
విండోస్ ప్రింట్ స్పూలర్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్ హెచ్చిరించింది. ప్రింట్ స్పూలర్ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
సెక్యూరిటీ ప్యాచ్
‘ప్రింట్ స్పూలర్ కోడ్‌కి సంబంధించిన లోపాల కారణంగా విండోస్‌కి సంబంధించిన అన్ని వెర్షన్లకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్ చేసుకోకి వాళ్లు ప్రింట్ స్పూలర్‌ని డిసేబుల్ చేయడం మంచిదని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment