-
హార్ట్‌బీటే పాస్‌పోర్ట్.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్ చేసుకుని తినడమే!
ఏదో పనిమీద పక్క దేశానికి వెళ్తున్నారు. చేతిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా నడిచి వెళ్లారు.అంతే చెకింగ్, ఇమిగ్రేషన్ గట్రా అన్నీ అయిపోయాయి. విమానంలో కూర్చోగానే..సీటు మీ శరీరానికి తగ్గట్టుగా మారిపోయింది. విమానం దిగి హోటల్‌కు వెళ్లగానే ఆకలేసింది.మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయగానే.. ప్రింట్ చేసి తెచ్చి ఇచ్చేశారు.. ఇదేమిటి ఏదేదో చెప్పేస్తున్నారు అనిపిస్తోందా? భవిష్యత్తులో.. అంటే 2070 నాటికిప్రయాణం ఇలానే ఉంటుందట. ఆ వివరాలేమిటో చూద్దామా.. బ్రిటన్‌కు చెందిన ‘ది ఈజీ జెట్’ సంస్థమరో 50 ఏళ్ల తర్వాత ప్రయాణాల తీరుఎలా ఉంటుంది? సెలవులను ఎలాఎంజాయ్ చేస్తామన్న అంశంపై శాస్త్రవేత్తలు,నిపుణులతో మాట్లాడి ‘ది ఈజీ జెట్ 2070 ఫ్యూచర్ ట్రావెల్’పేరిట నివేదికను విడుదల చేసింది. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిర్గిట్టె అండర్సన్, డిజైన్ సైంటిస్ట్ మెలిస్సా స్టెర్రీ, క్రాన్ఫీల్డ్ వర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం బ్రైత్వేట్లతో పాటు మరికొందరుతమ అంచనాలను వెల్లడించారు. జస్ట్ అలా నడిచివెళితే చాలు.. ప్రతి ఒక్కరి వేలిముద్ర, కంటి ఐరిస్ వేర్వేరుగా ఉన్నట్టే.. గుండె కొట్టుకునే సిగ్నేచర్ కూడా విభిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సిగ్నేచర్ డేటాను స్టోర్ చేసి.. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌పోర్టుగా వాడొచ్చంటున్నారు. ఉదాహరణకు విమానాశ్రయంలోని ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లగానే.. సెన్సర్లు, కెమెరాలు, ప్రత్యేక పరికరాలు స్పందిస్తాయి. ఐరిస్ స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖం గుర్తింపు), హార్ట్‌బీట్ సిగ్నేచర్లను గుర్తించి.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తాయి. ఇదంతా సెకన్లలోనే జరిగిపోతుంది. విమానంలో కూర్చోగానే.. ప్రయాణికులు విమానం ఎక్కి సీట్లోకూర్చోగానే.. వారి శరీరానికి తగినట్టు (సన్నగా, లావుగా, పొడవు, పొట్టి.. ఇలా) కాళ్లు గా సీటు ఆకృతి మారిపోతుంది. సీటుపై తలకు పక్కన అమర్చిన ప్రొజెక్టర్ నుంచి సరిగ్గా కళ్లకుముందు డిస్ప్లే ఏర్పడుతుంది. ఏ ఇబ్బందీ లేకుండా కావాల్సినవి వీక్షించవచ్చు. ఇల్లు–ఎయిర్పోర్ట్ టెర్మినల్– ఇల్లు ఉన్నచోటి నుంచే గాల్లోకి ఎగిరి ప్రయాణించి మళ్లీ అలాగే కిందకు దిగగలిగే (వీటీఓఎల్) ఎయిర్ ట్యాక్సీలు అంతటా అందుబాటులోకి వస్తాయి. ఇంటి దగ్గరే ఎయిర్‌ట్యాక్సీ ఎక్కి నేరుగావిమానాశ్రయం టెర్మినల్‌లో దిగడం.. ప్రయాణం చేశాక మళ్లీ టెర్మినల్ నుంచి నేరుగా ఇంటి వద్దదిగడం.. సాధారణంగా మారిపోతుంది. త్రీడీ ప్రింటెడ్ ఫుడ్.. కావాల్సినట్టు బెడ్ ♦ మనకు నచ్చిన ఆహారాన్ని కాసేపట్లోనే ఫ్రెష్‌గా ప్రింట్ చేసి ఇచ్చే ‘ఫుడ్ త్రీడీ ప్రింటింగ్’మెషీన్లు అందుబాటులోకి వస్తాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం దాకా ఏదైనా ప్రింట్ చేసుకుని తినేయడమే. ♦ హోటళ్లలో రూమ్‌లు ‘స్మార్ట్’గా మారిపోతాయి. మనం రూమ్‌కు వెళ్లే ముందే.. గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో,లోపలికి వెళ్లగానే ఏదైనా సంగీతం ప్లేకావాలో, బెడ్ ఎంత మెత్తగాఉండాలో, గీజర్‌లో నీళ్లు ఎంత వేడితో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు తగినట్టుగా అన్నీ మారిపోతాయి. ♦ మనకు కావాల్సిన మోడల్, డిజైన్, వస్త్రంతో డ్రెస్సులు కూడా త్రీడీ ప్రింటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మనం ఇక లగేజీ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు లేనట్టే. ప్రత్యేక సూట్లతో ‘టైమ్ ట్రావెలింగ్’ హాలిడే కోసం ఏదైనా పర్యాటక ప్రాంతానికివెళ్లినప్పుడు ప్రత్యేకమైన ‘హాప్టిక్’సూట్లను వేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్న సమయంలోనే వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ ద్వారా.. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఎలా మారుతూవచ్చాయన్నది కళ్ల ముందే కనిపించే సదుపాయం వచ్చేస్తుంది. ఇతర భాషల్లో ఎవరైనా మాట్లాడుతుంటే.. అప్పటికప్పుడు మనకు కావాల్సిన భాషలోకి మార్చి వినిపించే ‘ఇన్ ఇయర్’ పరికరాలు వస్తాయి. ఎక్కడైనా,ఏ భాష వారితోనైనా సులభంగా మాట్లాడొచ్చు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
విండోస్ యూజర్లకు షాక్ ! మైక్రోసాఫ్ట్ కీలక సూచన
విండోస్ ప్రింట్ స్పూలర్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్ హెచ్చిరించింది. ప్రింట్ స్పూలర్ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సెక్యూరిటీ ప్యాచ్ ‘ప్రింట్ స్పూలర్ కోడ్‌కి సంబంధించిన లోపాల కారణంగా విండోస్‌కి సంబంధించిన అన్ని వెర్షన్లకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోకి వాళ్లు ప్రింట్ స్పూలర్‌ని డిసేబుల్ చేయడం మంచిదని సూచించింది. -
ఆర్టీఏలో రశీదుల భారం
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న సామెతను గుర్తు చేస్తోందీ మన ఆర్టీఏ కార్యాయాలు, మీసేవా కేంద్రాల పరిస్థితి. పారదర్శకత కోసం రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఆన్లైన్ చేసిన లక్ష్యం నెరవేరింది. కానీ చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించి ప్రింటౌట్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులపై రోజుకు గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. వాహనదారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించకపోవడంతో ఇలా వినియోగదారుల నెత్తిన అదనపుభారం పడుతోంది. నేపథ్యమేంటి? 2016 ఆగస్టు నుంచి అప్పటి రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. ఇందుకు రవాణా శాఖతో మీ–సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగట్లేదు. లర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, చిరునామా మార్పు, ఫిట్నెస్, ఆర్సీ రెన్యువల్ ఇలా దాదాపు 56 సేవలకు కావాల్సిన వివిధ రకాల సేవల చార్జీలను ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీకి కనీస చార్జిగా రూ.35 నిర్ణయించారు. వీటిని ఆన్లైన్లో పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును సర్వీసు చార్జీ రూ.35తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చెల్లింపుల అనంతరం మీ–సేవా కేంద్రాలు రశీదులు ఇస్తారు. కానీ సంబంధిత ఫారం ప్రింటౌట్ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింటౌట్‌కు సంబంధిత ఇతర పత్రాలు జమచేసి రవాణా శాఖ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ప్రింటౌట్‌కు నెట్‌సెంటర్ల నిర్వాహకులు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రింటౌట్ ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా రోజులుగా సమస్య.. చాలా రోజులుగా మీ–సేవా కేంద్రాల్లో ప్రింటౌట్ సమస్య నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న మీ–సేవా కేంద్రాలు మాత్రమే ప్రింటౌట్లు ఇస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ప్రింటౌట్ ఇవ్వట్లేదు. దీంతో చేసేది లేక వినియోగదారులు బయటి నుంచి రూ.20 నుంచి 30 వరకు మరోసారి చెల్లిస్తున్నారు. ఒకసారి సర్వీసు చార్జీ చెల్లించాక మరోసారి ప్రింటౌట్‌కు డబ్బులు సమర్పించుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.5 లక్షలకుపైగా భారం పడుతోదని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ వాపోయారు. ప్రభుత్వం రూ.35 సర్వీసు చార్జీ వసూలు చేశాక మరోసారి ప్రింటౌట్ కోసం చెల్లించాల్సి రావడం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మీసేవా కేంద్రాలు ప్రింటౌట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారం, అవగాహన లేకపోవడమే కారణం.. దరఖాస్తు చేసునేందుకు వినియోగదారులు నేరుగా రవాణా కేంద్రంలోనే ఈ ఫారంలను ప్రింటౌట్ తీసుకోవచ్చని మీసేవా కేంద్రాల నిర్వహణ చూసే ఈఎస్డీ కమిషనర్ వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. వియోగదారులు అవగాహన లేకే ప్రింటౌట్లకు అదనంగా రూ.30 చెల్లిస్తున్నారని వివరణ ఇచ్చారు. ఆర్టీఏ కార్యాలయాలు... లావాదేవీలు ఒక్కో కార్యాలయంలో రోజుకు జరిగే కనీస లావాదేవీలు 300కుపైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల సంఖ్య 74 ఒక రోజుకు జరిగే లావాదేవీలు 22,200 (దాదాపుగా) మీ–సేవాల్లో ఒకరోజు వినియోగదారులు చెల్లించే సర్వీసుచార్జీలు రూ.7,77,000కుపైగా నెలలో 22 పనిదినాలకు చెల్లించే మొత్తం రూ.1,70,94,000 ఏటా మీ–సేవాకు అందుతున్న చార్జీల మొత్తం రూ.20,51,28,000కుపైగా -
కణజాలాల ముద్రణకు మార్గం సుగమం...
వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుందిగానీ.. యుటా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు శరీర కణజాలాన్ని త్రీడీ పద్ధతిలో ముద్రించేందుకు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ప్రమాదవశాత్తూ లేదా జబ్బుల కారణంగా దెబ్బతినే కణజాలం, లిగమెంట్, టెండాన్ల స్థానంలో త్రీడీ పద్ధతిలో ముద్రించిన భాగాలను వాడుకోవచ్చునని అంచనా. రోగి శరీరం నుంచి మూలకణాలను సేకరించడం.. వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన త్రీడీప్రింటర్ ద్వారా హైడ్రోజెల్పై టెండాన్ లేదా లిగమెంట్ ఆకారంలో పలుచటి పొరగా ఏర్పాటు చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. ఆ తరువాత కణాలు ఎదిగేందుకు తగిన పోషకాలను అందిస్తే చాలని.. సహజసిద్ధమైన శరీరభాగాలు రెడీ అవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ ఏడ్. వినేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా.. ఈ ప్రక్రియ సంక్లిష్టమైందని.. వేర్వేరు కణాలను సంక్లిష్టమైన ప్యాటర్న్లలో ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని అంటున్నారు డేవిడ్. నియాన్ బల్బుల మాదిరిగా వెలుగులు చిమ్మే జన్యుమార్పిడి కణాలను వాడటం ద్వారా తాము ఈ పద్ధతిని పరీక్షించి చూశామని తెలిపారు. ప్రస్తుతం ఎవరి కణజాలాన్ని అయినా మార్చాలంటే శరీరంలోని ఇతర భాగాల నుంచి సేకరించడం లేదంటే మత శరీరాల నుంచి సేకరించడం మాత్రమే మార్గం. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పద్ధతి ప్రాధాన్యం సంతరించుకుంది. -
రైల్వే టికెట్‌తో ఇబ్బందులు
రైల్వే శాఖ తప్పిదంతో మానసిక వేదన అనుభవించిన ఆ వృద్ధుడు.. చివరకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. బలవంతంగా రైలు దించేయటంతో రైల్వే శాఖపై పోరాటానికి దిగారు. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... లక్నో: షరన్పూర్కు చెందిన రిటైర్డ్ ఫ్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా(72) 2013లో నవంబర్ 19వ తేదీన కన్నౌజ్ వెళ్లేందుకు టికెట్‌ను తీసుకున్నారు. అయితే టికెట్ ప్రింట్ మీద 2013కి బదులు.. 3013గా ముద్రణ అయ్యింది. అది గమనించని విష్ణుకాంత్.. రైల్వే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీసీ తనిఖీలో వెయ్యి సంవత్సరాల తర్వాత తేదీ ముద్రించి ఉండటం గమనించిన ఆయన ఖంగుతిన్నారు. టీసీ రూ.800 ఫైన్ రాయటంతో ఆయన వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో ఆయన్ని బలవంతంగా తర్వాతి స్టేషన్లో కిందకు దించేశారు. ఈ వ్యవహారంపై ఆయన షరన్పూర్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, విచారణ కొనసాగుతూ వస్తోంది. ‘అందరి ముందు తనను అవమానించారని, అందుకు పరిహారం చెల్లించాలని’ విష్ణుకాంత్ వాదించగా, టికెట్ జారీ అయ్యాక పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని రైల్వే శాఖ వాదించింది. అయితే ఫోరమ్ చైర్మన్ మాత్రం రైల్వే శాఖ వాదనతో విబేధించారు. ‘70 ఏళ్ల వృద్ధుడ్ని మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని’ రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం కింద రూ.10,000 మరియు టికెట్ ధర.. వడ్డీతో కలిపి మరో రూ.3 వేలు చెల్లించాలని ఫోరమ్ బుధవారం తీర్పు వెలువరించింది. -
ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్‌కు ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డ్సు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ప్రింట్ ఎక్స్‌ల్ –2017 అవార్డ్సును ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ అందుకుంది. ఈ నెల 8న చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి విశ్వేశరావు, టెక్నికిల్ హెడ్ ఈలి సతీష్, గ్రాఫిక్స్ డివిజన్ ప్రింట్ టీమ్ ఎంవీ గోపీనాథ్‌లు హెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అలెన్బార్ షానీ, హెచ్‌పీ హెడ్ టీమ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి సుమారు 1400 ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా ఫొటో బుక్ , కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలలో ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్తమ ఫొటో బుక్ విన్నర్, కమర్షియల్ ప్రింట్ కేటగిరీ విన్నర్, ఓవర్ఆల్ గ్రాండ్ విన్నర్ అవార్డులను సంస్థ కైవసం చేసుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుసగా ఇంటర్నేషనల్ ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డులను అందుకున్న ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థను హెచ్‌పీ ఇంటర్నేషనల్, హెచ్‌పీ భారత్ టీమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ మాట్లాడుతూ గిగిగి .pటజీn్టౌnజీఛ్చి.ఛిౌఝ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రింటింగ్ సేవలను ప్రపంచ స్థాయిలో తమ వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. అడ్వాన్స్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో లైఫ్ టైమ్ ప్రింట్ క్వాలిటీతో లైట్ వైట్ వాటర్ ప్రూప్ ఫొటోబుక్స్ భారతదేశంలోని పలు ఫొటోగ్రాఫీ ప్రొఫెషనల్స్‌కు ,గ్రాఫిక్ డిజైనర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు. -
నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
-
‘కరెన్సీ’పై అంబేడ్కర్ ఉండాల్సిందే!
అరండల్‌పేట: ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి డిమాండ్ చేశారు. ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ కార్యాలయంలో శనివారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండియా రూపాయి ఇలా ఉండాలని సృష్టించిన కర్త అంబేడ్కర్ అని అన్నారు. అంబేడ్కర్ బొమ్మను ఇండియా కరెన్సీపై ముద్రించాలని ఆర్థిక శాఖ మంత్రికి ఫ్యాక్స్ రూపంలో వినతి పత్రం పంపించామన్నారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళతామన్నారు. -
భారత పటాన్ని తప్పుగా చూపితే 100 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: భారత దేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం ... భారత భౌగోళిక సమాచారాన్ని సేకరించడం, ప్రచురించడం, పంపిణీచే యడానికి ముందు సదరు సంస్థ తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. -
మెమోలో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో
నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కొప్పు గణేష్ చిట్యాల మండలం వట్టిమర్తి జెడ్పీహెచ్ఎస్లో గత ఏడాది టెన్త్ చదవాడు. వార్షిక పరీక్షల్లో గణితంలో ఫెయిల య్యాడు. సప్లిమెంటరీ పరీక్షల్లో సీ-2 గ్రేడ్‌తో పాసయ్యాడు. బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన మెమోలో అమ్మాయి ఫొటో ప్రింట్ అయ్యింది. దీంతో మెమోలో ఫొటోను సరి చేయాల్సిందిగా విద్యార్థి మరోమారు బోర్డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. -చిట్యాల -
పాఠ్య పుస్తకాలేవీ?
జిల్లాకు రాని పుస్తకాలు 15,60,090 అవసరం ఇప్పటివరకు రాని వైనం గతేడాది ఇదే సమయూనికి 70 శాతం చేరిక విద్యారణ్యపురి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది తొందరగా వచ్చినా.. ఏటా పాఠ్యపుస్తకాలు అందడం ఆలస్యం అవుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటారుు. అంటే జూన్ మాసంలో పుస్తకాలు విద్యార్థులకు అందించాలి. కానీ, ఇప్పటివరకు జిల్లాకే చేరుకోలేదు. కనీసం ముద్రణ కూడా కాలేదని సమాచారం. విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వ గోదాముల నుంచి జిల్లా అధికారులకు, ఈ అధికారుల నుంచి మండల గోడౌన్లకు.. అక్కడి నుంచి ఉపాధ్యాయులకు.. వీరు విద్యార్థులకు పంపిణీ చేయూలి. ఇదంతా జరగాలంటే మార్చిలోనే పుస్తకాలు జిల్లాకు చేరుకుని ఉండాలి. కానీ, రాలేదు. పుస్తకాలు అందడం అనుమానమే.. కాగా, జిల్లాలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 183 టైటిల్ పుస్తకాలు, 17,16,099 పాఠ్యపుస్తకాలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 15,60,090 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి, మిగితావి అమ్మకాల కోసం ప్రతిపాదించారు. గతేడాది 26 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రతిపాదించగా.. ఇందులో గత ఏప్రిల్ 1 వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నారుు. ఏప్రిల్ 23 తేదీ వరకు విద్యార్థులకు పంపిణీ అయ్యూరుు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 వచ్చినా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోలేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపలేదని సమాచారం. 2014 సెప్టంబర్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. గతేడాది జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాల్లో వివిధ టైటిల్స్ కలిపి 2 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ డిపోలోనే మిగిలి ఉన్నారుు. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పేరిట ఉన్నారుు. ఈ పుస్తకాలు కూడా పనికిరావు. జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేటు విద్యార్థులకు కూడా శాపం జిల్లాలో 1,637 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి అందు లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 3,19,250 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు మార్కెట్లోకి వస్తేనే ఆయా విద్యార్థులు కూడా పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యానికి కారణాలు.. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సిలబస్‌ను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలలో తెలంగాణ గురించి, మహనీయుల చరిత్ర అంశాలను చేర్చాలని చూస్తోంది. తెలంగాణ రాష్ర్టం పేరిట పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. మార్పుల కోసం సంబంధిత కమిటీ నివేదిక అందజేసినా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. ఆమోదం తర్వాతే ముద్రణ ప్రారంభమవుతుంది. -
కొత్త రూపాయి నోటు వచ్చింది
20 ఏళ్ల తర్వాత మళ్లీ ముద్రణ న్యూఢిల్లీ: సుమారు 20 ఏళ్ల విరామం తర్వాత సరికొత్త హంగులతో ఒక్క రూపాయి నోటు ముద్రణ మళ్లీ మొదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఇది తాజాగా విడుదలైంది. రాజస్థాన్‌లో నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయంలో మహర్షి ఈ నోటును విడుదల చేశారు. మిగతా కరెన్సీ నోట్లతో పోలిస్తే ఈ రూపాయి నోటుకో ప్రత్యేకత ఉంటుంది. మిగతావన్నీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ఉంటే.. ఈ రూపాయి నోటుపై మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది. ప్రత్యేకతలు ఇవీ...: కొత్త రూపాయి నోటు 110 మైక్రాన్ల మందంతో ఉంటుంది. వాటర్‌మార్కుగా అశోక స్తంభం చిహ్నం (సత్యమేవ జయతే పదాలు లేకుండా) ఉంటుంది. నోటు మధ్యలో ఒక అంకె, కుడివైపున ఒక పక్కగా భారత్ (హిందీలో) అనే పదం దాగి ఉంటాయి. నోటు ముందు భాగంలో ఆర్థిక శాఖ కార్యదర్శి మహర్షి సంతకం రెండు భాషల్లో ముద్రించి ఉంటుంది. ముద్రణా వ్యయం పెరిగిపోవడం వల్ల 1994లో ఒక్క రూపాయి నోటు ముద్రణ నిలిచిపోయింది. -
సీపీ చెబితే నేర్చుకునే పరిస్థితిలో మీడియా లేదు
ఏపీయూడబ్ల్యూజే గాంధీనగర్ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు కమిషనర్ చెబితే నేర్చుకునే స్థితిలో మీడియా వారు లేరని, ఆయన చేసిన ప్రకటనలోని కథనమే నిజమని భావించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. కళ్యాణ్ కేసు విషయంలో ఎవరితోనైనా దర్యాప్తు చేయించేందుకు అభ్యం తరం లేదని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు జర్నలిస్టులకు సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, తపన, ఆలోచన లేదని చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. పౌరుల శాంతియుత జీవనంలో మీడియా పోషిస్తున్న ప్రధాన పాత్ర పోలీసు కమిషనర్‌కు తెలియదా? అని వారు ప్రశ్నిం చారు. మీడియాలో వచ్చే కథనాల్లోని వాస్తవాలు జీర్ణించుకోవడం అందరికీ శ్రేయస్కరమని, అవి తప్పనే రీతిలో ప్రజలకు తప్పుడు సంకేతాలు మీద్వారా అందించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిం చారు. జరిగిన ఘటనలపై అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వార్తలు ప్రచురితం, ప్రసారం అవుతాయని సీపీలాంటి పెద్దలకు తెలియంది కాదని వారు హితవు పలికారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాను చులకన భావంతో చూడవద్దని కోరారు. జర్నలిస్టులను సమాజ ద్రోహులుగా చెప్పాలనుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని వారు సూచించారు. ప్రకటన జారీ చేసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, కృష్ణా అర్బన్ అధ్యక్షుడు జి.రామారావు, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ ఉన్నారు. -
కదం తొక్కిన కలం యోధులు అనంతపురం
క్రైం : పింఛన్ల అక్రమ తొలగింపు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ‘సాక్షి' స్టాఫ్ ఫొటోగ్రాఫర్ వీరేష్, విలేకరి రమణారెడ్డిలపై టీడీపీ కార్యకర్తల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు గళమెత్తారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి, అనంతపురం : జర్నలిస్టులపై దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. శింగనమలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, ప్రజాసంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ రామారావుకు వినతి పత్రం అందజేశారు. గుంతకల్లులోని ప్రెస్‌క్లబ్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో చేశారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ అర్బన్ సీఐ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. పెద్దవడుగూరులో ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కళ్యాణదుర్గంలో ఏపీయూడబ్ల్యూజే మండల శాఖ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో రిపోర్టర్లు, యువరాజ్యం, నెపోలియన్ ప్రజాసంఘాల నాయకులు ర్యాలీ చేశారు. సీఐ వంశీధర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గంలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆర్అండ్బీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తర్వాత డిప్యూటీ తహశీల్దార్ బాలకిషన్‌కు వినతిపత్రం అందజేశారు. రాప్తాడులో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి బస్టాండ్ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అక్కడ రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ధర్మవరంలో కాలేజీ సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత పట్టణ సీఐ ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి పుల్లయ్య ఆధ్వర్యంలో రిపోర్టర్లు, వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక సత్యమ్మగుడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీసుస్టేషన్లో సీఐ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్లు రెండుగంటల పాటు ఆందోళన చేశారు. పెనుకొండలో జర్నలిస్టులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. గుత్తి పట్టణంలోని గాంధీసర్కిల్లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి..సీఐ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి
కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి సుబేదారి : జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు బుధవారం కలెక్టర్ జి.కిషన్‌ను కోరారు. బుధవారం కలెక్టర్ కిషన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్ మాట్లాడారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారని అన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో సుమారుగా 800 మంది జర్నలిస్టుల పిల్లలు ఇందుకు అర్హులని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి ఉచిత విద్యను అందజేయాలని వారు కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ జి. కిషన్ స్పందిస్తూ రంగారెడ్డి జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని, జిల్లా విద్యాశాఖాధికారికి ఈ విషయమై ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐజేయూ నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి విఠల్, తోట సుధాకర్, జిల్లా నాయకులు కంకణాల సంతోష్, సదాశివుడు, ఎండీ.వాజిద్, గోకారపు శ్యాం, బి.సునిల్‌రెడ్డి, నవీన్, ప్రదీప్ పాల్గొన్నారు.