వాటర్ చానల్ వెంట పెట్రోలింగ్
నీటి చౌర్యానికి చెక్
- సమీక్షా సమావేశంలో నిర్ణయం
- బాధ్యతల్లో పాలుపంచుకోనున్న మూడు విభాగాల సిబ్బంది
గుర్గావ్ : నీటి చౌర్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు జాగ్రత్త చర్యలు తీసుకుం టోంది. ఇందులోభాగంగా గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ) వెంబడి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనుంది. డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గడచిన మూడు రోజుల వ్యవధిలో గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ)లో నీరు 50 శాతం మేర తగ్గింది, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే నిల్వలు ఘోరంగా తగ్గిపోతాయని సమావేశం అనంతరం విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందువల్ల నగరవాసులు నానాయాతనకు గురవ్వాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోపాటు జీడబ్ల్యూసీ, హుడా, సాగునీటి శాఖల సిబ్బంది కలిసి సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తగు రీతిలో వర్షాలు కురవకపోవడంతో జీడబ్ల్యూసీలో నీటిని రైతులు చౌర్యం చేస్తున్నట్టు తాము అనుమానిస్తున్నామన్నా రు. కాగా జీడబ్ల్యూసీ... సోనేపట్ వద్ద మొదలై రోహ్తక్, ఝజ్జర్ జిల్లాల మీదుగా నగరానికి చేరుకుంటుంది. కాగా పెట్రోలింగ్ విషయమై ఝజ్జర్ డీఎస్‌పీ అనూప్‌సింగ్ మాట్లాడుతూ తమ జిల్లాలో జీడబ్ల్యూసీ వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పోలీసు, హుడా, సాగునీటి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా గుర్గావ్ నగరానికి ప్రతి రోజూ 140 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది.
పంపింగ్ స్టేషన్ నేడు ప్రారంభం
నగర పరిధిలోని 42 అనధికార కాలనీవాసులకు నీటి కొరత కష్టాల నుంచి విముక్తి కలగనుంది. కిరారి భూగర్భ జలాశయంకమ్ పంపింగ్ స్టేషన్‌ను ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) శనివారం ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారి శుధ్య విభాగం మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రారంభించనున్నారు. తన బృహత్తర ప్రణాళికలో భాగం గా డీజేబీ దీనిని నిర్మించింది. ఈ పంపింగ్ స్టేషన్ అందుబాటులోకివ స్తే కిరారి శాసనసభా నియోజకవర్గం పరిధిలోని 42 అనధికార కాలనీల్లో నివసించే దాదాపు 1.25 లక్షలమందికి ఉపయుక్తమవుతుంది.