ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) త్వరలోనే భారతదేశంలో అడుగుపెట్టనున్నట్లు జరిగిన ప్రకటన విషయం తెలిసిందే. గతంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీ అభ్యర్థనను పలుమార్లు తిరస్కరించింది. కాగా ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి మీద ట్యాక్స్ ఉంటుందని అందరికి తెలుసు. కావున స్వదేశీ వాహనాల కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల ధరలు భారీగా ఉంటాయి. ఈ సమయంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. మన దేశంలోని ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేంద్రం మస్క్ కోరికను తిరస్కరించింది.
భారతీయ మార్కెట్లో ప్రవేశించనున్న టెస్లాకు ప్రస్తుతం ఎటువంటి సుంకం మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవడం లేదని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించినట్లు తాజాగా రెవిన్యూ సెక్రటరీ 'సంజయ్ మల్హోత్రా' వెల్లడించారు. మన దేశంలో గణనీయమైన పెట్టుబడులను పెంచడానికి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
(ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?)
భారతదేశంలో టెస్లా కార్లను తయారు చేయడానికి సుమారు 5,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కర్మాగారం ఏర్పాటు చేయడానికి మస్క్ భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న విధంగా జరిగితే మన దేశంలో టెస్లా కార్లు కేవలం రూ. 20 లక్షలకు లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా మన దేశం నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలకు కూడా ఎగుమతులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే టెస్లా కంపెనీకి భారత్ ఎగుమతి కేంద్రంగా నిలుస్తుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment