Lab
-
ఆన్లైన్ ఆకతాయిలపై సైబర్ గస్తీ!
సాక్షి, హైదరాబాద్: బస్‌స్టాప్‌లు, కార్యాలయాలు, మార్కెట్లు, సినిమాహాళ్లు.. ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులను వేధించే పోకిరీలను గతంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తర్వాత ఆన్లైన్ ఆకతాయిలు ఎక్కువయ్యారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై అడ్డగోలుగా కామెంట్లు పెట్టడం.. వ్యక్తిగతంగా సందేశాలు పంపి విసిగిండం.. ఆన్లైన్లో అశ్లీల పనులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ఆన్లైన్ ఆకతాయిల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు ఆన్లైన్ గస్తీ నిర్వహిస్తున్నారు.పలు సోషల్ మీడియా ఖాతాలతోపాటు, టిండర్, ట్రూలీమ్యాడ్లీ, బుమ్లే వంటి డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో ప్రవేశించి ఆన్లైన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ సైబర్ ల్యాబ్ సిబ్బంది అత్యాధునిక సాంకేతికత, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించి ‘హద్దుదాటే’వారికి బుద్ధి చెబుతున్నారు. తెలంగాణకే పరిమితం కాకుండా తాము గుర్తించిన లీడ్స్ (సమాచారం)తో ఇతర రాష్ట్రాల్లోని నిందితులను కూడా కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లోని సీఎస్ఏఎం లింకుల గుర్తింపు షీ సైబర్ ల్యాబ్ ఇప్పటివరకు చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం)కు సంబంధించి 180 లీడ్స్‌ను గుర్తించింది. చిన్నారుల అశ్లీల వీడియోలు ఈ ముఠాలు ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టు కీలక ఆధారాలు సేకరించడంతోపాటు 65 ఇంటెలిజెన్స్ రిపోర్టులను మొత్తం 13 రాష్ట్రాలకు పంపారు. వీటి ఆధారంగా దేశవ్యాప్తంగా 20 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి, 21 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాలు టెలిగ్రామ్‌లో గ్రూప్‌లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తూ.. గూగుల్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. కీలకంగా షీ సైబర్ ల్యాబ్స్త్రీలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు మహిళా భద్రతా విభాగంలో షీ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక సాంకేతిక, పరిశోధనాత్మక మద్దతును అందిస్తూ, ఎక్సలెన్స్ సెంటర్‌గా పనిచేస్తుంది. సైబర్ అడ్వొకసీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్వెస్టిగేటివ్ అసిస్టెన్స్, సైబర్ క్రైమ్ సపోర్ట్‌పై దృష్టి సారిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీసు సంస్థలకు సహాయం అందిస్తోంది. నేరస్థులను గుర్తించడం కోసం డేటా అనలిటిక్స్ అందించడం ద్వారా వివిధ విభాగాలకు సహాయం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు సైబర్ ఫోరెన్సిక్ మద్దతును అందిస్తోంది ఇతర రాష్ట్రాల్లోని నేరస్థులనూ గుర్తిస్తున్నాం మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిపై, ఆన్లైన్లో అనుమానాస్పద చర్యలకు పాల్పడేవారిపై షీ సైబర్‌ల్యాబ్ ద్వారా నిఘా పెడుతున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల క్రిమినల్ నెట్‌వర్క్‌లను కూడా గుర్తిస్తున్నాం. మేం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు ఒకరిని అరెస్టు చేయటంతో చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తున్న ముఠా వివరాలు తెలిశాయి. –శిఖా గోయల్ డీజీ, మహిళా భద్రత విభాగం -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్‌లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్‌లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్‌ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్‌లో ప్రచురించారు. -
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్‌లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏఐ’ బడి
చీపురుపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శకం ఆరంభమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లలో సైతం ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంటెల్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అధునాతన ఏఐ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్రంలోనే తొలి ఏఐ ల్యాబ్ కావడం విశేషం. ఈ ల్యాబ్ పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు మార్గదర్శి కానుంది. సమాజానికి ఉపయోగపడే ఆధునిక ఆవిష్కరణలకు దోహదపడనుంది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లలో ‘ఏఐ ఫర్ యూత్’ అనే పేరుతో నాలుగు సెషన్లలో 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మొదటి సెషన్లో ఇన్‌సై్పర్, రెండో సెషన్లో ఎక్వయర్, మూడో సెషన్లో ఎక్స్పీరియన్స్, నాలుగో సెషన్లో ఎంపవర్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు సెషన్లు పూర్తయిన తర్వాత సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. రూ.15 లక్షలతో ల్యాబ్ ఏర్పాటు రాష్ట్రంలో తొలిసారిగా రూ.15 లక్షలతో చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో తొమ్మిది అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, ఏసీలు ఉన్నాయి. దీనికోసం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గదిని కేటాయించారు. విద్యార్థులకు వరం ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు వరం. రాష్ట్రానికి ఒక ల్యాబ్ కేటాయిస్తే దానిని చీపురుపల్లిలో ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. విద్యార్థులు ఈ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో ఎంతో అవసరమైన అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. – ఏవీఆర్‌డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్ కన్సల్టేటర్ -
వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే..
'సినిమాల్లో హ్యుమనాయిడ్ రోబోను చూడగానే పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. సినిమాల్లో కనిపించే రోబో క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెడితే? ‘అబ్బో! ఆ అల్లరికి అంతు ఉండదు’ అనుకుంటాం. అయితే ‘ఐరిష్’ అనే ఈ రోబో ముందు మాత్రం పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే. ఇంతకూ ఎవరీ ఐరిష్?' కేరళలోని తిరువనంతపురం కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ లోకి ఫస్ట్ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ ఐరిష్ అడుగు పెట్టింది. ఈ హ్యుమనాయిడ్ ఉపాధ్యాయురాలు మూడు భాషల్లో మాట్లాడగలదు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలదు. ఎడ్టెక్ ‘మేకర్ల్యాబ్స్’ రూపకల్పన చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ కేరళలోనే కాదు దేశంలోనే మొదటిది. ‘ఐరిష్ నాలెడ్జ్బేస్ ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది’ అంటుంది మేకర్ ల్యాబ్స్. చదువుకు సంబంధం లేని సబ్జెక్ట్‌ల జోలికి ‘ఐరిష్’ వెళ్లదు. ‘కృత్రిమ మేధతో అవకాశాలు అనంతం అని చెప్పడానికి ఐరిష్ ఒక ఉదాహరణ. పిల్లలు అడిగే సందేహాలకు టీచర్‌లాగే ఐరిష్ సరిౖయెన సమాధానాలు ఇవ్వగలదు’ అంటున్నారు ‘మేకర్ల్యాబ్స్’ సీయీవో హరిసాగర్. ‘మేకర్ల్యాబ్స్తో కలిసి ఎన్నో రకాల వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటి ద్వారా పిల్లలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ మీరా ఎంఎన్. ఇవి చదవండి: International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే? జీవితంపై అధికారం హక్కులపై ఎరుక -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్‌పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్‌ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్‌కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్‌ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్‌కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్‌లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్‌కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్‌ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్‌కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్‌కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్‌లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్‌ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్‌కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్‌లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్‌లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. ల్యాబ్‌లో ఏబ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్‌గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్‌గా నిలిచింది. ల్యాబ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్‌లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్‌లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్‌లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్‌లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్‌లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్‌లో బీటీ, హెచ్‌టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్‌లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్‌ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్‌ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్‌ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్‌లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
భారత్‌లో నోకియా 6జీ ల్యాబ్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా భారత్‌లో తమ 6జీ ల్యాబ్‌ను నెలకొల్పింది. కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. భారత్‌ను నూతన ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల సాధన దిశగా ఇది మరో ముందడుగని ఆయన తెలిపారు. సురక్షితమైన రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర విభాగాలకు ఉపయోగపడగలిగే 6జీ టెక్నాలజీ ఆధారిత నవకల్పనలపై ఈ ల్యాబ్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరులోని తమ గ్లోబల్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్లో నోకియా దీన్ని ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికే 6జీ టెక్నాలజీలో 200 పైచిలుకు పేటెంట్లు దక్కించుకుంది. -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్‌మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్‌పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్సెంట్–ఎల్జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది. స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు, ఉపాధి అవకాశాలను .. ఎల్జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్సెంట్–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2020లో బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2025 నాటికి సింథటిక్ డైమండ్ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్ వేపర్ డిపోజిషన్ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. (ఇదీ చదవండి: కొత్త బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు) -
కరోనా వైరస్.. మానవ నిర్మితమే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్ మానవ నిర్మితమేనని చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ చెప్పారు. తాజాగా విడుదల చేసిన తన పుస్తకం ‘ది ట్రూత్ ఎబౌట్ వూహాన్’లో సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) నుంచి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ లీక్ అయ్యిందని వెల్లడించారు. చైనా ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు తెలుసని వివరించారు. చైనాకు అమెరికా బయోవెపన్ సాంకేతికతను అందజేస్తోందన్నారు. సరైన భద్రతా చర్యలు లేని ప్రయోగాల కారణంగా వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటకు వచ్చిందని స్పష్టం చేశారు. జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి చర్యలు ఆ ల్యాబ్‌లో లేవని ఆండ్రూ హఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)తో చైనాలోని వూహాన్ ల్యాబ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఎన్ఐహెచ్ నుంచి అందే నిధులతో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై వూహాన్ ల్యాబ్ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ప్రస్తావించారు. -
కరోనా పుట్టుకకు అగ్రరాజ్యమే కారణం...వెలుగులోకి షాకింగ్ నిజాలు
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ అంతా డ్రాగన్ దేశాన్ని ఆడిపోసుకున్నారు. కానీ అసలు కారణం అగ్రరాజ్యం అని యూఎస్‌కి చెందిన ఒక పరిశోధకుడు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనాలోని ప్రుభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధన కేంద్రం నుంచే కరోనా వైరస్ లీకైందని పేర్కొంది కూడా ఈ శాస్త్రవేత్తే. ఈ మేరకు యూఎస్ పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తాను రాసిన 'దిట్రూత్ అబౌట్ వ్యూహాన్' అనే పుస్తకంలో ఈ విషయాల గురించి వెల్లడించాడు. చైనాలో రిసెర్చ్ సెంటర్లోని కరోనా వైరస్ పరిశోధనలకు యూఎస్ ప్రభుత్వమే నిధులందిస్తోందని చెప్పారు. ఐతే చైనా ల్యాబ్‌లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్ లీక్ అయినట్లు తెలిపారు. ఇది మానవ నిర్మిత వైరస్ అని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్‌తో కూడినవని, వీటికి సరైన భద్రత తోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించ గలిగేలా ల్యాబ్‌లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. అంతేగాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) అనేది అమెరికా ప్రభుత్వం ప్రాథమిక ఏజెన్సీ. ఈ ఎన్ఐహెచ్ అంటువ్యాధులపై అధ్యయనం చేసే లాభప్రేక్ష లేని ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా నిధులు సమకూర్చిందని చెప్పారు. పైగా ఈ సంస్థ వ్యూహాన్ ల్యాబ్‌తో టైఅప్ అయ్యి ఈ కరోనా వైరస్‌పై మరింతగా పరిశోధనలు చేసిందని, ఫలితంగానే ఈ వైరస్ లీక్ అయ్యిందని చెప్పారు. శాస్త్రవేత్త హాఫ్ 2014 నుంచి 2016 వరకు ఈ ఎకోహెల్త్ అలియన్స్ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్ సంస్థ ఈ కరోనా వైరస్‌ను సృష్టించే పరిశోధన పద్ధతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వ్యూహాన్ ల్యాబ్‌కు సాయం చేసినట్లు తెలిపారు. ఇది జన్యు పరంగా సృష్టించిన వైరస్ అని చైనాకు ముందు నుంచే తెలుసునని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీ చైనాకు అందించింది యూఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు నిలయంగా మారింది. ఐతే వ్యూహాన్ పరిశోధన సంస్థకు వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిని పెంచుకునేలా అధికస్థాయిలో శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
యూనియన్ బ్యాంక్ ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. బ్యాంక్‌నకు చెందిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దీనిని ఏర్పాటు చేసింది. బ్యాంక్ సమాచార వ్యవస్థలు, డిజిటల్ ఆస్తులు, విభా గాలను సైబర్ దాడుల నుండి రక్షించడానికి రక్షణ యంత్రాంగాన్ని రూపొందించడం ఈ ల్యా బ్ లక్ష్యం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ.మణిమేఖలై శుక్రవారం ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ఈడీలు నితేశ్ రంజన్, రజనీశ్ కర్నాటక్, నిధు సక్సేనా పాల్గొన్నారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోలు మనుషులకు మద్దతు మాత్రమే ఇస్తాయని, మనుషుల స్థానాన్ని భర్తీ చేయవని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు. రోబోలను తయారు చేయ డానికి, వాటి సేవలను విస్తృతపరచడానికి నగరంలోని టి–హబ్ వేదికగా అతిపెద్ద రోబోటిక్స్ ఆర్ అండ్ డి ఎకో సిస్టమ్‌తో హెచ్–ల్యాబ్‌ను హెచ్–బోట్స్ ఆవిష్క రించింది. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం లు మాట్లాడుతూ.. జనాభాలో 15 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడే రోబోలను తప్పనిసరిగా తయారు చేయాలని హెచ్–బోట్స్‌ను కోరారు. కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ఇన్నో వేషన్ సెల్ విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్ శాంత థౌతం తెలిపారు. హెచ్–ల్యాబ్‌లతో రోబోటిక్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురానున్నామని ఫౌండర్ కిషన్ పేర్కొన్నారు. -
వైద్య పరీక్షలకు ప్రైవేటుకెందుకు?
సాక్షి, సిద్దిపేట: గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం వెళ్తే ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రికి కానీ, స్కానింగ్ సెంటర్లకు కానీ వెళ్లొద్దని.. ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని చెప్పారు. మంగళవారం సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. పట్టణ శివారులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పీహెచ్సీ నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు టీ డయాగ్నొస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్‌సీలకు గుండెనొప్పితో వచ్చేవారి కోసం ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ తదితర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్‌లు, హైదరాబాద్ జంట నగరాలలో అదనంగా మరో 10 ల్యాబ్‌లు ప్రారంభిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో రూ.40 వేల విలువ గల ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తూ.. ప్రమాదకరమైన గుండెపోటు (స్టెమీ) రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అన్నీ జిల్లాల్లో ఈ ‘స్టెమీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే, ఇవాళ ఏడేళ్లలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గతంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్రమే ఉండేవని, ఇప్పుడు 2,840 సీట్లు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 5,240 సీట్ల పెంపునకు కృషి చేస్తామన్నారు. మా తండ్రివయ్యా హరీశ్‌రావు స్థానిక ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు పలువురికి సొంత ఖర్చుతో కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ చేయించుకున్న విఠలాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాలవ్వ వద్దకు వెళ్లిన మంత్రి.. ‘అవ్వా నేనెవరినీ..?’ అం టూ ప్రశ్నించారు. దానికి ఆమె ‘మా తండ్రివయ్యా హరీశ్‌రావు నువ్వు..’అంటూ బదులిచ్చింది. కాగా ‘నీకు మంచిగ చూశారా, ఇక నుంచి నీకు కండ్లు మంచిగ కనపడతాయి, మీ ఊరు నుంచే కంటి పరీక్షలు మొదలు పెట్టాం..’అని మంత్రి చెప్పారు. -
సింహం సిక్స్టీ ఫైవ్.. పులి కబాబ్ ట్రై చేస్తే..!
చికెన్, మటన్ ఎప్పుడూ తినేవే.. అదే ఏనుగు లెగ్ కర్రీనో, చిరుతపులి ఫ్రైనో ట్రై చేస్తే.. వామ్మో ఏమిటివి అనిపిస్తోందా? ఇవేవో జస్ట్ పేర్లు కాదు. ఆ జంతువుల మాంసంతో చేసే వంటకాలే. కాకపోతే ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులను ఏమీ చంపడం లేదు. మరి ఆ మాంసం ఎలా వస్తుంది అంటారా.. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మాంసం కాని మాంసం.. జంతువులు, పక్షులను వధించి మాంసం వినియోగించడంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొక్కలు, నాచు సంబంధిత పదార్థాలతో మాంసం వంటి ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నారు. కానీ అవేవీ మాంసం వంటి అనుభూతిని కలిగించలేవు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షుల జీవకణాలను కృత్రిమంగా పెంచి మాంసం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చికెన్ వంటివాటిని తయారు చేశారు కూడా. ఎవరూ ఊహించని రీతిలో.. కృత్రిమ మాంసం రూపకల్పనకు సంబంధించి లండన్‌కు చెందిన ప్రిమెవల్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ చిత్రమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. చికెన్, మటన్, బీఫ్ వంటి సాధారణమైనవి కాకుండా.. ఎవరూ ఊహించని రీతిలో సింహం, పులి, ఏనుగు వంటి మాంసాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో జంతువులను చంపడంగానీ, హింసించడంగానీ ఉండదు. ఆయా జంతువుల నుంచి సేకరించిన కొద్దిపాటి రక్తం, ఇతర కణాల నుంచి.. ల్యాబ్‌లో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. రుచి.. బలం.. ఎక్కువట! ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్, బీఫ్ వంటివి పెద్ద రుచిగా ఉండవని, వాటి నుంచి అందే పోషకాలు కూడా తక్కువేనని ప్రిమెవల్ ఫుడ్స్ కంపెనీ స్థాపనకు పెట్టుబడులు పెట్టిన ఏస్ వెంచర్స్ ప్రతినిధి యిల్మాజ్ బొరా అంటున్నారు. ‘‘కోళ్లు, మేకలు, పశువుల పెంపకం సులువు కాబట్టే.. వాటి మాంసాన్ని మనం వినియోగిస్తున్నాం. వాటిలో కొలెస్టరాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. అదే కృత్రిమంగా మాంసం ఉత్పత్తి చేయగలిగినప్పుడు కూడా వాటితో పనేముంది? బాగా రుచిగా ఉండే, ఎక్కువ పోషకాలు ఉండే భిన్నమైన జంతువుల వైపు మేం దృష్టిపెట్టాం. ఉదాహరణకు మంచి నిద్ర, మూడ్ ఉండేందుకు చిరుతపులి మాంసాన్ని.. మెదడు పనితీరు మెరుగుపర్చే ఏనుగు మాంసాన్ని మనం భవిష్యత్తులో తినబోతున్నాం’’ అని చెప్తున్నారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమేనని, ఇంకా అద్భుతమైన ఆహార అనుభూతినీ పొందడం ఖాయమని పేర్కొంటున్నారు. -
80 దేశాలకు విత్తనాల ఎగుమతులు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్‌ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు
Covid Leak From Wuhan Lab: ఈ కరోనా మహమ్మారికి కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని వేలెత్తి చూపించిన వేటిని లక్ష్యపెట్టక ఇప్పటికీ తనదైన శైలిలో దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. అంతేకాదు కోవిడ్ మూలాలుపై స్వతంత్ర దర్యాప్తు కోసం కాన్బెర్రా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయిన డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. మరోవైపు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వుహాన్ ల్యాబ్ భాద్యతలు తీసుకునే నిమత్తం చుట్టూ ఆర్మీ జనరల్‌ను మోహరించడం, కరోనా వైరస్‌కి సంబంధించిన విషయంలో ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించకుండా తప్పుడూ కథనాలను ఇచ్చేందుకు ప్రయత్నించిందని ప్రోవిడెన్స్ నివేదిక వెల్లడించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మీడియా వుహాన్ లాక్‌డౌన్‌ను డాక్యుమెంట్ చేసినందుకు ఒక చైనీస్ జర్నలిస్టును జైలులో పెట్టారు. పైగా ఈ కరోనా మహమ్మారీ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిందని ఈ మహమ్మారీతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశామని ఇక దీనిపై విచారించాల్సింది, రుజువు చేయాల్సింది ఏమి లేదంటూ చైనా బుకాయిస్తోంది. అంతేకాదు కోవిడ్ -19 మూలానికి సంబంధించిన ప్రచురణలపై కూడా ఆంక్షలు జారీ చేసింది. మరోవైపు ల్యాబ్ లీక్‌లు జరుగుతాయని, దేశంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అడ్డకోలుగా మాట్లాడుతోంది. అంతేకాదు డిసెంబర్ 2021లో తైవాన్ అధికారికంగా SARS-COV-2 ల్యాబ్ లీక్‌ను ధృవీకరించింది కూడా. అయితే చైనా సీసీపీ మీడియా అధికారికంగా ఈ విషయం పై నోరు మెదపటం లేదు. దీంతో వ్యూహాన్ ల్యాబ్ లీక్ అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదమా ? లేక కావాలని చేసిన పనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పాశాత్య వైరాలజీ శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్‌లు ఇది కుట్రగా అభివర్ణించడం గమనార్హం. (చదవండి: మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్ తొలగింపు!) -
Andhra Pradesh: అందుబాటులోకి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఒమిక్రాన్ నిర్ధారణ కోసం రెండు కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపిలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్థారణకి శాంపిల్స్‌ని పూణే, హైదరాబాద్ సీసీఎంబికి వైద్య ఆరోగ్యశాఖ పంపించేది. ఇప్పుడు విజయవాడలోనే సాంకేతిక ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. చదవండి: ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్ సోమవారం నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా అధికారులు ట్రైయిల్ రన్ నిర్వహించారు. డెల్టా, ఓమిక్రాన్ మొదలైన కోవిడ్-19ల ఉత్పరివర్తనలు, రూపాంతరాలను ఇక్కడ ల్యాబ్‌లో గుర్తించే సదుపాయం ఉంటుంది. ల్యాబ్ పనితీరులో సీఎస్ఐఆర్, సీసీఎంబీ హైదరాబాద్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని వైద్య అధికారులు తెలిపారు. -
కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్
దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. కోట్లాది మంది కోవిడ్ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. చదవండి:: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి! కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్ 5న పాజిటివ్ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్‌కు పాటివ్‌గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు.. -
హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఉన్న భౌగోళిక అనుకూలత దృష్ట్యా హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) డైరెక్టర్ డాక్టర్ రెజీ మథాయ్ ప్రకటించారు. గతేడాది రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగం, ఏఆర్ఏఐ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రెజీ నేతృత్వంలోని ఏఆర్ఏఐ బృందం రెండురోజుల పర్యటనకుగాను శనివారం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఈవీ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి నేతృత్వంలోని అధికారులు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ ప్రతినిధులు ఏఆర్ఏఐ బృందంతో టీ వర్క్స్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రి సర్టిఫికేషన్, ట్రెయినింగ్ ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన వసతుల కోసం రావిర్యాలలోని ‘ఈ సిటీ’ని కూడా ఏఆర్ఏఐ బృందం సందర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనరంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోందని, ప్రిసర్టిఫికేషన్, టెస్టింగ్ ల్యాబ్ వల్ల కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెజీ మథాయ్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆవిష్కరించిన ఈ పాలసీ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని, ప్రిసర్టిఫికేషన్ ల్యాబ్ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుందని సుజయ్ వెల్లడించారు. కొత్తగా రెండు ఈవీ పార్కులు, టీ వర్క్స్, టీ హబ్ తదితరాలతో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను భారీగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఆర్ఏఐకి ఆటోమోటివ్ రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థగా ప్రాముఖ్యత ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఏఆర్ఏఐకి చెన్నైలోనూ ప్రాంతీయ కార్యాలయం ఉంది. -
మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్‌పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి.స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనాకేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్ ల్యాబ్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్ట్రాగాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డితో సీఆర్‌సీఐడీఎఫ్ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్)తో డీజీపీ కార్యాలయంలో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి కూడా పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)తో పాటు, మహారాష్ట్ర పోలీసులతో పలు ప్రాజెక్టుల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. రాష్ట్ర విమెన్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ సైబర్ ల్యాబ్ నడుస్తుంది. ఇందుకోసం విమెన్‌సేఫ్టీ వింగ్ మూడో అంతస్తులో ల్యాబ్ నిర్మించారు. ఇందులో పనిచేసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, సైబర్ క్రైం ఇన్వెస్టిగేటర్స్, కంటెంట్ రైటర్స్‌ను నియమించారు. ఈ నెలాఖరున కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
మనది రైతుపక్షపాత ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్ఆర్ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పెట్టుబడిసాయం కింద రైతన్నలకు ఏటా రూ.13,500 ఇస్తున్నామని, రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, ప్రతి పంటకు ఈ-క్రాపింగ్ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నాం పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆర్బీకేలో అమ్ముకోవచ్చని, రైతులకు అడుగడుగునా ఆర్బీకేలు అండగా ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ సీజన్‌లోని ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే ఇస్తున్నామని, ఆర్బీకేల ద్వారా తక్కువ అద్దెకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిగాయని సీఎం జగన్ గుర్తుచేశారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవన్నారు. దీనికంటే ముందు రాయదుర్గం మార్కెట్ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్.. కాసేపు రైతులతో ముచ్చటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Wuhan Lab Theory: కరోనా పుట్టుకపై ఫారిన్ సైంటిస్ట్ వివరణ
కరోనా.. ఎలా పుట్టిందో కూడా తెలియకుండా.. మనుషుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న వైరస్. ఈ మహమ్మారి పుట్టుక మిస్టరీని చేధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంతువుల ద్వారా వ్యాపించిందనుకుని నిర్ధారణకు వచ్చేలోపు.. ల్యాబ్ థియరీ తెరపైకి వచ్చింది. అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యల చేసింది గతంలో అందులో పనిచేసిన ఓ ఫారిన్ సైంటిస్ట్. సిడ్నీ: డానియెల్లే ఆండర్సన్.. ఆస్ట్రేలియన్ సైంటిస్ట్. వయసు 42 ఏళ్లు. కరోనా విజృంభణ టైంలో వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన ఏకైక ఫారిన్ సైంటిస్ట్. ఆమె రిలీవ్ అయిన తర్వాత ఏ విదేశీ సైంటిస్ట్ అందులో చేరలేదు(కరోనా ఆరోపణల నేపథ్యంలో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు). దాదాపు కొన్ని నెలలపాటు బీఎస్ఎల్-4 ల్యాబ్‌లో పనిచేసిన డానియెల్లే.. ప్రమాదకరమైన జబ్బులకు సంబంధించిన పరిశోధనల్లో భాగమైంది. ఆమె నవంబర్ 2019లో ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యింది. అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణల్ని ఆమె ఇప్పుడు తోసిపుచ్చుతోంది. చదవండి: బెంగాలీ కుర్రాడి వల్లే వుహాన్ కుట్ర వెలుగులోకి! ‘‘ల్యాబ్‌లో ఆ సీజన్లో రోజూ నేను పని చేశా. కానీ, అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కరోనా మూలాలేవీ ఆ ల్యాబ్‌లో నాకు కనిపించలేదు. ఏ సైంటిస్ట్ అలాంటి అనుమానాస్పద ప్రయోగాలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అనుమానాలే నిజమైతే.. రోజూ కంటెయిన్మెంట్ ల్యాబ్‌లో పని చేసిన నేను కొవిడ్ బారిన పడాలి కదా. కానీ, అలా జరగలేదు. ప్రతీరోజూ నేను అందరితో టచ్‌లో ఉన్నా. అందరం కలిసే తిన్నాం. కలిసే తిరిగాం. అందుకే ల్యాబ్ లీకేజీ థియరీని నేను ఖండిస్తున్నా. వైరస్ సహజంగా పుట్టిందే అని నేను నమ్ముతున్నా’’ అని బ్లూమరాంగ్ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయం వెల్లడించారు. చదవండి: చైనాలో వయాగ్రా దోమల భయం! “I do not believe the virus was manmade.” Danielle Anderson, the Wuhan Institute of Virology's last foreign scientist, left just before the #Covid19 pandemic. For the first time, she shares her story on China’s infamous lab https://t.co/JIFTwDTiiC pic.twitter.com/Dc8yQQqLEq — Bloomberg Quicktake (@Quicktake) June 28, 2021 ఇక వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన సైంటిస్టులు ముక్తకంఠంతో ల్యాబ్ లీకేజీ థియరీని ఖండిస్తున్నారు. కాగా, అక్టోబర్‌లో సార్స్ కోవ్2 విజృంభణ మొదలైందని చైనా ప్రకటించాక.. వైరస్ అనుమానాలు కూడా డ్రాగన్ కంట్రీ మీదకే మళ్లాయి. అయితే తమప్రమేయం లేదని ఆరోపణల్ని తోసిపుచ్చినా.. కొందరు విదేశీ సైంటిస్టులు మాత్రం నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో డబ్ల్యూహెచ్‌వో బృందం వుహాన్ ల్యాబ్‌ను పరిశీలించడం.. నివేదిక కూడా దాదాపు చైనాకే అనుకూలంగానే ఇచ్చింది. కోల్డ్ చెయిన్ ప్రొడక్టుల(ఆస్ట్రేలియన్ బీఫ్ లాంటి ఉత్పత్తులు) ద్వారా వైరస్ వ్యాప్తి చెంద ఉండొచ్చని చైనా అనుమానాల్ని డబ్ల్యూహెచ్‌వో బృందం దగ్గర వ్యక్తం చేసింది. చదవండి: కరోనా.. వుహాన్ కంటే ముందు అక్కడ! -
వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: చైనా
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్ ల్యాబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. డ్రాగన్ దేశం వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్ ల్యాబ్ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ అధ్యయనంలో వుహాన్ ల్యాబ్ కృషిని గుర్తిస్తూ మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్ ల్యాబ్ చేసిన కృషికి గాను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దానికి అవుట్‌స్టాండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ ప్రైజ్ 2021ని ప్రకటించింది. ‘‘కోవిడ్ జీనోమ్ సిక్వేన్స్ని తొలుత వుహాన్ ల్యాబ్ గుర్తించింది. అంటే దానర్థం ఈ వైరస్ ఇక్కడ నుంచే వ్యాప్తి చెందిందని.. లేదంటే మా దేశ శాస్త్రవేత్తలే దానిని తయారు చేసినట్లు కాదు’’ అన్నారు లిజియాన్. డ్రాగన్ డిమాండ్‌పై చైనా వైరాలిజిస్ట్, డాక్టర్ లి మెంగ్ యాన్ స్పందించారు. వుహాన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని తెలిపిన వారిలో యాన్ కూడా ఒకరు. ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. ‘‘ఒకవేళ వుహాన్ ల్యాబ్‌కి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే.. ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది’’.. ‘‘అవును మన జీవితాలను నాశనం చేయడానికి వుహాన్ ల్యాబ్ ఎంతో కష్టపడి కరోనాను అబివృద్ధి చేసింది. ఆ కృషిని గుర్తించి దానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ప్రతి దేశం దీనికి మద్దతివ్వాల్సిందే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. We must admit, the work of the Wuhan Institute of Virology really has touched all of our lives, hasn’t it? https://t.co/eicvXkz94v — Jim Geraghty (@jimgeraghty) June 21, 2021 If Wuhan Lab in China deserves Nobel Prize for Medicine according to China; then ISIS deserves the Nobel peace prize too. — Shining Star 🇮🇳 (@ShineHamesha) June 24, 2021 చదవండి: కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు! -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
సీఎం జగన్ వినూత్న ఆలోచనే ‘వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినూత్న ఆలోచనే వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన కాకినాడ రూరల్ వాకలపూడి రోడ్డు లో వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జులై 8 వైఎస్సార్ జయంతి (రైతు దినోత్సవం) రోజున 61 ల్యాబ్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామని తెలిపారు. వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లకు ఆక్వా ల్యాబ్‌లు అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. కల్తీ నివారణ కోసం ప్రతి జిల్లాలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.15వేల కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతుల యంత్రాల వినియోగం కోసం ఫామ్ మెకనైజ్డ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామర్లకోట, శ్రీకాకుళం, కర్నూలులో ఫామ్ మెకనైజ్డ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు బట్టబయలు చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం -
కరోనా పుట్టుక: చైనా పుట్టి ముంచింది మనోడే!
కరోనా వైరస్ పుట్టుకలో చైనా పాత్రపై అనుమానం మొదటి నుంచి ఉందే. అయితే మధ్యలో డబ్ల్యూహెచ్‌వో జోక్యం, ట్రంప్ హయాంలో యూఎస్ నిఘా వర్గాల నివేదికల్ని బయటకు రానివ్వకపోవడంతో ఆ ఆరోపణలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపించాయి. ఈ తరుణంలో ఉన్నట్లుండి ల్యాబ్ థియరీ ఒక్కసారిగా తెర మీదకు రావడం, మళ్లీ చైనాపై అమెరికా సహా కొన్ని దేశాలు ఆరోపణలతో విరుచుకుపడడం చూస్తున్నాం. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది.. గత నెలరోజుల పరిణామాలే ఇందుకు కారణమా? ఇందులో భారతదేశానికి చెందిన ఓ యువ అన్వేషకుడి పాత్రేంత అనేది పరిశీలిస్తే.. వెబ్‌డెస్క్: ‘‘కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’’.. ఇది డ్రాగన్ కంట్రీపై అగ్రదేశం అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఎదురుదాడి ప్రారంభించిన చైనా.. అమెరికాపైనే నిందలు వేయడంతో పాటు ఫౌఛీ మెయిల్స్ లీక్ వ్యవహారాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో గత నెలరోజుల ల్యాబ్ లీక్ థియరీ అంశం ఎలా ఉప్పెనలా ఎగిసిపడిందో చూద్దాం. డ్రాస్టిక్లో మనోడు! కరోనా పుట్టుక విషయంలో చాలామంది సైంటిస్టులకు, రీసెర్చర్లకు అనుమానాలున్నాయి. ఈ తరుణంలో ఆసక్తి ఉన్నవాళ్లంతా కలిసి డ్రాస్టిక్(DRASTIC) పేరుతో ఒక సైట్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ పుట్టుక తమ తమ అభిప్రాయాల్ని, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాల్ని ట్విట్టర్ ద్వారా ఆ పేజీలో తెలియజేస్తున్నారు. ఇందులో పలువురు భారతీయులూ ఉండగా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఓ యువకుడు ‘ది సీకర్’(The seeker) పేరుతో తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజానికి తొలుత ఈ యువకుడు కూడా మార్కెట్ ద్వారానే వైరస్ వ్యాపించిందని నమ్మాడంట. ఆ తర్వాత కొన్ని దర్యాప్తులను, రీసెర్చ్ పత్రాలను, మరికొందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ల్యాబ్ థియరీల వెనుక ఉన్న కథనాల్ని ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలు రాశాడు. ఇది న్యూస్‌వీక్ పీస్ వెబ్‌సైట్‌ను ప్రముఖంగా ఆకర్షించడంతో అతని(సైంటిస్ట్/రీసెర్చర్/సాధారణ యువకుడు) ఉద్దేశాల్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనం ఆధారంగానే ప్రధాన మీడియా హౌజ్‌లు ఒక్కసారిగా వుహాన్ ల్యాబ్ థియరీపై పడ్డాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం #WuhanLabLeak హ్యాష్‌ట్యాగ్‌తో మారుమోగింది. ఆపై సైంటిస్టులు ల్యాబ్ థియరీని పున:పరిశీలించగా, మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మూడు నెలల్లో వైరస్ పుట్టుక వ్యవహారం తేల్చాలని ఇంటెలిజెన్స్ విభాగాల్ని ఆదేశించడం, అమెరికా ఛీప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ ‘2019 వుహాన్ రీసెర్చర్ల అనారోగ్యం’ రికార్డులను బయటపెట్టాలని చైనాను డిమాండ్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. 2012 నుంచే.. చైనాలోని ఓ జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇది అప్పట్లో వినిపించిన వాదన. కానీ, కోవిడ్ 19 పుట్టుక చైనాలోని ల్యాబ్(వుహాన్ పేరు తర్వాత తెరపైకి) పుట్టిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఈ తరుణంలో నెలరోజులుగా(ముఖ్యంగా ఈ వారం నుంచి) వుహాన్ ల్యాబ్ థియరీపైనే ఎక్కువ ఫోకస్ అవుతోంది. 2012 నుంచే కరోనా వైరస్ పుట్టుకకు బీజం పడిందని, ఓ మైన్లలో పని చేసే ఆరుగురు అస్వస్థతకు గురి అయ్యారన్న వాదన బలంగా వినిపించింది. దీనికితోడు 2019లో యున్నన్ గుహాలను పరిశీలించిన వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు రీసెర్చర్లు జబ్బు పడడం, వాళ్లకు గోప్యంగా చికిత్స అందించడం, ఆ తర్వాతే కరోనా విజృంభణ.. ఇలా వరుస ఆరోపణలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చైనా ఎదురుదాడి.. అమెరికా గొంతులో వెలక్కాయ ‘‘2019లో వుహాన్ ల్యాబ్ లో అనారోగ్యానికి గురైన ముగ్గురు వ్యక్తుల మెడికల్ రికార్డులు చూపండి. వారు నిజంగా అనారోగ్యానికి గురయ్యారా? అయితే.. అనారోగ్యానికి కారణమేంటి?’’ అని చైనాను ఆంటోనీ ఫౌచీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేదా అనే దానిపై కీలకమైన ఆధారాలు అందించే తొమ్మిది మంది మెడికల్ రికార్డులను రిలీజ్ చేయాలని కోరారు. అయితే ఇదే ఫౌచీ గతంలో ‘ల్యాబ్ థియరీ’ని కొట్టిపడేశాడు. దీనికితోడు వుహాన్ ల్యాబ్ తో సంబంధం ఉన్న ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్.. థ్యాంక్స్ చెబుతూ ఫౌచీకి పంపిన ఈ మెయిల్ కూడా వివాదాస్పదమైంది. దీంతో ఇప్పుడు ఫౌచీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక కరోనా వైరస్ పుట్టుక విషయంలో అమెరికా పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని, అక్కడి ల్యాబ్‌లను పరిశీలించాలని చైనా, డబ్ల్యూహెచ్‌వోను కోరడంతో అమెరికా గొంతులో వెలక్కాయపడ్డట్లయ్యింది. అంతేకాదు కరోనా వైరస్ పుట్టుకపై స్టడీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)ను ఆహ్వానించాలని అమెరికాకు చైనా పిలుపునిచ్చి గట్టి కౌంటరే ఇచ్చింది. అయితే అమెరికా మాత్రం ఆ పని చేయదని, ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా బయో ల్యాబ్‌ల్లో జరిగే అవకతవకలు బయటపడతాయని భయపడుతుందని చైనా గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ఒక కథనం ప్రచురించింది. -
ఆ వైరస్ లేనప్పుడు.. లీక్ ఎలా?
ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందన్న విమర్శకులను వూహాన్ ల్యాబ్ డైరక్టర్ వాంగ్ యాన్యూ కొట్టిపారేశారు. ప్రస్తుతం వూహాన్ ల్యాబ్‌లో 3 రకాల వైరస్లు ఉన్నాయని.. కానీ ల్యాబ్‌లో ఉన్నవేవి కరోనా వైరస్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ ఆయిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. యాన్యూ స్పందిస్తూ.. ఊహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలన్ని ఊహాజనితమేనని పేర్కొన్నారు. అసలు వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ లేనప్పుడు ఎలా లీక్ అవుతుందని కౌంటర్ ఎటాక్ చేశారు. కాకపోతే మూడు వైరస్లు మాత్రం ల్యాబ్‌లో పరిశీలనలో ఉన్నాయన్నాయన్నారు. ఇవేవీ కోవిడ్-19కు మ్యాచ్ కావడం లేదని విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. అవి కేవలం సార్స్, కోవిడ్-2 లక్షణాలు మాత్రమే కల్గి ఉన్నాయన్నారు. గతంలో ప్రపంచాన్ని పీడించిన సార్స్ వైరస్‌తో ఈ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ రెండు వైరస్లు ఒకటి కాదడానికి తగిన ఆధారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించామని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 40వేల మరణించారు. చదవండి: కరోనా రుణంలోనూ వాటా! -
‘గాంధీ’లో స్కిల్ ల్యాబ్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన మైలురాయిని అధిగమించేందుకు వేదిక కానుంది. తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో స్కిల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుకేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి 15వ తేదీలోగా టెండరు ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లో స్కిల్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాలకు చెందిన వైద్యసిబ్బందికి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ స్కిల్‌ల్యాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ఇండియాకు చెందిన డాక్టర్ యోగేష్, ఇమ్రాన్‌ఖాన్‌ల నేతృత్వంలో ఆరుగురు నిపుణుల బృందం బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులతోపాటు వైద్యసిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు స్కిల్ ల్యాబ్‌లో శిక్షణ అందిస్తారు. రోగిపై నేరుగా కొన్ని రకాల ప్రయోగాలు చేయలేరు. అవి వికటిస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అందుకు ప్రత్యామ్నాయంగా మనిషి ఆకారంలో అంతే సైజులో ఉండే బొమ్మలను అంటే ప్రాణం లేని కృత్రిమ మనుషులు స్కిల్‌ల్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని వైద్యపరిభాషలో మ్యానిక్యూర్స్ అంటారు. వాటిలో కూడా రక్తప్రసరణ, గుండె కొట్టుకోవడం వంటి మనిషిలో జరిగే అన్ని జీవప్రక్రియలు జరుగుతాయి. వాటిపై వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించి నైపుణ్యాన్ని పెంపొందిస్తారు. ఐదు రాష్ట్రాల వైద్యసిబ్బందికిశిక్షణ ఇక్కడే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వైద్యసిబ్బందికి ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు సౌత్ ఇండియా నోడల్ సెంటర్‌గా స్కిల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. గాంధీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి చెందిన ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర విభాగాలకు చెందిన కొంతమంది వైద్యులతోపాటు మరో 12 మంది ట్యూటర్లను ఎంపిక చేసి ఢిల్లీలో వృత్తి నైపుణ్యం పద్ధతులు, టీచింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం వీరిని స్కిల్‌ల్యాబ్ శిక్షకులుగా నియమించి ఐదు రాష్ట్రాల వైద్యసిబ్బందికి శిక్షణ ఇప్పిస్తారు. ఓపీ భవనం పైన స్కిల్‌ల్యాబ్... గాంధీ ఆస్పత్రి ఓపీ భవనంపైన స్కిల్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు వైద్యనిపుణులు, తెలంగాణ వైద్యఅధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు నిర్ణయించారు. భవన నిర్మాణానికి రూ.కోటి, పరికరాలు, ఎక్విప్మెంట్, మ్యానికుర్స్లను కొనుగోలుకు మరో కోటి రూపాయలు వ్యయం చేస్తారు. ఇప్పటికే ప్రారంభమైన టెండరు ప్రక్రియను మార్చి 15వ తేదీతో పూర్తి చేసి, మూడు నెలల్లో స్కిల్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 2.5 కోట్లతో ఆర్‌సీఎన్‌సీ డిజాస్టర్ భవన సముదాయం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో రేడియేషన్, కెమికల్స్, న్యూక్లియర్ సెంటర్ (ఆర్‌సీఎన్‌సీ) డిజాస్టర్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ వైధ్యాధికారులు బుధవారం స్థల పరిశీలన నిర్వహించారు. హైదరాబాద్ నగరంపై బాంబు దాడులు జరిగితే తక్షణ వైద్యసేవలు అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ డిజాస్టర్ భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలో భవనాన్ని నిర్మించేలా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ విధానాన్ని అవలంబించి ఆర్‌సీఎన్‌సీ డిజాస్టర్ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
త్రీడీ.. రెడీ
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): సాంకేతిక రంగంలో భవిష్యత్ తరాలకు త్రీడీ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే అత్యాధునిక అడ్వాన్స్డ్ త్రీడీ టెక్నాలజీ ఆవశ్యకత పెరుగనుంది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, వైద్య రంగంలో అవసరమైన వాటిని డిజైన్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన త్రీడీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నాన్‌టెక్నికల్ యూనివర్సిటీల్లో త్రీడీ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఏకైక విశ్వవిద్యాలయం రాయలసీమ విశ్వవిద్యాలయం కావటం గర్వకారణం. రూ.30 లక్షలతో త్రీడీ ల్యాబ్‌ను రెండు నెలల క్రితం అప్పటి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.నరసింహులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రారంభించారు. ఐదు కంప్యూటర్లు, అత్యాధునికమైన ఐదు ప్రింటర్లు, స్కానింగ్ మిషన్ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వస్తువులు. త్రీడీ స్కానర్ మనుషులు కొలవలేని, డిజైన్ చేయలేని వాటిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి ప్రింటింగ్ తీసుకోవచ్చు. త్రీడీ టెక్నాలజీ.. త్రీ డైమెన్సనల్ ప్రింటింగ్ అనేది (త్రీడీ) అడిటివ్ మానుఫ్యాక్షరింగ్ అనే అంశంపై ఆధారపడి భౌతిక వస్తువులను త్రీ డైమెన్సన్లో అచ్చు వేస్తోంది. ఇది ఒక పొర మీద ఒక పొరను జమ చేస్తూ ఒక క్రమపద్ధతిలో ప్రింట్ చేస్తుంది. దీని కోసం త్రీడీ క్యాడ్ నమూనాను కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ద్వారా రూపొందిస్తారు. ఆర్యూ ల్యాబ్‌లో ఇలా.. ⇔ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వారు టర్బైన్ బ్లేడ్స్‌ను త్రీడీ స్కానింగ్ చేసుకోడానికి ఆర్‌యూలోని త్రీడీ స్కానర్‌ను ఉపయోగించుకున్నారు. ⇔ ఏపీలోని అటానమస్ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులకు సమ్మర్ స్కూల్ ప్రొగ్రామ్‌లో భాగంగా త్రీడీ ప్రిటింగ్పై శిక్షణ ఇచ్చారు. ⇔ ఆర్‌యూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం విద్యార్థులు కొంత మంది హైదరాబాద్‌లోని ఆడెడ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శిక్షణ పొందారు. ⇔ ఆర్యూ క్యాంపస్‌లోని భవనాలు, వర్సిటీ పేరును త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేస్తున్నారు. త్రీడీ ల్యాబ్, స్కానర్‌తో ఉపయోగాలు ⇔ పరిశ్రమల్లో చాలా వేగంగా ప్రాథమిక నమూనాను తయారు చేసుకోవచ్చు. ⇔ త్రీడీ షూ లాస్ట్స్ (షూ మోడల్) తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ⇔ ఆర్ట్ అండ్ జ్యూవెలరీ ఫొటో టైప్ డిజైనింగ్‌కు అవకాశం. ⇔ దంత వైద్యాలయాల్లో పళ్ల నమూనాలు రూపొందిస్తారు. ⇔ ఇళ్లు, కాలనీలు, వెంచర్ల నమూనాల డిజైనింగ్‌కు నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. ⇔ ఆటోమోటీవ్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తారు. ⇔ యంత్రాల బాహ్య డిజైనింగ్ చేయుటకు ఉపయోగిస్తారు. -
ఫ్రీగా వన్‌ప్లస్ 6..కానీ
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 6ను ఎట్టకేలకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు ఒకవైపు హల్చల్ చేస్తుండగానే.. మరో గుడ్‌న్యూస్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రారంభానికి ముందే, వన్ ప్లస్టీం తన అభిమానులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము వాడుతున్న వస్ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకటించిన ల్యాబ్ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్ బ్యాక్ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ ది ల్యాబ్ వన్‌ప్లస్ 6 ఎడిషన్ అనే బ్లాగ్‌లో వెల్లడించింది. గతంలో వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 5టీ నిర్వహించినట్టుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్టు తలిపింది. ఎంట్రీలు పంపించేందుకు చివరి తేదీ మే 2. మే 12 న విజేతలను ప్రకటిస్తారు. రివ్యూలు ఇంగ్లీషులో మాత్రమే ఉండాలి. ఈ ల్యాబ్ ప్రోగ్రాం కోసం కేవలం 15మందిని ఎంపిక చేస్తారు. ఇతర నియమాలు, నిబంధనలు తదితర వివరాలు కోసం https://oneplus.typeform.com/to/W08XQ0 లింక్‌లో లభ్యం. అన్నట్టు ఏప్రిల్ 22నుంచే అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా 'నోటిఫై మీ' సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్‌కు ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డ్సు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ప్రింట్ ఎక్స్‌ల్ –2017 అవార్డ్సును ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ అందుకుంది. ఈ నెల 8న చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి విశ్వేశరావు, టెక్నికిల్ హెడ్ ఈలి సతీష్, గ్రాఫిక్స్ డివిజన్ ప్రింట్ టీమ్ ఎంవీ గోపీనాథ్‌లు హెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అలెన్బార్ షానీ, హెచ్‌పీ హెడ్ టీమ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి సుమారు 1400 ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా ఫొటో బుక్ , కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలలో ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్తమ ఫొటో బుక్ విన్నర్, కమర్షియల్ ప్రింట్ కేటగిరీ విన్నర్, ఓవర్ఆల్ గ్రాండ్ విన్నర్ అవార్డులను సంస్థ కైవసం చేసుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుసగా ఇంటర్నేషనల్ ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డులను అందుకున్న ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థను హెచ్‌పీ ఇంటర్నేషనల్, హెచ్‌పీ భారత్ టీమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ మాట్లాడుతూ గిగిగి .pటజీn్టౌnజీఛ్చి.ఛిౌఝ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రింటింగ్ సేవలను ప్రపంచ స్థాయిలో తమ వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. అడ్వాన్స్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో లైఫ్ టైమ్ ప్రింట్ క్వాలిటీతో లైట్ వైట్ వాటర్ ప్రూప్ ఫొటోబుక్స్ భారతదేశంలోని పలు ఫొటోగ్రాఫీ ప్రొఫెషనల్స్‌కు ,గ్రాఫిక్ డిజైనర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు. -
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్త ఎదిగేందుకు కృషి చేయాలి
శ్రీ ప్రకాష్ టింకరింగ్ ల్యాబ్ అభినందన సభలో మంత్రి రాజప్ప పెద్దాపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'మై క్లీన్ ఇండియా' కలలకు సాకారం అందించిన ఘనత పెద్దాపురం శ్రీ ప్రకాష్ విద్యా సంస్థకే దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. నీతి ఆయోగ్ కమిషన్ ఆదేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహించిన ఇన్నోవేషన్ చాలంజెస్‌లో దేశంలోని 12 వేల పాఠశాలలు దరఖాస్తు చేయగా నవాంధ్ర నుంచి 1207 పాఠశాలలు ఆసక్తి కనబరిచాయి. వీటిలో ఏపీలో 8 పాఠశాలలు ఎంపిక కాగా జిల్లాలో రెండు పాఠశాలలు శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల (పెద్దాపురం), శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పాయకరరావుపేట) ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ల్యాబ్‌ల ఎంపికకు కృషి చేసిన విద్యార్థులను, పాఠశాల డైరెక్టర్ విజయ్‌ప్రకాష్‌ను అభినందించారు. పాఠశాల ¿¶భౌతిక శాస్త్ర విభాగాధిపతి పీవీఎస్‌బీ చలపతి పర్యవేక్షణలో విద్యార్థులు అభ్యుదయ ప్రోమా, అపురూప్‌రాజ్ వర్థన్, గ్రీష్మణిలు పాల్గొని పెద్దాపురం పట్టణ పరి«ధిలోని జల కాలుష్య నివారణ, యంత్రశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి రెండు వాట్స్ ఎల్ఈడీ బల్బు వెలిగేలా యంత్రాన్ని రూపొందించిన తీరు తెన్నులను వారు మంత్రి సమక్షంలో వివరించారు. ‘మై క్లీన్ ఇండియా'లో భాగంగా జిల్లా నుండి రెండు పాఠశాలలకు స్థాçనం లభించిందని పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ అన్నారు. అనంతరం మంత్రి రాజప్ప మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పెద్దాపురానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులను, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు ఎప్పటికీ మరువరని, అటువంటి స్పూర్తితోనే ప్రతీ విద్యార్థి మేధస్సుతో ముందుకు ఎదగాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయిలు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ల్యాబ్ పెద్దాపురం పట్టణానికి రావడం గర్వకారణమన్నారు. అనంతరం ప్రాజెక్టుకు కీలక పాత్ర పోషించిన నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఎడ్యుకేషనల్ కో–ఆర్డినేటర్ ఎఎస్ఎన్ మూర్తిని మంత్రి రాజప్ప సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి, అకడిమిక్ కో–ఆర్డినేటర్ పీఏ రాజు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, బొడ్డు బంగారుబాబు, గుమ్మళ్ళ రామకృష్ణ, అడబాల కుమారస్వామి, రోటరీ కార్యదర్శి పాణింగపల్లి చలపతిరావు (నాని), డాక్టర్ పతివాడ రాజేష్‌బాబు, డాక్టర్ పతివాడ శ్రీలక్ష్మి, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. -
మొబైల్ ఆక్వా ల్యాబ్ సేవల్ని వినియోగించుకోవాలి
‘సిఫ్ట్’ ఎఫ్డీఓ డాక్టర్ విజయభారతి నేడు కాట్రేనికోన మండలంలో పరీక్షలు కాట్రేనికోన : మత్స్య పరిశ్రమ అ«భివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ ఆక్వా సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఎఫ్డీఓ డాక్టర్ టి. విజయభారతి సూచించారు. ఆక్వా చెరువుల వద్దే మొబైల్ ఆక్వా ల్యాబ్‌లో నామమాత్రపు రుసుంతో మట్టి, నీటి నాణ్యత, బాక్టీరియా పరీక్షలు చేసి నివేదికలను రైతులకు అందిస్తామన్నారు. విజయభారతి బృందం గురువారం కాట్రేనికోన మండల కేంద్రంలో నడవపల్లి, కందికుప్ప, కాట్రేనికోన తదితర గ్రామాలలో మొబైల్ ఆక్వా సేవలు అందిస్తారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు చెరువు నీటిని మొబైల్ లాబ్‌కు తీసుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. -
వీవీఐటీలో ‘గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్’
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఏపీఎస్ఎస్డీసీ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సిఓఇ)లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ భారతదేశంలో తన మొట్టమొదటి గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్‌ను ప్రారంభించనుందని వి.వి.ఐ.టి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గూగుల్‌కు చెందిన నిపుణులు కళాశాలకు శుక్రవారం విచ్చేసి ల్యాబ్ ప్రారంభానికి కళాశాలలో ఉన్న సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ మౌంటెన్‌వ్యూ, అమెరికాకు చెందిన క్లేర్ బేలే మాట్లాడుతూ ఎపిఎస్ఎస్డీసీ, వీవీఐటీ కళాశాలలతో సంయుక్తంగా గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధిలో ఈ ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గూగుల్ భారతదేశ యువతలో మంచి నైపుణ్యం ఉందనే ఉద్దేశ్యంతోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇన్నోవేషన్ ల్యాబరేటరీలను ప్రారంభిస్తుందన్నారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ గూగుల్, ఏపీఎస్ఎస్డీసీతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్వహించటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో గూగుల్ నిపుణుల బృందంలోని క్లేర్ బేలే, జేమ్స్ బాగ్మాన్ లతో పాటు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి చర్చించారు. -
ఆగ్రహ జ్వాల
దివీస్ ల్యాబ్ పనులను అడ్డుకున్న రైతులు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాల తొలగింపు తుని ఎమ్మెల్యే మద్దతు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న దాడిశెట్టి రాజా రూ.350 కోట్లు మిగుల్చుకునేందుకే ఈ కుట్ర అని వెల్లడి సెజ్ ఖాళీ భూములకు బదులు రైతుల భూములు ఇవ్వడమేమిటని నిలదీత తొండంగి : తొండంగి మండలం కోన తీరప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ పనులను పరిసర గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు తమ భూములివ్వడానికి నిరాకరించారు. ఆ భూముల్లో బలవంతంగా పాకలు వేసేందుకు చేసిన యత్నాలను ఆదివారం అడ్డుకున్నారు. పాక వేసేందుకు ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించారు. ఆగ్రహంతో తాటాకులను దగ్ధం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి పనులనూ జరగనివ్వబోమని నినదించారు. వారికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పూర్తి మద్దతు తెలిపారు. అంతకుముందు పంపాదిపేటలో జరిగిన సభలో బాధిత రైతులు, మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తమ భూముల్లో పనులు ప్రారంభించారని తెలిపారు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాజా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సీనియర్ నాయకులు పేకేటి సూరిబాబు, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు సత్యనారాయణ తదితరులు దివీస్ పనులు జరుగుతున్న భూములను పరిశీలించారు. అక్కడ చెట్టు నరుకుతున్న కూలీలతో ఎమ్మెల్యే చర్చించారు. పనులు నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా తాటియాకులపాలెం రైతు నేమాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన భూమిలో బలవంతంగా పాకలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత రైతులు, మహిళలు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాలను తొలగించారు. తాటాకులను, దూలాలను తగులబెట్టారు. కాలుష్య పరిశ్రమ తరలేవరకూ పోరాటం పంపాదిపేటలో జరిగిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, తీరప్రాంత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని, కాలుష్య పరిశ్రమ తరలిపోయే వరకూ రైతుల పక్షాన పోరాడతానని భరోసా ఇచ్చారు. అమాయక రైతుల వద్ద భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. దివీస్ ల్యాబ్‌్సకు ఫలానా ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ చౌకగా భూములు ఇప్పించేందుకు ఈ పరిశ్రమ కుంపటిని ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు తెచ్చిపెట్టారన్నారు. ‘‘సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాలు సేకరించారు. ఖాళీగా ఉన్న ఆ భూములను దివీస్‌కు ఎందుకు కేటాయించలేదు? చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు 505 ఎకరాల కోన భూములను కేటాయించడం వారికి పూర్తిగా అన్యాయం చేయడమే. సెజ్‌లో ఎకరాకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దివీస్ యాజమాన్యం ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండా ఎకరా రూ.5 లక్షలకే లాక్కొని పేదలైన కోన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించకపోవడంతో రూ.24 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. అయినా భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించలేదు. ఆ భూములకంటే సారవంతమైన కోన భూములను ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి సేకరించాలని చూడడం పూర్తిగా అన్యాయం’’ అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలుష్య పరిశ్రమవల్ల తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజలు భూములను వదిలి పూర్తిగా వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుందని, పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉంటుందని అన్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే పరిశ్రమలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టారని.. అధికార బలంతో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. -
ల్యాబ్‌లలో బూజు దులపాల్సిందే..!
* జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్ * ఇప్పటికే స్పష్టంచేసిన రాష్ట్ర సర్కారు * జిల్లాలో 61 ప్రాక్టికల్స్ కేంద్రాల కేటాయింపు! శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు వారం రోజుల ముందుగా ల్యాబ్‌లను తెరచే సంస్కృతికి ఈ ఏడాది చరమగీతం పడనుంది. ప్రాక్టికల్స్ ల్యాబ్‌లలో బూజు దులిపే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో మూడు రోజుల కిందట అన్ని జిల్లాల ఆర్ఐవోలు, సిబ్బందితో సమీక్షించి జంబ్లింగ్ పద్దతిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ నేపధ్యంలో మంగళవారం జిల్లాలోన్ని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నిర్వహించనున్న కీలక సమావేశంపై ఆసక్తి నెలకొంది. 2017 ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, కళాశాలలను తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్టు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 17 వేల మంది.. జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘిక, 4 గిరిజన సంక్షేమ, 14 మోడల్, 90కు పైగా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సరం నుంచి సుమారు 17వేల మంది వరకు సైన్స్ విద్యార్థులు పాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో 37 సర్కారీ కళాశాలలు ఉన్నట్టు తెలిసింది. నేడు ప్రిన్సిపాళ్లతో సమావేశం ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్ఐఓ పాపారావు వెల్లడించారు. శ్రీకాకుళం బాలుర జూనియర్ కళాశాలలో జరగనున్న ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ విధిగా హాజరుకావాలని సూచించారు. -
ఏపీలో లిండే ఇండియా రూ. 500 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు అవసరమైన వాయువులను (గ్యాస్) ఉత్పత్తి చేస్తున్న లిండే ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌తోపాటు ఎయిర్ సెపరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ఈ ల్యాబ్ రానుంది. మొత్తంగా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఏడాది చివరికల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి కానుందని కంపెనీ ఎండీ మొలాయ్ బెనర్జీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో 7 ఎయిర్ సెపరేషన్ సైట్లు, 13 బాట్లింగ్ ప్లాంట్లను లిండే నెలకొల్పింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించింది. కాగా, లిండే ఇంటిగ్రేటెడ్ వాల్వ్ పేరుతో భారత్‌లో తొలిసారిగా తేలికైన మెడికల్ ఆక్సిజన్ సిలిండర్‌ను విడుదల చేసింది. బరువు 5 కిలోలు. బిల్ట్ ఇన్ రెగ్యులేటర్ దీని ప్రత్యేకత. ట్యూబ్‌ను నేరుగా అనుసంధానించి రోగికి ఆక్సిజన్ అందించవచ్చు. -
అస్థిపంజరానికి అంత్యక్రియలు!
ఆ పాఠశాల విద్యార్థులు అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అస్థిపంజరమేమిటి?అంత్యక్రియలేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. తమ స్కూల్ ల్యాబ్ లో సుమారు అర్థ శతాబ్దం పాటు సేవలందించిన ఆ అస్థిపంజరం.. ఇటీవలే నిజమైనదని తెలిసింది. దీంతో ఏళ్ళతరబడి తమకు సేవలందించిన ఆ అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించాలని పాఠశాల నిర్ణయించింది. యధావిధిగా శవపేటికలో ఉంచి, శ్మశానానికి తరలించి, విద్యార్థులంతా దానిచెంత ఎర్రగులాబీలు ఉంచి నివాళులర్పించగా.. ఘనంగా అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తి చేశారు. మెర్సీసైడ్.. సెయింట్ హెలెన్స్ దగ్గరలోని హేడాక్ హైస్కూల్ ల్యాబ్ లో విద్యార్థులకు మానవ శరీర భాగాలను వివరించేందుకు ఉపయోగిస్తున్న అస్థిపంజరం.. నిజంగా ఓ వ్యక్తిదని తెలిసి స్కూల్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ల్యాబ్ టెక్నీషియన్... ప్రయోగశాలలోని అల్మారానుంచి బయటకు తీసినప్పుడు అనుమానంతో దాని ఎముకలకు పరీక్షలు నిర్వహించారు. అవి సుమారు 19వ శతాబ్దంనాటి, ఆసియా ప్రాంతంలోని 17 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తివిగా గుర్తించారు. నిజానికి 19వ శతాబ్దంనాటి అస్తిపంజరం అక్కడకు ఎలా వచ్చింది? ఆ వ్యక్తి మరణానికి ముందు బ్రిటన్ చేరుకున్నాడా? లేక ఆ అస్థిపంజరాన్ని తెచ్చి స్కూల్లో ఉంచారా అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక శ్మశాన నిర్వాహకులు కూడ అంత్యక్రియలకు ఎటువంటి ఛార్జీలు వేయకుండా ఉచితంగా సేవలు అందించారు. ఏ వ్యక్తి జీవితమైనా ఒకటేనని, ఏభై ఏళ్ళకు పైగా తమ పాఠశాలలో సేవలందించిన అస్థిపంజరం.. నిజంగా ఓ వ్యక్తిదని తెలిసి... కనీస గౌరవం అందించడంలో భాగంగానే తాము అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించామని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. -
కాలేజీలన్నీ లోపాల పుట్టలే!
జేఎన్టీయూ అధికారుల తనిఖీల్లో వెల్లడి బోధనా సిబ్బంది తక్కువే.. మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు నేడు ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్: ల్యాబ్ ఉంటే ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ ఉంటే ల్యాబ్ లేదు.. రెండూ ఉన్నావిద్యా ప్రమాణాల్లేవు.. లైబ్రరీల్లో పుస్తకాల్లేవు, సరైన మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు.. ఇదీ రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి. చాలా కళాశాలల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులేమీ లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లూ లేవు.. ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి ఎన్నో కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ నేతృత్వంలో ఏర్పాటైన అఫిలియేషన్ల కమిటీల కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. 17వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో 16వ తేదీ సాయంత్రానికి ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు కళాశాలలను తనిఖీ చేసిన అధికారులు... రాత్రంతా వాటిని క్రోడీకరించే పనిలో పడ్డారు. కళాశాలల వారీ పరిస్థితులతో కూడిన నివేదికను శనివారం ఉదయమే ప్రభుత్వానికి పంపించేందుకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించగా... అందులో వంద కాలేజీల్లో చాలా ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు తెలిసింది. మిగతా కాలేజీల్లోనూ చాలా వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, మౌలిక సౌకర్యాలు లేనట్లుగా అధికారుల తనిఖీలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటన్నింటినీ పరిశీలించి ఏయే కళాశాలలకు అఫిలియేషన్లు ఇస్తుందనే విషయం శనివారం వెల్లడికానుంది. దీంతో ఆదివారం ఉదయం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయానికి కళాశాలల సంఖ్య, సీట్ల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఏయే కాలేజీలకు అఫిలియేషన్లు వస్తాయి..? ఏయే కాలేజీలకు అనుమతులు రావన్న దానిపై యాజమాన్యాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ లోపాలున్న కాలేజీలకు అనుమతులు కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచే జరిగే వె బ్ ఆప్షన్ల ప్రక్రియలో 220 వరకే కాలేజీలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు
మదనపల్లె ఏరియా ఆస్పత్రి వైద్యులపై డీసీహెచ్‌ఎన్ మండిపాటు మదనపల్లెక్రైం: ‘ఓ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వైద్యులు ఓ విధి, విధానం లేకుండా వ్యవరించడం తగదు. తమకు కేటాయించిన ఓపీడీలోని రోగులను మాత్రమే పరీక్షించి, పక్క ఓపీడీకి చెందిన వారు వస్తే నాకు సంబంధం లేదు.. మరోచోటుకు వెళ్లమని కసురుకోవడం వైద్యవృత్తికే కళంకం తెస్తుంది. కొంతమంది డాక్టర్లు గిరగీసుకుని వైద్యం చేయడం ఏంటి?. అత్యవసర విభాగంలో డ్యూటీచేసే వారు రోగులు లేనప్పుడు జనరల్ కేసులను కూడా చూడాలి’ అంటూ జిల్లా వైద్యశాలల సంమన్వయకర్త(డీసీహెచ్‌ఎన్) డాక్టర్ సరళమ్మ మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక డాక్టర్లు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు కాకముందే కొంత మంది డాక్టర్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఆస్పత్రిలో ఎవరు డాక్టర్లు, ఎవరు సిబ్బంది.. ఎవరు బయటి వ్యక్తులనే తేడా తెలియడంలేదన్నారు. డాక్టర్లు యూనిఫామ్, గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు. అత్యవసర విభాగం నుంచి ఎక్స్‌రే, ల్యాబ్, ఫార్మసీ, డ్రగ్స్టోర్రూము, వార్డులను ఆమె పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్థియేటర్లో కొన్ని మార్పులను సూచించారు. ఆప్తాలమిక్ కేసులకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు ఓ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నట్లు తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, దీనికి నేను చాలాషేమ్గా ఫీలవుతున్నానని అన్నారు. ఆస్పత్రిలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తాము చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం తగదన్నారు. పనులు చేయలేని వారు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. ఆదివారాల్లో ఓపీడీ లేకపోయినా వైద్యులు విధిగా ఆస్పత్రికి వచ్చి వార్డుల్లో ఉన్న తమ పేషంట్లను చూడాలన్నారు. డాక్టర్లు లీవు తీసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎంవోనే పూర్తి బాధ్యతలు తీసుకుని ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలన్నారు. మాట వినని వారిపై వేటు వేయాలని, దిక్కరిస్తే తనకు సరెండర్ చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 27 వైద్య పోస్టులు ఖాళీ జిల్లావ్యాప్తంగా 27 వైద్య పోస్టులు కొరత ఉన్నట్టు డీసీహెచ్‌ఎన్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పోస్టుల భర్తీకి సీఏఎస్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడగానే పోస్టులభర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక పలుకేసులను రెఫర్ చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమా వేశంలో ఆర్ఎంవో గురుస్వామినాయక్, డాక్టర్ జ్ఞానేశ్వర్, హెడ్ నర్సులు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాసుల దాహం
కాసుల దాహం పెద్దాసుపత్రికి డబ్బు జబ్బు పట్టింది. జబ్బు ఎలాంటిదైనా.. వ్యాధి నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా మారింది. కాదు.. కాదు.. మార్చేశారు. అవసరం ఉన్నా.. లేకపోయినా.. ‘పరీక్ష’ పెడుతుండటంతో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఇప్పుడీ వ్యాపారం లక్షల్లో జరుగుతోంది. ల్యాబ్ నిర్వాహకులతో పాటు.. కొందరు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. కర్నూలుతో పాటు అనంతపురం, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల రోగులకు పెద్దాసుపత్రే ‘ప్రాణం’. ఎంతో ఆశతో ఇక్కడికొచ్చే రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరు వింటేనే హడలిపోతున్నారు. ఈ ప్రక్రియ ప్రహసనంగా తయారైంది. చీటీలు పట్టుకుని కాళ్లరిగేలా తిరుగుతూ సగం చచ్చిపోతున్నారు. తీరా ఆ విభాగానికి చేరుకున్నా సిబ్బంది తిట్ల పురాణం జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. నిపుణులైన రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఐదుగురు ఉన్నా కుర్చీలు కదలరనే అభిప్రాయం ఉంది. సెంట్రల్ ల్యాబ్‌ను ప్రస్తుతం ట్రైనింగ్ విద్యార్థులతో నెట్టుకొస్తున్నారు. మూత్ర పరీక్షకు ఉపయోగించే శాంపిల్ బాటిళ్లు సరిగ్గా శుద్ధి చేయడం లేదు. 33, 39, గైనిక్లోని ల్యాబ్‌లను మధ్యాహ్నం 12 గంటలకే మూసేస్తున్నారు. 24వ ల్యాబ్‌లో ప్రతి రోజూ 800 నుంచి 900 మంది వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్నారు. షుగర్ టెస్ట్ చేయించుకునే వారు టెక్నీషియన్ల కోసం 10 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఇక మూత్ర శాలలను శుభ్రం చేయకపోవడంతో రోగులు ముక్కు మూసుకుని పని కానిచ్చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌ల దందా ఆసుపత్రిలో కొన్ని ప్రత్యేక వ్యాధి నిర్దారణ పరీక్షలు తప్ప మిగిలినవన్నీ ఉచితంగా చేయాల్సి ఉంది. ఈ పరీక్షలు చేసేందుకు ప్రతి నెలా ఆసుపత్రి ఖజానా నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఆసుపత్రిలోని కొందరు వైద్యులు ప్రైవేట్ ల్యాబ్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆసుపత్రిలో పరీక్షలు సరిగ్గా ఉండటం లేదని.. త్వరగా ఇవ్వరనే సాకుతో మెడికల్, సర్జికల్, గైనిక్, పీడియాట్రిక్, సూపర్‌స్పెషాలిటీ విభాగాల వైద్యులు కొందరు ప్రైవేట్ ల్యాబ్‌లకు రాస్తున్నారు. అక్కడ రూ.30ల విలువ చేసే టెస్ట్‌కు రూ.100లు, రూ.50ల విలువ చేసే టెస్ట్‌కు రూ.200ల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి పరీక్షపై అదనంగా 60 నుంచి 70 శాతం వసూలు చేస్తుండగా.. ల్యాబ్‌ల నిర్వాహకులతో పాటు ఆ పరీక్షను బయటకు రాసిన వైద్యుల జేబు కూడా నిండుతోంది. గైనిక్‌వార్డు నుంచి హెచ్‌బీ(హిమోగ్లోబిన్) టెస్ట్‌ను సైతం బయటకు రాస్తున్నారంటే వైద్యులు ఎంతకు దిగజారారో తెలియజేస్తోంది. ఎండోక్రైనాలజి, నెఫ్రాలజి, యురాలజి, కార్డియాలజి, మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్ విభాగాల నుంచి కొందరు వైద్యులు ప్రతి ఒక్క టెస్ట్‌ను ప్రైవేట్‌కే రాసేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ అధికంగా కర్నూలు మెడికల్ కాలేజీలోని బయోకెమిస్ట్రీ, పెథాలజి విభాగాల వైద్యులు కొందరు డ్యూటీ టైంలోనే వెళ్లి రిపోర్టులు రాసిస్తున్నా కళాశాల అధికారులు మైనం దాల్చడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. కొందరు జూనియర్ వైద్యులు సైతం బయటకు పరీక్షలు రాస్తుండటంతో వారికి అవసరమైన ఖరీదైన పుస్తకాలు, బహుమతులు ల్యాబ్ నిర్వాహకులు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ నుంచి బిల్లుల క్లెయిమ్ ఆసుపత్రిలో అందుబాటులోని వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం బయట చేయిస్తున్న వైద్యులు, ఆ బిల్లులను ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు క్లెయిమ్ చేసిస్తూ ఆసుపత్రి ఖజానాకు చిల్లు పెడుతున్నారు. రోగులు సైతం తాము ప్రైవేట్‌లో పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకంతో వైద్యులు సూచించిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. ఒక్కో రోగి డిశ్చార్జ్ అయ్యేలోపు మూడు నుంచి నాలుగు ప్రైవేటు ల్యాబ్‌ల బిల్లులు ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్ చేసుకుంటున్నారు. సగటున ఒక్కో రోగి రూ700 నుంచి రూ.1200 వరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కుమ్మరిస్తున్నారు. ఏళ్ల తరబడి అడ్డదారిలో ఆరోగ్యశ్రీ బిల్లులు క్లెయిమ్ అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.