patrolling
-
ఆన్లైన్ ఆకతాయిలపై సైబర్ గస్తీ!
సాక్షి, హైదరాబాద్: బస్‌స్టాప్‌లు, కార్యాలయాలు, మార్కెట్లు, సినిమాహాళ్లు.. ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులను వేధించే పోకిరీలను గతంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తర్వాత ఆన్లైన్ ఆకతాయిలు ఎక్కువయ్యారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై అడ్డగోలుగా కామెంట్లు పెట్టడం.. వ్యక్తిగతంగా సందేశాలు పంపి విసిగిండం.. ఆన్లైన్లో అశ్లీల పనులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ఆన్లైన్ ఆకతాయిల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు ఆన్లైన్ గస్తీ నిర్వహిస్తున్నారు.పలు సోషల్ మీడియా ఖాతాలతోపాటు, టిండర్, ట్రూలీమ్యాడ్లీ, బుమ్లే వంటి డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో ప్రవేశించి ఆన్లైన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ సైబర్ ల్యాబ్ సిబ్బంది అత్యాధునిక సాంకేతికత, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించి ‘హద్దుదాటే’వారికి బుద్ధి చెబుతున్నారు. తెలంగాణకే పరిమితం కాకుండా తాము గుర్తించిన లీడ్స్ (సమాచారం)తో ఇతర రాష్ట్రాల్లోని నిందితులను కూడా కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లోని సీఎస్ఏఎం లింకుల గుర్తింపు షీ సైబర్ ల్యాబ్ ఇప్పటివరకు చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం)కు సంబంధించి 180 లీడ్స్‌ను గుర్తించింది. చిన్నారుల అశ్లీల వీడియోలు ఈ ముఠాలు ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టు కీలక ఆధారాలు సేకరించడంతోపాటు 65 ఇంటెలిజెన్స్ రిపోర్టులను మొత్తం 13 రాష్ట్రాలకు పంపారు. వీటి ఆధారంగా దేశవ్యాప్తంగా 20 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి, 21 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాలు టెలిగ్రామ్‌లో గ్రూప్‌లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తూ.. గూగుల్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. కీలకంగా షీ సైబర్ ల్యాబ్స్త్రీలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు మహిళా భద్రతా విభాగంలో షీ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక సాంకేతిక, పరిశోధనాత్మక మద్దతును అందిస్తూ, ఎక్సలెన్స్ సెంటర్‌గా పనిచేస్తుంది. సైబర్ అడ్వొకసీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్వెస్టిగేటివ్ అసిస్టెన్స్, సైబర్ క్రైమ్ సపోర్ట్‌పై దృష్టి సారిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీసు సంస్థలకు సహాయం అందిస్తోంది. నేరస్థులను గుర్తించడం కోసం డేటా అనలిటిక్స్ అందించడం ద్వారా వివిధ విభాగాలకు సహాయం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు సైబర్ ఫోరెన్సిక్ మద్దతును అందిస్తోంది ఇతర రాష్ట్రాల్లోని నేరస్థులనూ గుర్తిస్తున్నాం మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిపై, ఆన్లైన్లో అనుమానాస్పద చర్యలకు పాల్పడేవారిపై షీ సైబర్‌ల్యాబ్ ద్వారా నిఘా పెడుతున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల క్రిమినల్ నెట్‌వర్క్‌లను కూడా గుర్తిస్తున్నాం. మేం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు ఒకరిని అరెస్టు చేయటంతో చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తున్న ముఠా వివరాలు తెలిశాయి. –శిఖా గోయల్ డీజీ, మహిళా భద్రత విభాగం -
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
రైల్వే ట్రాక్‌లపై గస్తీ పెంపు
ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్‌లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్‌లపై పెట్రోలింగ్‌ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.ఆర్పీఎఫ్తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్‌ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. -
సైకిళ్లపై పోలీసుల పెట్రోలింగ్..
-
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
పోలీస్ స్పందన 7 నిమిషాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఏదైనా సంఘటన చోటుచేసుకున్న వెంటనే బాధితులు లేదా అక్కడ ఉన్నవారు వెంటనే డయల్ 100కు కాల్ చేస్తారు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాక ఎంత తక్కువ సమయంలో పోలీసులు ఆ స్థలానికి చేరుకుంటే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనినే సాంకేతికంగా ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ జరిగేలా చూడటం తదితర లక్ష్యాలతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా 2023కు సంబంధించి రెస్పాన్స్ టైమ్‌ను లెక్కించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరిన ఈ సమయం ఏడు నిమిషాలుగా ఉండగా, ఈ ఏడాది మరింత తగ్గించాలనేది పోలీసులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇలా... ఎవరైనా ‘100’కు కాల్ చేస్తే, అది నేరుగా ‘డయల్–100’కమాండ్ సెంటర్‌కు చేరుతుంది. వెంటనే వారు బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేస్తారు. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్లోని అంశాలను సంక్షిప్త సందేశంగా (టెక్ట్స్) మార్చి బాధితుడున్న ఏరియాలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపించేవారు. దీంతో పాటు వాకీటాకీ ద్వారానూ సమాచారం ఇచ్చి గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ వాహనం ఎక్కడ ఉంది? బాధితుడికి ఎంత దూరంలో ఉంది? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేదికాదు. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఘటనాస్థలికి చేరిన తర్వాత పెట్రోలింగ్ సిబ్బంది చెప్పే అంశాల ఆధారంగా ఫిర్యాదుగా పరిగణించే ఫోన్ కాల్‌ను క్లోజ్ చేసేవారు. ఇప్పుడు...ట్యాబ్నే ‘జీపీఎస్’ బాధితుడు ‘100’కు ఫోన్ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సిటీలోని ప్రతి గస్తీ వాహనం, బ్లూకోల్ట్స్లకు పోలీసు విభాగం ట్యాబ్స్ అందించింది. ఇవే జీపీఎస్ పరికరంగా పనిచేస్తుండటంతో దాని ఆధారంగా ‘డయల్–100’సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెర/ట్యాబ్/ప్రత్యేక యాప్ ద్వారా కచి్చతంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్ కాల్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్ ద్వారా ట్యాబ్‌లో రింగ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ నుంచి అనేది తేలిగ్గా తెలియడానికి అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి రింగ్‌టోన్ ఏర్పాటు చేశారు. ఆ సిబ్బంది ఫోన్ ఎత్తిన వెంటనే ఆ ట్యాబ్‌లో తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. వీటిని చూసిన వెంటనే గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్టు ధ్రువీకరిస్తున్నారు. అలా...గణన షురూ.. పెట్రోలింగ్ వాహనం, బ్లూకోల్ట్స్ సిబ్బంది ఒకసారి ఫిర్యాదు అందుకున్నట్టు ట్యాబ్‌లో ఉండే ‘100 యాప్’ద్వారా ధ్రువీకరించిన వెంటనే ‘రెస్పాన్స్ టైమ్’లెక్కింపు ప్రారంభమవుతోంది. ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందించే విధంగా సాంకేతిక చర్యలు తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదు అయితే స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీంతో ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలు ఆన్లైన్ ద్వారానే సంబంధిత స్టేషన్ హౌస్ఆఫీసర్కు పంపిస్తున్నారు. ‘క్లోజ్’చేసే వరకు ‘టైమ్ రన్నింగ్’... గస్తీ బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడం వంటి చర్యలు పూర్తయిన తర్వాత మొదట వచ్చిన నోటిఫికేషన్ మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’బటన్ నొక్కడంతో ఈ వ్యవహారం పూర్తవుతుంది. అప్పటి వరకు సమయం లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్నే ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’గా పరిగణిస్తున్నారు. ఫోన్‌కాల్ వచ్చిన దగ్గర నుంచి జరిగే ప్రతిదీ ‘డయల్–100’తో పాటు కమిషనరేట్ కంట్రోల్ రూమ్, జోనల్ కార్యాలయాలకు చేరుతూ పర్యవేక్షణకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ టైమ్ పట్టణాల్లో తక్కువగా, గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లోనూ తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్
ఢిల్లీ: జీ20 సదస్సుకు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దాదాపు లక్ష మంది పోలీసులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. అవసరమైన ప్రాంతాలలో చెకింగ్ ఏర్పాట్లు చేశారు. నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | In view of the upcoming G20 Summit, Delhi Police is patrolling the Raj Ghat area with the help of a tractor. pic.twitter.com/lJo0Wevrvs — ANI (@ANI) September 7, 2023 వీడియోలో యమునా నది దృశ్యాలు కనిపిస్తున్నాయి. మట్టి రహదారిలో పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రపంచ స్థాయి నేతలు ఢిల్లీకి రానున్నందున పోలీసులు ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుంటా చెకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. సమావేశం నిర్వహించనున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నందున యమునా ఖాదర్ ప్రాంతంలో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఈరోజు టియర్ గ్యాస్ ప్రాక్టీస్ కూడా చేశాం' అని షహద్రా డీసీపీ ఇన్ఛార్జ్ హర్ష్ ఇండోరా తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. ఎవరెవరికి బస ఎక్కడంటే..? -
బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!
లండన్: నేరాల కట్టడికి ప్రపంచమంతటా పోలీసులు గాలితో పందెం వేస్తూ దూసుకెళ్లే అత్యాధునిక వాహనాలను వాడుతున్నారు. కానీ బ్రిటన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టుక్‌టుక్ (ఈ–రిక్షా)లను రంగంలోకి దించుతోంది. వేల్స్‌లోని గ్వెంట్ కౌంటీ పోలీసులు ఇప్పటికే నాలుగు టుక్‌టుక్‌లు కొనుగోలు చేశారు. స్థానిక న్యూపోర్ట్, అబెర్గ్రావెనీ ప్రాంతాల్లో ర్రాతి వేళల్లో పార్కులు, వాక్‌వేలు, బహిరంగ స్థలాల్లో గస్తీకి వాటిని వాడుతున్నారు. నేరాలు జరిగితే సమీపంలోని ఏ టుక్టుక్నైనా సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన వస్తోందట! అయితే ఈ టుక్‌టుక్‌ల గరిష్ట వేగాన్ని గంటలకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం మరో విశేషం. ఈ–రిక్షాల సేకరణకు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో గ్వెంట్ పోలీసు విభాగం భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు
మైసూరు(బెంగళూరు): రాత్రి గస్తీలో పురుష పోలీసులకు దీటుగా తాము కూడా పనిచేయగలమని మహిళా పోలీసులు నిరూపించారు. ఈమేరకు బుధవారం రాత్రి మైసూరులోని నంజనగూడు పోలీస్ ఉప విభాగం పరిధిలో మహిళా పోలీసులు రాత్రి గస్తీ విధులు నిర్వహించారు. బుధవారం రాత్రి 9 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 6 గంటలవరకు విధులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మహిళా పోలీసులను రాత్రి గస్తీ విధులకు పంపగా వారు ధైర్యంగా విధులు నిర్వహించారన్నారు. మరో ఘటనలో.. బిడ్జి మరమ్మతులకు ప్రతిపాదన కేజిఎఫ్: ఇటీవల కురిసిన వర్షాలకు తాలూకాలోని రామసాగర చెరువు మరువపోయి పాలారు నదికి అడ్డుగా నిర్మించిన బ్రిడ్జి తెగిపోయిందని, దీనికి మరమ్మతులకు గాను రూ. 2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. గురువారం బాపనేహళ్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఆమె పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఏఈఈ శేషాద్రి తదితరులు ఉన్నారు. చదవండి: నా భర్త నాకు కావాలి.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు -
పోలీస్‌పై 'ఫెల్ట్' భారం
హలో పోలీస్ స్టేషనా..? కరెంటు పోయి చాలా సేపవుతోంది సార్. కొంచెం లైన్‌మన్‌కు చెప్పి వేయించండి. సార్.. ఊళ్లోని వైన్‌షాపులో క్వార్టర్‌పై రూ.5 అధికంగా విక్రయిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం సార్.. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి ఇవీ పోలీసులకు ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులు. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసుశాఖ జిల్లాల్లో ‘ఫెల్ట్ నీడ్స్’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తమ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో భద్రతను పటిష్ట పరిచేలా పోలీసులు సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి పెట్రోలింగ్, గస్తీ అవసరమా? పోకిరీలు, మందుబాబుల బెడద ఉందా? తదితర అంశాలపై గ్రామ పెద్దలతో చర్చించాలి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇందులో అదనంగా చేర్చిన కొన్ని అంశాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు బస్సులు వస్తున్నాయా? పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది? డ్రైనేజీ ఇబ్బందులు ఉన్నాయా? కరెంటు సమస్య ఎలా ఉంది? తాగునీరు సరిగా సరఫరా అవుతోందా? వంటి విషయాలను కానిస్టేబుళ్లు, ఎస్సైలు తెలుసుకొని వాటిని సంబంధిత గ్రామాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కార్యక్రమ ఎజెండాలో చేర్చారు. ఇక్కడే పోలీసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శాంతిభద్రతల సమస్యలైతే ఫర్వాలేదుగానీ మరీ డ్రైనేజీ, బస్సు సౌకర్యం, పారిశుద్ధ్యం, రోడ్డు సమస్యలపై కొందరు ఫిర్యాదులు చేస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. శాఖలో సిబ్బంది కొరత ఇలా..: రాష్ట్రంలో క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పడుతోంది. రాష్ట్ర జనాభా ఆధారంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటుకు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో 81,647 పోస్టులు మంజూరయ్యాయి. కానీ వాస్తవానికి ఇక్కడ 53,115 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 72.93 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా కేవలం 47.44 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అసలే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుండగా, ‘ఫెల్ట్ నీడ్స్’ మరింత చికాకు పెడుతోందని సిబ్బంది అంటున్నారు. –సాక్షి, హైదరాబాద్ -
‘దిశ’ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: ‘దిశ’ సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా చర్యలు పెంచారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్లను గుర్తిస్తున్నారు. అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధానంగా భువనగిరి, బీబీనగర్, వలిగొండ, నాగిరెడ్డిపల్లి, రామన్నపేట, వంగపల్లి రైల్వేస్టేషన్లతో పాటు బస్టాండ్లపై కన్నేశారు. పెట్రో మొబైల్.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పెట్రో మొబైల్ వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. పెట్రో మొబైల్ సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారు. బాధితులు 100కు డయల్ చేసిన వెంటనే వీరు స్పందిస్తారు. జీపీఎస్ వి« దానం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంతో పెట్రో మొబైల్ వాహనాలను అనుసంధానం చేశారు. 12 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో నడవాల్సిన పెట్రో మొబైల్ వాహనాలు.. సిబ్బంది కొరత వల్ల ఒక డ్రైవర్, కానిస్టేబుల్‌తో పని చేస్తున్నాయి. బ్లూ కోట్స్.. జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు చొప్పున బ్లూకోట్స్ సిబ్బంది ఉన్నారు.ఆయా స్టేషన్ల పరిధిలో వీరు నిత్యం తిరుగుతుంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని పరిష్కరిస్తారు. సిటీ పోలీసింగ్.. జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే గ్రామ పోలీస్ వ్యవస్థ ఉండగా ఎక్కువ సిటీ పోలీసింగ్ కొనసాగుతోంది. జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నందున ఇక్కడ నిబంధనల్లోనూ తేడా ఉంటుంది. బ్లూకోట్స్, పెట్రో మొబైల్, ఎస్ఓటీ పోలీస్ తదితర విభాగాలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్నాయి. అయితే దిశ దుర్ఘటన నేపథ్యంలో భద్రత చర్యలను మరింత పెంచారు. జిల్లాలో నేరాల అదుపుపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఎస్ఓటీ పోలీసులు సివిల్ పోలీస్‌లతోపాటు నేరాలను ప్రేరేపించే కార్యకలాపాలపై దాడులు పెంచారు. గతంలో 100 డయల్‌కు 50 కాల్స్ వస్తుండగా ఇప్పుడు 100 వరకు వస్తున్నాయి.సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ భద్రతా చర్యలు విసృతం చేశారు. మహిళల కోసం విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్స్.. మహిళల భద్రత దృష్ట్యా టోల్గేట్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్‌లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేసే యోచనలో జిల్లా పోలీసులు ఉన్నారు. జిల్లాలోనూ వెలుగుచూసిన ఘటనలు జిల్లాలోనూ దిగ్భ్రాంతికర సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. యాదగిరిగుట్టలో వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్న చిన్నారుల సంఘటన సంచలనం సృష్టించిందే. అలాగే బొమ్మలరామారం మండలం హజీపూర్‌లో బాలికలపై లైంగికదాడి, హత్య సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి. సిబ్బంది కొరత : జిల్లా పోలీస్ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ హోదాల్లో 670మంది ఉండాలి. ప్రస్తుతం 326 ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భదత్రా చర్యలను పెంచారు. బెల్ట్ షాపులు, దాబాలపై ఎస్ఓటీ పోలీసుల దాడులు చౌటుప్పల్/బీబీనగర్ : ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పలు చోట్ల దాడులు నిర్వహించారు. చౌటుప్పల్‌లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద గంగాపురం వెంకటేశం బెల్టుషాపులో సోదాలు చేసి రూ.20వలే విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా లక్కారం గ్రామ శివారులో గల సుందరయ్యకాలనీలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన కిరాణం షాపునుంచి రూ.20వేలు విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అదే విధంగా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి వెంట గల దాబాలపైనా మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీస్‌లు దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర్ దాబాలో మద్యం స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రంగస్వామి తెలిపారు. నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు యాదాద్రి భువనగిరి జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నందున గ్రామ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. ఆ పద సమయంలో 100కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారు. వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరి ధిలో విద్యాసంçస్థల్లో 100కు డయల్ చేయ డం, షీటీంలకు ఫోన్ చేయడం వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహిస్తాం. టోల్గేట్లు, పెట్రోల్‌బంక్‌ల వద్ద మహిళలకు రెస్ట్ రూం లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయిస్తాం. –డీసీపీ నారాయణరెడ్డి ఉదయం సమయంలోనూ పెట్రోలింగ్ నిర్వహించాలి రాత్రి వేళల్లోనూ కాకుండా ఉదయం సమయంలోనూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలి. అనుమానితులు, జూలాయిగా తిరిగే వ్యక్తుల వివరాలను ఆరా తీస్తుండాలి. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపైనా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుండాలి. అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. –మధు, దాతారుపల్లి -
సరిహద్దుకి ఆవల
సెల్యూట్ చేసిన లాంచ్‌నాయక్ రాంసింగ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆఫీసర్ కమాండింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో నేనూ వెళతాను సార్!’’ వినయంగా అన్నాడు రాంసింగ్.‘‘ఎందుకు?’’ అడిగేడు ఆఫీసర్ కమాండింగ్.‘‘స్వామి నాకు మిత్రుడు సార్!’’ చెప్పాడతను. అప్పటికే ఆఫీసర్ కమాండింగ్ చాలా విసుగ్గా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున పెట్రోలింగ్ పార్టీ ఒకటి మందుపాతరకి బలైంది. అయిదు శవాలు మాత్రం దొరికాయి. ఆయుధాలు, శరీరాల మీదున్న విలువైన వస్తువులు పట్టుకుపోయారు శత్రుసైనికులు. ఇద్దరు భారత సైనికుల శరీరాలు కత్తి పోట్లకు గురయ్యాయి. అంటే మందుపాతర పేలాక ప్రాణాలతో మిగిలిన వారిని అంతమొందించారన్నమాట. పెట్రోలింగ్ పార్టీలోని స్వామి అనే సైనికుని ఆచూకీ లేదు. శత్రుసైనికులు బందీగా పట్టుకుపోవడానికి అవకాశం లేదు. ఏ తుప్పల్లోనో శరీరం పడి ఉంటుందన్న ఆలోచనతో సెర్చింగ్ పార్టీని పంపుతున్నారు. రెండు దేశాల సరిహద్దుకి మధ్య ఎవరికీ చెందని రెండు కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న అడవి ఉంది. చొరబాటుదారులు అడవి ప్రాంతంలో పెట్రోలింగ్ పార్టీ కనుమరుగయిన మరుక్షణం సరిహద్దు దాటుతారు. చొరబాటుదారుల్ని వెంటాడే క్రమంలో పెట్రోలింగ్ పార్టీ మందుపాతర పేలుడులో చిక్కుకుంది. ఇది శత్రువు ఎత్తుగడ కావచ్చు.‘‘సరే వెళ్ళు’’ చెప్పాడు ఆఫీసర్ కమాండింగ్, ఆలోచనల నుండి తేరుకుని. రాంసింగ్ సెల్యూట్చేసి ఆక్కడి నుండి కదిలి సెర్చింగ్ పార్టీ ఇన్చార్జి హవల్దార్‌కి రిపోర్టు చేశాడు. ఆ తరువాత స్టోర్ నుండి ఆయుధాలు తీసుకున్నాడు. సెంట్రీలు చూస్తుండగా సెర్చింగ్ పార్టీ బోర్డరు దాటింది. క్రమంగా సెర్చింగ్ పార్టీలోని నలుగురు సభ్యులు కనుమరుగయ్యారు. అంతా సరళరేఖ మాదిరిగా తమ మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేటట్లు చూసుకుని నడుస్తోంది సెర్చింగ్ పార్టీ. కాళ్ళకి మెత్తని జంగిల్ షూస్ ఉండటంతో అడుగుల శబ్దం రావడం లేదు. అందరికంటే ముందున్న వ్యక్తి పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం పసిగడితే తన టీవ్ుని హెచ్చరిస్తాడతను. శత్రువుకి సమీపంగా వెళుతున్నామనే స్పృహ ఉంది అందరికీ. జాగ్రత్తతోపాటు ఆయుధాన్ని దూరం చేసుకోకూడదు. మృత్యువు చెప్పిరాదు. అడవిని సమీపించాక అంతా నేలమీద పడుకున్నారు. టీవ్ు లీడర్ బైనాక్యులర్స్‌తో అత్యంత జాగ్రత్తగా ముందుకి చూశాడు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు. క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చి నెమ్మదిగా లేచాడు. అందరూ గన్స్లోడ్ చేసి ఎటాకింగ్ పొజీషన్లో ముందుకి కదిలారు. వారి చూపు ముందున్న ప్రదేశం మీద ఉంది. ముందురోజు అక్కడ మందుపాతర పేలింది. అయిదు శవాలను తీసుకొచ్చారు క్యాంపుకి. దొరకని శరీరం కోసం ఇప్పుడొచ్చారు.లీడర్ చెయ్యి ఎత్తాడు. అందరూ టక్కున ఆగిపోయారు. అడవిలో అస్పష్టంగా ఉన్న కాలి బాటకి అడ్డంగా ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి ఉంది. ఆ గొయ్యికి చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాడు లీడర్. కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా అరిచాడు. ‘‘ఇక్కడో ల్యాండ్‌మైన్ ఉంది.’’నేలమీద రెండడగులు లోతు తవ్వి ఆ గోతిలో భూమికి సమాంతరంగా అమరుస్తారు మందుపాతర. ఒక్క సేఫ్టీపిన్ మాత్రమే పైకి కనిపిస్తుంది. దానిమీద కాలు వేసినా లేదా కాలితో తన్నినా సేఫ్టీపిన్ లోపల ఉన్న కేప్‌కి తగిలి పేలుతుంది. చుట్టు పక్కల పదడుగుల దూరం వరకూ దాని ప్రభావం ఉంటుంది. యుద్ధభూమిలో అత్యంత వినాశకారి ఆయుధం ల్యాండ్ మైన్.బాటకి ఇరువైపులా కదిలారు నలుగురు. వాళ్ళంతా నేలని పట్టిపట్టి చూశారు. శత్రువు చాలా ప్రమాదకరమైన వాడనే ఆలోచన వాళ్ళ బుర్రలో కదులుతోంది. ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక వాళ్ళు కాస్త స్వేచ్ఛగా కదలసాగారు. ఒకవైపు గాలిస్తూ వెళ్ళిన రాంసింగ్కి చిన్న లోయ ఒకటి ఎదురైంది. అతను తలెత్తి చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మకి యూనిఫాంలోని పీలిక ఒకటి వేలాడుతూ కనిపించింది. వీపుకి అమర్చుకున్న అవర్షాక్ నుండి రోప్ తీశాడు రాంసింగ్. దానికి చివర రాయికట్టి లోయలోకి వదిలాడు. మూడు వంతులు తాడు లోపలికి వెళ్ళాక నేలకి తగిలింది రాయి. ఇన్చార్జికి చెప్పి రెండోకొన చెట్టుకి కట్టి తాడు పట్టుకుని దిగడం ప్రారంభించాడు. పది నిమిషాలకి తాడు లూజయింది. ఇన్చార్జి లోపలికి తొంగి చూశాడు. వెలుగుతున్న టార్చి చుక్కలా కనపించిందంతే. గంట తరువాత లోపల నుండి రాంసింగ్ గొంతు వినిపించింది. ‘‘బాడీ దొరికింది. స్లీపింగ్ బ్యాగ్ లోపలికి పంపండి...’’స్లీపింగ్ బ్యాగ్ మరో తాడుకి కట్టి లోయలోకి పంపేడు ఇన్చార్జ్. అరగంట తర్వాత శవాన్ని పైకిలాగాక రాంసింగ్ పైకి వచ్చాడు. రాంసింగ్ సూచన ప్రకారంఇద్దరు జవాన్లు బాడీతో అక్కడ నుంచి కదిలారు. రాంసింగ్ తన అవర్షాక్ నుంచి చిన్న గునపం బయటకు తీశాడు.‘‘అదెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగాడు హవల్దార్.‘‘మనవాళ్ళ చావుకి కారణమైన శత్రువుకి బుద్ధి చెప్పాలి. మీరు లైనింగ్ పొజిషన్లో బైనాక్యులర్స్‌తో శత్రు సరిహద్దుని గమనించండి. ఎవరైనా ఇటు వస్తుంటే నన్ను హెచ్చరించండి..’’ చెప్పాడు రాంసింగ్.అతను ఏంచేస్తాడో అర్థంకాక పోయినా, నేలమీద పడుకుని బైనాక్యులర్స్ కళ్ళముందు పెట్టుకుని గమనించసాగేడు హవల్దార్. ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి అవతల మొత్తం నాలుగు మందుపాతరలు ఉన్నాయి. వాటి మధ్య దూరాన్ని కాలి అడుగులతో కొలిచాడు. ఒక్కొక్క దాని మధ్య పదడుగుల దూరం ఉంది. శత్రు సరిహద్దువైపు ఉన్న చివరి ల్యాండ్‌మైన్ నుంచి పదడుగులు వెనక్కి నడిచి అక్కడ చిన్న గునపంతో గుండ్రంగా నేలమీద గుర్తు పెట్టాడు. దాని తరువాత ఒకటి, ఆ తరువాత మరొకటి పెట్టాడు. తను చెయ్యబోతున్న పనిని ఒకసారి సమీక్షించుకున్నట్టు కొన్ని క్షణాలు చూశాడు. తను చేస్తున్నది చాలా ప్రమాదకరమైన పని. ఏ మాత్రం తేడావచ్చినా నామరూపాలు లేకుండా పోతాడు. గుర్తులు పెట్టినచోట గోతులు తవ్వడానికి అరగంట పట్టింది. ఆ తరువాత తనకి దగ్గరలోని ల్యాండ్‌మైన్ దగ్గరకు వెళ్ళాడు. దానికి కాస్త ఎడంగా చుట్టూ అడుగున్నర లోతు తవ్వాడు. ఆపని చేస్తున్నప్పుడు అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చివరగా మట్టిమీద నిలబడిన ల్యాండ్‌మైన్ కిందికి రెండు చేతులు పోనిచ్చి ఊపిరిబిగపట్టి నెమ్మదిగా పైకి లేపాడు. అది కదలకుండా తీసుకెళ్ళి తను తీసిన ఓ గొయ్యిలో ఉంచి చుట్టూ మట్టి కప్పాడు.మిగతా రెండింటిని కూడా అలాగే తీసుకెళ్ళి పాతాడు.మూడు మందుపాతరలూ వెనక్కి జరిపాక మిగిలిన దాని దగ్గరకు వచ్చాడు. బరువైన రాయికి రోప్ కట్టి ఆ మందుపాతర మీద ఉంచాడు. రెండో చివర రోప్ని ఓ చెట్టుకి వదులుగా ముడివేసి చేతులు దులుపుకున్నాడు. అంతవరకూ రాంసింగ్ చర్యల్ని గమనించిన హవల్దార్ అన్నాడు – ‘‘చాలా ప్రమాదకరమైన పని. ఏదో ల్యాండ్‌మైన్ నీ చేతిలో పేలితే?’’.‘‘నిన్న పోయిన ఆరుగురికి మరొకరు జత అయ్యేవాడు... ప్రమాదమని శత్రువుకి బుద్ధి చెప్పకుండా ఊరుకుంటామా...’’ నవ్వేడు రాంసింగ్.డెడ్‌బాడీతో క్యాంపు చేరుకుంది సెర్చింగ్ పార్టీ.మరునాడు తెల్లవారుజామున రాంసింగ్‌ని నిద్రలేపాడు సెంట్రీ. అతను బేరక్ నుంచి బయటకొచ్చి చన్నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. చల్లగా ఉంది వాతావరణం. మరికాసేపట్లో అదృశ్యం కావడానికి సమాయత్తమవుతోంది చీకటి. రాంసింగ్ సరిహద్దు దాటి నిశ్శబ్దంగా అడవివైపు నడిచాడు. అడవిలోని కాలిబాటలోకి ప్రవేశించి చెట్టుకి కట్టిన తాడు అందుకుని చేతికి చుట్టుకుని బలంగా లాగాడు.ల్యాండ్‌మైన్ మీద ఉంచిన రాయి తప్పుకుంది. సేఫ్టీ పిన్ చిన్న చప్పుడుతో పైకి ఎగిరింది. భూమి కంపించేటట్టు పెద్ద చప్పుడు. వెనక్కి తిరిగి క్యాంపు చేరుకుని సెంట్రీపోస్టులో ఇసుక బస్తామీద కూర్చున్నాడు రాంసింగ్. అతని చేతికి పొగలు కక్కుతున్న టీ మగ్ అందించాడు ఒకతను. అది తాగుతూ జరగబోయే పరిణామం కోసం ఎదురుచూడసాగేడు. సరిగ్గా తెలతెలవారుతుండగా అడవి నుంచిరెండు పేలుడులు అక్కడికి వినిపించాయి. పని పూర్తయినట్టు సెంట్రీలవైపు చూసి చిన్నగా నవ్వాడు రాంసింగ్.కుయుక్తితో భారత సైనికుల్ని మట్టుపెట్టి ఆయుధాలు, విలువైన వస్తువులు పట్టుకుపోయిన శత్రువు వలలో చిక్కుకొని అంతమయ్యాడు. ‘‘అటెన్షన్.... మార్చ్.....’’రాంసింగ్ ఎడమకాలు కుడికాలు పక్కకి చేర్చి కదిలాడు. కమాండ్ పాస్ చేసిన హవల్దార్ కూడా అతనితో సమానంగా అడుగులు వెయ్యసాగేడు. అది కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోని మేజర్ క్యాంప్ ఆఫీస్.లోపల ముగ్గురు కూర్చుని ఉన్నారు. మధ్యలో రివాల్వింగ్ చైర్లో ఉన్నాడు మేజర్. సిబ్బందిలో ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే శిక్ష విధించే కోర్ట్ ఆఫ్ మార్షల్ అది. ముందురోజు బోర్డర్ దగ్గర ఉన్న ప్లటూన్ ఆఫీసర్ కమాండింగ్కి రాంసింగ్‌ని, హవల్దార్‌ని హెడ్ క్వార్టర్‌కి పంపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇద్దరూ పది కిలోమీటర్లు నడచి హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. ముందు హవల్దార్‌ని విచారించాక రాంసింగ్‌ని పిలిచారు.‘‘హాల్ట్...’’ చెప్పాడు హవల్దార్. ఇద్దరూ ఆగాక అన్నాడు – ‘‘సెల్యూట్..’’. ఎదురుగా ఉన్న మేజర్‌కి సెల్యూట్ చేశాక ‘‘డౌన్’’ అన్నాడు. మేజర్ హవల్దార్ వైపు చూసి తలూపాడు. అతను సెల్యూట్ చేసి ఎబౌట్ టర్న్ తీసుకుని మార్చింగ్‌లో అక్కడ నుండి బయటకి నడిచాడు.రెండు నిమిషాలు తన ముందున్న పేపర్లు పరిశీలించి ఆ తర్వాత తలెత్తి రాంసింగ్ మీదకి చూపు సారించాడు మేజర్. ఇరవై రెండు సంవత్సరాలు దాటిన యువకుడతను. మీసాలు పూర్తిగా రాలేదు. మూడు సంవత్సరాల ఆరు నెలలు అతని సర్వీస్. మేజర్ కళ్ళలో చిన్నపాటి ఆశ్చర్యం కదలాడింది. ‘‘శత్రువు అమర్చిన ల్యాండ్ మైన్స్ ప్లేస్ మార్చి పదిమంది మరణానికి కారకుడవయ్యావు. ఏ ధైర్యంతో ఆ పని చేశావ్?’’ కంగుమనే గొంతుతో అడిగాడు మేజర్.‘‘ఇది ధైర్యానికి సంబంధించినది కాదు సార్. నాతో పనిచేస్తున్న ఆరుగురిని శత్రువు పొట్టన పెట్టుకున్నాడు. వారి ఆయుధాలను వారిమీదే ప్రయోగించి బదులు తీర్చాను’’ వినయంగా చెప్పాడు రాంసింగ్.‘‘అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం..’’ కఠినంగా అన్నాడు మేజర్.‘‘మీ పర్మిషన్ తీసుకునే సమయం లేదు సార్! యుద్ధభూమిలో దొరికిన శత్రువుని దొరికినట్లే హతమార్చడం భారత సైనికునిగా నా బాధ్యత’’మేజర్ తలపరికించాడు. ‘‘నీకు స్వామితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయా?’’ అడిగేడు మేజర్.‘‘లేవు సార్! అతను నా ప్రాణ స్నేహితుడు.’’ చెప్పాడు రాంసింగ్.‘‘అయితే ఎందుకు చంపావ్ అతన్ని?’’ఊహించని ప్రశ్న కావడంతో నోరు మెదపలేదు రాంసింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో వెళతానని ఈనెల తొమ్మిదిన ఆఫీర్ కమాండింగ్ని అడిగావు. అందరితోపాటు స్టోర్స్ నుంచి వెపన్స్ డ్రా చేశావు. తిరిగొచ్చాక వెపన్స్ హేండోవర్ చేసినప్పుడు స్టెన్గన్తూటాల్లో ఒకటి తక్కువైంది.’’మౌనంగా చూస్తూ ఉండిపోయాడతను.‘‘ఆ తూటా ఇదే..’’ పాలిథిన్ కవరులోని తూటా చూపించాడు మేజర్.‘‘పోస్టుమార్టవ్ులో స్వామి ఛాతీకి స్టెన్‌గన్ బేరల్ ఆనించి కాల్చినట్టు తేలింది. తూటా చేసిన గాయం నుండి కారిన రక్తం షర్టుకి అంటుకుని ఉంది. నిజానికి నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్ళావు. కాని కాల్చి చంపావ్. ఇది బాధ్యతతో కూడిన డిసిప్లిన్ ఫోర్సు. ఇక్కడఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం కుదరదు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి, అరెస్ట్ చెయ్యవచ్చు’’ గంభీరంగా అన్నాడు మేజర్.గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు రాంసింగ్. లోయలో నేల కాలికి తగిలాక తాడు వదిలిపెట్టాడు రాంసింగ్. టార్చి వెలిగించి చుట్టూ చూశాడు. కొమ్మలు, తీగలు దట్టంగా అల్లుకుని నేల చిత్తడిగా ఉంది. అదోరకమైన వాసన ముక్కుపుటాలను తాకుతోంది. చెట్లు అడ్డదిడ్డంగా పెరిగాయి. కొండరాళ్ళు నాచు రంగులో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ముందుకి కదిలాడు. ఏవో పురుగులు శరీరంమీద పాకసాగాయి. ఒకసారి వాటిని దులుపుకుని అవంత తేలిగ్గా వదలవని గుర్తించాడు. ఆచితూచి అడుగులు వేస్తూ కదలసాగేడు. మందుపాతర పేలుడులో గాయపడిన వ్యక్తి ఆ లోయలో పడితే నామరూపాలు ఉండవని గుర్తించాడు. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఓ రాయి పక్కన కనిపించింది స్వామి శరీరం.దగ్గరకు వెళ్ళి వెలుగులో చూసి చప్పున తలతిప్పుకుని రాబోయే వాంతిని ఆపుకున్నాడు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది శరీరం. ఒక కాలు తొడ వరకు లేదు. ఓ చెయ్యికి మణికట్టు లేదు. ముఖంలో కుడి భాగం లోతైన గాయంతో దెబ్బతింది. శరీరాన్ని రకరకాల కీటకాలు కమ్మేశాయి. మరింత దగ్గరకు వెళ్ళి ఛాతీమీద చెయ్యేశాడు. గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి రెండో చెయ్యివేశాడు. ప్రాణం ఉంది.‘‘స్వామీ..’’ పిలిచాడు గద్గదంగా.‘‘స్వామీ...’’ అంటూ భుజం పట్టుకుని కదిపాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేదుకాని ఎడమకన్ను సగం తెరుచుంది.‘‘నేనురా... రాంసింగ్‌ని.’’ చెప్పాడు దుఃఖాన్ని ఆపుకుంటూ.‘‘రాంసింగ్...’’ అస్పష్టంగా ఉచ్చరించాయి స్వామి పెదవులు.‘‘అవును నేనే... నిన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళతాను’’ చెప్పాడు వణుకుతున్న స్వరంతో.‘‘వద్దురా...’’‘‘పైన మన పార్టీ ఉంది. మరేం భయంలేదు.’’ చెప్పాడు.‘‘నేను బతికే స్థితిలో ఉన్నానా?’’ అడిగాడు స్వామి.‘‘అవేం మాటలురా..’’ రాంసింగ్ గొంతు పూడుకుపోయింది.‘‘ఎక్కువసేపు బతకను... అది నిజం... నా ప్రాణం పోయాక ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. లేదంటే నాకు విముక్తి ప్రసాదించు. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఇక్కడ పడిన దగ్గరనుంచి చావు కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’రాంసింగ్ మాట్లాడలేదు. ఆ స్థితిలో స్వామిని చూసేసరికి మతిపోయిందతనికి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. అతను బతకడని, ఒకవేళ బతికినాజీవచ్ఛవమని తెలుస్తూనే ఉంది.‘‘నాకు చెల్లెలు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు...’’రాంసింగ్ కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది.వణుకుతున్న చేత్తో స్టెన్‌గన్ బయటకు తీశాడు. ‘‘సో ... నేరం చేశావ్?’’ మేజర్ అన్నాడు.తల అడ్డంగా ఊపాడు రాంసింగ్. ‘‘అది నేరమని, నా భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచించలేదు సార్! నా ప్రాణ స్నేహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఏ దైవమూ వాడి చావుని ఆపలేదు. చావు ఆలస్యం కావడం వల్ల వాడు మరికాసేపు నరకయాతన అనుభవించడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వాడి కోరిక తీర్చాను సార్..’’కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.‘‘బయట వెయిట్ చెయ్యి, మళ్ళీ పిలుస్తాను..’’ చెప్పాడు మేజర్.రాంసింగ్ సెల్యూట్ చేసి బయటకొచ్చాడు.‘‘ఏమైంది బేటా?’’ బయట ఉన్న హవల్దార్ అడిగేడు.‘‘ఏం కాలేదు’’ రాంసింగ్ జవాబిచ్చాడు.‘‘ఏం కాదు’’ చెప్పాడతను. రాంసింగ్, స్వామి అతని స్క్వాడ్‌లోనే పనిచేస్తున్నారు. తనకంటే ముందు హవల్దార్‌ని పిలిచి మేజర్ విచారించాడని తెలుసు రాంసింగ్కి. అయితేలోపల ఏం జరిగిందో మాత్రం తెలియదు.అరగంట తర్వాత తన ముందు నిలబడిన రాంసింగ్‌ని అడిగేడు మేజర్.‘‘స్వామి చెల్లెలు పరిస్థితి ఏమిటి?’’‘‘ఆమెని మా గ్రామం తీసుకుపోతాను సార్. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఈమెతో నలుగురు అవుతారు. నాకు పెళ్ళిచేసుకునే వయసు రావడానికి ఇంకా రెండున్నర ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఆమె ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటాను. లేదంటేఆమెకి నచ్చినవాడికిచ్చి పెళ్ళిచేస్తాను సార్!’’మేజర్ కొన్ని క్షణాలు తన ముందున్న కాగితాలు చూసి ఆ తర్వాత తలెత్తాడు. అతని ముఖం భావరహితంగా ఉంది. ‘‘నీకిది మొదటి వార్నింగ్. తక్కువ సర్వీసులో లాంచనాయక్గా ప్రమోషన్ పొందావు. మంచి భవిష్యత్ ఉంది నీకు. ఇక నుంచి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉద్యోగం చెయ్యి. అనవసరమైన విషయాల జోలికి పోకు... వెళ్ళు.’’ చెప్పాడు గంభీరంగా.స్మార్ట్‌గా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగాడు రాంసింగ్. -
టూరిస్ట్ స్పాట్స్‌లో ‘ఈ–సైకిల్’ పెట్రోలింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం ద్విచక్ర వాహనాలు, ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్ డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ఈ–సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను తొలి దశలో టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఐఐటీ విద్యార్థులు టీ–హబ్‌లో ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీ ఓ తరహాకు చెందిన ఈ–సైకిల్‌ను రూపొందించింది. దీని పనితీరును కొత్వాల్ శుక్రవారం తన కార్యాలయంలో పరిశీలించారు. ఇవే మోడల్స్ లేదా ఇదే తరహాకు చెందిన ఈ–సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి దశలో ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ సైకిల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 50 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి ఫెడల్ చేస్తే సార్టయ్యే ఈ బై సైకిల్ ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఈ బై సైకిల్‌ను టూరిజం పోలీసింగ్‌తోపాటు బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. గరిష్టంగా మూడు నెలల్లో వీటిని పోలీసు విభాగంలోకి తీసుకురావాలని భావిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. -
ఒంటెలతో సరిహద్దు పహారా!
సాక్షి, చండీగఢ్ : లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భారత్ మరో వ్యూహాత్మక ప్రయోగానికి తెరతీస్తోంది. లడఖ్ నియంత్రణ రేఖనుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నాలు గతంలో అధికంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. ఆ ప్రాంతంలో ఒంటెలను గస్తీ కోసం ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిహద్దుల్లో పహారాతో పాటూ, సైనికులకు ఆయుధాలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఈ ఒంటెలను ఆర్మీ ఉపయోగించుకోవాలని యోచన చేస్తోంది. ప్రయోగాత్మక దశలో రెండు మూపురాలున్న ఒంటెలను ఇందుకు వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయం తీసుకుంది. రెండు మూపురాలున్న ఒంటెలు అలవోకగా 180 నుంచి 200 కిలోల బరువును మోసుకెళ్లగలవు. అంతేకాక ఇవి రెండుగంటల వ్యవధిలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని అనాయాసంగా ప్రయాణించగలవు. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన జంతువులకన్నా.. రెండు మూపురాలున్న ఒంటెలు ఎడారిలో అత్యంత వేగంగా ప్రయాణించగలవు. ఇదిలావుండగా.. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా సైన్య శిక్షణ ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాక సైన్యంలోని వివిధ అవసరాలకు ఒంటెలను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. -
భాగస్వామి
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 2 కాలిఫోర్నియాలోని ఆ చిన్న గ్రామంలో కెల్లీ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. అతనికి బ్రింక్సీ ఎదురుపడ్డాడు. ‘‘నువ్వు నీ వృత్తిని మార్చుకోకపోతే నువ్వు మరోసారి జైలు లోపలి భాగం చూడాల్సి ఉంటుంది’’ కెల్లీ బ్రింక్సీని బెదిరించాడు. అప్పటికే రెండుసార్లు జైలుకి వెళ్లొచ్చిన బ్రింక్సీని కెల్లీ గతంలో చాలాసార్లు హెచ్చరించాడు. ‘‘నన్నొక్కడినీ జైలుకి పంపి, ఈ ఊరిని రక్షించావనుకోకు. నాలాంటివాళ్లు వందల మంది ఇక్కడ ఉన్నారు’’ బ్రింక్సీ జవాబు చెప్పాడు. ‘‘అందుకే రేపటి నించి నాకు ఓ కొత్త పోలీసు భాగస్వామి వస్తున్నాడు. వాడు ఒకేసారి నీలాంటి ఇరవై మందిని ఎదుర్కోగలడు’’. ‘‘ఎవరు?’’... బ్రింక్సీ ఆసక్తిగా అడిగాడు. ‘‘నా కొత్త పార్ట్నర్ పేరు పీటర్. జర్మనీలోని ఆక్స్‌బర్గ్ అతని స్వగ్రామం. ఇటీవలే అమెరికాకి వలస వచ్చాడు.’’ ‘‘చూద్దాం’’... బ్రింక్సీ నిర్లక్ష్యంగా అన్నాడు. అధికారులు పీటర్ గురించి చెప్పగానే కెల్లీ మొదట్లో పీటర్ని తన భాగస్వామిగా తిరస్కరించాడు. కానీ క్రమేపీ అతను తనకి ఎంత అండగా ఉంటాడో అర్థమైంది. అందుకు కారణం పీటర్ పొందిన శిక్షణ. భయంకరంగా, నల్లగా కనిపించే పీటర్... కెల్లీ ఇంట్లోనే బస చేయసాగాడు. కెల్లీ భార్య నోరా ఈ కొత్త అతిథిని అంగీకరించింది. పిల్లలు మాత్రం పీటర్‌కి దూరంగా మెసలసాగారు. కారణం పీటర్ వాళ్లని తన దగ్గరకు రానీడు. రాత్రుళ్లు పెట్రోలింగ్‌లో తన భర్తకి తోడుగా పీటర్ ఉండటం కెల్లీ భార్యకి సంతోషాన్ని ఇచ్చింది. నోరాకి గల ఒకే సమస్య పీటర్ ఎక్కువ మాంసం తినడం. ఆ రాత్రి ఒకటిన్నర దాటాక పీటర్‌తో కలిసి కెల్లీ పెట్రోలింగ్ చేశాడు. డ్యూటీ దిగబోయే ముందు ఆఖరుగా ఎక్స్‌ప్రెస్ స్ట్రీట్‌లోని స్థానిక బ్రీవరీకి చేరుకున్నాడు. అందులోంచి బీర్ బాటిల్ కేసులని ఎవరో తరచు దొంగిలిస్తున్నారని, రాత్రిళ్లు బీట్‌లో చూడమని కెల్లీకి ఆ ఉదయమే లెఫ్టినెంట్ సూచించాడు. బ్రీవరీ బయట ఓ వేన్ ఆగి ఉండటం, ఎవరో దాన్లోకి బీర్ కేన్స్‌ని ఎక్కించడం గమనించిన కెల్లీ... డ్రైవింగ్ తలుపు తెరిచి, దిగి, తన భాగస్వామి పక్కన ఉన్న తలుపు కూడా తెరిచి చెప్పాడు. ‘‘పీటర్... మనకి పని పడినట్లుంది. దిగు.’’ ఇద్దరూ అక్కడికి వెళ్లారు. ఆ వేన్ అప్పటికే సగానికి పైగా బీర్ కేన్స్‌తో నిండింది. లోపల నించి బీర్ కార్టన్స్ని మోసుకొచ్చే వ్యక్తి మొహం వాటిని వేన్లో ఉంచేదాకా కెల్లీకి కనపడలేదు. అతను బ్రింక్సీ! ‘‘బ్రింక్సీ... నువ్వు నా హెచ్చరికను ఖాతరు చేయలేదు. రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డావు’’ బెల్ట్‌కి ఉన్న బేడీలని తీస్తూ అన్నాడు చెల్లీ. నివ్వెరపోయిన బ్రింక్సీ కొద్ది క్షణాల్లో తేరుకుని తన నడుంకి, బెల్ట్‌కి మధ్య దాచిన రివాల్వర్ని తీసి నవ్వుతూ కెల్లీకి గురిపెట్టాడు. ‘‘వీడేనా పీటర్?’’... బ్రింక్సీ అడిగాడు. ‘‘అవును. తన ప్రతాపం చూస్తావా?’’ ‘‘చూస్తాను’’... ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు బ్రింక్సీ. ‘‘పీటర్... గెట్ హిమ్’’... వెంటనే కెల్లీ ఆజ్ఞాపించాడు. తక్షణం పీటర్ బ్రింక్సీ మీదకి దూకి వాడి కాలు పట్టుకున్నాడు. బ్రింక్సీ చేతిలోని రివాల్వర్ పేలి గుండు పీటర్ తల్లోంచి దూసుకుపోయింది. ‘‘డ్యూటీలో ఉన్న పోలీస్‌ని చంపడం ఎంత నేరమో తెలుసా?’’ కెల్లీ అరిచాడు. అతని చేతిలోని రివాల్వర్ కూడా పేలింది. బ్రింక్సీ కుడి భుజంలో ఆ గుండు గుచ్చుకుంది. బ్రింక్సీ చేతిలోని రివాల్వర్ కింద పడిపోయింది. ‘‘దొంగతనం చేస్తూ రెడ్ హేండెడ్‌గా పట్టుబడి, డ్యూటీలో ఉన్న పోలీస్‌ని చంపావు. కాబట్టి నిన్ను చంపినా నాకేం కాదు. నా గుండు గురి తప్పింది.’’ కెల్లీ చేతిలోని పిస్తోలు మళ్లీ పేలింది. బ్రింక్సీ మరణించబోయే ముందు ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘పీటర్ పోలీస్ ఎందుకవుతాడు? కుక్క...’’ ‘‘పీటర్ నా భాగస్వామి’’... కళ్లల్లోంచి నీళ్లు కారుతూండగా, నిశ్చలంగా పడి ఉన్న ఆ జర్మన్ షెఫర్డ్ కుక్కని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు కెల్లీ. మూలం: జేమ్స్ హోల్డింగ్ కథ -
ఇక ‘వీడియో’ పెట్రోలింగ్
- తస్మాత్ జాగ్రత్త! నిఘా నేరుగా మీ వద్దకే.. - 24 గంటల పాటు పహారా - కరీంనగర్లో ప్రారంభించిన ఎస్పీ - రెండో దశలో గోదావరిఖనిలో.. కరీంనగర్ క్రైం: ఆరుబయట మద్యం తాగడం, ఈవ్‌టీజింగ్, ఆందోళనలు, అల్లరిమూకల వేధింపులు, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు... ఇవే కాదు ఎక్కడేం జరిగినా ఇక పోలీసుల కెమెరాలో నిక్షిప్తం కానున్నారుు. వీడియో కెమెరాతో కూడిన అత్యాధునికమైన పెట్రోలింగ్ వాహనాన్ని సోమవారం ఎస్పీ శివకుమార్ కరీంనగర్లో ప్రారంభించారు. పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసిన వీడియో కెమెరా అన్ని సంఘటనలను రికార్డు చేసి కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో విజయవంతమైన ఈ విధానాన్ని మొదటిసారిగా జిల్లా కేంద్రంలో ప్రవేశపెట్టారు. రెండో దశలో ఇలాంటి పెట్రోలింగ్ వాహనాన్ని గోదావరిఖనిలో ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే డయల్ 100కు గాని, వాట్స్ యూప్ నంబర్ 7093101101కు సమాచారం అందించాలని సూచించారు. కాగా.. ఈ పెట్రోలింగ్ వాహనానికి నిత్యం ఒక ఎస్సై ఇన్చార్జిగా వ్యహరిస్తారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి షిప్ట్ పద్ధతిలో 24 గంటల పాటు పెట్రోలింగ్ చేస్తుంది. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటే సంఘటన స్థలానికి చేరుకుని వీడియో రికార్డు చేయడంతో పాటు ఫొటోలు తీస్తుంది. అక్కడ సంఘటనను నియంత్రించడానికి పోలీసులు చర్యలు చేపడతారు. నగర శివారుల్లో మద్యం సేవిస్తున్న వారి ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి అక్కడ్కికడే జరిమానా విధించడం లేదా వారిని కోర్టులో ప్రవేశపెడుతారు. దీనికి సాక్ష్యంగా వాహనంలో రికార్డు అయిన వీడియోను కోర్టుకు సమర్పిస్తారు. ఈ వీడియోలో నిక్షిప్తమైన అన్ని కేసుల్లోనూ కోర్టుకు ఆధారాలను సమర్పిస్తారు. ఇప్పటికే పోలీసులకు అందించిన వాహనాలపై ప్రత్యేకమైన లైట్లు, మైక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, గోదావరిఖని డీఎస్పీలు జె.రామారావు, ఎస్.మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ కోటేశ్వర్రావు, కరీంనగర్ వన్, టు, త్రీ రూరల్, ట్రాఫిక్, తిమ్మాపూర్ సీఐలు విజయసారథి, హరిప్రసాద్, సదానందం, నరేందర్, మహేశ్‌గౌడ్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఖాకీపై జీపీఎస్ నిఘా
కొందరిలో ఆందోళన ఇప్పటి వరకు నామమాత్రంగా నైట్ బీట్లు నిర్వహించిన కొందరు సిబ్బంది జీపీఎస్ విధానం అమల్లోకి రావడంతో ఆందోళనలో పడ్డారు. ఈ విధానంతో విధులు భారంగా మారుతాయని భావిస్తున్నారు. పోచమ్మమైదాన్ : ఖాకీల పని విధానంపై ఇక నిఘా పెరగనుంది. క్షేత్రస్థారుులో సిబ్బంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారో.. పెట్రోలింగ్ వాహనాలను ఎక్కడ నిలిపారో క్షణాల్లో ఉన్నతాధికారులకు తెలిసిపోనుంది. ఇందుకనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పోలీస్ వాహనాల నియంత్రణ, సిబ్బంది పనితీరుపై నిఘా పెంచడమేగాక ప్రజలకు సత్వర సేవలందించేందుకుగాను తాజాగా జీపీఎస్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా తనదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జనసంచారం, వాహనాల రద్దీ పెరగనున్న క్రమంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎస్పీ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేరుుంచిన ఆయన కొత్తగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. నగరంలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా వాహనం ఎక్కడ ఉందనే సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడం ద్వారా ఆ వాహనాన్ని నియంత్రించే శక్తి కూడా ఎస్పీ చేతిలోనే ఉంటుంది. త్వరలో జిల్లావ్యాప్తంగా అమలు : అంబర్ కిశోర్ ఝా, వరంగల్ అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేస్తామన్నారు. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సోమవారం పెట్రోలింగ్ జీపీఎస్ వాహనాలను ప్రారంభించి, బ్లూకోల్ట్స్ బీట్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లా కోసం కూడా జీపీఎస్ కమాండింగ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జీపీఎస్ సిస్టమ్ పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్, క్రైం డీఎస్పీ ఈశ్వరరావు, ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ, మహిళా పీఎస్, రూరల్ క్రైం సీఐలు ఫణీందర్, సత్యనారాయణ, ప్రభాకర్ రావు, అలీ, మట్టెవాడ ఎస్సై రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. బ్లూ కోల్ట్స్‌కు స్మార్ట్ ఫోన్లు బ్లూ కోల్ట్స్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. బ్లూకోల్ట్స్ బీట్ పరిధిలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే ఫొటో తీసి కంట్రోల్ రూంకు పంపించాలి. ఇలా సంఘటనను స్మార్ట్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన తక్షణమే డీఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని క్షణాల్లో పంపడం ద్వారా అధికారులు ఇందుకోసం చర్యలు తీసుకుంటారు. అలాగే బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన నిందితులు కన్పిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం పంపిస్తారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌కు కూడా జీపీఎస్ సిస్టమ్ పని చేస్తుంది. అనుసంధానం ఇలా తొలుత జీపీఎస్ పరికరాన్ని వాహనంలో అమర్చుతారు. ఇది శాటిలైట్‌తో అనుసంధానమై ఉంటుంది. దాని ద్వారా కంట్రోల్ రూమ్‌కు సిగ్నల్స్‌కు అనుసంధానం చేస్తారు. వాహనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జీపీఎస్ కోడ్ ఆధారంగా ఏ వాహనం గురించైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కడ నిలిపి ఉంది.. ఎంత స్పీడుతో వెళ్తోందనే విషయూలు కూడా తెలుస్తారుు. వాహనంలో ఉన్న సిబ్బంది ఒకచోట ఉండి మరో చోట ఉన్నామని అబద్ధం చెప్పినా ఆ వాహనం అక్కడే నిలిచిపోయేలా కంట్రోల్ రూం ద్వారా ఆపివేసే సౌకర్యం కూడా ఉండడం గమనార్హం. పని తీరు ఇలా... ఏదైనా ప్రాంతంలో సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించడంతోపాటు సంఘటన స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకుగాను ఆ పరిసర ప్రాంతానికి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ వాహనంను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి ఆ బృందానికి ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేస్తారు. దీంతో పోలీసులు త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని సేవలందించే అవకాశం ఉంటుంది. -
రైల్వే పోలీసులు.. దొంగ వేషాలు!
కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్టర్ : రైల్వే డీఎస్పీ రైటర్ హీరో : ఐడీ పార్టీ కానిస్టేబుల్ సైడ్ హీరో : డీఎస్పీ జీపు డ్రైవర్ సహనటులు : హోంగార్డు, డీఎస్పీ రైటర్ నైట్ పెట్రోలింగ్‌తో ‘ప్రత్యేక’ పహారా ట్రైసిటీస్ పరిధిలో అక్రమ వసూళ్లు వారు పోలీసులే.. కాకపోతే రైల్వే పోలీసులు. పెట్రోలింగ్ చేసే అర్హత లేదు.. అయితేనేం పోలీస్ జీపు ఉంది కదా అనుకున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేసి దండుకోవచ్చని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా ట్రైసిటీస్‌లో వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఓ యువకుడి ఫిర్యాదుతో వారి బండారం బయటపడింది. రైల్వే పోలీసుల ‘స్పెషల్ పహారా’పై పోలీస్ యంత్రాంగం అవాక్కైంది. కానీ.. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని అధికారులు భావించారో.. ఏమో.. దొంగ పోలీస్ టీంను కటకటాల్లోకి నెట్టేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాజీ పేరిట సదరు రైల్వే పోలీసుల ‘స్పెషల్ పార్టీ టీం’ను కాపాడేందుకు యత్నిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. - వరంగల్ క్రైం వరంగల్ క్రైం : అర్ధరాత్రి పోలీస్ పెట్రోలింగ్ జీబును చూస్తే... ఎవరికైనా సరే భయం వేయక మానదు.. తప్పులు చేసిన వారైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత దక్షిణ సమర్పించేందుకు వెనుకాడరు. ఇదే ఆ రైల్వే పోలీసులకు ‘కీ’ పారుుంట్ అరుుంది. నైట్ పెట్రోలింగ్ పేరిట రైల్వే డీఎస్పీ జీబులో చక్కర్లు కొడుతూ దందాకు శ్రీకారం చుట్టారు. ‘స్పెషల్ పార్టీ టీమ్’ గా చెప్పుకుంటూ అమాయక ప్రజల వద్ద అందినకాడికి దండుకున్నారు. ఈ బాగోతంలో మొత్తం నలుగురు ఉన్నారు. ఇందులో ఒకరు రైల్వే డీఎస్పీకి చెందిన ఐడీ పార్టీ కానిస్టేబుల్. ఇతను పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ... ఇటీవలే బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇక్కడే తిష్టవేశాడు. మరొకరు డీఎస్పీ వాహన డ్రైవర్... ఇంకొకరు హోంగార్డు కాగా... నాలుగో వ్యక్తి డీఎస్పీ రైటర్‌గా చెలామని అవుతున్న ఉద్యోగి. ఈ రైటర్ ఆలోచన మేరకే డమ్మీ స్పెషల్ పోలీస్ టీమ్ తయారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇతడిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నారుు. ఈ టీంలో ఉన్న రైల్వే ఉద్యోగులు అందరూ దశాబ్ద కాలంగా ఇక్కడే తిష్టవేసి ఉన్నారు. ఇలా రంగంలోకి... రైల్వే డీఎస్పీగా కొద్ది కాలంగా చెలామణి అవుతున్న వారందరూ నాన్ లోకల్లోనే ఉంటున్నారు. ఇదే అదనుగా డీఎస్పీ జీబు డ్రైవర్‌తో రైటర కుమ్మక్కై పథకం రచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. పెట్రోలింగ్ సమయంలో జీబు డ్రైవర్‌గా హోం గార్డు... పోలీస్ అధికారులుగా హైట్, వెయిట్‌తో ఆఫీసర్లా కనపడే ఐడీ పార్టీ కానిస్టేబుల్, డీఎస్పీ అసలు జీబు డ్రైవర్‌గా వ్యవహరించారు.రైటర్ జీబులోనే కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. వీరందరూ రాత్రి 10 గంటల తర్వాత డీఎస్పీ జీబులో బయలుదేరి కాజీపేట పరిసర ప్రాంతాలు మడికొండ, రాంపూర్, కాజీపేట, హన్మకొండలో తిరిగి దొరికిన వారి వద్ద దండుకున్నారు. గిరాకీ దొరకకుంటే వరంగల్ ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా వెళ్లారు. అనుమానంగా కనిపించిన వారిని, రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని, ప్రేమికులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులను టార్గెట్ చేసుకుని రాత్రంతా వేట సాగించేవారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే ‘స్పెషల్ పార్టీ పోలీస్’ పేరును వాడుకున్నట్లు తెలిసింది. ఈ తతంతం కొద్ది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇద్దరు ఉద్యోగులు ఇటీవల బదిలీపై కొన్ని నెలలు వెళ్లడంతో వీరి దందాకు ఫుల్స్టాప్ పడింది. కొంతకాలం తర్వాత అందరు మళ్లీ ఇక్కడే జమ కాగా.. దందా కొనసాగించారు. బండారం బయటపడిందిలా.... రైల్వే పోలీసుల దొంగ దందాపై రైల్వే పార్టీ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. మరీ ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయారు. ఈ క్రమంలో ఈ దొంగ స్పెషల్ పార్టీ బృందం గత ఏడాది డిసెంబర్ 21న పెట్రోలింగ్ చేస్తూ హన్మకొండకు చేరుకుంది. హౌసింగ్‌బోర్డులో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. పోలీస్ జీబు రాగానే పరుగులంకించినప్పటికీ ఒక యువకుడు వీరికి చిక్కాడు. వెంటనే అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. జేబులో ఉన్న డబ్బులు, పర్సును, ఏటీఎం కార్డులను తీసుకున్నారు. వాటితో తృప్తి పడకుండా సదరు యువకుడి ఇంటికి వెళ్లి నానా హం గామా చేశారు. సదరు వ్యక్తులను అనుమానించిన యువకుడు తెల్లారి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎస్సై దొంగ పోలీసుల వ్యవహరాన్ని బహిర్గతం చేశారు. పోలీస్ వేషంలో వచ్చిన వారిని గుర్తించి వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. చివరకు రైల్వే శాఖకు చెందిన వారు ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టాల్సి ఉంది. అయితే సుబేదారి పోలీసులను రైల్వే పోలీసులు బతిమిలాడి సదరు యువకుడితో రాజీ చేసుకుంటామని చెప్పారు. సరే చూడండి.. అనడంతో పెద్ద మొత్తంలో సదరు యువకుడికి డబ్బులు ముట్టజెప్పి రాజీ కుదుర్చుకుని విష యం బయటకు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఆది నుంచి వీరి వ్యవహార శైలిపై కన్నేసిన ఈ శాఖలోని వారే జరి గిన విషయంపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేశారు. జరిగిన వాస్తవం తెలుసుకుని విస్మయం చెందారు. సుబేదారి పోలీసులు ఈ విషయూన్ని కప్పిపుచ్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
ఖాకీలకు కొత్త వాహనాలు!
జిల్లా పోలీస్‌శాఖకు కొత్త వాహనాలు సమకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎస్పీ వి.శివకుమార్ పలు వాహనాలను పరిశీలించినట్టు సమాచారం. పోలీస్స్టేషన్ల నిర్వహణకు సుమారు 70 వాహనాలను, పోలీస్ స్మార్ట్‌సిటీల కోసం ప్రత్యేకంగా మరికొన్ని వాహనాలను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు నుంచి ఆమోదం లభించిన వెంటనే జిల్లా పోలీసులకు కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ⇒ 70 వాహనాలు, వంద బైక్‌లకు ప్రతిపాదనలు ⇒ పోలీసు స్మార్ట్‌సిటీలకు అదనంగా ఏర్పాటు ⇒ ప్రస్తుతమున్నవి.. 130 వాహనాలే.. ⇒ 36కి పైగా ఠాణాలకు కొరత కరీంనగర్ క్రైం: జిల్లా పోలీస్‌శాఖ కొన్నేళ్లగా వాహనాల కొరతతో ఇబ్బందులు పడుతోంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేసినా అందుకు అనుగుణంగా వాహనాల కేటాయింపు జరగడం లేదు. డయల్ 100 సేవలు, 24 గంటల పెట్రోలింగ్‌కు కూడా ప్రత్యేక వాహనాలు అందుబాటులో లేవు. కొన్నేళ్లుగా వాహనాల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరుకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 68 పోలీస్స్టేషన్లు, 18 సర్కిళ్లు, ఆరు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటితోపాటు ఆర్మ్డ్, ఆక్టోపస్, ఎస్బీ, ఎన్ఐబీ తదితర విభాగాలు పని చేస్తున్నాయి. వీటిన్నంటికి వాహనాలు తప్పనిసరి. కానీ జిల్లావ్యాప్తంగా 32 పోలీస్స్టేషన్లకు మాత్రమే ప్రభుత్వ వాహనాలున్నాయి. నిఘా, ఇతర విభాగాలకు అసలు వాహనాలే లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలనే అన్ని సివిల్, ఆర్ముడ్ విభాగాల అధికారులకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ వాహనాలు లేని పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలు సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన వాహనాలకు మాత్రమే ప్రతి నెల 110 లీటర్ల డీజిల్ కేటాయిస్తుంది. ప్రైవేట్ వాహనాలు వినియోగించుకుంటున్న వారికి డీజిల్ కోటా ఉండదు. దీంతో వీటి నిర్వహణ, అద్దె రూపంలో అయా పోలీస్స్టేషన్లపై ప్రతి నెల సుమారు రూ.25 వేల భారం పడుతోంది. కాలం చెల్లిన వాహనాలే ఎక్కువ.. ప్రస్తుతం జిల్లా పోలీస్‌శాఖలో 130 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు మూడు నెలల్లో సుమారు 15 వాహనాలు జీవితకాలం ముగియనుంది. వీటితోపాటు మరో 50 వాహనాలు కొనుగోలు చేసి సుమారు 20 ఏళ్లు దాటింది. ఇవి కూడా తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గతేడాది జీవితకాలం కంటే ఎక్కువగా వినియోగించిన సుమారు 10 వాహనాలను తుక్కుకు పంపించారు. మరో రెండు మూడు నెలలు గడిస్తే మరికొన్ని వాహనాలు జీవితాకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో పోలీస్ సేవలకు ఇబ్బందులు తప్పవు. ఉన్నవాటి నుంచి వీఐపీ సెక్యూరిటీ కోసం పలు వాహనాలు కేటాయించాల్సి వస్తోంది. బందోబస్తు సమయంలో ఎస్కార్టు చేసే సందర్భాల్లో రిపేర్లకు వస్తున్నాయి. వీటిని మరమ్మతులు చేయించడం భారమవుతోంది. ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుండడంతో జిల్లాకు కొత్త వాహనాలు కేటాయించాలని పలుమార్లు జిల్లా పోలీస్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. కానీ ఇప్పటివరకు వాహనాలను మంజూరు చేయకపోవడం గమనార్హం. డయల్ 100, పెట్రోలింగ్‌కు ఇబ్బందులు ప్రసుత్తం జిల్లాలో మూడు పెట్రోలింగ్ రక్షక్ వాహనాలు మాత్రమే ఉండగా ఇవి కూడా నగరంలో మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో రెండు వాహనాలు తరచూ రిపేర్లు వస్తున్నాయి. డయల్ 100 సేవలు అందించడానికి ప్రత్యేకంగా వాహనాలు అవసరం. ఈ సేవల ప్రారంభంలో ప్రతి స్టేషన్‌కు ఒక వాహనం కేటాయిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క వాహనం కూడా కేటాయించలేదు. దీంతో సిబ్బంది తమ సొంత ద్విచక్రవాహనాలనే డయల్ 100 సేవలకు వినియోగిస్తున్నారు. వీటికి ఎలాంటి బడ్జెట్ లేకపోవడంతో సిబ్బందిపై అర్థికంగా భారంగా పడుతోంది. అలాగే పెట్రోలింగ్ విభాగాన్ని బలోపేతం చేసి అందుబాటులో ఉన్న వాహనాలకు జీపీఎస్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్ వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో పలు పోలీస్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు తప్పనిసరి. 70 వాహనాలు, 100 బైక్‌లు.. జిల్లా పోలీస్ శాఖకు 70 వాహనాలు, వంద బైక్‌లు కేటాయించాలని ఎస్పీ శివకుమార్ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. జిల్లా రోడ్లకు అనుకూలంగా ఉన్న పలు వాహనాలు ఎస్పీ పరిశీలించినట్టు తెలిసింది. దీనికి ఉన్నతాధికారులు సైతం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ఆనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. -
మహిళలపై వేధింపులను ఉపేక్షించం
►ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం ►దొంగనోట్ల చలామణి అరికడతాం ►పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు ► పెట్రోలింగ్ ముమ్మరం చేస్తాం ►కొత్త ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకోనున్నట్లు జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెరిగిన టెక్నాలజీ వల్ల మహిళలు ఎక్కువగా వేధింపుల కు గురవుతున్నారని, వారి కి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయించవచ్చని అన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విభాగంలో అందరూ మహిళ అధికారులనే నియమిస్తామన్నారు. ఫిర్యాదులు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. చైన్ స్నాచింగ్‌లను నిరోధించేదుకు శ్రద్ధ పెడతామన్నారు. ఈ తరహా చోరీలపై మహిళలను చైతన్య పరుస్తామన్నారు. జిల్లాలో మహిళ పోలీస్స్టేషన్లు పెంచేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేసి జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తామన్నారు. పాత నేరస్తులపై నిఘా పెడతామన్నారు. జిల్లాలో ఆటోడ్రైవర్ల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని, అటువంటి వారి ఆటలు కట్టించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నకిలీ నోట్ల చెలమణి ఎక్కువ ఉందని తెలిసిందన్నారు. పోలీస్స్టేషన్లలో ఎస్సైలు సివిల్ తగాదాలు, సెటిల్మెంట్లు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాపై అవగాహన ఉంది మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా, ఆదిలాబాద్ జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వహించే సమయంలో తనకు జిల్లా గురించి కొంత అవగాహన ఏర్పడిందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ పరిధి అతిక్రమించకుండా విధులు నిర్వహిస్తానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం తిర్మారాస్‌పల్లి గ్రామానికి చెందిన తాను పుట్టి పెరిగింది పల్లె ప్రాంతంలోనేన్నారు. 10వ తరగతి వరకు గ్రామంలోనే చదివాను, గ్రామీణ ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. పేదలకు న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. అంతకుముందు ఎస్పీ తరుణ్‌జోషీ కొత్త ఎస్పీకి పూల బొకేతో స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. -
శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం వద్దు
పగలు జరిగే దొంగతనాలపై దృష్టి పెట్టండి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు వరంగల్‌క్రైం : శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు అర్బన్ పోలీసు అధికారులకు సూచించారు. అర్బన్ పోలీసు విభాగం పనితీరుపై శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అర్బన్ పరిధిలోని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు, సీఐలు, సబ్ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పరిశోధన పురోగతి, గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతితోపాటు నిందితులను అరెస్టు చేయకపోవడానికిగల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష జరిపారు. శుక్రవారం హన్మకొండలోని గణేష్‌నగర్‌లో జరిగిన దోపిడీపై స్పందిస్తూ దోపిడీ జరిగిన తీరుపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అర్బన్ పరిధిలో రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించడంతో రాత్రి పూట జరిగే దొంగతనాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. అరుుతే కొద్దికాలంగా నగరంలో పగటి పూట చోరీలు జరగడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు కూడా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే అధికారులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ తీరు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యంగా చోరీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో అధికారులు తమ సమయాన్ని విశ్రాంతికి కేటాయించకుండా తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముమ్మర గస్తీ నిర్వహించాలన్నారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా కదలికలను గుర్తించాలన్నారు. అధికారులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామాల స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. జులాయిలపై దృష్టి పెట్టడంతోపాటు వారి వ్యక్తిగత అలవాట్లపై నజర్ పెట్టాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, ఓఎస్డీలు వాసుసేన, నాగరాజు కుమార్, అర్బన్ స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, రాజిరెడ్డి, ప్రభాకర్, రాజమహేంద్రనాయక్‌తో పాటు ఇన్స్పెక్టర్లు , ఆర్ఐలు, సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
సూసైడ్‌నోట్ కలకలం
వాడపల్లి వంతెనపై పోలీసులకు లేఖ, బైక్, ఫోన్ లభ్యం కృష్ణానదిలో గాలింపు చర్యలు మిస్సింగ్ కేసు నమోదు వాడపల్లి(దామరచర్ల) మండల పరిధిలోని వాడపల్లి వంతెనపై లభించిన ఓ సూసైడ్‌నోట్ తీవ్ర కలకలం రేపింది. వివరాలు..వాడపల్లి ఎస్సై వీరరాఘవులు బుధవారం ఉందయం పెట్రోలింగ్‌లో భా గంగా వంతెనపైకి వెళ్లగా బైక్, సూసైడ్‌నోట్ రాసిన కాపీ, స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ లభించాయి. లేఖలోని వివ రాలు ఇలా ఉన్నాయి.. ‘‘నాపేరు ధీరావత్ సుధాకర్, మాది దామరచర్ల మం డలం వీర్లపాలెం గ్రామం. అండ్రోమిడా సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో మిర్యాలగూడ ఏరియాకు డీలర్‌గా పనిచేస్తున్నా. కంపెనీలో పనిచేస్తున్న నల్లగొండకు చెందిన వెంకట్‌రెడ్డి, విశాఖపట్టణానికి చెంది న రంఘనాథ్‌లు నాకు రూ.90 వేలు ఇవ్వాలి. వారిని సంప్రదిస్తే సాకులు చెబుతున్నారే తప్ప డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో న దిలో దూకుతున్నా.. నా ఆత్మహత్యకు కారణం వారిద్దరే’’ అని రాసి ఉంది. దీంతో ఎస్ఐ వెంట నే ఘటన స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా సుధాకర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడి గురించి ఆరా తీశాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య అర్పిత పోలీసులకు తెలిపింది. కాగా,సుధాకర్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుధాకర్ భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వాటర్ చానల్ వెంట పెట్రోలింగ్
నీటి చౌర్యానికి చెక్ - సమీక్షా సమావేశంలో నిర్ణయం - బాధ్యతల్లో పాలుపంచుకోనున్న మూడు విభాగాల సిబ్బంది గుర్గావ్ : నీటి చౌర్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు జాగ్రత్త చర్యలు తీసుకుం టోంది. ఇందులోభాగంగా గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ) వెంబడి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనుంది. డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గడచిన మూడు రోజుల వ్యవధిలో గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ)లో నీరు 50 శాతం మేర తగ్గింది, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే నిల్వలు ఘోరంగా తగ్గిపోతాయని సమావేశం అనంతరం విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందువల్ల నగరవాసులు నానాయాతనకు గురవ్వాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోపాటు జీడబ్ల్యూసీ, హుడా, సాగునీటి శాఖల సిబ్బంది కలిసి సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తగు రీతిలో వర్షాలు కురవకపోవడంతో జీడబ్ల్యూసీలో నీటిని రైతులు చౌర్యం చేస్తున్నట్టు తాము అనుమానిస్తున్నామన్నా రు. కాగా జీడబ్ల్యూసీ... సోనేపట్ వద్ద మొదలై రోహ్తక్, ఝజ్జర్ జిల్లాల మీదుగా నగరానికి చేరుకుంటుంది. కాగా పెట్రోలింగ్ విషయమై ఝజ్జర్ డీఎస్పీ అనూప్‌సింగ్ మాట్లాడుతూ తమ జిల్లాలో జీడబ్ల్యూసీ వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పోలీసు, హుడా, సాగునీటి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా గుర్గావ్ నగరానికి ప్రతి రోజూ 140 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది. పంపింగ్ స్టేషన్ నేడు ప్రారంభం నగర పరిధిలోని 42 అనధికార కాలనీవాసులకు నీటి కొరత కష్టాల నుంచి విముక్తి కలగనుంది. కిరారి భూగర్భ జలాశయంకమ్ పంపింగ్ స్టేషన్‌ను ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) శనివారం ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారి శుధ్య విభాగం మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రారంభించనున్నారు. తన బృహత్తర ప్రణాళికలో భాగం గా డీజేబీ దీనిని నిర్మించింది. ఈ పంపింగ్ స్టేషన్ అందుబాటులోకివ స్తే కిరారి శాసనసభా నియోజకవర్గం పరిధిలోని 42 అనధికార కాలనీల్లో నివసించే దాదాపు 1.25 లక్షలమందికి ఉపయుక్తమవుతుంది. -
ఆదివారం సెలవు తీసుకోవద్దు
సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా నిర్ణయించారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఆదివారం ముంబై పోలీసులెవరూ సెలవు(వీక్లీ ఆఫ్) తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, సెలవురోజు కావడంతో నగరవాసు లు షాపింగ్ కోసం మార్కెట్లకు రావడంతో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో వారి ఆటకట్టించేందుకు ఆదివారం నగరంలోని ప్రతీ వీధిలో, ప్రధాన మార్కెట్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయిం చారు. అందుకోసం ఆరోజు పోలీసులు ఎవరూ సెలవు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేశారు. ఆదివారానికి బదులుగా మరోరోజు సెలవు తీసుకోవాల న్నారు. తాము తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత 60 రోజుల్లో గొలుసు దొంగతనాల సంఖ్య 60 శాతం తగ్గిందన్నారు. భద్రత మరింత పటిష్టం... నగరంలో భద్రతను మరింత పెంచాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. కేవలం మహిళలకు మాత్రమేకాకుండా రాత్రి వేళ్లలో చీకట్లో ఒంటరిగా వెళ్లే ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకొని భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాత్రి వేళ్లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుతున్నప్పుడు ఎవరైనా ద్విచక్రవాహనంపై వెంబడిస్తున్నారా? అని గమనించాలని సూచించారు. అయితే అన్ని పోలీస్టే షన్ల అధికారులు ఆదివారం కూడా విధులకు హాజ రై వీధుల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారా? లేదా? గమనించాలని, ఏవైనా ఫిర్యాదులుంటే వెంటనే తెలియజేయాలన్నారు. దీంతో చైన్ స్నాచర్లు, దొంగ లు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదని మారి యా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారాల్లో.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నాకాబందీ నిర్వహించాల్సిందిగా మారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. 2013లో 2,090 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత రెండు నెలలు (మార్చి, ఏప్రిల్)గా వీటి సంఖ్య 60 శాతం మేర తగ్గినట్లు ఆయన తెలిపారు. పోలీసుల సంఖ్య పెంచడం, తరచూ నాకాబందీలు నిర్వహిస్తుండడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముంబైలో చైన్ స్నాచింగ్ అతిపెద్ద సమస్యగా మారిందని డీసీపీ మహేష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. అన్ని పోలీస్టే షన్లు ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి తరచూ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సదరు ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. -
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
వరంగల్ కైం, న్యూస్‌లైన్ : నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం అర్బన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు, కేసుల పరి శోధన, పురోగతిని ఎస్పీ తెలుసుకున్నా రు. అలాగే, నేరస్తుల అరెస్టులతోపాటు గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, నేరస్తులను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా పెండింగ్ కేసుల పరిష్కా రం కోసం ఎస్పీ అధికారులకు సూచన లు, సలహాలు చేశారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేసిన సిబ్బందికి ఎ స్పీ వెంకటేశ్వర్రావు అభినందనలు తెలి పారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఎన్నికల సందర్భంగా నమోదైన కే సుల వివరాలు, కేసులు ఏ స్థాయి పరిశోధనలో ఉన్నాయో పోలీస్స్టేషన్ల వారీగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రజల కు పోలీసులపై మరింత నమ్మకం కలిగేవిధంగా అధికారులు విజిబుల్ పోలీ సింగ్ పెంచాలన్నారు. నేరాల అదుపు కోసం అధికారులు సిబ్బందితో కలిసి బస్టాండ్, రైల్వే స్టేషన్లు, లాడ్జీల్లో ఆకస్మిక త నిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వర్తించిన అర్బన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలకు ఆయన నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, శాంతిభద్రతల ట్రాఫిక్ ఓఎస్డీలు నాగరాజ్‌కుమార్, అర్బన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.