ప్రపంచ మార్కెట్లో టెస్లా సంస్థకు చెందిన వాహనాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కంపెనీ త్వరలో భారతదేశంలో కూడా అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే చైనాలోని షాంఘైలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో 40 సెకన్లకు ఒక ఈవీ తయారవుతుందని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో ప్రతి 40 సెకన్లకు ఒక ఏకక్ట్రిక్ కారు తయారవుతుందని, దీనికి సంబంధించిన ఒక ట్విటర్ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్టివిటీ వంటి వాటికి సంబంధించినవి చూడవచ్చు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
టెస్లా కంపెనీకి అమెరికాలో ఒక మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా బయట చైనాలో మాత్రమే ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ సంస్థ కేవలం రెండు మోడల్స్‌ని మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండూ కూడా చౌకైన కార్లుగా పరిగణిస్తారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ అనేక సార్లు సిబ్బందిని చాలా సార్లు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
#Didyouknow that at #Shanghai's #Tesla Gigafactory, they can produce a #car in less than 40 seconds? 🤔Curious to see how they achieve such speed? Let's dive into the working environment!@Tesla @Tesla_Asia pic.twitter.com/FWXe7TxGYq
— Shanghai Let's meet (@ShLetsMeet) July 25, 2023
Comments
Please login to add a commentAdd a comment