ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్‌కు ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డ్సు
ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్‌కు ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డ్సు
Published Sat, May 13 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ప్రింట్ ఎక్స్‌ల్ –2017 అవార్డ్సును ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ అందుకుంది. ఈ నెల 8న చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి విశ్వేశరావు, టెక్నికిల్ హెడ్ ఈలి సతీష్, గ్రాఫిక్స్ డివిజన్ ప్రింట్ టీమ్ ఎంవీ గోపీనాథ్‌లు హెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అలెన్‌బార్ షానీ, హెచ్‌పీ హెడ్ టీమ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి సుమారు 1400 ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా ఫొటో బుక్ , కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలలో ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్తమ ఫొటో బుక్ విన్నర్, కమర్షియల్ ప్రింట్ కేటగిరీ విన్నర్, ఓవర్‌ఆల్ గ్రాండ్ విన్నర్ అవార్డులను సంస్థ కైవసం చేసుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుసగా ఇంటర్నేషనల్ ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డులను అందుకున్న ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థను హెచ్‌పీ ఇంటర్నేషనల్, హెచ్‌పీ భారత్ టీమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ మాట్లాడుతూ గిగిగి .pటజీn్టౌnజీఛ్చి.ఛిౌఝ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఆన్‌లైన్ ప్రింటింగ్ సేవలను ప్రపంచ స్థాయిలో తమ వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. అడ్వాన్స్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో లైఫ్ టైమ్ ప్రింట్ క్వాలిటీతో లైట్ వైట్ వాటర్ ప్రూప్ ఫొటోబుక్స్ భారతదేశంలోని పలు ఫొటోగ్రాఫీ ప్రొఫెషనల్స్‌కు ,గ్రాఫిక్ డిజైనర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement