ఆధునిక కాలంలో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టాల్సిందే.. కానీ కారు కొనాలంటే ఎంత వెచ్చించాలో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం రూ. 99,000లకే ఎలక్ట్రిక్ కారు లభించిందంటే చాలామందికి నమ్మశక్యం కాదు. అయితే ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి చైనాకు చెందిన 'అలీబాబా' కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని తయారు చేసింది. ముందు భాగంలో పులి ఆకారంలో ఉన్న ఈ కారు కేవలం రెండు సీట్లను మాత్రమే కలిగి ఉంది. అంటే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది వీక్ పేరిట సేల్ నిర్వహించిన అందులో ఈ కారుని 1199 డాలర్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 99,000 వరకు ఉంటుంది.
చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది కంపెనీ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ కారుని చైనాలో తప్పా ఇతర దేశాలకు తీసుకెళ్లే ఛాన్స్ లేదు. మొత్తానికి ఇది టాటా నానో కారుకంటే తక్కువ ధరకే లభించిందని తెలిసిపోతోంది.
ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?
కారు చిన్నగా ఉండటం వల్ల పార్కింగ్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 35 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 47 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశానికి రాదనే తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment