ఆన్‌లైన్‌ ఆకతాయిలపై సైబర్‌ గస్తీ! | Cyber ​​patrolling with cutting edge tools: telangana | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఆకతాయిలపై సైబర్‌ గస్తీ!

Published Fri, Nov 29 2024 6:18 AM | Last Updated on Fri, Nov 29 2024 6:18 AM

Cyber ​​patrolling with cutting edge tools: telangana

అత్యాధునిక టూల్స్‌తో సైబర్‌ పెట్రోలింగ్‌  

చైల్డ్‌ పోర్నోగ్రఫీ విక్రయిస్తున్న ముఠాల గుట్టురట్టు  

ఇతర రాష్ట్రాల్లోని 65 మంది నేరస్తుల గుర్తింపు  

కీలక పాత్ర పోషిస్తున్నషీ సైబర్‌ ల్యాబ్‌ 

తెలంగాణ పోలీసుల మాచారంతో ఇతర రాష్ట్రాల్లో 21 మంది అరెస్టు  

సాక్షి, హైదరాబాద్‌: బస్‌స్టాప్‌లు, కార్యాలయాలు, మార్కెట్లు, సినిమాహాళ్లు.. ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులను వేధించే పోకిరీలను గతంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తర్వాత ఆన్‌లైన్‌ ఆకతాయిలు ఎక్కువయ్యారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై అడ్డగోలుగా కామెంట్లు పెట్టడం.. వ్యక్తిగతంగా సందేశాలు పంపి విసిగిండం.. ఆన్‌లైన్‌లో అశ్లీల పనులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ఆన్‌లైన్‌ ఆకతాయిల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు ఆన్‌లైన్‌ గస్తీ నిర్వహిస్తున్నారు.

పలు సోషల్‌ మీడియా ఖాతాలతోపాటు, టిండర్, ట్రూలీమ్యాడ్లీ, బుమ్లే వంటి డేటింగ్‌ యాప్‌లలో ఫేక్‌ ప్రొఫైల్స్‌తో ప్రవేశించి ఆన్‌లైన్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ సైబర్‌ ల్యాబ్‌ సిబ్బంది అత్యాధునిక సాంకేతికత, ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ను వినియోగించి ‘హద్దుదాటే’వారికి బుద్ధి చెబుతున్నారు. తెలంగాణకే పరిమితం కాకుండా తాము గుర్తించిన లీడ్స్‌ (సమాచారం)తో ఇతర రాష్ట్రాల్లోని నిందితులను కూడా కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  

13 రాష్ట్రాల్లోని సీఎస్‌ఏఎం లింకుల గుర్తింపు  
షీ సైబర్‌ ల్యాబ్‌ ఇప్పటివరకు చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (సీఎస్‌ఏఎం)కు సంబంధించి 180 లీడ్స్‌ను గుర్తించింది. చిన్నారుల అశ్లీల వీడియోలు ఈ ముఠాలు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు కీలక ఆధారాలు సేకరించడంతోపాటు 65 ఇంటెలిజెన్స్‌ రిపోర్టులను మొత్తం 13 రాష్ట్రాలకు పంపారు. వీటి ఆధారంగా దేశవ్యాప్తంగా 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, 21 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాలు టెలిగ్రామ్‌లో గ్రూప్‌లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తూ.. గూగుల్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు.  

కీలకంగా షీ సైబర్‌ ల్యాబ్‌
స్త్రీలు, పిల్లలపై జరిగే సైబర్‌ నేరాలను అరికట్టేందుకు మహిళా భద్రతా విభాగంలో షీ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక సాంకేతిక, పరిశోధనాత్మక మద్దతును అందిస్తూ, ఎక్సలెన్స్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. సైబర్‌ అడ్వొకసీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్వెస్టిగేటివ్‌ అసిస్టెన్స్, సైబర్‌ క్రైమ్‌ సపోర్ట్‌పై దృష్టి సారిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీసు సంస్థలకు సహాయం అందిస్తోంది. నేరస్థులను గుర్తించడం కోసం డేటా అనలిటిక్స్‌ అందించడం ద్వారా వివిధ విభాగాలకు సహాయం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు సైబర్‌ ఫోరెన్సిక్‌ మద్దతును అందిస్తోంది  

ఇతర రాష్ట్రాల్లోని నేరస్థులనూ గుర్తిస్తున్నాం 
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిపై, ఆన్‌లైన్‌లో అనుమానాస్పద చర్యలకు పాల్పడేవారిపై షీ సైబర్‌ల్యాబ్‌ ద్వారా నిఘా పెడుతున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల క్రిమినల్‌ నెట్‌వర్క్‌లను కూడా గుర్తిస్తున్నాం. మేం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్‌ పోలీసులు ఒకరిని అరెస్టు చేయటంతో చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తున్న ముఠా వివరాలు తెలిశాయి.   –శిఖా గోయల్‌ డీజీ, మహిళా భద్రత విభాగం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement