ నెలలోనే సేల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెస్టూన్ షావోమ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న వుల్లింగ్ హాంగుయంగ్ మినీ ఈవీకి ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు గత ఏప్రిల్ నెలలో షాంఘై ఆటో షోలో కనిపించింది. కాగా త్వరలో రోడ్డు మీదికి రానుంది. డ్యూయెల్ టోన్ కలర్‌లో చూడముచ్చటగా ఉన్న ఈ కారు మంచి డిజైన్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు
షావోమ బెస్టూన్ ఎలక్ట్రిక్ కారు FME ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన కార్లు 800 కిమీ నుంచి 1200 కిమీ రేంజ్ అందిస్తాయి. కావున 20 కిలోవాట్ మోటార్ కలిగిన బెస్టూన్ 800కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. కాగా ఖచ్చితమైన రేంజ్ తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment